![UP Assembly Election 2022: BJP MLA Raja Singh Warns UP Voters - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/15/74444.jpg.webp?itok=KFrTh4Nu)
సాక్షి, హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో ఉండాలంటే యోగికి జై కొట్టాల్సిందేనని హెచ్చరించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఓటేయనివారు రాష్ట్రం వదిలి వెళ్లిపోవాల్సిందేని యూపీ ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ‘యూపీలో రెండు విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. త్వరలో మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. యోగీకి ఓటు వేయకుంటే జేసీబీ, బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నికల తరువాత యోగికి ఓటు వేయని వారిని గుర్తిస్తాం. యూపీలో ఉండాలంటే యోగీ అనాల్సిందే లేకపోతే యూపీ వదిలి వెళ్లాల్సిందే’ అంటూ యూపీ ప్రజల్ని హెచ్చరించారు.
చదవండి: (అభివృద్ధి మంత్రాన్ని వదిలి.. మళ్లీ ‘హిందుత్వ’ జపమెందుకో!)
Comments
Please login to add a commentAdd a comment