సాక్షి, హైదరాబాద్: గంగా- యమున సంగమంగా విరాజిల్లుతూ...లౌకిక వాదానికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తోందని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. మత కలహాలు సృష్టించే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని పేర్కొన్నారు. తొలినాళ్లలో విద్యుత్ కోతలు, నీటి సమస్యలు ఎదుర్కొందని.. అయితే అనతికాలంలోనే వాటిని అధిగమించిందని తెలిపారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు.
గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
- దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలకు తెలంగాణలో పెన్షన్
- ఆసరా పెన్షన్(వృద్యాప్య) వయోపరిమితి 57 ఏళ్లకు తగ్గింపు
- బీడీ కార్మికులకు పెన్షన్ రూ. 2016
- దివ్యాంగులకు పెన్షన్ రూ. 3016
- కులవృత్తులను ప్రోత్సహిస్తున్నాం
- చెరువులు, రిజర్వాయర్లపై మత్స్యకారులకు హక్కులు కల్పించాం
- నాయీ బ్రాహ్మణులు, రజకులను ఆర్థికంగా ఆదుకుంటున్నాం
- గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ
- రైతు ఆత్మహత్యలను నివారించాం
- రైతులకు నాణ్యమైన, ఉచిత విద్యుత్ అందిస్తున్నాం
- కోటి ఎకరాలకు సాగునీరే లక్ష్యంగా వివిధ ప్రాజెక్టుల నిర్మాణం
- తెలంగాణలో 969 రెసిడెన్షియల్ స్కూళ్లు
- ట్రాక్టర్లు, ఆటోలపై రవాణా పన్ను ఎత్తివేత
- మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలను పెంచాం
- ఇంట్లోని కుటుంబ సభ్యులందరికీ రూ. 1కే కిలోబియ్య(ఆరు కిలోలు)
Comments
Please login to add a commentAdd a comment