
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజాసింగ్
పంజగుట్ట: తెలంగాణలో నిజాం కాలంనాటి రజకార్లపాలన కొనసాగుతోందని గోషామహల్ ఎమ్మెల్యే, గోరక్షాదళ్ అధ్యక్షుడు రాజాసింగ్ అన్నారు. పోలీసులు రజ్వీ అనుచరుల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల తో మాట్లాడుతూ ... ప్రభుత్వం పోలీస్ బందోబస్తు మధ్య ఆవులను కసాయి వారికి అప్పగిస్తుందన్నారు.
సోమవారం మైలార్‌దేవుల పల్లి ప్రాంతంలో ఆవులను అక్రమ రవాణా చేస్తుండగా గోరక్షాదళ్ కార్యకర్తలు అడ్డుకుని పోలీసులకు అప్పగించగా, వారు సత్యం శివం సుందరం గోశాలకు వాటిని అప్పగించినట్లు తెలిపారు. అయితే గోషాల వద్ద ఎంఐఎం కార్యకర్తలు గొడవ చేయడంతో పోలీసులు బందోబస్తు మధ్య ఆవులను కబేళాలలకు తరలించడం దారుణమన్నారు.
ఏటా బక్రీద్ ముందు ప్రభుత్వం చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఆవుల అక్రమ రవాణాను అడ్డుకునేదని, అయితే ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి తనిఖీలు నిర్వహించడంలేదని ఆరోపించారు. బజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్, సంఘ్, గోరక్షాదళ్ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి బెదిరిస్తున్నారన్నారు. ఎవరైనా ఆవులను బలిచేస్తే ఊరుకునేది లేదని భవిష్యత్ పరిణామాలకు ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి, నగర కమిషనర్లకు లేఖలు రాసినట్లు తెలిపారు.