గోషామహల్ నియోజకవర్గంలో ఈసారి ప్రజల ఓటు ఎవరికీ..?
గోషామహల్ నియోజకవర్గం
గోషామహల్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ రెండోసారి గెలిచారు. 2018లో బిజెపి తెలంగాణ అసెంబ్లీలో గెలిచిన ఏకైక సీటు ఇది. రాజాసింగ్ తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది,మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాదోడ్ పై 17734 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. గతంలో రాదోడ్ బిజెపిలోనే ఉండారు. తదుపరి ఆయన టిఆర్ఎస్ లో చేరారు. కాని ఫలితం దక్కలేదు. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఐ నేత ముకేష్ గౌడ్ 25217 ఓట్లతో మూడు స్థానంలో నిలిచారు.
రాజాసింగ్ కు 61854 ఓట్లు రాగా, ప్రేమ్ సింగ్ రాదోడ్ కు 44120 ఓట్లు వచ్చాయి. రాజాసింగ్ 2014లో కూడా భారీ గా 46793 ఓట్ల ఆధిక్యతతో ముకేష్ పై గెలిచారు. 2014లో ఇక్కడ టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన ప్రేమకుమార్ ధూత్‌కు 6312 ఓట్లు లభించాయి. మాజీ మంత్రి ముకేష్ 1989, 2004లలో మహారాజ్‌గంజ్ నుంచి 2009లో గోషామహల్ నుంచి గెలిచారు. 2007 నుంచి రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో సభ్యునిగా ఉంటూ, తిరిగి గెలిచి వ్కెఎస్ క్యాబినెట్లోనూ ఆ తరువాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్లోనూ ఉన్నారు.
1983లో టిడిపి పక్షాన గెలిచిన పి. రామస్వామి, 1994లో బిజెపి తరుపున చట్టసభకు నెగ్గారు. ఈయన 1984లో నాదెండ్ల భాస్కరరావు నెలరోజుల మంత్రివర్గంలో సభ్యునిగా వున్నారు. 1985లో గెలిచిన జి. నారాయణరావు సభాపతి పదవిబాధ్యతలు నిర్వహించారు. మహారాజ్‌గంజ్‌లో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి నాలుగుసార్లు, టిడిపి రెండుసార్లు, బిజెపి రెండుసార్లు, సంయుక్త సోషలిస్టు పార్టీ ఒకసారి గెలిచాయి. మహారాజ్ గంజ్ లో ఎనిమిదిసార్లు బిసిలు గెలవగా,వారిలో ముగ్గురు గౌడ, నలుగురు మున్నూరు కాపు వర్గానికి చెందినవారు.ఒకసారి వెలమ, మరోసారి పిట్టి గెలుపొందారు. కాగా గోషా మహల్ లో మూడుసార్లుగా బిసి నేతలే ఎన్నికయ్యారు.
గోషామహల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..