సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం గవర్నర్ తిమిళిసైతో అన్ని అబద్ధాలు పలికించిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా టీఆర్‌ఎస్ నిలబెట్టుకోలేకపోయిందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామన్నారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన విషయం తెలిసిందే.
గవర్నర్ ప్రసంగంలో కొత్తగా ఏమి లేదని, బీజేపీ ఎమ్మెల్సీ రాంచర్‌రావు అన్నారు. ఆమె ప్రసంగం పాతబాటిల్‌లో కొత్త సారా అనే సామెతలా ఉందని ఎద్దేవా చేశారు. విద్యార్థులను, నిరుద్యోగులను నిరాశపరిచే విధంగా గవర్నర్ ప్రసంగం ఉందని దుయ్యబట్టారు. ప్రసంగంలో నిరుద్యోగ భృతి విషయం ప్రస్తావించలేదని, ప్రభుత్వం చెప్పేవి విని, చెవులు నుంచి రక్తాలు కారుతున్నాయని అన్నారు. గవర్నర్ ప్రసంగం ద్వారా అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందినదని స్పష్టంగా కనిపిస్తోందన్నారు. (అన్ని రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ: తమిళిసై)
Comments
Please login to add a commentAdd a comment