సాక్షి, చిత్తూరు : జిల్లాలోని ముట్టూరుకి చెందిన గీతాంజలి అనే మహిళపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. సాదిక్ అనే మైనర్ బాలుడిని గీతాంజలి, ఆమె కొడుకు కలిసి దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ఆధారంగా పోలీసులు గీతాంజలిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు.
అయితే సాదిక్ అనే మైనర్ బాలుడు ఓ అమ్మాయికి సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని, దీంతో ఆ అమ్మాయికి వరుసకు చిన్నమ్మ అయిన గీతాంజలి సాదిక్‌పై దాడి చేసినట్టు సమాచారం. గీతాంజలితో పాటు ఆమె కుమారుడు కూడా సాదిక్‌ను చితకబాదాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గీతాంజలిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు.
Published Sat, Jan 26 2019 7:50 PM | Last Updated on Sat, Jan 26 2019 8:59 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment