సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ 2020-21 వార్షిక బడ్జెట్ సమావేశాలను మార్చి 6 నుంచి నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 6న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం, మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చర్చ ప్రారంభంకానుంది. మార్చి 8 ఆదివారం, మరుసటి రోజు హోళీ పండుగ కావడంతో పదో తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మార్చి 25 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. 13 పని దినాలను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేశారు.
శాసనమండలి సమావేశాలను మాత్రం కేవలం 4 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. పట్టణ ప్రగతి ముగిసిన వెంటనే ఒక రోజు విరామం ఇచ్చి ఆరో తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలా షెడ్యూలు సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment