telangana budget session
-
అక్కడ బటన్ నొక్కితే చాలు డబ్బులు టంగ్ టంగ్ అని పడ్డాయి..
-
ఆ అధికారుల గొంతుకోసే.. కేంద్రం ప్లాన్ ని బయటపెట్టిన కేసీఆర్
-
బడ్జెట్ గురించి తెలుసుకోవాలా? అయితే ఈ వీడియో చూడండి
-
తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు
-
రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా బడ్జెట్: మంత్రి హరీష్ రావు
-
అసెంబ్లీలో గట్టిగా నిలదీద్దాం: బీజేపీ శాసనసభాపక్షం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని.. వివిధ వర్గాల ప్రజల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం కేసీఆర్ హామీల అమలు అంశాలను లేవనెత్తాలని బీజేపీ నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూం ఇళ్లు, 317 జీవో, పోడు భూములు, యాసంగిలో ధాన్యం కొనుగోలు, పంట నష్టపరిహారం, కొత్త రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు, మద్యం అమ్మకాలు, విద్యావైద్య వ్యవస్థలోని లోపాలు తదితర అంశాలను ప్రస్తావించాలని తీర్మానించింది. శుక్రవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ సభాపక్షనేత రాజాసింగ్, సీనియర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పార్టీ నేతలు స్వామిగౌడ్, ఎన్.రామచంద్రరావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. పలు కారణాల వల్ల ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఈ భేటీకి హాజరుకాలేదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ రోజురోజుకూ బలహీనపడుతోందని, బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని.. అందుకే సీఎం కేసీఆర్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో కలిసి బీజేపీని బదనాం చేసే కుట్రలు చేస్తున్నారని సమావేశంలో నేతలు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ట్రాప్‌లో పడొద్దు: సంజయ్ మందబలంతో టీఆర్ఎస్ రెచ్చగొట్టే అవకాశం ఉందని, పార్టీ ఎమ్మెల్యేలు సంయమనంతో వ్యవహరించాలని సంజయ్ సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో తీవ్ర అసహనంలో ఉన్న అధికార టీఆర్ఎస్ ట్రాప్‌లో పడ కుండా జాగ్రత్త వహించాలని సూచించారు. బడ్జెట్ సమావేశాలను సద్వినియోగం చేసుకుని, రాష్ట్రంలో బీజేపీ బలపడటానికి మార్గం వేయాలన్నారు. టీఆర్ఎస్ మంద బలంతో పదేపదే రెచ్చగొట్టే అవకాశం ఉందని రాజాసింగ్ చెప్పారు. పర్యటనల పేరుతో కేసీఆర్ కొత్త డ్రామాలు ‘ఇక్కడ తన పనైపోయిందని తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళ్తున్నారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో వేలాది మంది రైతులు చనిపోతే ఒక్కరికీ నయాపైసా సాయం చేయని కేసీఆర్ జార్ఖండ్ వెళ్లి జవాన్లకు సాయం పేరుతో జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం నారాయణపేట జిల్లా పెద్దకొర్ల గ్రామానికి చెందిన టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన 25 మంది నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ‘టీఆర్ఎస్ సర్కార్‌పై వ్యతిరేక ఓట్లను చీల్చి లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈసారి ప్రజలు బీజేపీకి అధికారం ఇవ్వాలనే నిర్ణయించారు’ అని పేర్కొన్నారు. -
మేము చేశామని డబ్బాలు కొట్టుకునే అలవాటు లేదు
-
‘చెవుల నుంచి రక్తాలు కారుతున్నాయి’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ తిమిళిసైతో అన్ని అబద్ధాలు పలికించిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా టీఆర్ఎస్ నిలబెట్టుకోలేకపోయిందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామన్నారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన విషయం తెలిసిందే. గవర్నర్ ప్రసంగంలో కొత్తగా ఏమి లేదని, బీజేపీ ఎమ్మెల్సీ రాంచర్‌రావు అన్నారు. ఆమె ప్రసంగం పాతబాటిల్‌లో కొత్త సారా అనే సామెతలా ఉందని ఎద్దేవా చేశారు. విద్యార్థులను, నిరుద్యోగులను నిరాశపరిచే విధంగా గవర్నర్ ప్రసంగం ఉందని దుయ్యబట్టారు. ప్రసంగంలో నిరుద్యోగ భృతి విషయం ప్రస్తావించలేదని, ప్రభుత్వం చెప్పేవి విని, చెవులు నుంచి రక్తాలు కారుతున్నాయని అన్నారు. గవర్నర్ ప్రసంగం ద్వారా అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందినదని స్పష్టంగా కనిపిస్తోందన్నారు. (అన్ని రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ: తమిళిసై) -
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
-
అన్ని రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ: తమిళిసై
సాక్షి, హైదరాబాద్: గంగా- యమున సంగమంగా విరాజిల్లుతూ...లౌకిక వాదానికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తోందని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. మత కలహాలు సృష్టించే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని పేర్కొన్నారు. తొలినాళ్లలో విద్యుత్ కోతలు, నీటి సమస్యలు ఎదుర్కొందని.. అయితే అనతికాలంలోనే వాటిని అధిగమించిందని తెలిపారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు. గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలకు తెలంగాణలో పెన్షన్ ఆసరా పెన్షన్(వృద్యాప్య) వయోపరిమితి 57 ఏళ్లకు తగ్గింపు బీడీ కార్మికులకు పెన్షన్ రూ. 2016 దివ్యాంగులకు పెన్షన్ రూ. 3016 కులవృత్తులను ప్రోత్సహిస్తున్నాం చెరువులు, రిజర్వాయర్లపై మత్స్యకారులకు హక్కులు కల్పించాం నాయీ బ్రాహ్మణులు, రజకులను ఆర్థికంగా ఆదుకుంటున్నాం గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ రైతు ఆత్మహత్యలను నివారించాం రైతులకు నాణ్యమైన, ఉచిత విద్యుత్ అందిస్తున్నాం కోటి ఎకరాలకు సాగునీరే లక్ష్యంగా వివిధ ప్రాజెక్టుల నిర్మాణం తెలంగాణలో 969 రెసిడెన్షియల్ స్కూళ్లు ట్రాక్టర్లు, ఆటోలపై రవాణా పన్ను ఎత్తివేత మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలను పెంచాం ఇంట్లోని కుటుంబ సభ్యులందరికీ రూ. 1కే కిలోబియ్య(ఆరు కిలోలు) -
మార్చి 6 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ 2020-21 వార్షిక బడ్జెట్ సమావేశాలను మార్చి 6 నుంచి నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 6న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం, మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చర్చ ప్రారంభంకానుంది. మార్చి 8 ఆదివారం, మరుసటి రోజు హోళీ పండుగ కావడంతో పదో తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మార్చి 25 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. 13 పని దినాలను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేశారు. శాసనమండలి సమావేశాలను మాత్రం కేవలం 4 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. పట్టణ ప్రగతి ముగిసిన వెంటనే ఒక రోజు విరామం ఇచ్చి ఆరో తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలా షెడ్యూలు సిద్ధం చేశారు. -
ఆ పథకాల కోసం ప్రజాధనాన్ని వృధా చేయం!
సాక్షి, హైదరాబాద్: దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణపై పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంపై ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నా.. సంక్షేమ పథకాలు యథాతథంగా కొనసాగుతాయని సీఎం స్పష్టం చేశారు. గత ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. 2019-20 పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో సీఎం కేసీఆర్... మండలిలో ఆర్థిక మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టారు. అనంతరం శాసనసభ... శనివారానికి శాసనమండలి బుధవారానికి వాయిదా వేశారు. చదవండి: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ ప్రజాధనాన్ని వృధా చేయదలుచుకోలేదు కేంద్ర ప్రభుత్వ పథకాలపై తమకు పూర్తి అవగాహన వుందని, ప్రజలకు మేలు చేసే..కేంద్ర పథకాలను మాత్రమే రాష్ట్రంలో అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు ప్రయోజనం కలిగించని కేంద్ర పథకాల కోసం ప్రజాధనాన్ని వృధా చేయదలుచుకోలేదని తేల్చి చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం కంటే రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకంతోనే ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతోందని, ఆరోగ్యశ్రీ ద్వారా 85 లక్షల 34వేల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుండగా.. ఆయుష్మాన్ భారత్ ద్వారా కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే మేలు జరుగుతుందని కేసీఆర్ వివరించారు. ఆరోగ్య శ్రీ కోసం ప్రస్తుత బడ్జెట్లో ఏడాదికి రూ. 1,336 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. మూలధన వ్యయం పెరిగింది! తెలంగాణ ఏర్పాటు తర్వాత మూలధన వ్యయం పెరిగిందని, తమ ప్రభుత్వ విధానాలతో మూలధన వ్యయం పెరుగుతూ వస్తోందని తెలిపారు. జీడీపీ వృద్ధి రేటు 4.5 నుంచి 10.2 శాతానికి పెరిగిందన్నారు. ఐదేళ్లలో తెలంగాణ సంపద రెట్టింపు అయిందన్నారు. ఐటీ రంగంలో 11.5 శాతం, వ్యవసాయంలో 8.1 శాతం వృద్ధి నమోదయినట్టు చెప్పారు. ఐటీ ఎగుమతుల విలువ 100 శాతానికిపైగా పెరిగిందని, పారిశ్రామిక రంగంలో అదనంగా అభివృద్ధి సాధించామన్నారు. గత ఏడాదిన్నరగా దేశం తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోందని, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 5 శాతం అభివృద్ధి మాత్రమే నమోదైందని కేసీఆర్ తెలిపారు. ఆర్థిక మాంద్యం ఉందన్న విషయాన్ని గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయని, దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గిందన్నారు. రైతుబంధు యథాతథంగా కొనసాగుతుంది వాహనాల కొనుగోలులో 10.6 శాతం తగ్గుదల కనిపిస్తోందని, విమానయాన రంగంపైనా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉందని వెల్లడించారు. గూడ్స్ రైళ్ల బుకింగ్ కూడా తగ్గిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూపాయి పతనమైందని, డాలర్‌తో రూపాయి మారకం విలువ 72.40కు పడిపోయిందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నానని అన్నారు. మోటార్ వాహనాలు, ఎక్సైజ్ పాటు అన్ని రంగాల్లో ఆదాయం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పన్నేతర వ్యయం 29 శాతం తగ్గిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం కోత పెట్టిందని వాపోయారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి తెలంగాణ కంటే దారుణంగా ఉందని వెల్లడించారు. రైతు బంధు పథకం యథాతథంగా కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టత నిచ్చారు. అందుకు చింతిస్తున్నాను..! కేంద్ర విధానాలనే రాష్ట్రాలు అనుసరించాలే తప్ప మరో గత్యంతరం లేదని, అందుకు తెలంగాణ కూడా అతీతం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు సంక్లిష్టంలో ఉన్న ఈ పరిస్థితిలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వచ్చిందని చింతిస్తున్నానని అన్నారు. చేజారిపోతున్న వేల కోట్ల విలువైన భూమిపై ఇప్పుడు ప్రభుత్వానికి హక్కు వచ్చిందని, ఆ భూమిని దశల వారీగా విక్రయంచడం ద్వారా రాష్ట్రానికి అదనంగా ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
బడ్జెట్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చేతులెత్తేసింది
-
ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కాన్‌స్టిస్ట్యూషనల్ క్లబ్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. శాసనసభలో సీఎం కేసీఆర్, శాసనమండలిలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు రాష్ట్రబడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం శాసనసభా కార్యకలాపాల సంఘం (బీఏసీ) సమావేశమైంది. 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని, ఆదివారం కూడా సమావేశాలు కొనసాగించాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. చదవండి: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ ఈ నెల 24వ తేదీన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెపథ్యంలో అక్టోబర్ మధ్యలో అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లు పెట్టే అవకాశముందని తెలుస్తోంది. ఇక, టీ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క సూచించినవిధంగా ఢిల్లీలో మాదిరిగా హైదరాబాద్ కాన్సిస్ట్యూషనల్ క్లబ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక, వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాలు 21 రోజులు పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. ఈ నెల 14, 15 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ ఉంటుందని వెల్లడించారు. ఇక, శాసన మండలిలో ఈ నెల 14న రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ జరగనుంది. 15వ తేదీన బడ్జెట్‌పై ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10న మండలికి సెలవు కాగా, 11వ తేదీన చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఉండనుంది. మళ్లీ 12, 13 తేదీల్లో సెలవులు ఉండనున్నాయి. 14న బడ్జెట్‌పై చర్చ, 15న బడ్జెట్‌పై ప్రభుత్వ సమాధానం ఉండనున్నాయి. ఈ నెల 14వ తేదీ నుంచి 22 వరకు మండలి సమావేశాలు జరగనున్నాయి. -
తెలంగాణ అసెంబ్లీలో అనూహ్య పరిణామాలు
-
కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు
-
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. బడ్జెట్ సమావేశాలు కావటంతో శాసనసభ, శాసన మండలి సభ్యులు సంయుక్తంగా అసెంబ్లీలో సమావేశం కాగా, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నారు. ప్రభుత్వం గడిచిన నాలుగేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ రంగాల్లో సాధించిన విజయాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావిస్తారు. ఈ సమావేశాలు రెండువారాల పాటు కొనసాగే అవకాశం ఉంది. -
కేసీఆర్ మార్కులు పట్టించుకోను: జానారెడ్డి
తాను అస్సలు సర్వేలు నమ్మబోనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. ప్రజల తీర్పునే తాను నమ్ముతానని ఆయన చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన మార్కులతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన సరదాగ సీఎల్పీలో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి చేయించిన సర్వేలపై జానారెడ్డిని ప్రశ్నించగా తాను కేసీఆర్ సర్వేలు పట్టించుకోనని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న దుబారాలో ఇదొకటి అని, అసలు ప్రభుత్వ సొమ్ముతో ఇలా సర్వేలు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలే తీర్పే ఫైనల్ అని చెప్పారు. ఈ రోజుల్లో మీడియా కూడా సరిగా సర్వేలు చేయలేకపోతోందని చెప్పిన జానా.. తాను ఓడిపోతానని ఎన్నోసార్లు సర్వేల పేరిట కథనాలు రాశారని గుర్తు చేశారు. తాను సర్వేలపై ఆధారపడే మనిషిని కాదని జానా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏ పార్టీతోనూ తమకు అవగాహన లేదని చెప్పారు. ‘ఇతర పార్టీలతో అవగాహనలన్నీ ఎన్నికల ముందు ఉండే తతంగాలు. నేను సీఎం అని పదిమందితో అనిపించుకుంటాను. అంత మాత్రాన అవుతామా? ఎవరో అనగానే సీఎం అయిపోతామని నేను భ్రమించను. అభిమానంతో వాళ్ల అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. అర్హత ఉందని నేను అనుకుంటా. అంత మాత్రాన అయిపోతామని కాదు. రకరకాల కారణాలతో నిర్ణయాలు ఉంటాయి. సీఎం అవుతానని నేనెప్పుడు చెప్పలేదు. హిందీ నేర్చుకుంటుంటే కూడా రకరకాల ప్రచారం చేశారు’ అని జానారెడ్డి చెప్పారు. -
వైఎస్ఆర్ సీపీని చీల్చాలని యత్నిస్తూ ఇక్కడ గగ్గోలా?
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో విపక్షాలు ప్రవర్తించిన తీరు నీచమైన సంస్కృతిని నిదర్శనమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన సోమవారం ఉదయం 'సాక్షి' ప్రతినిధితో మాట్లాడుతూ పవిత్రమైన అసెంబ్లీని అవమానపరిచేలా ప్రతిపక్షాలు ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. జాతీయ గీతాన్ని అవమానపర్చడం సమంజసమా అని ఈటెల సూటిగా ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన సంఘటనల ఫుటేజ్‌లను పరిశీలిస్తే ఎవరు దోషులో తేలుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ది రాజకీయ శూన్యమేనని ఈటెల వ్యాఖ్యానించారు. తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు చెప్పుచేతల్లో పని చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చీల్చాలని టీడీపీ యత్నిస్తూ...ఇక్కడ గగ్గోలు పెట్టడం సమంజసమా అని ఈటెల అన్నారు. తెలంగాణ బతికిబట్టకట్టకూడదని... అస్థిరతలోనే ఉండాలని విపక్షాల యత్నమని ఆయన మండిపడ్డారు. సంక్షేమం, పల్లెప్రగతి, ఉపాధి లక్షయంగా కొత్త బడ్జెట్ ఉంటుందన్నారు. ప్రస్తుత బడ్జెట్లో ఆశించిన రాబడులు రానిమాట వాస్తవమేనని ఈటెల అంగీకరించారు. కేంద్రం నిధుల కేటాయింపుల విషయంలో తేడా వచ్చిందని ఈటెల అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని అధిగమిస్తామనే నమ్మకం ఉందని ఈటెల ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డివి ఒట్టి ప్రగల్బాలేనని, చేవలేని చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. -
ప్రాక్టికల్‌గా తెలంగాణ బడ్జెట్: ఈటెల
హైదరాబాద్ : తాము ప్రవేశపెట్టబోయే తెలంగాణ బడ్జెట్ ప్రయోగాత్మకంగా ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన గురువారం 'సాక్షి'తో మాట్లాడుతూ.. రాష్ట్ర రాబడి, వ్యయంపై స్పష్టత వచ్చిందన్నారు. బడ్జెట్లో సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమల ద్వారా ఉపాధికి పెద్దపీఠ వేశామన్నారు. ఇకపై కేంద్రం నిధులు పెరగడంతో పాటు నేరుగా రాష్ట్రాలకు అందుతాయన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి అన్న ప్రాధాన్యాన్ని కేంద్రం గుర్తించిందని ఈటెల అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యం, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా బడ్జెట్‌కు రూపకల్పన చేస్తామన్నారు. తొలి ఆర్నెల్ల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ముందుగానే ఉమ్మడి సభలో ఆమోదించినందున అక్టోబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు అవసరమైన పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఆర్థిక శాఖ రూపకల్పన చేస్తుందని తెలిపారు. కాగా తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలను మార్చి 6వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే నెల10 లేదా 11వ తేదీల్లో 2015-16 బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. -
'రాష్ట్ర బడ్జెట్ అద్భుతంగా ఉండబోతుంది'
హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు రాబోయే అయిదేళ్లలో ఉపయోగపడే విధంగా బడ్జెట్ సమావేశాలు ఉంటాయని ఐటీ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ అద్భుతంగా ఉండబోతుందని, కొత్తగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామని ఆయన శనివారమిక్కడ తెలిపారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై లేనిపోని విమర్శులు చేస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్యలకు, విద్యుత్ సంక్షోభానికి కారణమైనవారే ఇప్పుడు ఆందోళనలు చేయటం విడ్డూరమన్నారు. ప్రజలకు తాము జవాబుదారీ అని, ప్రతిపక్షాలు చేసే రాజకీయాలను ప్రజల దృష్టికి తీసుకు వెళతామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలపై బీజేపీ నేతలే సమాధానం చెప్పాలని కేటీఆర్ అన్నారు. నలభై నిమిషాల్లో చేయాల్సిన పనిని నాలుగు నెలల పాటు నాన్చుతున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సరైన గౌరవం ఇవ్వటం లేదని అన్నారు. తమతో సంప్రదించకుండా తెలంగాణలో ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపటం, హైదరాబాద్‌పై పోలీసుల పెత్తనం తదితర అంశాలను బీజేపీ నేతలు గమనించి మాట్లాడితే బాగుంటుందని కేటీఆర్ హితవు పలికారు.