ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు | Bollaram Police book case against MLA Raja singh | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు

Published Fri, Dec 11 2015 12:08 PM | Last Updated on Mon, Oct 29 2018 8:21 PM

Bollaram Police book case against MLA Raja singh

హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై శుక్రవారం కేసు నమోదు అయింది. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో ఆయనపై బొల్లారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బీఫ్ ఫెస్టివల్ను అడ్డుకుంటున్న రాజాసింగ్ను పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చారు.

 

అయితే అక్కడ జరిగిన వాగ్వాదంలో సీఐను ఎమ్మెల్యే దూషించడంతో కేసు నమోదైంది. కాగా గతంలో కూడా రాజాసింగ్పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. విధి నిర్వహణలో ఉన్న ఆ కానిస్టేబుల్ పై దాడి చేయడమే కాక చంపేస్తానంటూ బెదిరించారు. దీంతో బాధిత కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement