సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ సస్పెండెడ్ నేత రాజా సింగ్ సెక్యులర్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణం పోయినా ఫర్వాలేదుగానీ.. అలాంటి పార్టీల్లోకి వెళ్లనని ప్రకటించారు.
‘‘చచ్చినా నేను సెక్యులర్ పార్టీలకు వెళ్ళను. నా ప్రాణం పోతున్నా.. బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల వైపు చూడను. తెలంగాణను హిందు రాష్ట్రం చేయాలని నా లక్ష్యం. బీజేపీ గనుక నాకు టికెట్ ఇవ్వకుంటే.. రాజకీయాలను పూర్తిగా పక్కనపెట్టేస్తా. కానీ, హిందూ రాష్ట్రం కోసం పని చేసుకుంటా. అయినా బీజేపీ అధిష్టానం నా విషయంలో సానుకూలంగా ఉంది. సరైన టైంలో నాపై వేటు ఎత్తేస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారాయన.
అలాగే.. బీఆర్‌ఎస్, ఎంఐఎంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉంది. అందుకే పెండింగ్ పెట్టారు. దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారు. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. కానీ ఇండిపెండెంట్‌గా కాని.. వేరే పార్టీల నుంచి కాని పోటీ చేయను అని స్పష్టం చేశారాయన.
Comments
Please login to add a commentAdd a comment