Raja Singh T
-
నయనతార 'అన్నపూరణి'.. తెలంగాణ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్!
కొత్త ఏడాదిలో నయనతార కలిసి రావడం లేదు. ఆమె నటించిన అన్నపూరణి చిత్రం పెద్దఎత్తున వివాదానికి దారితీసింది. ఇప్పటికే ఈ చిత్రంపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సైతం స్ట్రీమింగ్ నుంచి తొలగించింది. తాజాగా ఈ చిత్రంపై తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన జీ స్టూడియోస్‌పై పూర్తిగా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సినిమాలు గతంలో కూడా వచ్చాయని.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా దర్శకులు, నటీనటులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోమంత్రి అమిషాకు విజ్ఞప్తి చేశారు. అన్నపూరణి సినిమాపై ఎమ్మెల్యే టి.రాజా సింగ్ మాట్లాడుతూ..'జీ స్టూడియోస్ క్షమాపణలు చెప్పిందని విన్నా. కానీ క్షమాపణలు చెప్పినా ఇలాంటివీ రిపిట్ అవుతూనే ఉంటాయి. గతంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఇలాంటి సినిమాలు చేయడం మనం చాలాసార్లు చూశాం. ఈ వివాదానికి కారణమైన జీ స్టూడియోస్‌ను పూర్తిగా నిషేధించాలని.. ఇలాంటి సినిమాలు తీసే దర్శకులు, నటీనటులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నా' అని వీడియోలో కోరారు. కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం అన్నపూరణిపై ఇప్పటికే మహారాష్ట్రలో మాజీ శివసేన లీడర్ రమేశ్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా మధ్యప్రదేశ్‌లోనూ ఈ సినిమాపై కేసు నమోదు చేశారు. దీంతో ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ తమ ఫ్లాట్‌ఫామ్ నుంచి పూర్తిగా తొలగించింది. ఈ సినిమా హిందువులు మనోభావాలు దెబ్బతియడమే కాకుండా.. లవ్ జీహాద్‌ను ప్రొత్సహించేలా ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. స్పందించిన మేకర్స్ అన్నపూరణి వివాదం తర్వాత జీ స్టూడియోస్ ఒక ప్రకటన విడుదల చేసింది. అభ్యంతరకర సన్నివేశంలో అవసరమైన మార్పులు చేసేవరకు సినిమాను నెట్‌ఫ్లిక్స్ నుంచి తీసివేస్తామని హామీ ఇచ్చారు. మాకు ఎవరీ మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యం లేదని తెలిపింది. ఈ విషయంపై క్షమాపణలు కోరుతున్నాం అంటూ ప్రకటనలో వెల్లడించింది. కాగా.. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన అన్నపూరణిలో నయనతార ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో కార్తీక్ కుమార్, జై, సత్యరాజ్, పూర్ణిమ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. #WATCH | Hyderabad, Telangana: On 'Annapoorani' movie, BJP leader T Raja Singh says, "I have heard that Zee Studios has apologized but an apology will do nothing. We have seen many times that such films are being made to hurt the sentiments of Hindus...I appeal to Union Home… pic.twitter.com/pOMDyA7EY6 — ANI (@ANI) January 12, 2024 -
అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా!
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ సస్పెండెడ్ నేత రాజా సింగ్ సెక్యులర్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణం పోయినా ఫర్వాలేదుగానీ.. అలాంటి పార్టీల్లోకి వెళ్లనని ప్రకటించారు. ‘‘చచ్చినా నేను సెక్యులర్ పార్టీలకు వెళ్ళను. నా ప్రాణం పోతున్నా.. బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల వైపు చూడను. తెలంగాణను హిందు రాష్ట్రం చేయాలని నా లక్ష్యం. బీజేపీ గనుక నాకు టికెట్ ఇవ్వకుంటే.. రాజకీయాలను పూర్తిగా పక్కనపెట్టేస్తా. కానీ, హిందూ రాష్ట్రం కోసం పని చేసుకుంటా. అయినా బీజేపీ అధిష్టానం నా విషయంలో సానుకూలంగా ఉంది. సరైన టైంలో నాపై వేటు ఎత్తేస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారాయన. అలాగే.. బీఆర్ఎస్, ఎంఐఎంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉంది. అందుకే పెండింగ్ పెట్టారు. దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారు. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. కానీ ఇండిపెండెంట్‌గా కాని.. వేరే పార్టీల నుంచి కాని పోటీ చేయను అని స్పష్టం చేశారాయన. -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కలిసిన చికోటి ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను చికోటి ప్రవీణ్ కుమార్ కలిశారు. శుక్రవారం ధూల్‌పేట్‌లోని రాజాసింగ్ నివాసానికి వెళ్లిన ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హిందూత్వ వాదిగా మాత్రమే ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కలవడానికి వచ్చానన్నారు. హిందూ ధర్మం కోసం పోరాడే వారందరికీ అండగా ఉంటానని తెలిపారు. తనకు ఏ పార్టీలతో కూడా ఎలాంటి సంబంధంలేదన్నారు. ప్రస్తుతం ఏ పార్టీలో చేరే ఆలోచన కూడా లేదన్నారు. రాజాసింగ్ హిందూ టైగర్ కాబట్టే ఆయన కలవడానికి వచ్చానని చికోటి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. చదవండి: (నిత్యం పొడవాటి గడ్డంతోనే..! ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పట్టారా?) -
పీడీ యాక్ట్ బోర్డు ఎదుట ఎమ్మెల్యే రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నమోదు అయిన పీడీ యాక్ట్‌పై అడ్వైజరీ బోర్డు విచారణ చేపట్టింది. పీడీ యాక్ట్ బోర్డ్ చైర్మన్ జస్టిస్ భాస్కరరావు నేతృత్వంలో విచారణ సాగుతోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ జరిగిన విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఇదిలా ఉంటే.. ముహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్‌పై అభియోగాలు నమోదు అయ్యాయి. అయితే.. ‘నేను మహ్మద్ ప్రవక్త గురించి వీడియోలో మాట్లాడానని కొందరు ఆరోపిస్తున్నారు. నేను వీడియోలో ఎక్కడా మహ్మద్ ప్రవక్త పేరును ప్రస్తావించలేదు’ అంటూ మరో వీడియోను అరెస్ట్‌కు ముందు రిలీజ్ చేశారు రాజాసింగ్. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైల్లో ఉన్నారు. మరోవైపు.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్లో రాజాసింగ్ క్రిమినల్ కేసులు పొందుపరచలేదంటూ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించి.. నవంబర్ 1 లోగా సమాధానం ఇవ్వాలని రాజాసింగ్ తరపు న్యాయవాదుల్ని కోరింది. -
Hyderabad: పరేషాన్లో పాతబస్తీ.. రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్!
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరం వారం, పదిరోజులుగా నిత్యం ఏదో ఒక విషయంతో జాతీయ స్థాయి వార్తల్లో ఉంటోంది. మునావర్ కామెడీ షో అనౌన్స్మెంట్ మొదలు తాజాగా జరుగుతున్న రాజాసింగ్ ఇష్యూ వరకు ప్రతి రోజూ నగరానికి సంబంధించిన విషయాలు వేడి పుట్టిస్తున్నాయి. నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు పహారా పెంచడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాత బస్తీలో ఆంక్షలు విధించడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఒకసారి ఈ మొత్తం ఘటనలను పరిశీలిస్తే.. హైదరాబాద్ మహానగరంలో మునావర్ కామెడీ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే గతంలో ఓ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడిన మునావర్ షోకు అనుమతి ఎలా ఇస్తారని గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా తప్పుబట్టారు. మునావర్ షో నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. షోను అడ్డుకుంటామని చెప్పారు. అంతకు ముందు కూడా ఎక్కడ షో నిర్వహిస్తారో ఆ హాల్‌ను దగ్దం చేస్తామని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిస్థితులు నడుమ రాజాసింగ్ హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా ఆయన్ను అదుపులోకి తీసుకొని హౌజ్ అరెస్ట్ చేశారు. ఉత్కంఠతో మొదలై.. ప్రశాంతంగా ముగిసిన మునావర్ షో ఆద్యంతం ఉత్కంఠ, ఉద్రిక్తత, అరెస్టుల నడుమ మునావర్ ఫారూఖీ ఆగస్టు 20న హైదరాబాద్‌లో నిర్వహించిన కామెడీ లైవ్ షో ‘డోంగ్రీ టు నోవేర్’ ప్రశాంతంగా ముగిసింది. మునావర్ గతంలో హిందూ దేవతలను కించపరిచారని... అందుకే నగరంలో ఆయన షోను జరగనివ్వబోమంటూ బీజేపీ, వీహెచ్‌పీ హెచ్చరించిన నేపథ్యంలో మాదాపూర్‌లోని శిల్పకళావేదిక, పరిసర ప్రాంతాల్లో 1,500 మంది పోలీసులు బందోబస్తు చేపట్టి కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఒకటి తర్వాత మరొకటి నగరంలో సోమవారం రాత్రి నుంచి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ కె.కవిత ఇంటిపై దాడి చేసిన బీజేపీ నేతల అరెస్టులు జరుగుతుండగానే... ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పదల వ్యాఖ్యల వీడియో వైరల్ అయింది. దీనిపై పెద్ద స్థాయిలో నిరసనలు, కేసులు, అరెస్టు తదితరాలతో నగరం రణరంగంగా మారింది. దీనికితోడు రియల్ ఎస్టేట్ కంపెనీలపై జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడులు కలకలం సృష్టించాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం పరిణామాల నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై సోమవారం బీజేపీ నాయకులు దాడి చేశారు. దీనికి సంబంధించి బీజేపీ నాయకులు, కార్యకర్తలపై బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. అనేక మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు, అరెస్టులపై బీజేపీ శ్రేణులు అర్ధరాత్రి వరకు ఆందోళనలకు దిగాయి. ఇది సద్దుమణగక ముందే ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారింది. దీంతో నగర వ్యాప్తంగా నిరసనలు జరగడంతో పాటు ఆందోళనకారులు బషీర్‌బాగ్ పాత కమిషనరేట్ వద్దే ఆందోళనకు దిగారు. ఆపై రాజాసింగ్‌పై వరుస ఫిర్యాదులు, కేసుల నమోదు మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌కు సంబంధించిన చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చర్లపల్లిలోని రైల్వే టెర్మినల్ సందర్శన సైతం రద్దయింది. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా నగరంలోని అనేక సంస్థలు, వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. వీటికి కొనసాగింపుగా అన్నట్లు మంగళవారం రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేయడం కలకలం సృష్టించింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సభ సోమవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగింది. దీంతో సోమవారం నుంచి చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో నగర ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు. పాత కమిషనరేట్ వద్ద నిరసన ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై ఓ పక్క బందోబస్తు ఏర్పాట్లు కొనసాగుతుండగానే ఆందోళనకారులు బషీర్‌బాగ్‌కు చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో దాదాపు 3 వేల మంది ఆందోళనకారులు బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ వద్దకు వచ్చారు. రాజాసింగ్‌ను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. అయితే అక్కడకు వచ్చిన ప్రత్యేక బలగాలు పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు తీసుకున్నాయి. కేసుల మీద కేసులు రాజాసింగ్ వ్యాఖ్యలపై హైదరాబాద్ దక్షిణ మండలంలోని డబీర్‌పుర ఠాణాలో మొదటి కేసు నమోదైంది. ఆపై మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్, బాలానగర్ సహా ఆరు చోట్ల కేసులు రిజిస్టర్ అయ్యాయి. రాష్ట్రంలోని మరికొన్ని పోలీసుస్టేషన్లలో కూడా కేసులు నమోదయ్యాయి. 10 నిమిషాల 27 సెకన్ల నిడివితో ఉన్న రాజాసింగ్ వీడియోకు సంబంధించి మంగళ్‌హాట్ ఠాణాలో ఐపీసీలోని 153–ఎ, 295–ఎ, 505 (2), 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. ఉద్రిక్తత మధ్య అరెస్టు మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ధూల్‌పేట్‌లోని రాజాసింగ్ ఇంటికి మంగళ్‌హాట్ పోలీసులతో పాటు నగర టాస్క్‌ఫోర్స్ అధికారులు చేరుకున్నారు. వీరిని రాజాసింగ్ అనుచరులతో పాటు బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ దశలో పోలీసులు, రాజాసింగ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తనకు నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ రాజాసింగ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. ధర్మం కోసం చావడానికైనా సిద్ధమని, వెనక్కి తగ్గేదిలేదని అన్నారు. తన వీడియో రెండో పార్ట్ కూడా త్వరలోనే విడుదల చేస్తానన్నారు. అతికష్టమ్మీద రాజాసింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చారు. నేరుగా బొల్లారం ఠాణాకు తరలించారు. ఈ విషయం తెలిసిన తర్వాత బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ వద్ద నుంచి ఆందోళనకారులు వెళ్లిపోయారు. బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియోలో మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తక్షణమే పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ మంగళవారం ప్రకటించింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో సెప్టెంబర్ 2వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కమిటీ సభ్య కార్యదర్శి ఓం పాఠక్ మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జూన్ నెలలో నూపుర్ శర్మ ఉదంతంతో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, రాజాసింగ్ వీడియోను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. పార్టీకి నష్టం జరగకుండా చూసే క్రమంలో ఎమ్మెల్యేపై చర్యలకు దిగింది. కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు రాజాసింగ్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 41సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని రాజాసింగ్ తరపు న్యాయవాదులు కోర్టులు వాదనలు వినిపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేయడం చట్టవిరుద్దమని తెలిపారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి, ఇరుపక్షాల వాదనల అనంతరం.. పోలీసుల వినతిని తిరస్కరించారు. దీంతో పోలీసులు రాజాసింగ్‌ను మంగళవారం రాత్రి ఆయన ఇంటి వద్ద విడిచిపెట్టారు. రాజాసింగ్ కోర్టులో ఉన్న సమయంలో ఆయనకు అనుకూలంగా, వ్యతిరేకంగా అనేకమంది కోర్టు వద్దకు చేరుకున్నారు. ఓ దశలో పరిస్థితి అదుపుతప్పేలా కన్పించింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. రాజాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా చార్మినార్ పరిసరాల్లోని చిరు వ్యాపారులతో దుకాణాలను స్వచ్ఛందంగా బంద్ చేసి నిరసన తెలిపారు. వదంతులు నమ్మొద్దు ‘రాజా సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలో కొందరి మనో భావాలు దెబ్బతిన్నాయి. వీడియో పోస్టు చేసిన వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేశాము. చర్యలు తీసుకున్నాము. ఈ కేసులో ఓ లీగల్ అడ్వైజర్‌ను ఏర్పాటు చేశాం. ఎవరూ వదంతులు నమ్మవద్దు. ముందస్తు చర్యల్లో భాగంగా సెన్సిటివ్ ఏరియాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను పెట్టాము. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దు అనీ విజ్ఞప్తి చేస్తున్నాము. పాతబస్తీలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదు. పాతబస్తీ అంత కూడా ప్రశాంతంగా ఉంది. పరిస్థితులు కంట్రోల్లో ఉన్నాయి' అని సౌత్‌జోన్ డీసీపీ సాయి చైతన్య తెలిపారు. దూసుకొచ్చిన ఆందోళనకారులు శాలిబండ చౌరస్తాలో రాజా సింగ్‌కు వ్యతిరేకంగా బుధవారం మరోసారి పెద్ద ఎత్తున ఆందోళనకారులు దూసుకొచ్చారు. నల్లజెండాలు ప్రదర్శిస్తూ.. నిరసన తెలుపుతూ శాలిబండ చౌరస్తా నుంచి చార్మినార్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమూహాన్ని శాలిబండ చౌరస్తాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజా సింగ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జనాలను చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. నిరసనకారుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పాతబస్తీలో హైటెన్షన్ ఓల్డ్ సిటీలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. శాలిబండ, మొగల్‌పూర ఘటనలపై చార్మినార్ పోలీస్ స్టేషన్లో అడిషనల్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, పోలీస్ ఉన్నతాధికారులు సమీక్షించారు. ఇప్పటికే మతపెద్దలతోనూ చర్చించారు. మరోసారి ఘటనలు జరగకుండా చూడాలని పోలీసులు సూచించారు. పాతబస్తీలో 14 సున్నిత ప్రదేశాల్లో భారీగా బందోబస్తు నిర్వహించారు. ఇప్పటికే ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. సీఎం కేసీఆర్ రివ్యూ పాతబస్తీ అలజడిపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. రాత్రి 7గంటలలోపు షాపులన్నీ బంద్ చేయాలని పోలీసులు పెట్రోలింగ్ వెహికల్స్‌తో పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పాతబస్తీలో దుకాణాలను పోలీసులు మూసివేయించారు. పలుచోట్ల పెట్రోల్ బంక్‌లు బంద్ చేయించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. కీలక ప్రాంతాలలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించింది. పాతబస్తీలో ర్యాలీలు, ధర్నాలు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఓల్డ్‌సిటీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. సిటీలో ఆందోళనలపై సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. దాదాపు 3 గంటలకు పైగా పోలీసుల ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. -
రాజాసింగ్ లాయర్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ..
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టులో రాజాసింగ్ కేసు వాదించిన లాయర్ కరుణాసాగర్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బెయిల్ ఇప్పించినందుకు చంపేస్తామంటూ ఫోన్లో బెదిరిస్తున్నారు. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు లాయర్ కరుణాసాగర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘న్యాయవాద వృత్తిని నేను నెరవేర్చాను. పోలీసుల వైఫల్యంతోనే రిమాండ్ రిజెక్ట్ అయింది. నిన్నటి నుంచి గుర్తు తెలియని ఆగంతకులు నాకు కాల్స్ చేసి చంపుతామని బెదిరిస్తున్నారు. దుబాయ్ నుంచి కొందరు కాల్స్‌చేసి బెదిరిస్తున్నారు. బెదిరింపులకు నేను భయపడను. దీనిపై పోలీసులు స్పందించాలి’ అని లాయర్ కరుణాసాగర్ కోరారు. కాగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రిమాండ్‌ను రిజెక్ట్ చేసిన నాంపల్లి కోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 41సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని రాజాసింగ్ తరపు న్యాయవాదులు కోర్టులు వాదనలు వినిపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేయడం చట్టవిరుద్దమని తెలిపారు. రాజాసింగ్ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఎమ్మెల్యే రిమాండ్‌ను కోర్టు రిజెక్ట్ చేసింది. రాజాసింగ్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. చదవండి: (హైదరాబాద్‌లో అల్లర్లకు కుట్ర.. ఇది ముమ్మాటికీ నిజం: బండి సంజయ్) -
Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగిన ఆయనపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి శనివారం ఆదేశాలు జారీచేసింది. మీడియా సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకుండా రాజాసింగ్‌పై 72 గంటలపాటు నిషేధం విధించింది. ప్రజాప్రతినిధిగా ఉండి భాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. యూపీ ఓటర్లను బెదిరించడం ద్వారా చట్టాలను, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన రాజాసింగ్‌పై ఎందుకు చర్యలు చేపట్టకూడదో సంజాయిషీ ఇవ్వాలని ఇటీవల ఈసీ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులకు ఫిబ్రవరి 19వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోగా సమాధానమివ్వాలని స్పష్టం చేసింది. చదవండి: (రాజాసింగ్ వార్నింగ్: ఓటేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సిందే) అయితే గడువులోగా రాజాసింగ్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆయనపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో రాజాసింగ్‌పై హైదరాబాద్ వెస్ట్ జోన్ మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. తెలంగాణ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసినట్టు సీఐ రవికుమార్ తెలిపారు. -
రాజాసింగ్ వార్నింగ్: ఓటేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో ఉండాలంటే యోగికి జై కొట్టాల్సిందేనని హెచ్చరించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఓటేయనివారు రాష్ట్రం వదిలి వెళ్లిపోవాల్సిందేని యూపీ ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ‘యూపీలో రెండు విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. త్వరలో మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. యోగీకి ఓటు వేయకుంటే జేసీబీ, బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నికల తరువాత యోగికి ఓటు వేయని వారిని గుర్తిస్తాం. యూపీలో ఉండాలంటే యోగీ అనాల్సిందే లేకపోతే యూపీ వదిలి వెళ్లాల్సిందే’ అంటూ యూపీ ప్రజల్ని హెచ్చరించారు. చదవండి: (అభివృద్ధి మంత్రాన్ని వదిలి.. మళ్లీ ‘హిందుత్వ’ జపమెందుకో!) -
Telangana: అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల గెలుపుతో శాసనసభలో బీజేపీ బలం మూడుకు పెరిగింది. రాజేందర్ గెలిస్తే ట్రిపుల్ ఆర్ (ఆర్ఆర్ఆర్) అసెంబ్లీలో ఉంటారని ఆ పార్టీ అధ్య క్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యా యి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 5 సీట్లలో గెలిచిన ఆపార్టీ 2018 శాసనసభ సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసింది. గోషామహల్ నుంచి రాజా సింగ్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఒక్క సీట్‌కే పరిమిత మైంది. తరువాత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు టీఆర్ఎస్పై విజ యం సాధించి అసెంబ్లీలోకి ప్రవేశించారు. బీజేపీ లో చేరిన ఈటల శాసనసభ్యత్వానికి కూడా రాజీ నామా చేయడంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వచ్చింది. హోరా హోరీగా సాగిన తాజా ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ సుమారు 24 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. కమ లాపూర్/ హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఆయన గెలవ డం ఇది ఏడోసారి. దీంతో శాసనసభలో బీజేపీ బలం మూడుకు పెరిగింది. బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు నేతల పేర్లు ఆంగ్ల అక్షరం ‘ఆర్’తోనే మొదలవుతుంది. సినీ దర్శకుడు రాజమౌళి తీస్తున్న సినిమా కూడా ‘ఆర్ఆర్ఆర్’. దీంతో ఆ టైటిల్‌ను ఈ ముగ్గురికి అన్వయిస్తున్నారు. -
గాంధీ ఆస్పత్రిలో సేవ చేసే అవకాశమివ్వండి
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో కరోనా సోకిన రోగులకు సేవ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శుక్రవారం లేఖ రాశారు. గాంధీలో రోజుకు 10 నుంచి 12 గంటలపాటు తాను రోగులకు సేవ చేయగలనని లేఖలో తెలిపారు. ధూల్‌పేటకు చెందిన ఓ గర్భిణి డాక్టర్లు, సిబ్బంది సరిగ్గా పని చేయకపోవడం వల్ల చనిపోయిందని పేర్కొన్నారు. ఆ మహిళకు సరైన వైద్యం అందించాలని కేటీఆర్, ఈటల రాజేందర్‌కు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేసినా స్పందించలేదని వాపోయారు. తల్లితో పాటు కడుపులో ఉన్న శిశువు కూడా చనిపోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. -
ఎంఐఎం ఎమ్మెల్యేపై రాజాసింగ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలాపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే దబీర్‌పుర ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఉన్నబారికేడ్‌ను బలవంతంగా తొలగించారు. దీంతో బలాలాతోపాటు ఎంఐఎం మిగతా ఎమ్మెల్యేలు హైదరాబాద్ ఓల్డ్ సీటీలో లాక్డౌన్ నిబంధనలను పాటించడం లేదని, వీరిపై చర్చలు రాజా సింగ్ కోరారు. కాగా బారికేడ్లు తొలిగించే ముందు మజ్లిస్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా మీర్‌చౌక్ ఏసీపీ నుంచి అనుమతి తీసుకున్నారని దబీర్‌పుర పోలీసులు తెలిపారు. (యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 21 మంది మృతి ) రాజాసింగ్ మాట్లాడుతూ.. ఓ వైపు కరోనాతో దేశం పోరాడుతుంటే బలాలా వంటి ఎంఐఎం పార్టీ నేతలు లాక్డౌన్ నిబంధనలను పాటించడం లేదని మండిపడ్డారు. అధికారుల ఆదేశాలు పాటించకుండా పోలీసులకు, డాక్టర్లకు ఇబ్బంది కలిగిస్తున్నారని దుయ్యబట్టారు. అసలు ఈ చర్యలన్నింటి వెనక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హస్తం ఉందని ఆరోపించారు. ఓ వైపు ప్రజలకు మంచిగా కనిపిస్తూ మరోవైపు తన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో నిబంధనలను ఉల్లంఘించమని ఒవైసి ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ కోరారు. (గ్రేటర్ ఆర్టీసీ.. కండక్టర్ లెస్ సర్వీసులు! ) ఫ్లైఓవర్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అబ్దుల్లా బలాలా -
‘అలా అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ వల్గర్ భాషలో మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. 5 ఏళ్లలో కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేసారని విమర్శించారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరు చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. బంగారు తెలంగాణ కాకుండా.. అప్పుల తెలంగాణగా మారిందన్నారు. బైంసాలో జరిగిన హింస గుర్తులేని కేసీఆర్‌కు.. ఢిల్లీ ఘటనలు ఎలా గుర్తున్నాయని ప్రశ్నించారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్.. 10 పేజీల సీఏఏ బిల్లు చదవలేదా అని రాజాసింగ్ ప్రశ్నించారు. సీఏఏ వల్ల దేశంలోని ఏ ఒక్క వర్గానికి ఇబ్బంది లేదని అన్నారు. ఎన్నార్సీపై ప్రస్తుతం చర్చ జరగడం లేదని.. దానిని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్పీఆర్ అనేది ఈరోజు కొత్తగా జరుగుతున్న ప్రక్రియ కాదని అన్నారు. -
సీఏఏపై చర్చ.. బిల్లు పేపర్లు చించేసిన ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. సీఏఏను వ్యతిరేకిస్తూ సోమవారం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటన చేశారు. దీంతో ఆగ్రహించిన రాజాసింగ్ పాస్ చేసిన బిల్లు పేపర్లను చించివేస్తూ నిరసన తెలిపారు. రాజాసింగ్ మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ మైక్ కట్ చేయడంతో సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. కేవలం ఎంఐఎం దృష్టిలో మంచి మార్కులు తెచ్చుకునేందుకే సీఏఏకు టీఆర్ఎస్ వ్యతిరేకంగా తీర్మానం చేసిందని ధ్వజమెత్తారు. సీఏఏ వల్ల ఎవరికైనా అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే రాజీనామా చేసి, తెలంగాణ నుంచి వెళ్లిపోతానని ప్రకటించారు. (దేశానికి ఈ చట్టం అవసరం లేదు: కేసీఆర్) సభలో ఎంఐఎం గంటసేపు మాట్లాడారని, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరా అని రాజాసింగ్ ప్రశ్నించారు. ఈ చట్టం వల్ల దేశంలోని మైనార్టీలకు సమస్య లేదని అమిత్‌షా తెలిపారని అన్నారు. ఎంఐఎం పార్టీని ఖుషీ చేయాలనే కేసీఆర్ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎం ఏది చెబితే సీఎం అదే చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కర్ఫ్యూ తరహాలో భయానక వాతావరణం సృష్టించి సమగ్ర కుటుంబ సర్వే చేయించారని విమర్శించారు. తెలంగాణ వివరాలు కేంద్రానికి వెళ్లవద్దని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. (రాక్షసుల్లా తయారయ్యారు) ‘‘ముఖ్యమంత్రికి ఇంత కూడా తెలివి లేదా. ఎన్నార్సీపై ఇంకా నిర్ణయం కాలేదు. దానిపైన కూడా వ్యతిరేకిస్తూ తీర్మానం చేసారు. దేశం అనాథాశ్రమం కాదు.1985లో రాజీవ్ ప్రధానిగా ఉన్నప్పుడే ఎన్నార్సీ తెచ్చారు. సీఏఏ.. ఎన్పీఆర్.. ఎన్ఆర్సీకి సబంధం లేదు. ఎంఐఎంకు గులాంగిరి చేసే విధంగా సీఎం వ్యవహరిస్తున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలు తిరిగి ప్రజలకు వాస్తవాలు తెలియ జేస్తాం. ప్రజలపై ఒత్తిడి తీసుకు వచ్చి తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా చేస్తాం. ఈ తీర్మానం ఫాల్తూ రిజల్యూషన్. ఇది ఎందుకు పనికి రాని తీర్మానం.’’ అని టీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
‘చెవుల నుంచి రక్తాలు కారుతున్నాయి’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ తిమిళిసైతో అన్ని అబద్ధాలు పలికించిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా టీఆర్ఎస్ నిలబెట్టుకోలేకపోయిందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామన్నారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన విషయం తెలిసిందే. గవర్నర్ ప్రసంగంలో కొత్తగా ఏమి లేదని, బీజేపీ ఎమ్మెల్సీ రాంచర్‌రావు అన్నారు. ఆమె ప్రసంగం పాతబాటిల్‌లో కొత్త సారా అనే సామెతలా ఉందని ఎద్దేవా చేశారు. విద్యార్థులను, నిరుద్యోగులను నిరాశపరిచే విధంగా గవర్నర్ ప్రసంగం ఉందని దుయ్యబట్టారు. ప్రసంగంలో నిరుద్యోగ భృతి విషయం ప్రస్తావించలేదని, ప్రభుత్వం చెప్పేవి విని, చెవులు నుంచి రక్తాలు కారుతున్నాయని అన్నారు. గవర్నర్ ప్రసంగం ద్వారా అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందినదని స్పష్టంగా కనిపిస్తోందన్నారు. (అన్ని రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ: తమిళిసై) -
'కేసీఆర్ ఒక అబద్దాల పుట్ట'
సాక్షి, నిజామాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పి మత్తు తెలంగాణ, అప్పుల తెలంగాణగా తయారు చేశారని ఎమ్మెల్యే రాజా సింగ్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్‌లో శనివారం నిర్వహించిన రోడ్ షోలో రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక అబద్దాల పుట్ట అని ధ్వజమెత్తారు. ఉద్యోగాలు, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులను కేంద్రం ఇస్తామన్నా సీఎం ఒప్పుకోవడం లేదని ఆరోపించారు. అయినా కేసీఆర్‌కు భయపడడానికి తమది కాంగ్రెస్ పార్టీ కాదని హెచ్చరించారు. నిజామాబాద్ పేరును తిరిగి ఇందూరుగా మార్చుకోవాలని, నిజామాబాద్ మున్సిపల్ మేయర్ పదవిని బీజేపీ సాధించాలని పేర్కొన్నారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీకి జాతీయత భావం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. దేశంలో జాతీయత భావం సాధించిపెట్టిన ఘనత మోదీ, అమిత్ షాలదేనని పేర్కొన్నారు. సీఏఏ, ఎన్నార్సీ వల్ల దేశంలోని ముస్లింలకు ఏ ఇబ్బంది ఉండదని, ముస్లింలంతా మా అన్నదమ్ములని రాజాసింగ్ వెల్లడించారు. -
‘సీఏఏ భారత పౌరులకు సంబంధించింది కాదు’
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ దూకుడు తట్టుకోలేక పౌరసత్వ సవరణ చట్టంపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంట్ ఆమోదం పొందడంతో.. పలు రాజకీయ పార్టీలకు వేరే అంశాలు లేకపోవడంతో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. సీఏఏ, ఎన్నార్సీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ నిర్వహించిన సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు సీఏఏకు మతం రంగు పులిమి.. ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఇది భారత పౌరులకు సంబంధించిన చట్టం కాదని అన్నారు. నాడు జిన్నా మెప్పు కోసం కాంగ్రెస్ తలోగ్గిందని లక్ష్మణ్ విమర్శించారు. ఆ రోజు కాంగ్రెస్ అలా చేయకపోతే.. నేడు ఈ చట్టం చేసే అవసరమే వచ్చేది కాదని చెప్పారు. గతంలో పాకిస్తాన్లో 23 శాతం ఉన్న హిందువులు.. నేడు 1 శాతానికి పరిమితమయ్యారని గుర్తుచేశారు. మోదీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఏఏపై విష బీజాలు నాటే వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశ భక్తులు ఈ బిల్లు సమర్థించండి : రాజా సింగ్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. ‘నేడు దేశ భక్తులకు, దేశ ద్రోహులకు మధ్య సంఘర్షణ జరుగుతోంది. మేము ప్రధాని మోదీ ఏది చెబితే అది చేస్తాం. దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం. దేశ ద్రోహులను దేశం నుంచి వెళ్లగొడతాం. రెండోసారి ప్రధాని అయ్యాక మోదీ ఆర్టికల్ 370ని రద్దుచేసి కశ్మీర్, దేశాన్ని కాపాడారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ప్రజలను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నాయి. భారతదేశంలోని ముస్లింలు ఇక్కడే ఉంటారు. ఇతర దేశాల్లో నివసించే భారతీయులను మన దేశానికి తీసుకురావాలని మోదీ సంకల్పించారు. దేశ భక్తులు సీఏఏను సమర్థించాలి’ అని పిలుపునిచ్చారు. -
నేను ఎమ్మెల్యేనా.. రౌడీషీటర్‌నా?
-
నేను ఎమ్మెల్యేనా.. రౌడీషీటర్‌నా?
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు. మంగళ్‌హాట్ పోలీసుల రౌడీషీటర్స్ జాబితాలో రాజాసింగ్ పేరును చేర్చారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కొందరు బీజేపీ కార్యకర్తలు దీన్ని గమనించి రాజాసింగ్‌కు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ.. ఇంకా తన పేరు రౌడీషీటర్ జాబితాలో ఉండటంపై మండిపడ్డారు. తాను అన్ని వదిలేసి.. ప్రజా సేవలోకి వచ్చానని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై, మంత్రులపై గతంలో రౌడీషీట్లు ఉన్నాయని.. వాటిని ఇప్పుడు కొనసాగిస్తారా అని ప్రశ్నించారు. తనపై రౌడీషీట్ పెట్టినందుకు బాధలేదని చెప్పారు. తాను ఇప్పుడు ఎమ్మెల్యేనా, రౌడీషీటర్‌నా అనే దానికి ముఖ్యమంత్రి, హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
దిశ ఘటన.. రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులను ఊరి తీయాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే దిశ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిశ కేసు నిందితులు కోర్టు నుంచి తప్పించుకున్నా, జైలు నుంచి తప్పించుకున్నా, తన నుంచి తప్పించుకోలేరని రాజా సింగ్ హెచ్చరించారు. దిశను ఎంత దారుణంగా హత్య చేశారో.. నలుగురు నిందితులను అదే విధంగా శిక్షిస్తామని చెప్పారు. కాగా, ఈ కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మహబూబ్‌నగర్‌లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయనుంది. మరోవైపు షాద్‌నగర్ కోర్టు దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను వారం రోజులపాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీచేసింది. -
రాజాసింగ్ మా సాంగ్ కాపీ కొట్టారు : పాక్ ఆర్మీ
సాక్షి, హైదరాబాద్ : ‘హిందుస్తాన్ జిందాబాద్.. దిల్‌కీ అవాజ్.. హర్ దిల్‌కీ అవాజ్..’ పాటను గోషామహల్ ఎమ్మెల్యే, శ్రీరామ్ యువసేన భాగ్యనగర్ అధ్యక్షుడు టి.రాజాసింగ్ లోథా విడుదల చేసిన విషయం తెలిసిందే. శ్రీరామనవమి సందర్భంగా ఈ పాటను తన అధికారిక ట్విటర్లో రాజాసింగ్ షేర్ చేశారు. ఈ పాటను భారత సైనికులకు అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ పాటను రాజాసింగ్ కాపీ కొట్టారని పాక్ ఆర్మీ ఆరోపించింది. మార్చి 23 పాకిస్తాన్ డే సందర్భంగా తాము రూపొందించిన ‘పాకిస్తాన్ జిందాబాద్’ పాటకు కాపీనని పేర్కొంది. ఈ పాటను సహిర్ అలీ బగ్గా రాసారని తెలిపింది. ఈ పాటను కాపీ చేసినందుకు సంతోషంగా ఉందని, కానీ కాపీకి సంబంధించిన నిజాలు కూడా వెల్లడించాలి కదా! అని పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు రాజాసింగ్ పాడిన సాంగ్‌ను కూడా జతచేశారు. రాజా సింగ్.. ‘పాకిస్తాన్ జిందాబాద్ ’ పాటను ‘హిందూస్తాన్ జిందాబాద్ ’ గా మార్చి భారత సైన్యానికి అంకితమిచ్చారని పాక్ స్థానిక మీడియా పేర్కొంది. Glad that you copied. But copy to speak the truth as well. #PakistanZindabad https://t.co/lVPgRbcynQ — Asif Ghafoor (@peaceforchange) 14 April 2019 -
బీజేపీని గెలిపించి మోదీకి బహుమతిగా ఇవ్వాలి
బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి పీవీ శ్యామ్‌సుందర్‌రావును గెలిపించి ప్రధాని మోదీకి బహుమతిగా ఇవ్వాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. శనివారం భువనగిరిలో బైక్ ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. కేంద్రం ఇప్పటికే జిల్లాకు ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం, పాస్‌పోర్టు కార్యాలయం, సైనిక పాఠశాల మంజూరు చేసిందని గుర్తు చేశారు. సాక్షి, యాదాద్రి: బీజేపీ అభ్యర్థి పీవీ శ్యామ్‌సుందర్‌రావును గెలిపించి భువనగిరి కార్యకర్తలు ప్రధా ని మోదీకి బహుమతి ఇవ్వాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. శనివారం భువనగిరిలో బైక్ ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం భువనగిరి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. పీవీ శ్యామ్‌సుందర్‌రావు కొన్నేళ్లుగా నియోజకవర్గంలో ప్రజా సేవలో ఉన్నారన్నారు. ప్రతి కార్యకర్త తనకు తాను అభ్యర్థిగా భావించుకుని పీవీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. సమయం మూడు రోజులే ఉన్నం దున కార్యకర్తలు పూర్తిస్థాయిలో పని చేస్తే కచ్చితంగా గెలుస్తామన్నారు. మోదీ ప్రధాని అయితే నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని గుర్తు చేశారు. ఇప్పటికే కేంద్రం ఏయిమ్స్, కేంద్రీయ విద్యాలయం, పాస్‌పోర్టు కార్యాలయం, సైనిక పాఠశాల మంజూరు చేసిందన్నారు. జాతీ య రహదారులను అభివృద్ధి చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ బ్లాక్మెయిల్ రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ అభ్యర్థి పీవీ శ్యాంసుందర్‌రావు మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గంలో ఇప్పటి రకు గెలిచిన కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎంపీలు ప్రజల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. త మ స్వప్రయోజనాల కోసం ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. బీజేపీ మో దీ ప్రభుత్వం నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులు మం జూరు చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెదిరె శ్రీరాంరెడ్డి, దాసరి మల్లేశం, నర్ల నర్సింగ్‌రావు, సుర్వి లావణ్య, చందా మహేందర్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా పాక్ కోడలు అవసరమా?
-
పాక్ కోడలు అవసరమా?: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలను భారత ప్రజలు కోరుకోవడం లేదని, ఈ తరుణంలో పాకిస్తాన్ కోడలైన సానియా మీర్జాను తెలంగాణ ప్రచారకర్తగా తీసేయాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన ఏమన్నారంటే.. ‘నమస్కారం.. నా తెలంగాణ ప్రజల్లారా.. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా మన ముఖ్యమంత్రి.. సానియా మీర్జాను నియమించారు. ఆమె ఎవరు?.. పాకిస్తాన్ కోడలు. పెళ్లి అయిపోయిన తర్వాత ఆమె ఆ దేశం కోడలు అవుతుంది. అలాంటి పాకిస్తాన్ కోడలిని సీఎం తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా చేశారు. ముఖ్యమంత్రిగారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవ్వాళ మన సైన్యంపై పాక్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఎంతో మంది జవాన్లు అమరులయ్యారు. ప్రతీ దేశం పాక్‌ను వ్యతిరేకిస్తుంది. భారత్ కూడా అన్నిరకాల మద్దతును ఉపసంహరించుకుంది. మీరూ కూడా పుట్టిన రోజు జరుపుకోలేదు. ఈ విషయం తెలిసి చాలా సంతోష పడ్డాను. సానియామీర్జాను ప్రచారకర్తగా తొలగించి పీవీ సింధూ, సైనా నెహ్వాల్‌లో ఒకరిని నియమించండి. ఈ విషయంపై ఒక సారి ఆలోచించండి’ అని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. భారత్-పాక్ మధ్య ఏ వివాదం చెలరేగిన సానియా మీర్జాకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతిఒక్కరు ఆమె దేశభక్తిని ప్రశ్నిస్తూ.. ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. తాజాగా జరిగిన పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కూడా సానియా తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈ విషయంపై ఆమె ఒకింత అసహనాన్ని వ్యక్తం చేస్తూ తన దేశభక్తిపై వివరణ కూడా ఇచ్చుకున్నారు. గొంతు చించుకుంటేనే దేశభక్తా? అంటూ ట్రోలింగ్ చేసే వారిపై తీవ్రంగా మండిపడ్డారు. చదవండి: గొంతు చించుకొని అరవాలా: సానియా మీర్జా -
ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గో రక్షా పేరిట గోవులను రక్షిస్తుంటే పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారంటూ బషీర్ బాగ్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు నిరాహారదీక్ష చేస్తానని రాజా సింగ్ ప్రకటించారు. దీంతో సోమవారం సాయంత్రం ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మొహరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం బషీర్‌బాగ్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ బయలుదేరడానికి వెళుతుండగా పోలీసులు రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గోవులను రక్షించి గోశాలకు తరలిస్తుంటే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. గోరక్ష కార్యకర్తలపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. బక్రీద్ కోసం ఓల్డ్ సిటీకి తరలించిన గోవులను, గోవు దూడలను వెంటనే గోశాలకు తరలించాలన్నారు. గోవులను వదించడానికి పిలిపించిన కసాయిలను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తన డిమాండ్లు నెరవేర్చే వరకు నిరాహారదీక్ష కొనసాగిస్తానని తెలిపారు. కాగా, నిరసన దీక్షకు అనుమతి లేదని పోలీసులు రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
అందరి చూపు వైఎస్సార్ సీపీ వైపు
తుని: నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనపై ప్రజలు విసుగు చెందారు. దివంగత నేత రాజశేఖరరెడ్డి తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పాలన కోసం జనం ఎదురు చూస్తున్నారు. ప్రజల నాడిని తెలుసుకున్న నాయకులు వైఎస్సార్ సీపీలో చేరడానికి సమాయత్తం అవుతున్నారు. టీడీపీ కోసం ఎన్నో త్యాగాలు చేసినా గుర్తింపు ఇవ్వలేదని, తమ భవిష్యత్తుకోసం జనాదరణ కలిగిన పార్టీలో చేరడమే సముచితమని వారు భావిస్తున్నారు. ప్రజా సంకల్పయాత్ర పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా జననేత జగన్మోహన్రెడ్డి ఈ నెల 11న తుని గొల్ల అప్పారావు సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభకు జనం వేల సంఖ్యలో తరలివచ్చారు. ఇది చూసిన టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. టీడీపీలో నాయకులు బాగు పడ్డారే తప్ప అభివృద్ధి జరిగింది ఏమీ లేదన్న విషయాన్ని ప్రజలు గమనించారు. వైస్సార్ సీపీలో చేరడానికి నాయకులు సిద్ధం: ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. టీడీపీకి చెందిన పలువురు మండల స్ధాయి నాయకులు వైఎస్సార్ సీపీలో చేరడానికి మంతనాలు జరుపుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కూడా ఎవరు వచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. దీంతో టీడీపీలో ఆందోళన మొదలైంది. తుని, తొండంగి, కోటనందూరు మండలాలు, పట్టణానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత వీరందరూ బయటకు రావడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. -
రాజాసింగ్‌కు తప్పిన పెను ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రాజాసింగ్‌పై ఉద్దేశపూర్వకంగా దాడికి యత్నం జరిగినట్లు బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వివరాల్లోకెళ్తే.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో జరిగిన బహిరంగసభకు హాజరయ్యారు. సభ ముగిసిన అనంతరం అర్ధరాత్రి ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. 30 కిలోమీటర్లు ప్రయాణించగానే మార్గం మధ్యలో ఆయన కారును ఓ గుర్తుతెలియని వ్యక్తి లారీతో ఢీకొట్టాలని చూశాడు. అయితే రాజాసింగ్ కారు డ్రైవర్ అప్రమత్తం కావడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. అదే సమయంలో ఎమ్మెల్యే కారు వెనకాలే వస్తున్న మరో కారును ఆ లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు లారీ క్లీనర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ ప్రమాదానికి పథకం వేసి ఉండొచ్చునని ఆయన భావిస్తున్నారు. లారీతో తన కారును ఢీకొట్టాలని చూశారని ఆయన ఆరోపించారు. తన కారు డ్రైవర్ అప్రమత్తం కావడం వల్లే పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానని రాజాసింగ్ తెలిపారు. -
ప్రతి హిందువు ఇంట్లో ఖడ్గం ఉండాలి
సాక్షి, బెంగళూరు (యాదగిరి): బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో హైదరాబాద్–కర్ణాటక ప్రాంతంలోని యాదగిరిలో బుధవారం హిందూ విరాట్ సమావేశాన్ని నిర్వహించారు. శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్‌తో పాటు తెలంగాణలోని రాజాసింగ్ పాల్గొన్నారు. రాజాసింగ్ మాట్లాడుతూ.. ‘మత మార్పిడితో పాటు హిందూ ఆలయాలను ధ్వంసం చేసిన టిప్పు సుల్తాన్ జయంతిని కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సరికాదు. టిప్పు జయంతికి బదులుగా ఎవరైనా దేశ భక్తుడి జయంతిని ఆచరించాలి. ప్రతి హిందువూ తన ఇంట్లో లాఠీని, ఖడ్గాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి. సందర్భం వచ్చినప్పుడు హిందూ ధర్మాన్ని విరోధించే వారి తలలను ఖడ్గంతో నరకాలి’ అని వ్యాఖ్యానించారు. ఆ కార్యక్రమానికి హాజరైన యువకులు రాజాసింగ్ వ్యాఖ్యలతో తమ చేతుల్లోకి ఖడ్గాలను తీసుకొని తిప్పడం కనిపించింది. ప్రమోద్ ముతాలిక్ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ‘దేశం, ధర్మాన్ని రక్షించుకునేందుకు ప్రతి హిందూ ఖడ్గాన్ని చేపట్టాలని నేను కూడా 15 ఏళ్లుగా చెబుతూ వస్తున్నాను. అయితే ఈ ఖడ్గాన్ని తప్ప తాగి ఎవరిపైనైనా దాడి చేసేందుకు కానీ, మంచి వారికి హాని తలపెట్టేందుకు కానీ వినియోగించకూడదు’ అని చెప్పారు. -
30ఏళ్ల అరాచక పాలన..
► పిఠాపురంలో మూడేళ్లలో మించి పోయింది : రాజా గొల్లప్రోలు (పిఠాపురం) : తునిలో 30 ఏళ్లుగా సాగుతున్న అరాచక పాలనను.. పిఠాపురంలో గత మూడేళ్లుగా పాలన మించిపోయిందని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. గొల్లప్రోలులో గురువారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ప్లీనరీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తునిలో గురువును తలదన్నేలా పిఠాపురంలో శిష్యుడు అకృత్యాలకు పాల్పడి...రాచరిక పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే వర్మను ఉద్దేశించి అన్నారు. మట్టి, ఇసుకను అమ్ముకుని నియోజకవర్గాన్ని దోచుకు తింటున్నారన్నారు. మట్టిని తవ్వుకోడానికి చెరువులను ఎండగట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. మొసలి కన్నీరు కార్చి ఓట్లు వేయించుకుని.. ఇప్పుడు ఓట్లు వేసిన ప్రజల ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు తిరగబడే రోజులు వస్తున్నాయన్నారు. ప్రతిపక్ష నేతను విమర్శించాను.. మంత్రి పదవి ఇవ్వండని అధినేత ముందు మోకరిల్లుతున్న ఆయన.. స్థాయిని మరచి విమర్శలు చేస్తే సహించేదిలేదని ఎమ్మెల్యే రాజా హెచ్చరించారు. -
ఆ చొరవే ఊపిరి పోసింది
క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చిన ఎమ్మెల్యే రాజా జీజీహెచ్‌లో కోలుకుంటున్న బాధితులు తుని రూరల్ : ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రాణాలను నిలబెట్టారు. ఫో¯ŒS చేశాం అంబులెన్సు వస్తుందని కొంతమంది, ప్రత్యామ్నాయ వాహనంలో తరలిస్తే తమకు ఏ కేసులు చుట్టుకుంటాయోనని మరికొందరు ఎదురు చూస్తుండగా అటుగా వచ్చిన ఎమ్మెల్యే చొరవ తీసుకోవడం ఎంతో మందిని కదిలించింది. గురువారం సాయంత్రం తుని మండలం మరువాడవద్ద జరిగిన ఆటో, మోటార్ సైకిల్ ఢీకొన్న సంఘటనలో ఇదే మండలం బుచ్చి సీతయ్యపేటకు చెందిన దంపతులు కె.సింహాచలం (పెదబాబులు), సీతారత్నం తీవ్రంగా గాయపడ్డారు. ఒక దశలో సింహాచలం మృతి చెందాడని భావించిన స్థానికులు అతన్ని పట్టించుకోలేదు. సీతారత్నాన్ని ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్సు కోసం ఎదురు చూస్తుండిపోయారు. కేఓ మల్లవరంలో జరిగిన వివాహ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న ఎమ్మెల్యే రోడ్డుపై పడిఉన్న దంపతులను చూసి వారిని ఎవరూ పట్టించుకోకపోవడంతో చలించిపోయారు. వెంటనే తన వాహనాన్ని పక్కన నిలిపి ఆటోగా పోతున్న ఆటోలో క్షతగాత్రులను ఎక్కించి తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెనుక తన వాహనంలో ఆస్పత్రికి వెళ్లి వైద్యులతో చర్చించి సత్వర వైద్యం అందించారు. సింహాచలానికి కాలు, సీతారత్నానికి వెన్నుముక తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కాకినాడ ఆస్పత్రిలో సింహాచలం, సీతారత్నం వైద్యసేవలు పొందుతూ కోలుకుంటున్నారు. సకాలంలో ఎమ్మెల్యే రాజా స్పందించి ఆస్పత్రికి తరలించడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డామని క్షతగాత్రులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే సేవాహృదయంతో తమ పిల్లలను పోషించుకునేందుకు జీవించే అవకాశం లభించిందన్నారు. నేటి రాజకీయ నాయకుల్లో సేవాతత్పరత కానరావడంలేదని, అందుకు భిన్నంగా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆపదలో ఉన్న ఎంతోమందిని ఆదుకోవడంతోపాటు ఇటువంటి సంఘటనల్లో తన ఔదార్యం చాటుకుంటున్నారని పలువురు పేర్కొన్నారు. -
అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా
ఎమ్మెల్యే రాజాసింగ్ రామ మందిర నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు హైదరాబాద్: ‘అయోధ్యలో రామమందిరం నిర్మించి తీరుతాం.. ఎవరైనా అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా.. రామాలయ నిర్మాణంలో ప్రాణాలు అర్పించడానికైనా.. తీయడానికైనా ఏ మాత్రం వెనుకాడబోను’ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 5న శ్రీరామనవమి రోజు ఎమ్మెల్యే రామభక్తులను ఉద్దేశించి ధూల్‌పేట్ జుమ్మెరాత్‌బజార్‌లో ప్రసంగించిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేగాక పలు మీడియా చానెళ్లు ఈ వీడియోను ప్రసారం చేయడంతో రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై ‘సాక్షి’వివరణ కోరగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హయాంలో త్వరలోనే రామ మందిరం నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. ఎవరైనా అడ్డువస్తే వారి ప్రాణాలు తీసేందుకు వెనుకాడబోనన్నారు. రామమందిరం నిర్మాణం ఆపడం ఇక ఎవరితరం కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హిందుస్తాన్‌లో హిందువులకు వ్యతిరేకంగా ఉండేవారికి స్థానంలేదని స్పష్టం చేశారు. కాగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌పై డబీర్‌పురా పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లా ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ వెంకన్ననాయక్ తెలిపారు. -
కేరళ సీఎం పర్యటనను అడ్డుకుంటాం
ఎమ్మెల్యే రాజాసింగ్ సాక్షి, హైదరాబాద్: కేరళలో వీహెచ్‌పీ నేతలను హత్య చేయిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ హైదరాబాద్ పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. ఈ నెల 19న సీపీఎం నిర్వహించే బహిరంగ సభలో కేరళ సీఎంను పాల్గొనకుండా నిలువరించాలని బీజేపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. -
హైదరాబాద్‌కు పయనమైన ఎమ్మెల్యే రాజా
తొండంగి : వైఎస్సార్ సీపీ అ«ధిష్టానం పిలుపు మేరకు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆదివారం రాత్రి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు సంబంధించి రాష్ట్రంలో పరిణామాలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ నెల 20న గవర్నర్‌ను కలవనున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అన్నవరం రైల్వేస్టేçÙ¯ŒSకు వచ్చిన ఆయనను తుని, తొండంగి మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి సమస్యలు వివరించారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, పార్టీ నాయకులు పప్పల సీతారాముడు, సాపిశెట్టి చిన్న, తొండంగి సొసైటీ ఉపాధ్యక్షుడు వనపర్తి సూర్యనాగేశ్వరరావు, బూర్తి కృష్ణ, కందాబాబ్జి, నాగం గంగ తదితరులు ఎమ్మెల్యే రాజాకు వీడ్కోలు పలికారు. -
కేసులకు భయపడబోను..
దివీస్ బాధితుల పక్షానే పోరు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కాకినాడ : ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు కృష్ణుడుల అరాచకాలు రోజురోజుకీ మితిమీరి పోతున్నాయని, కేసులు పెట్టి వేధింపులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆరోపించారు. అయినా వెనుకడుగు వేయకుండా దివీస్ బాధితుల పక్షాన పోరాడతానని స్పష్టం చేశారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయిన తనను టీడీపీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. గత రెండేళ్ళలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఆయన శుక్రవారం విలేకరులకు చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. తుని నియోజకవర్గంలో జరుగుతున్న అనేక సంఘటనల్లో బాధితుల పక్షాన నిలబడడంతో కక్ష కట్టారు. ఏడు సెక్ష¯ŒS 307 కేసులతో పాటు మరో 22 కేసులు బనాయించారు. పేదల పక్షాన పోరాడుతున్న ప్రతిసారీ ఏదోరకంగా కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు బెదిరిపోయే వ్యక్తిని కాదు. ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాడతా. ఎన్ని కేసులు పెట్టినా, మరెన్ని బెదిరింపులకు పాల్పడినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నాడు ఏరువాక చేసి.. నేడు వేధింపులా! ఎస్ఈజడ్ భూముల విషయంలో నానా హంగామా చేసి నాగలిపట్టి ఏరువాక చేసిన చంద్రబాబు ఇప్పుడు పేదరైతుల పొట్టకొట్టి అయిన వారి కోసం కోట్లాది రూపాయల భూములను దివీస్‌కు ధారాదత్తం చేశారు. ఎన్నికల మందు ఇంటికి పెద్దకొడుకుగా ఆదరించాలన్న చంద్రబాబు ఏరుదాటాక తెప్ప తగలేసిన చందాన వ్యవహరిçస్తున్నారు. దివీస్ పరిశ్రమ వల్ల పంపాది పేట, తాటియాకుల పాలెం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఆ ప్రాంతం నుంచి నాకు 86 ఓట్లే వచ్చాయి. దాంతో ఇప్పుడు నా వద్దకు వచ్చేందుకు ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయినా బాధ్యత కలిగిన ప్రజా ప్రతిని«ధిగా వారి పక్షాన నిలబడి పోరాడుతున్నాను. 78 రోజులుగా దివీస్ ప్రాంతంలో 144 సెక్ష¯ŒS విధించి అణచివేత ధోరణితో వ్యవహరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ముద్రగడ అంశానికి సంబం«ధించి తుని ఘటనలో 164 మందిపై కేసులు నమోదు చేస్తే అందులో ఎక్కువ శాతం వైఎస్సార్ సీపీకి చెందినవారే. వికలాంగులు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజలను కేసుల్లో ఇరికించారు. చంద్రబాబు డైరెక్ష¯ŒSలోనే తుని సంఘటన చోటుచేసుకుంది. ఆనాడు జరిగిన సంఘటనలన్నింటికీ చంద్రబాబే కారణం. తునిలో పుట్టడమే నేరమన్న ««ధోరణిలో తెలుగు దేశం పార్టీ అరాచక పాలన కొనసాగిస్తోంది’ అంటూ రాజా ధ్వజమెత్తారు. -
ప్రజల సమస్య ప్రభుత్వానికి పట్టదా?
తుని : ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలకు ఏర్పడిన ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విమర్శించారు. ఎంతసేపూ తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై విమర్శలు చేయడానికే సీఎం పరిమితమయ్యారన్నారు. తుని శాంతినగర్‌లోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో రాజా ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేసి వారం అవుతోందని, ఇంతవరకూ ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడం దురదృష్టకరమన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వ తీరును ఎండగడుతున్న ప్రతిపక్షాలపై పోలీసులు చేత కేసులుపెట్టించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ధ్వజమెత్తారు. తొండంగి మండలం కోన ప్రాంతంలో కాలుష్యం వెదజల్లే దివీస్ పరిశ్రమ కోసం అక్కడి ప్రజలను సమస్యల్లోని నెడుతున్నాయన్నారు. దివీస్ బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్సీపీ అధినేత, శాసనసభలో ప్రతిపక్షనేత వైఎస్ జగ¯ŒSమోß毌S రెడ్డి ఈ నెల 22న తొండంగి మండలానికి వస్తున్నారన్నారు. అక్కడ జరిగే జగ¯ŒS బహిరంగ సభను పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంత చేయాలని రాజా కోరారు. -
పరిశ్రమ కంటే ప్రజలే ముఖ్యం
వారి కోసం పోరాటాలకు సిద్ధం తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తుని : తొండంగి మండలం సముద్ర తీర ప్రాంతంలో విషపదార్థాలను వెదజల్లే దివీస్ మందుల పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం, పరిశ్రమ కన్నా ప్రజలే ముఖ్యమని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. శనివారం తొండగి మండలం తీరప్రాంతానికి చెందిన మత్స్యకార సంఘం నాయకులు చొక్కా కాశీ విశ్వేశ్వరరావు, మేరుగు హరి, మెసా సత్తిబాబు తుని పార్టీ కార్యాలయంలో రాజాను కలిశారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ వరకూ ఉన్న సముద్ర తీర ప్రాంతంలో లక్ష మంది మత్స్యకారులు చేపల వేటతో జీవనోపాధి పొందుతున్నారని నాయకులు లె లిపారు. దివీస్ మందుల పరిశ్రమ ఏర్పాటు చేస్తే మత్స్య సంపద అంతరించి, మత్స్యకారులు ఉపాధి కోల్పోయి, వలసపోవాల్సి వస్తుందని వివరించారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచన చేయాలే తప్ప కార్పొరేట్ కంపెనీల కోసం కాదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగిపోయాయని, 30 ఏళ్ల నుంచి టీడీపీకి కంటికి రెప్పలా ఉన్న మత్స్యకార, యాదవ సామాజిక వర్గాలను యనమల రామకృష్ణుడు నిర్లక్ష్యం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేవలం సొమ్ముల కోసం సొంత సామాజిక వర్గానికి అన్యాయం చేయడం తగదన్నారు. కోటనందూరు మాజీ ఎంపీపీ గొర్లి అచ్చియ్య నాయుడు, తొండంగి మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలోకి టీడీపీ మాజీ జెడ్పీటీసీ కాశీ స్థానిక శాంతినగర్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే రాజా సమక్షంలో టీడీపీకి చెందిన కాశీ విశ్వేశ్వరరావు పార్టీ చేరారు. ఆయనకు ఎమ్మెల్యే రాజా కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చొక్కా కాశీ విశ్వేరరావు మాట్లాడుతూ టీడీపీకి మద్దతు ఇచ్చిన తీర ప్రాంత ప్రజలకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. తొండంగి మండలంలో ప్రభుత్వం 144 సెక్షన్ అమలు చేసి సభలు జరగకుండా చేసిందని, త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని, పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరతారన్నారు. దానవాయిపేట పంచాయతీ మాజీ సర్పంచ్ మేరుగు హరిబాబు, కోస్తా జాతీయ మత్స్యకార పరిరక్షణ కాలుష్య నివారణ సంఘం చైర్మన్ మెసా సత్తిబాబు, ఎ.ప్రకాశరావు, కోటనందూరు మాజీ ఎంపీపీ గొర్లి అచ్చియ్య నాయుడు, మోతుకూరి వెంకటేష్ పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రి కేసీఆర్ గతం మరిచారు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వికారాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. స్థానిక అతిథి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ విమోచనను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీఆర్ పదవిలోకి రాగానే గతం మరిచారని విమర్శించారు. సౌండ్ పొల్యూషన్, టైమ్ మెయింటెనెన్స్ అంటూ.. హిందువుల పండుగలపై అనేక ఆంక్షలు పెడుతున్న రాష్ట్ర సర్కార్.. ముస్లింల వేడుకలకు మాత్రం నిబంధనలేవీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సుప్రీం కోర్టు చేసిన చట్టం ప్రకారం గోవధపై నిషేధం ఉన్నా.. తెలంగాణలో వేలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఏర్పాటులో సర్దార్ వల్లబాయ్‌పటేల్ కీలకంగా వ్యవహరించారని తెలిపారు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదన్నారు. మహనీయుల చరిత్రలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే తమ పార్టీ తిరంగాయాత్రను ప్రారంభించిందని స్పష్టంచేశారు. వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి ప్రజాధరణ ఉన్నా.. గ్రూపు రాజకీయాల వల్ల బలహీనమవుతోందని పలువురు విలేకరులు ఆయనను అడగగా.. పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కె. లక్ష్మణ్ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించరని, అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతంపై దృష్టిసారించారని స్పష్టంచేశారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పాండుగౌడ్, నాయకులు చౌదరి యాదవరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్, మాజీ ప్రధాన కార్యదర్శి శివరాజ్, నాయకులు మాధవరెడ్డి, కేపీ రాజు, విజయ్‌భాస్కర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోకల సతీష్‌గుప్త, బీజేవైఎం నాయకులు అనిల్, వివేకానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే రాజా నిర్బంధం
హైదరాబాద్ వెళ్లేందుకు అంగీకరించిన పోలీసులు విమానాశ్రయానికి తరలింపు తునిరూరల్ : ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత హైదరాబాద్ వెళ్లేందుకు అంగీకరించి మధురపూడి విమానాశ్రయానికి తరలించారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్.అన్నవరంలో స్వగృహం నుంచి బయలుదేరిన ఎమ్మెల్యే రాజాను పట్టణ సీఐ బి.అప్పారావు, ఎస్సై శంకరరావు, పోలీసులు వెంబడించి తునిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. దివీస్ ల్యాబ్ భూసేకరణకు వ్యతిరేకంగా ఆరవ తేదీన బాధితులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అధికారేతర పార్టీల నాయకులు, సంఘాల వారు నిర్ణయించారు. దీంతో మంగళవారం అన్ని ప్రాంతాల నుంచి వచ్చే నాయకులను అడ్డుకునే క్రమంలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను నిర్బంధించేందుకు పోలీసులు యత్నించారు. దివీస్‌కు వ్యతిరేకంగా జరిగే సమావేశానికి వెళ్లనివ్వబోమని సీఐ అప్పారావు స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్‌లో జరిగే పార్టీ సమావేశానికి వెళతానని ఎమ్మెల్యే రాజా పోలీసులకు చెప్పారు. దివీస్‌కు వ్యతిరేకంగా జరిగే సమావేశానికి వెళతారన్న అనుమానంతో ఉన్న పోలీసులు హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతిస్తామని, విమానాశ్రయం వరకు తామే పంపిస్తామని ఎమ్మెల్యేకు చెప్పారు. ఇందుకు అంగీకరించడంతో ఎమ్మెల్యేను మధురపూడి విమానాశ్రయానికి పోలీసులు తరలించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ పాండురంగారావును తన ఆస్పత్రిలో నిర్బంధించారు. పంపాదిపేట సమీపంలో అదుపులోకి తీసుకున్న సీపీఐ (ఎం.ఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి బుగత బంగార్రాజు, తుని ఏరియా కార్యదర్శి కె.జనార్ధన్‌లను పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
రాష్ట్రంలో రజాకార్ల పాలన:రాజాసింగ్
పంజగుట్ట: తెలంగాణలో నిజాం కాలంనాటి రజకార్లపాలన కొనసాగుతోందని గోషామహల్ ఎమ్మెల్యే, గోరక్షాదళ్ అధ్యక్షుడు రాజాసింగ్ అన్నారు. పోలీసులు రజ్వీ అనుచరుల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల తో మాట్లాడుతూ ... ప్రభుత్వం పోలీస్ బందోబస్తు మధ్య ఆవులను కసాయి వారికి అప్పగిస్తుందన్నారు. సోమవారం మైలార్‌దేవుల పల్లి ప్రాంతంలో ఆవులను అక్రమ రవాణా చేస్తుండగా గోరక్షాదళ్ కార్యకర్తలు అడ్డుకుని పోలీసులకు అప్పగించగా, వారు సత్యం శివం సుందరం గోశాలకు వాటిని అప్పగించినట్లు తెలిపారు. అయితే గోషాల వద్ద ఎంఐఎం కార్యకర్తలు గొడవ చేయడంతో పోలీసులు బందోబస్తు మధ్య ఆవులను కబేళాలలకు తరలించడం దారుణమన్నారు. ఏటా బక్రీద్ ముందు ప్రభుత్వం చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఆవుల అక్రమ రవాణాను అడ్డుకునేదని, అయితే ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి తనిఖీలు నిర్వహించడంలేదని ఆరోపించారు. బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్, సంఘ్, గోరక్షాదళ్ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి బెదిరిస్తున్నారన్నారు. ఎవరైనా ఆవులను బలిచేస్తే ఊరుకునేది లేదని భవిష్యత్ పరిణామాలకు ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి, నగర కమిషనర్లకు లేఖలు రాసినట్లు తెలిపారు. -
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు
శంషాబాద్ రూరల్: పోలీసు విధులకు ఆటంకం కలిగించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై శంషాబాద్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి వద్ద సోమవారం పట్టుబడిన పశువులను మండలంలోని బుర్జుగడ్డతండా వద్ద ఉన్న సత్యం శివం సుందరం గోశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడకు చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో విధులకు ఆటంకం కలిగించారని ఐపీసీ సెక్షన్–186 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
‘దివీస్’ భగభగలు
- లేబొరేటరీ పనులను అడ్డుకున్న రైతులు - నిర్మాణ సామగ్రి దహనం.. పెద్ద ఎత్తున నినాదాలు - రైతుల ఆందోళనకు అండగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాజా తొండంగి తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కోన తీరప్రాంతంలో దివీస్ లేబొరేటరీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పరిసర గ్రామాల రైతులు ఆ భూముల్లోకి ఆదివారం ప్రవేశించి పనులను అడ్డుకున్నారు. దానవాయిపేట పంచాయతీ కొత్తపాకలు గ్రామంలో ప్రభుత్వం దివీస్ లేబొరేటరీస్‌కు 505 ఎకరాలు కేటాయించింది. ఇటీవల రెవెన్యూ అధికారులు ఎకరాకు రూ.5 లక్షల పరిహారం చెల్లించి కొంతమంది రైతుల నుంచి భూములు సేకరించారు. అయితే ఈ పరిశ్రమ వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, గాలి, నీరు, నేల కలుషితమై తీరప్రాంత గ్రామాల మనుగడ దెబ్బ తింటుందని పేర్కొంటూ.. పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం తదితర గ్రామాల రైతులు భూములిచ్చేది లేదంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. సమస్యను తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా దృష్టికి తీసుకువెళ్లి తమకు న్యాయం చేయాలని కోరగా పంపాదిపేటలో బాధిత రైతులతో ఎమ్మెల్యే ఆదివారం చర్చించారు. దివీస్ సేకరించిన భూముల్లో క్లియరింగ్ పనులు రెండు రోజుల క్రితం ప్రారంభమయ్యాయని రైతులు వివరించారు. అక్కడున్న మహిళలు, రైతులతో కలిసి ఎమ్మెల్యే రాజా పాదయాత్రగా పరిశ్రమకు సేకరించిన భూముల పరిశీలనకు వెళ్లారు. తాటియాకులపాలేనికి చెందిన రైతు ఎన్.నాగేశ్వరరావు భూమిలో దివీస్ ప్రతినిధులు బలవంతంగా పనులు నిర్వహిస్తున్నారని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన రైతులు తమపై బలప్రయోగానికి దిగితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ.. అక్కడ షెడ్డు నిర్మించేందుకు వేసిన స్తంభాలను, తాటిదూలాలను తొలగించారు. తాటియాకులను తగలబెట్టి నిరసన తెలిపారు. పరిశ్రమ నిర్మాణ పనులు సాగనివ్వబోమని నినాదాలు చేశారు. రైతులకు అండగా వైఎస్సార్సీపీ: ఎమ్మెల్యే రాజా కాకినాడ సెజ్ ప్రాంతంలో సేకరించిన భూములు ఖాళీగా ఉండగా.. పేద రైతుల భూములను తక్కువ ధరకు బలవంతంగా సేకరించడం అన్యాయం. సెజ్ ప్రాంతంలో పరిశ్రమను స్థాపిస్తే ఎకరాకు రూ.70 లక్షల చొప్పున దాదాపు రూ. 350 కోట్లు అవుతుందని, కానీ, కోన ప్రాంతంలోని పేద రైతుల భూములను రూ. 25 కోట్లకే చేజిక్కించుకునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఎన్నో ఏళ్లుగా భూమినే నమ్ముకుని బతుకుతున్న తీరప్రాంత రైతులంతా పరిశ్రమ స్థాపనతో వచ్చే కాలుష్యం వల్ల వలస పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రాంత ప్రజల మనుగడను ప్రశ్నార్థకం చేసే దివీస్ పరిశ్రమ స్థాపనను ప్రభుత్వం విరమించుకునే వరకూ ఎమ్మెల్యేగా, వైఎస్సార్సీపీ నేతగా ప్రజల పక్షాన పోరాడతాను. -
తీవ్రవాదుల అడ్డాగా హైదరాబాద్
- ఉగ్రవాదులకు పెద్దన్నలా వ్యవహరిస్తున్న అసదుద్దీన్ - ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి - బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ : ‘‘హైదరాబాద్ తీవ్రవాదులకు అడ్డాగా మారింది. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉగ్రవాదులకు పెద్దన్నలా వ్యవహరిస్తున్నారు. నగరంలో పట్టుబడిన ఉగ్రవాదులకు తమ పార్టీ తరఫున మద్దతు ఇస్తానన్న ఒవైసీపై దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. ఎంఐఎం పార్టీని రద్దు చేయాలి. హైదరాబాద్‌లో జరుగుతున్న ఉగ్ర కార్యకలాపాలపై త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు నివేదిక సమర్పిస్తా’’ అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్న ఎంఐఎం పార్టీతో అధికార టీఆర్ఎస్ దోస్తీ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ సాధిస్తామని నిత్యం ప్రకటనలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. టైస్టులకు మద్దతు పలుకుతున్న పార్టీలతో పొత్తుపెట్టుకుని ఎలా బం గారు తెలంగాణ సాధిస్తారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎంఐఎంతో దోస్తీ పాముకు పాలు పోసి పెంచడమే అన్న విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు. ఎంఐఎం టైస్టులకు మద్దతుగా ప్రకటనలు చేయడం వల్లే హైదరాబాద్‌లో ఉగ్రవాద సానుభూతిపరులు పెరుగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కేవలం ముస్లింల ఓట్లతోనే గెలిచినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. టైస్టులకు వ్యతిరేకంగా ప్రపంచం యు ద్ధం చేస్తోందని, ప్రధాని ప్రతీ దేశం తిరిగి ఉగ్రవాదాన్ని ఎలా రూపుమాపాలని ప్రయత్నం చేస్తుంటే తెలంగాణ మాత్రం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సుమారు 50 మందికిపైగా ఉగ్రవాదులు తెలంగాణ రాష్ట్రంలోనే దొరకడం దీనికి నిదర్శనమన్నారు. ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాదులను పట్టుకోకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. -
51 అడుగుల హనుమాన్ విగ్రహం
ధూల్‌పేట్ గంగాబౌలి గుట్టపై... హైదరాబాద్: రాజధాని నగరంలోని ధూల్‌పేట్ గంగాబౌలి గుట్టపై నిర్మితమైన 51 అడుగుల ఆకాశ్‌పురి హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. గురువారం సాయంత్రం గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్‌లోథా, సాధ్వీ ప్రాచీ, సాధ్వీ దేవాఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరై హనుమాన్ ప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ లోథ, సాధ్వీ ప్రాచీ, సాధ్వీ దేవాఠాకూర్లు మాట్లాడుతూ నగరానికే తలమానికంగా ఆకాశ్‌పురి హనుమాన్ను తీర్చిదిద్దారని, భవిష్యత్‌లో ధూల్‌పేట్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతుందని అన్నారు. చివరగా అన్నదాన కార్యక్రమం జరిగింది. హనుమాన్ హృదయంలో రామదర్బార్ 51 అడుగుల ఎత్తులో నిర్మితమైన ఆకాశ్‌పురి హనుమాన్ హృదయంలో కొలువుదీరిన రామదర్బార్‌ను హనుమాన్ చేతులతో తెరుస్తున్నట్లు రిమోట్ ద్వారా కనెక్ట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రిమోట్ ఆన్ చేసిన వెంటనే హనుమాన్ హృదయంలో ఉన్న రామదర్భార్ విగ్రహ స్వరూపాలు కనువిందు చేస్తున్నాయి. -
బీజేపీకి ప్రచారం చేయను
బీజేపీ టికెట్లు అమ్ముకున్నారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డిపై ఎమ్మెల్యే లోథ ధ్వజం అబిడ్స్ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కుమ్మక్కై బీజేపీని నాశనం చేస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ అన్నారు. గ్రేటర్లో బీజేపీ టికెట్లను బిల్డర్లు, భూకబ్జాదారులకు అమ్ముకున్నారని ఆరోపిం చారు. గురువారం తన కార్యాలయం లో విలేకరులతో మాట్లాడుతూ... గ్రేటర్లో బీజేపీ ఓడిపోయేలా దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి టికెట్ల పంపకం చేశారన్నారు. దీనిపై తాను కొన్ని నెలలుగా ముందుగానే హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవాలనే ఆకాంక్షతో హిందుత్వవాదులకు టికెట్లు ఇవ్వాలని కోరినా ఒక్క హిందుత్వవాదికి కూడా టికెట్ కేటాయించలేదన్నారు. బీజేపీ ఓడడం ఖాయం: గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధుల్లో అత్యధికులు ఓడిపోవడం ఖాయమని, ఇందుకు కారణం బండారు దత్తాత్రే య, కిషన్‌రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి వారు దందాలు చేసుకుంటున్నారని, వారిద్దరి కారణంగా గ్రేటర్లో బీజేపీ తీరని నష్టం జరుగుతుందన్నారు. ఈ ఎన్నికల్లో తాను బీజేపీ తరపున ప్రచారం చేయనని స్పష్టం చేశారు. టీడీపీతో కలిసి బీజేపీ అభ్యర్ధులు బలంగా ఉంటే దాదాపు 80-100 సీట్లు కైవసం చేసుకోవచ్చునని. అయితే టీఆర్ఎస్కు మేయర్‌పీఠాన్ని అప్పగించేందుకే సరైన అభ్యర్ధులను ఎంపిక చేయలేదన్నారు. -
‘హైకోర్టు తీర్పు సీఎంకు చెంపపెట్టు’
అబిడ్స్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టు చెంపపెట్టు లాంటిదని గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ అన్నారు. గ్రేటర్ ఎన్నికలపై కేసీఆర్ చేస్తున్న కుట్రలకు హైకోర్టు చరమగీతం పాడిందన్నారు. గురువారం గోషామహల్ షాహినాయత్‌గంజ్‌లోని తన కార్యాలయంలో ‘సాక్షి’తో మాట్లాడుతూ... గ్రేటర్లో ఎక్కువ సీట్లు గెలవాలని ముఖ్యమంత్రి, మంత్రులు పన్నిన కుట్రలలు భగ్నమయ్యాయన్నారు. 15 రోజుల్లో ఎలక్షన్ ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించి, రిజర్వేషన్ల ప్రక్రియను నేటికీ ప్రకటించకపోవడంతో గ్రేటర్‌లోని అన్ని పార్టీలు ఆందోళనకు గురవుతున్నాయన్నారు. నెలరోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని గురువారం హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లుతెరిచి ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించాలని సూచించారు. -
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై శుక్రవారం కేసు నమోదు అయింది. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో ఆయనపై బొల్లారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటున్న రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చారు. అయితే అక్కడ జరిగిన వాగ్వాదంలో సీఐను ఎమ్మెల్యే దూషించడంతో కేసు నమోదైంది. కాగా గతంలో కూడా రాజాసింగ్‌పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. విధి నిర్వహణలో ఉన్న ఆ కానిస్టేబుల్ పై దాడి చేయడమే కాక చంపేస్తానంటూ బెదిరించారు. దీంతో బాధిత కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. -
బీఫ్ ఫెస్టివల్ భగ్నం
♦ భారీ బందోబస్తుతో అడ్డుకున్న పోలీసులు ♦ ఖాకీల దిగ్బంధంలో ఓయూ ♦ సీ హాస్టల్ వద్ద లాఠీచార్జి.. విద్యార్థుల అరెస్ట్ ♦ హాస్టళ్లలోనే బీఫ్ వంటకాల ఆరగింపు ♦ ఎమ్మెల్యే రాజాసింగ్ గృహ నిర్బంధం.. అరెస్ట్ సాక్షి, హైదరాబాద్: కొద్దిరోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన బీఫ్ ఫెస్టివల్‌ను పోలీసులు భగ్నం చేశారు. ముందుగా ప్రకటించినట్లే ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద గురువారం ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక(డీసీఎఫ్) సభ్యులు ఫెస్టివల్ నిర్వహణకు యత్నించారు. అయితే వర్సిటీలో 600కుపైగా పోలీసుల మోహరింపు, డీసీఎఫ్ నేతల ముందస్తు అరెస్ట్‌లతో ఇది సాధ్య పడలేదు. దీంతో అప్పటికే బీఫ్ వంటకాలు సిద్ధం చేసుకున్న డీసీఎఫ్ సభ్యులు తమ హాస్టళ్లలోనే ఒకరికొకరు పంచుకుని తిన్నట్లు తెలిసింది. ఇంకొందరు ఎన్సీసీ గేటు సమీపంలోని త్రివేణి హాస్టల్లో వండుకుని తిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వాట్సప్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లోకి పోస్ట్ చేశారు. వీటిని చూసి కోపోద్రిక్తులైన బజరంగ్దళ్ , ఏబీవీపీ, గో సంరక్షణ సమితి కార్యకర్తలు ఓయూలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. గురువారం అర్ధరాత్రి వరకు ఓయూ వద్ద బందోబస్తు కొనసాగింది. బీఫ్ ఫెస్టివల్‌కు మద్దతు పలికిన వారితోపాటు, నిర్వహణను అడ్డుకునేందుకు యత్నించిన 300 మందికిపైగా అరెస్టయ్యారు. వీరందరినీ వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించి సాయంత్రం విడిచిపెట్టారు. అరెస్టయిన వారిలో ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఆందోళనకారులు పలుచోట్ల ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు. దీంతో ఒక డ్రైవర్ గాయపడ్డారు. లాఠీచార్జీలు.. అరెస్టులు ఓయూలో మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీ హాస్టల్ వెనుక వైపు కొందరు విద్యార్థులు బీఫ్ వంటకాలు తింటూ నినాదాలు చేశారు. అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు వారి వెంట పడి లాఠీచార్జి చేశారు. కొందరు విద్యార్థులు హాస్టల్ గదుల్లోకి వెళ్లి త లుపులు వేసుకోగా.. మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓయూలోకి వెళ్లే అన్ని దారులను పోలీసులు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఎక్కడి కక్కడ బారికేడ్లు, ముళ్ల కంచెలు, చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఓయూలోకి ఇతరులు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. విలేకరులను కూడా లోనికి అనుమతించలేదు. బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకునేందుకు తెలంగాణ శివసేన నాయకులు గుట్టు చప్పుడు కాకుండా చెట్ల పొదల మాటున ఓయూలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీఫ్ ఫెస్టివల్‌కు మద్దతుగా ఓయూలోకి వెళ్లేందుకు యత్నించిన పీడీఎస్‌యూ, పీఓడబ్ల్యూ, ఐఎఫ్టీయూ నాయకులను ఎన్సీసీ గేట్ వద్ద అడ్డుకున్నారు. ఫెస్టివల్ నిర్వహించకుండా నిర్బంధం విధించినా విద్యార్థులు బీఫ్ తిని విజయవంతం చేశారని డీసీఎఫ్ ప్రతినిధులు తెలిపారు. కాగా, వర్సిటీలో ఎలాంటి పండుగలు నిర్వహించరాదన్న కోర్టు ఆదేశాల మేరకు ఓయూలో గురువారం నిర్వహించ తలపెట్టిన పందికూర పండుగను రద్దు చేసుకున్నట్లు బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సోలం కి శ్రీనివాస్ తెలిపారు. ఓయూలో కొన్ని విద్యా ర్థి సంఘాల నాయకులు తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్, ఫోర్క్ ఫెస్టివల్ పండుగలకు విద్యార్థుల మద్దతు లేదని తేలిపోయిందని ఏబీవీపీ జాతీయ నాయకులు కడియం రాజు పేర్కొన్నారు. పోలీసులు బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నట్లు విప్లవ రచయితల సం ఘం ఒక ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం యోగా, గోవధ పేరుతో అలజడి సృష్టిస్తోందని, మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని విరసం నేత వరవరరావు దుయ్యబట్టారు. రాజాసింగ్ అరెస్ట్ బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటానని హెచ్చరించిన ఎమ్మెల్యే రాజాసింగ్ లోథాను గురువారం ఉదయమే పోలీసు లు అరెస్టు చేశారు. మొదటగా గృహ నిర్బం ధం చేసిన ఆయన్ను తర్వాత.. షాహినాయత్ పోలీసులు గోషామహల్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. అక్క డి నుంచి బొల్లారం పీఎస్‌కు తీసుకెళ్లారు. ఢిల్లీలోనూ బీఫ్ ఫెస్టివల్ సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ) నేతలు గురువారం బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం అరెస్టులకు పాల్పడిందని, అందుకే ఢిల్లీలో నిర్వహించామని టీవీవీ అధ్యక్షుడు నూకల మహేశ్ పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
హైదరాబాద్ : ఛలో ఓయూకు పిలుపునిచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మంగళ్‌హాట్‌లోని ఆయన నివాసంలోనే రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సాయినాథ్గంజ్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. కాగా ఓయూలో బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటామని రాజాసింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పలువురు అనుమానితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించొద్దని సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై తాము జోక్యం చేసుకోబోమని తాజాగా హైకోర్టు స్పష్టం చేసినా.. నిర్వాహకులైన ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక (డీసీఎఫ్) ప్రతినిధులు మాత్రం తమ పట్టువీడటం లేదు. అయితే, ఎలాగైనా అడ్డుకుంటామని హిందుత్వ సంస్థలు ప్రకటించడంతో అందరి చూపు ఓయూపైనే కేంద్రీకృతమైంది. మరోపక్క ఖాకీల మోహరింపుతో ఓయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్దకూర పండుగ నిర్వహణకు పిలుపునిచ్చిన నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఓయూలోని ఎన్ఆర్ఎస్ హాస్టల్‌ను దిగ్భందించారు. అలాగే ఇతరులతో పాటు మీడియాకు కూడా క్యాంపస్ లోనికి అనుతమించడం లేదు. -
కబేళాకు తరలిస్తున్న గోవులను కాపాడిన ఎమ్మెల్యే
ఎల్బీనగర్: కబేళాకు తరలిస్తున్న గోవులను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు పట్టించారు. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం నుంచి లారీలో నగరంలోని బహదూర్‌పురాలోని కబేళాకు గోవులను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన అనుచరులతో కలిసి ఆటోనగర్‌లో అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టుకున్న లారీలో ఏడు ఆవు దూడలు, 31 కోడె దూడలు ఉన్నాయి. వీటిని నగరంలోని ప్రభుత్వ గోశాలకు తరలించారు. గోవులను తరలిస్తున్న కృష్ణ, గణపతి, బైరాగిలను స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నాకు ఏమైనా జరిగితే కమిషనర్‌దే బాధ్యత
దేశంలో ఎక్కడ ఏం జరిగినా ఓల్డ్ సిటీ కేంద్రంగా మారుతోంది.. యూనివర్శిటీల్లో విద్యార్థులను తీవ్రవాదం వైపు మళ్లింపు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దోమలగూడ : తీవ్రవాదుల నుంచి తనకు ప్రాణ హాని ఉందని.. ఈ విషయంలో ఎటువంటి అపాయం చోటుచేసుకున్నా.. అందుకు నగర పోలీసు కమిషనర్ భాద్యత వహించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు రక్షణ పెంచాలని, దేశద్రోహ ఉగ్రవాది యాకూబ్ మెమన్ను సమర్థించే వారి మీద దేశద్రోహులను శిక్షించాలని కోరుతూ జాతీయ హిందూ ఉద్యమం ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాది మెమన్ ఉరితీతపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మరికొందరు ముస్లిం నేతలు, కుహనా సెక్యులరిస్టులు అత్యున్నత న్యాయ వ్యవస్థ తీర్పును, రాష్ట్రపతి విచక్షణను ప్రజల్లో తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మెమన్ను సమర్థించడం దేశద్రోహం కిందకే వస్తుందని, భవిష్యత్తులో ఇది ప్రమాదకరంగా మారకుండా ఉండాలంటే యాకూబ్‌ను సమర్థించే వారిని, న్యాయ వ్యవస్థను వ్యతిరేకించే వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ఎన్నో ఏళ్లుగా చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, దీనిపై డీజీపీ, కమిషనర్, ఇంటిలిజెన్స్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా దర్యాప్తు చేయడంలేదు, పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పాత నగరం టైస్ట్‌ల అడ్డాగా మారిందని, తాజాగా నలుగురైదుగురు ఐఎస్ఐ తీవ్రవాదులు పోలీసుల గాలింపులో పట్టుపడ్డారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో శివసేన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు మురారి, భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ పి నరేందర్, హిందూ ఏక్తా మంచ్ అధ్యక్షులు బద్రి తోష్నివాల్, హిందూ ధర్మ రక్షా సమితి కార్యదర్శి రామాంజనేయులు, హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర కన్వీనర్ చంద్రమొగెర్, జైన్ సేవా సంఘ్ అధ్యక్షులు నోరతన్మాల్, బీజేపీ లీగల సెల్ కన్వీనర్ అరుణాసాగర్, అదర్శ మహిళా సంఘం అధ్యక్షులు రూబీమిశ్రా తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథాపై కేసు
ఎమ్మెల్యే దాడి చేశారని కానిస్టేబుల్ ఫిర్యాదు అబిడ్స్: బరాత్‌లో డీజేను నిలిపివేసిన తనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథా దాడి చేశాడని ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళ్‌హాట్ పోలీసులు రాజాసింగ్‌లోథాతో పాటు అతని అనుచరులపై కేసులు నమోదు చేశారు. అయితే తాను ఎవరిపై దాడి చేయలేదని, ఆ కానిస్టేబుల్ మద్యం తాగి ఉండటంతో అతడిని ఆసుపత్రికి తరలించి పరీక్షలు జరిపించాలని అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్సైలను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం... ధూల్‌పేట్ బలరాంగల్లీ అరాంగర్ కాలనీకి చెందిన విజయేందర్‌సింగ్ నివాసంలో పెళ్లి ఉండటంతో ట్రాలీలో డీజేను ఉంచి బలరాంగల్లీలో పెద్దశబ్దంతో డీజేను వాయిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో బ్లూ కోర్ట్స్-1 సిబ్బంది ఎంబీ చంద్రశేఖర్, మహావీర్‌లు అక్కడికి వెళ్లి.. డీజేకు అనుమతి లేకపోవడంతో నిలిపివేశారు. దీంతో పెళ్లివారు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి విషయం చెప్పగా ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో నైట్‌డ్యూటీలో ఉన్న ఎస్సై ఆర్.శేఖర్ అక్కడి వచ్చారు. డీజేను నిలిపివేయడంతో పోలీసులకు, పెళ్లివారికి వాగ్వాదం జరిగింది. కాగా, ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథా, ఆయన అనుచరులు ఘటనా స్థలానికి వస్తూనే తమను దూషించి, దాడి చేశారని కానిస్టేబుల్ ఎంబీ చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథాతో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ చంద్రశేఖర్‌పై దాడిచేయడాన్ని పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణ్‌కుమార్ సింగ్ ఖండించారు. కానిస్టేబుల్ మద్యం తాగి ఉన్నాడు: ఎమ్మెల్యే విందు జరుగుతున్న ఇంటికి అర్ధరాత్రి మద్యం తాగి వచ్చిన కానిస్టేబుల్ చంద్రశేఖర్ మహిళలను కూడా దూషించాడని ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథా అన్నారు. తాను ఆ కానిస్టేబుల్‌ను మద్యం ఎందుకు తాగి వచ్చావని అడిగానని, దాడి చేయలేదని మీడియాకు తెలిపారు. కానిస్టేబుల్ మద్యం తాగి ఉన్న విషయాన్ని అక్కడ ఉన్న మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్ ఎస్సైలకు కూడా చెప్పానని, వారు తనకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపేసి, తిరిగి తనపైనే ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ధూల్‌పేట్ పరిధిలో రాత్రివేళల్లో ఏ పంక్షన్ అయినా పోలీసులు మద్యం తాగి వచ్చి మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై ఇటీవలే తాను మంగళ్‌హాట్ పోలీసులపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశానన్నారు. పోలీసుల అక్రమాలపై త్వరలోనే పూర్తి వివరాలతో డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. -
అక్రమ ఇసుక దందాపై దాడిశెట్టి పోరు
బొద్దవరం డంపింగ్యూర్డులో నిల్వల్ని గుర్తించిన ఎమ్మెల్యే రాజా స్థానికాధికారులు స్పందించకపోవడంతో కలెక్టర్, ఆర్డీఓలకు ఫిర్యాదు రైతులు, పార్టీ నాయకులతో ఏడున్నర గంటలకు పైగా యూర్డులోనే నిరీక్షణ చివరికి వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుక, 11లారీలు, రెండు జేసీబీల సీజ్ తుని :కోట్ల విలువ చేసే ఇసుక అక్రమంగా తరలిపోతుంటే అవినీతితో, అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో పట్టించుకోని అధికారులను తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తన పట్టుదలతో దిగివచ్చేలా చేశారు. అక్రమ ఇసుక నిల్వలను స్వయంగా గుర్తించిన ఆయన వాటిని స్వాధీనం చేసుకునే వరకూ పట్టువిడవ లేదు. ఏడున్నర గంటలపాటు అధికారుల కోసం నిరీక్షించి మరీ వేలాది క్యూబిక్ మీటర్ల అక్రమ ఇసుక నిల్వలను, తరలించడానికి ఉద్దేశించిన వాహనాలను పట్టించారు. ఇసుక అక్రమ దందాతో తాండవ ఒడ్డున పంట భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవాలని సంకల్పించిన ఎమ్మెల్యే రాజా రైతులు, మండల వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో కోటనందూరు మండలం బొద్దవరం వెళ్లారు. తాండవ నదిలో తవ్విన ఇసుకను నిల్వచేసిన డంపింగ్ యార్డుకు వెళ్లి, 11 లారీలు, రెండు జేసీబీలతోపాటు వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలను గుర్తించారు. దీనిపై స్థానిక రెవెన్యూ, మండల పరిషత్ అధికారులకు సమచారమిచ్చారు. గంటలు గడుస్తున్నా స్థానిక అధికారులు స్పందించకపోవడంతో కలెక్టర్ అరుణ్‌కుమార్, పెద్దాపురం ఆర్డీవో విశ్వేశ్వరరావులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి ఇసుక నిల్వలు, వాహనాలను సీజ్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు వచ్చే వరకు కదిలేది లేదన్న ఎమ్మెల్యే రాత్రి తొమ్మిది గంటల వరకూ అక్కడే ఉండిపోయూరు. కాగా అధికార పార్టీ పెద్దలు చీకటిపడ్డాక ఇసుక అక్రమార్కులను ఉసిగొల్పి ఎమ్మెల్యేను, గ్రామస్తులను బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో ఎస్పీ, డీఎస్పీలకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, తహశీల్దారు పి.వరహాలయ్య, ఎంపీడీఓ మధుసూదన్‌లు వచ్చి ఇసుక తరలింపుకు ఉపయోగిస్తున్న వాహనాలను సీజ్ చేస్తామని చెప్పారు. అయితే లిఖితపూర్వకంగా చెబితేనే అక్కడ నుంచి కదులుతానని ఎమ్మెల్యే రాజా తేల్చిచెప్పడంతో చివరికి సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. ఇదంతా జరిగే సరికి రాత్రి 10 గంటలైంది. రైతుల శ్రేయస్సుకు రాజీలేని పోరు: ఎమ్మెల్యే రాజా తాండవ నదిలో ఇసుకను గృహనిర్మాణదారుల కోసమంటూ పంచాయతీ జారీ చేసే పర్మిట్లను అడ్డుపెట్టుకుని రోజుకు రూ.కోటి పైగా విలువ చేసే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఎమ్మెల్యే రాజా విలేకరులకు చెప్పారు. కోటనందూరు నుంచి తుని మండలం వరకూ ఉన్న తాండవలో సుమారు పదిచోట్ల అధికారపార్టీ అండదండలతో ఇసుక మాఫియూ చెలరేగిపోతోందన్నారు. ఆరునెలలుగా ఇది జరుగుతున్నా ఒక్క అధికారీ పట్టించుకోలేదని ఆరోపించారు. విచ్చలవిడి తవ్వకాలతో నదీగమనం మారి సాగు భూములు నదిలో కలిసిపోతున్నాయని, బోరుబావుల్లో నీటి నిల్వలు తగ్గుతున్నాయని అన్నారు. రైతుల శ్రేయస్సు కోసం ఇసుకమాఫియాను అరికట్టేంత వరకూ రాజీ లేని పోరాటం చేస్తానన్నారు. ఎమ్మెల్యే వెంట మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ గొర్లి రామచ ంద్రరావు, మాజీ ఎంపీపీ గొర్లి అచ్చియ్యనాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పెదపాటి అమ్మాజీ, పార్టీ నాయకులు దాడి బాబులు, వేముల రాజబాబు, చింతకాయల చినబాబ్జి, లగుడు శ్రీను, లంకప్రసాద్, ఎల్లపు సూర్యనారాయణ, సుర్ల అప్పలనాయుడు, కూరపాటి రమణ, బర్రి అప్పారావు, రేలంగి రమణాగౌడ్, మోతుకూరి వెంకటేష్, పలువురు రైతులు ఉన్నారు. ప్రోటోకాల్‌ను విస్మరించిన అధికారులు ఎమ్మెల్యే రాజా, రైతులు కలసి అనధికార ఇసుక నిల్వలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా అధికారులు సకాలంలో స్పందించలేదు. చివరికి డిప్యూటీ తహశీల్దార్ ఆర్.వెంకటేశ్వరరావు వచ్చి లారీలు, జేసీబీలు,ఇసుక నిల్వల వివరాలను నమోదు చేశారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నిం చగా రెండు నిమిషాలు మాట్లాడాక స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకి బందోబస్తు ఇవ్వవలసిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. ఎమ్మెల్యే బొద్దవరం వచ్చిన అరగంటకు వచ్చిన కోటనందూరు ఎస్సై గోపాలకృష్ణ పది నిమిషాల్లోనే ఉన్నతాధికారుల నుంచి ఫోన్ రాగా వెళ్లిపోయారు. అనంతరం తహశీల్దార్, ఎంపీడీఓ కూడా ఇలాగే వ్యవహరించారు. -
‘శోభా’యమానం
అబిడ్స్/జియాగూడ/కలెక్టరేట్/ సుల్తాన్‌బజార్: జైశ్రీరామ్...జై వీర హనుమాన్ అంటూ లక్షలాది మంది భక్తుల నినాదాల నడుమ శ్రీరామ నవమి శోభాయాత్ర కన్నుల పండువగా నిర్వహించారు. ధూల్‌పేట్ నుంచి పురానాపూల్, జిమ్మెరాత్ బజార్, చుడీ బజార్, ఛత్రి, బేగంబజార్, సిద్దిఅంబర్‌బజార్, గౌలిగూడ, కోఠి, సుల్తాన్‌బజార్ వరకు నగర రహదారులు కాషాయమయంగా మారాయి. వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ధూల్‌పేట్ గంగాబౌలిలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర కొనసాగింది. మొదటిసారిగా సీతారాంబాగ్ ఆలయం నుంచి భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి నాయకులు ఈ యాత్రను నిర్వహించారు. బృందావన్ నుంచి వచ్చిన సాధ్వీ సంహిత, ఆధ్యాత్మిక గురువు స్వామి కమలానంద భారతి సీతారాం బాగ్‌లో ఉదయం 11 గంటలకు పూజలు చేసి... యాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు గంగాబౌలిలో ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ, ఆలిండియా బీజేపీ కార్యదర్శి మురళీధర్‌రావులు శ్రీరాముడికి పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. రాత్రి వరకూ ఈ వేడుక కొనసాగింది. ఉర్రూతలూగించిన డోల్ పతక్ బ్యాండ్... పూణె నుంచి వచ్చిన కళాకారుల డోల్ పతక్ బ్యాండ్ ఉర్రూతలూగించింది. 101 మంది యువతీ యువకులు నృత్యాలు చేస్తూ... శివాజీ, శ్రీరాముడి భక్తి గీతాలు పాడుతూ బ్యాండ్‌లో పాల్గొన్నారు. ఆకట్టుకున్న విగ్రహాలు ఈ యాత్రలో భారీ శ్రీరాముడి విగ్రహం, శివాజీ, హనుమంతుడు, సీతారామ లక్ష్మణలు, రాణిఅవంతిబాయి, శేషశయ్యపై ఆదివిష్ణువు, రామసేతు, శ్రీరాముడి పట్టాభిషేకం విగ్రహాలు భక్తుల మదిని దోచుకున్నాయి. ధూల్‌పేట్‌లో టీఆర్ఎస్ నాయకులు ఆనంద్‌సింగ్ నిర్వహించిన ఫాల్కీ యాత్రలో తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రామ మందిరం నిర్మిద్దాం:సాధ్వీ సంహిత అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని ప్రతి భక్తుడూ కోరుతున్నారని బృందావన్ వీహెచ్‌పీ నాయకురాలు సాధ్వీ సంహిత పేర్కొన్నారు. ఛత్రీ చౌరస్తా వద్ద భక్తులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ హిందూ సంస్కృతిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. గోవధ నిషేధ చట్టం పూర్తిగా అమలయ్యే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. హిందువుల ఐక్యతే ప్రధానం: ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ హిందువులు ఐక్యంగా ఉంటే శత్రువులు పారిపోతారని యాత్ర నిర్వాహకుడు, ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ పిలుపునిచ్చారు. బేగంబజార్ చౌరస్తాలో భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ హిందూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు యువత కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ రాష్ట్ర నాయకులు కేశవరాజు, రామరాజు, యమన్‌సింగ్, కె.రాములు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్అంతరాయం బేగంబజార్ ఛత్రి ప్రాంతంలో సాయంత్రం 4 గంటల సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భక్తులు తీవ్ర అభ్యంతరం తెలిపి శోభాయాత్ర నిలిపివేశారు. పోలీసులు సైతం విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంట తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో యాత్ర కొనసాగింది. ప్రశాంతంగా ముగింపు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శోభా యాత్ర ప్రశాంతంగా ముగిసింది. దీంతో ప్రజలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. భారీ బందోబస్తు సాక్షి, హైదరాబాద్: శ్రీరామ నవమి సందర్భంగా నగరంలో నిర్వహించిన శోభాయాత్రలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు రెండు వేల మంది సిబ్బందిని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి బందోబస్తుకు కేటాయించారు. మరోపక్క ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా వాహనాలను దారి మళ్లించారు. ఈసారి ‘వీడియో కెమెరా మౌంటెడ్ వెహికిల్’ను యాత్ర ముందు భాగంలో ఒకటి, వెనక భాగంలో మరొక టి వినియోగించారు. వీటి ద్వారా అక్కడి దృశ్యాలను పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లో కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, అదనపు పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, జితేందర్, స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీసు కమిషనర్ నాగిరెడ్డి, డీసీపీలు రంగనాథ్, చౌహాన్లు తిలకించారు. వీరితో పాటు అగ్నిమాపక శాఖ, విద్యుత్, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్ తదితర ప్రభుత్వ విభాగాల అధికారులు సైతం తిలకించారు. బందోబస్తులో ఈస్ట్, వెస్ట్, నార్త్, సెంట్రల్, సౌత్ జోన్ల డీసీపీలు డాక్టర్ రవీందర్, వెంకటేశ్వరరావు, సుధీర్‌బాబు, కమలాసన్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అడ్డుకున్న పోలీసులు యాకుత్‌పురా: ఉప్పుగూడ హనుమాన్ నగర్‌లోని శ్రీ మంగళ్ముఖి హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రలో డీజేకు అనుమతి లేదని.. వెంటనే తీసేయాలని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు, పోలీసుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. కాసేపటి తరువాత వివాదం సద్దుమణిగింది.