‘హైకోర్టు తీర్పు సీఎంకు చెంపపెట్టు’ | high court shock to trs party | Sakshi
Sakshi News home page

‘హైకోర్టు తీర్పు సీఎంకు చెంపపెట్టు’

Published Thu, Jan 7 2016 11:46 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

high court shock to trs party

అబిడ్స్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టు చెంపపెట్టు లాంటిదని గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ అన్నారు. గ్రేటర్ ఎన్నికలపై కేసీఆర్ చేస్తున్న కుట్రలకు హైకోర్టు చరమగీతం పాడిందన్నారు. గురువారం గోషామహల్ షాహినాయత్‌గంజ్‌లోని తన కార్యాలయంలో ‘సాక్షి’తో మాట్లాడుతూ... గ్రేటర్‌లో ఎక్కువ సీట్లు గెలవాలని ముఖ్యమంత్రి, మంత్రులు పన్నిన కుట్రలలు భగ్నమయ్యాయన్నారు.

15 రోజుల్లో ఎలక్షన్ ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించి, రిజర్వేషన్ల ప్రక్రియను నేటికీ ప్రకటించకపోవడంతో గ్రేటర్‌లోని అన్ని పార్టీలు ఆందోళనకు గురవుతున్నాయన్నారు. నెలరోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని గురువారం హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లుతెరిచి ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించాలని సూచించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement