సాక్షి, హైదరాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు. మంగళ్‌హాట్ పోలీసుల రౌడీషీటర్స్ జాబితాలో రాజాసింగ్ పేరును చేర్చారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కొందరు బీజేపీ కార్యకర్తలు దీన్ని గమనించి రాజాసింగ్‌కు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ.. ఇంకా తన పేరు రౌడీషీటర్ జాబితాలో ఉండటంపై మండిపడ్డారు. తాను అన్ని వదిలేసి.. ప్రజా సేవలోకి వచ్చానని అన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై, మంత్రులపై గతంలో రౌడీషీట్లు ఉన్నాయని.. వాటిని ఇప్పుడు కొనసాగిస్తారా అని ప్రశ్నించారు. తనపై రౌడీషీట్ పెట్టినందుకు బాధలేదని చెప్పారు. తాను ఇప్పుడు ఎమ్మెల్యేనా, రౌడీషీటర్‌నా అనే దానికి ముఖ్యమంత్రి, హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment