K.Satyanarayana
-
ఇంటర్లో తప్పా.. ఐఏఎస్ పాసయ్యా!
సాక్షి, విజయవాడ : ఇంటర్మీడియట్లో తప్పిన నేను.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని చేరుకోవాలనే బలమైన కోరకతో ఐఏఎస్ పాసయ్యాయని అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ కె.సత్యనారాయణ అన్నారు. స్థానిక పీబీ సిద్ధార్థ కళాశాలలో ఉద్యోగదర్శిని పేరుతో వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు జరుగుతున్న ఉచిత శిక్షణా కార్యక్రమం ముగిం పు శనివారం కళాశాల సెమినార్ హాలులో జరి గింది. ముఖ్య అతిథిగా హాజరైన సత్యనారాయణ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ జీవితంలో సాధించాలనుకున్న లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధించాలనే తపన చాలా బలంగా ఉండాలన్నారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిం చాలనే కోరికతో పాటుగా కష్టపడేతత్వం, క్రమశిక్షణ ఉండాలని చెప్పారు. మొక్కబడిగా చదవడం, రోజు వారి పనులు చేయడం అనేది మంచిది కాదన్నారు. చదువుకునే వయస్సులో మంచి ఆహారం తీసుకోవాలని దాని వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుందని తెలిపారు. తాను ఇంటర్‌తో పాటుగా సివిల్స్‌ను ప్రిపేర్ అవుతున్న సమయంలో ప్రిలిమ్స్‌తో పాటుగా మెయిన్స్ చాలా సార్లు తప్పానని చెప్పారు. ఓటమి నుంచి తాను పాఠాలు నేర్చుకుంటూ చేసిన తప్పులను గుర్తించి దిద్దుకుంటూ ముందుకు సాగానని వివరించారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలనే కాని కుంగిపోకూడదన్నారు. మన మీద మనకు పూర్తిస్థాయిలో నమ్మకం ఉండాలని, అప్పుడే విజయాలు సొంతం అవుతాయన్నారు. ఎ.పి.సి.ఆర్.డి.ఏ జాయింట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు గొప్ప నాయకుల జీవిత చరిత్ర పుస్తకాలను చదవాలన్నారు. ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ మురళీ మోహన్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, ప్రణాళికతో చదివితే విజయం తథ్యమన్నారు. విజన్ ఫౌండేషన్ అధినేత విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఈ ఉచిత శిక్షణతో ప్రతిభ చూపిన వారికి ఏడాది పాటు ఆన్లైన్లో విజన్ సంస్ధ ఆధ్వర్యంలో నిర్వహించే మాక్ టెస్ట్‌లకు అవసరమైన పుస్తకాలు, పాస్ట్‌వర్డ్‌ను ఉచితంగా అందచేస్తున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి సివిల్ సర్వీసెస్ పరీక్షకు అవసరమైన శిక్షణను తమ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా అందచేస్తున్నామని తెలియ జేశారు. కళాశాల ప్రిన్సిపల్ ఎం.రమేష్‌తో పాటుగా విద్యార్థులు పాల్గొన్నారు. -
కర్నూలు అధికారులపై భూమా సభాహక్కుల నోటీసు
-
కర్నూలు అధికారులపై భూమా సభాహక్కుల నోటీసు
సాక్షి, హైదరాబాద్: అక్రమ కేసులు బనాయించి, తనపై చట్ట విరుద్ధంగా రౌడీషీటును తెరవడానికి కారణమైన కర్నూలు పోలీసు సూపరింటెండెంట్ ఎ. రవికృష్ణ, మరో ముగ్గురు పోలీసు అధికారులపై పీఏసీ చైర్మన్, నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి శాసనసభా హక్కుల తీర్మానానికి నోటీసును ఇచ్చారు. ఆయన శనివారం హక్కుల నోటీసును ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి కె.సత్యనారాయణకు అందజేశారు. గత అక్టోబర్ 31వ తేదీన నంద్యాల మున్సిపల్ సమావేశం సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనల్లో నిరాధారమైన ఆరోపణలతో తనపై కేసు పెట్టడమే కాకుండా అరెస్టు చేశారని ఆయన నోటీసులో పేర్కొన్నారు. -
84మందికి ఏఎస్ఐలుగా ఉద్యోగోన్నతి
గుంటూరు, న్యూస్‌లైన్: గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాల పరిధిలోని 84మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి కల్పిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ పి.వి.సునీల్కుమార్గురువారం ఉత్తర్వులు జారీచేశారు. హెడ్‌కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్ఐలుగా పదోన్నతి పొందిన వారికి వెంటనే ఆయా పోలీసుస్టేషన్లలో రిపోర్టుచేయాలని ఆదేశించారు. పదోన్నతి పొందిన వారిలో డి.జయరావు, ఎస్.పరిశుద్ధరావు, వి.ఎన్.రాజేశ్వరి, వి.కవితాకుమారి, ఎం.శ్యామ్‌ప్రసాద్, టి.ప్రభాకరరావు, జె.సురేష్‌బాబు, ఆర్.సత్యనారాయణ, పి.ఆనందకుమార్, కె.గోపాలరావు, వి.నాగేశ్వరరావు, ఎస్.కె.ఎం.డి.ఆలి, కె.రాఘవేంద్రరావు, కె.ధర్మరాజు, ఎస్.కె.నజీర్అహ్మద్, అబ్దుల్ అలిం, పి.బాబూరావు, జి.వెంకటేశ్వర్లు, జి.ఆర్.మోహన్‌రావు, కె.బాబు, పి.సాంబశివరావు, ఆర్.షంషూద్దీన్, ఎ.గోపికృష్ణ, పి.వెంకటేశ్వర్లు, కె.ఆర్.దుర్గారావు, టి.రోశయ్య, కె.వి.రమేష్‌బాబు, సీహెచ్వెంకటేశ్వర్లు, ఎ.కృష్ణ, ఎస్.కె.సిలార్‌సాహెబ్, పి.పోలరాజు, ఐ.సాంబశివరావు, ఎస్.కె.అబ్దుల్ మసీద్, కె.సత్యనారాయణ, ఎం.డి.అలివలిషరీఫ్, ఎన్.సాంబశివరావు, పి.వనమాలికలు, ఎస్.కె.మస్తాన్‌వలి, హరికృష్ణారావు, ఎం.ఎస్.ఎన్.రాజు, ఎన్.చంద్రరావు, వై.వి.సుబ్బయ్య, ఐ.ఫ్రాన్సిస్, టి.వి.వెంటేశ్వరరావు, బి.నరసింహారావు, మహమ్మద్ సుభాని, టి.భాగ్యలక్ష్మి, కె.ధనలక్ష్మి, ఎస్.కుర్షిద్బేగం, పి.వెంకటేశ్వర్లు, ఆర్.ఎం.నాయక్, బి.సాంబశివరావు, ఎం.జోజి, కె.కృష్ణారావు, ఎస్.కె.ఎం.డి.ఫింబర్, పి.సాంబశివరావు, జి.సత్యనారాయణ, బి.రామకోటేశ్వరరావు, వి.రవీంద్రబాబు, వై.ఎస్.శర్మ, ఎస్.కె.సుభాని, ఎస్.డి.ఇస్మాయిల్, బి.బాబూరావు, బి.ఏసురత్నారావు, కె.నాగేశ్వరరావు, కె.వెంకటేశ్వరరావు, కె.సాంబశివరావు, సీహెచ్‌శ్రీనివాసరావు, కె.రాంబాబు, జి.వెంకటాద్రి, ఎ.సాంబశివరావు, జి.కృష్ణారావు, ఎస్.కె.నాగూర్‌షరీఫ్, కె.ఎస్.ప్రసాదరావు, కె.శ్రీహరి, ఎన్.సీతయ్య, టి.పెదబాబు, టి.వెంకటేశ్వరరావు, ఎం.ఆర్.మోహన్‌రావు, డి.ఎన్.మల్లేశ్వరరావు, పి.వెంకటేశ్వర్లు, ఎం.నర్సారెడ్డి, కె.ఎస్.నాగేశ్వరరావు, టి.సుబ్బారావు ఉన్నారు.