దాదాపు రెండు దశాబ్దాల క్రితం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘7/జీ బృందావన కాలనీ’ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ హీరోగా నటించగా, సోనియా అగర్వాల్ హీరోయిన్‌గా చేశారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా సెల్వరాఘవన్ దర్శకత్వంలోనే ‘7/జీ బృందావన కాలనీ 2’ రూపొందుతోంది. తొలి భాగంలో చేసిన రవికృష్ణ మలి భాగంలోనూ హీరోగా నటిస్తున్నారు. అయితే హీరోయిన్‌గా అనశ్వర రాజన్ చేస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుందని, త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తామని న్యూ ఇయర్ సందర్భంగా వెల్లడించారు మేకర్స్. జయరామ్, సుమన్ శెట్టి, సుధ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం మాట్లాడుతూ– ‘‘7/జీ బృందావన కాలనీ’ చిత్రం ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది. ఆ మ్యాజిక్ రిపీట్ అయ్యేలా, ఈ తరం ఆడియన్స్‌కు నచ్చేలా విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా ‘7/జీ బృందావన కాలనీ 2’ సినిమాను తీస్తున్నాం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment