
51 అడుగుల హనుమాన్ విగ్రహం
ధూల్‌పేట్ గంగాబౌలి గుట్టపై...
హైదరాబాద్: రాజధాని నగరంలోని ధూల్‌పేట్ గంగాబౌలి గుట్టపై నిర్మితమైన 51 అడుగుల ఆకాశ్‌పురి హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. గురువారం సాయంత్రం గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్‌లోథా, సాధ్వీ ప్రాచీ, సాధ్వీ దేవాఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరై హనుమాన్ ప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ లోథ, సాధ్వీ ప్రాచీ, సాధ్వీ దేవాఠాకూర్‌లు మాట్లాడుతూ నగరానికే తలమానికంగా ఆకాశ్‌పురి హనుమాన్‌ను తీర్చిదిద్దారని, భవిష్యత్‌లో ధూల్‌పేట్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతుందని అన్నారు. చివరగా అన్నదాన కార్యక్రమం జరిగింది.
హనుమాన్ హృదయంలో రామదర్బార్
51 అడుగుల ఎత్తులో నిర్మితమైన ఆకాశ్‌పురి హనుమాన్ హృదయంలో కొలువుదీరిన రామదర్బార్‌ను హనుమాన్ చేతులతో తెరుస్తున్నట్లు రిమోట్ ద్వారా కనెక్ట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రిమోట్ ఆన్ చేసిన వెంటనే హనుమాన్ హృదయంలో ఉన్న రామదర్భార్ విగ్రహ స్వరూపాలు కనువిందు చేస్తున్నాయి.