punjagutta
-
యూ బెగ్గర్ అంటూ.. తాత అవమానించాడు
హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త చంద్రశేఖర్ జనార్దనరావు(Industrialist Janardhan Rao) హత్యకేసులో నిందితుడు, ఆయన మనవడు కిలారు కీర్తితేజ(Keerthi Teja) నాలుగు రోజుల (Police custody) సోమవారం ముగిసింది. కీర్తితేజ తన తాతను హత్య చేసిన విధానం, ఎందుకు చేశాడో పంజాగుట్ట పోలీసులకు వివరించారు. ప్రతిరోజూ తన తాత జనార్దన్‌రావు అవమానించేవాడని.. అది భరించలేకనే ఈ ఘోరానికి పాల్పడినట్లు కీర్తితేజ వెల్లడించాడు. ఏరోజూ తనను సొంత మనిషిగా చూడలేదని, అందరి కంటే హీనంగా చూస్తూ దారుణంగా వ్యవహరించేవాడని, అందుకే తాతను హత్య చేశానని పోలీసుల విచారణలో చెప్పాడు. సీఐ శోభన్ తెలిపిన వివరాల ప్రకారం తన తాత తనను కుటుంబంలో ఒక సభ్యుడుగా తనను ఎప్పుడూ చూసేవాడు కాదన్నాడు.ప్రతీరోజూ తనను బెగ్గర్ అంటూ సంబోధించడమే కాకుండా ఆఫీసుకు వెళ్తే అక్కడ కూడా అవమానించేవారని కీర్తి తేజ చెప్పాడు. దీంతో స్టాఫ్ కూడా తనను చిన్నచూపు చూసేవారంటూ తెలిపాడు. ఆస్తి పంపకాలు పదవుల కేటాయింపుల్లోనూ తనను తక్కువ చేశాడని, చివరకు డైరెక్టర్ పదవి కూడా జనార్దన్‌రావు రెండవ కుమార్తె కొడుకుకు ఇచ్ఛాడని, అప్పటినుంచి తనకు, తాతకు మధ్య గొడవలు పెరిగాయని చెప్పాడు. అందుకే తాతను చంపేయాలని నిర్ణయించుకుని ప్లాన్ చేసుకున్నానని, అందులో భాగంగా ఇన్‌స్టామార్ట్ నుంచి కత్తి కొనుగోలు చేశానని చెప్పాడు.హత్య జరిగిన రోజు తనకు తాతకు మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిందని, తనకు వాటా కావాలని అడిగితే ఇయ్యను పొమ్మనడంతో కోపంతో కత్తితో కసితీరా పొడిచి చంపేసి తర్వాత అక్కడినుంచి పారిపోయానని కీర్తి తేజ తెలిపాడు. హత్య చేసిన తర్వాత బిఎస్మక్తా ఎల్లమ్మగూడ పక్కనే ఖాళీ స్థలంలో కత్తి, రక్తంతో కూడిన బట్టలను తగులబెట్టానని వివరించాడు. అయితే మంటల్లో కత్తి కాలిపోకుండా అలాగే ఉండడంతో పోలీసులు ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అయితే మొదటిరోజు విచారణలో కీర్తితేజ పోలీసులకు సహకరించలేదు.ఎందుకు హత్య చేశావంటూ పోలీసులు ఎంత ప్రశ్నించినా నోరు మెదపలేదు. ఘటనాస్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు ప్రయత్నిస్తే కీర్తి తేజ సహకరించలేదు. ఏ ప్రశ్న అడిగినా నేల చూపులు చూసేవాడని పోలీసులు చెప్పారు. రెండవరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అప్పటినుంచి విచారణ వేగవంతమైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని విచారణ అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు పోలీసులు చెప్పారు. -
డివైడర్‌ను ఢీకొట్టిన కారు : Punjagutta Circle
-
HYD: జారిపడ్డ మేయర్ విజయలక్ష్మి
సాక్షి,హైదరాబాద్:గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్ గద్వాల విజయలక్ష్మికి తృటిలో ప్రమాదం తప్పింది. నగర సుందరీకరణ పనుల్లో భాగంగా నగరంలో సోమవారం(ఫిబ్రవరి 3) పాదయాత్ర చేస్తున్న సందర్భంగా నాగార్జున సర్కిల్ ఫుట్‌పాత్‌పై మేయర్ కాలుజారి కిందపడ్డారు.కిందపడ్డ మేయర్‌ను పక్కనే ఉన్న హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఓదార్చారు.అనంతరం స్వల్ప గాయాలతో మేయర్ తన పాదయాత్రను కొనసాగించారు. -
హైకోర్టు ఆదేశాలు.. పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు సాహిల్
సాక్షి,హైదరాబాద్: బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ఇవాళ (సోమవారం) పంజాగుట్ట పోలీసుల విచారణకు హాజరుకానున్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సాహెల్ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. 2023 డిసెబర్ 23న (శనివారం) హైదరాబాద్‌లోని బేగంపేట ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రధాన నిందితుడు సాహిల్. శనివారం అర్ధరాత్రి దాటాక మితిమీరిన వేగంతో కారు నడిపిన సాహిల్ ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టారు.కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో ప్రజాభవన్ ఘటన అనంతరం కేసు నుంచి తప్పించుకునేందుకు సాహిల్ తొలుత ముంబైకి, అక్కడి నుంచి దుబాయ్‌కి వెళ్లిపోయినట్లు గుర్తించారు.దీంతో అతడిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేశారు. దుబాయి నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఈ తరుణంలో ఈ ఏడాది డిసెంబర్ 4న కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 న పంజాగుట్ట పోలీసుల ఎదుట సాహిల్ హాజరు కావాలని సూచించింది. దుబాయ్‌లో ఉన్న విచారణలో భాగంగా సాహిల్ దుబాయ్ నుండి హైదరాబాద్ రావాల్సిందేనని.. పోలీసుల విచారణకు సహకరించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో సాహిల్ ఇవాళ పంజాగుట్ట పోలీసుల విచారణను ఎదుర్కొనున్నారు. -
ట్రాఫిక్ పోలీస్ ను ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్
-
గోవా జైలే డ్రగ్స్‌కు అడ్డా.. 500 మందితో నెట్వర్క్..
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట డ్రగ్స్ కేసు నిందితుడు స్టాన్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్‌తో స్టాన్లీ పట్టుబడ్డాడు. ఇక, స్టాన్లీ డ్రగ్స్ లింక్స్.. పోలీసుల కస్టడీ విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 500 మందితో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ కేసుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీఎస్‌న్యాబ్) విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో స్టాన్లీకి విదేశాల నుంచి మాదకద్రవ్యాలు చేరవేసే వ్యవహారం అంతా గోవాలోని కోల్వలే జైలు కేంద్రంగా సాగిందని వెల్లడికావడంతో టీఎస్‌న్యాబ్ అటువైపు దృష్టి సారించింది. అక్కడి జైల్లో ఖైదీలుగా ఉన్న నైజీరియన్ ఓక్రాతోపాటు ఆ ముఠాలో కీలకంగా ఉన్న ఫైజల్‌లను తీసుకువచ్చే ప్రయత్నాల్లో తలమునకలైంది. న్యాయస్థానం అనుమతితో ఓ బృందం ఇప్పటికే గోవాకు వెళ్లింది. వారిద్దరినీ విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఇక, గోవా కేంద్రంగా సింథటిక్ డ్రగ్స్‌ను సరఫరా చేయడంలో స్టాన్లీ ముఠా ఆరితేరింది. ఆ క్రమంలో హైదరాబాద్‌కు వచ్చిన స్టాన్లీ సుమారు రూ.8 కోట్ల విలువైన మాదకద్రవ్యాలతో ఇటీవల టీఎస్‌న్యాబ్‌కు చిక్కాడు. అతడిని విచారించిన క్రమంలో ఈ ముఠాకు యూరోపియన్ దేశాల నుంచి డ్రగ్స్ అందుతున్నట్లు తేలింది. ఆయా దేశాల నుంచి ఓడల్లో తొలుత ముంబైకి సరకు చేరుతున్నట్లు, అక్కడి నుంచి హైదరాబాద్ సహా దేశంలోని ఇతర మెట్రో నగరాలకు సరఫరా అవుతున్నట్టు నిర్ధారణయింది. కొకైన్, ఎల్ఎస్డీ బ్లాట్స్, చరస్, హెరాయిన్, అంపిటమైన్, మారిజువానా, ఓజీ కుష్.. తదితర మాదకద్రవ్యాల్ని ఈ ముఠా తెప్పించి అవసరమైన కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారానికి గోవాలోని కోల్వలే జైలు కేంద్రబిందువుగా ఉన్నట్లు, జైల్లో ఉన్న ఓక్రా, ఫైజల్‌లు సెల్ఫోన్ల ద్వారానే డ్రగ్స్ కోసం విదేశాలకు అర్డర్లు పంపిస్తున్నట్లు, సరకు చేరిన అనంతరం సౌరవ్ అనే పెడ్లర్ ద్వారా స్టాన్లీ సహా ఇతర డ్రగ్ ముఠాలకు దాన్ని అందజేసేలా ఓక్రా నెట్‌వర్క్‌ను సృష్టించినట్టు విచారణలో స్టాన్లీ వెల్లడించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విచారణలో వెల్లడైన అంశాలను టీఎస్‌న్యాబ్ బృందం ఐదారు రోజుల క్రితం గోవా పోలీసులకు చేరవేసి అప్రమత్తం చేసింది. అనంతరం కోల్వలే జైల్లో అక్కడి అధికారులు తనిఖీలు నిర్వహించగా ఖైదీల వద్ద 16 సెల్ఫోన్లు లభించడం కలకలం రేపింది. ఎఫ్ఎస్ఎల్లో సెల్ఫోన్లలోని సమాచారాన్ని విశ్లేషించడంపై ప్రస్తుతం గోవా పోలీసులు దృష్టి సారించారు. సదరు కాల్‌డేటాను తెప్పించుకోవడంతోపాటు ఓక్రా, ఫైజల్‌లను ఇక్కడికి తీసుకొచ్చి విచారిస్తే ఈ ముఠా లీలలతోపాటు యూరోపియన్ దేశాల్లో డ్రగ్స్ సరఫరా దందాపై కీలక సమాచారం లభిస్తుందని టీఎస్‌న్యాబ్ భావిస్తోంది. -
పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ అరెస్ట్
-
బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై లుక్ అవుట్ నోటీస్ జారీ
-
ప్రజాభవన్: ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్.. సీఐ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో పంజాగుట్ట సీఐ దుర్గారావు సస్పెండ్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడి కేసులో నిర్లక్ష్యం వహించినందుకు దుర్గారావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాగా, ర్యాష్ డ్రైవింగ్ చేసి వ్యక్తులన బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సొహైల్ మార్చేసిన విషయం తెలిసిందే. వివరాల ప్రకారం.. ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కేసును పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా ర్యాష్ డ్రైవింగ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ అని నిర్ధారించారు. ప్రధాన నిందితుడిగా సోహైల్‌ను చేర్చటమే కాకుండా.. అతనిపై 17 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్వాకం బయటపడింది. ప్రమాదం తర్వాత సోహైల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సోహైల్‌ను అదుపులోకి తీసుకోవడంతో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు పీఎస్‌కు వచ్చారు. షకీల్ కొడుకును విడిపించుకుపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీంతో, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ.. పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గరావును సస్పెండ్ చేశారు. Panjagutta Inspector B. Durga Rao suspended for negligence in former MLA Shakeel's son Sohail case. #Telangana pic.twitter.com/qvq11aSRNC — Mubashir.Khurram (@infomubashir) December 26, 2023 ఘటన జరిగిన రోజున (డిసెంబర్ 24న) నైట్ డ్యూటీలో సీఐ దుర్గారావుతో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది.. సోహైల్‌ను తప్పించి వేరే వ్యక్తి పేరును చేర్చారంటూ.. పెద్ద ఎత్తున ఆరోపణలు రావటంతో.. అధికారులు వారిపై విచారణ చేపట్టారు. వెస్ట్ జోన్ డీసీపీ పూర్తి స్థాయిలో విచారిస్తున్న క్రమంలో దుర్గారావు అస్వస్థతకు గురయ్యారు. బీపీ డౌన్ కావటంతో.. దుర్గారావు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో దుర్గారావు వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదం వ్యవహారంపై రాజకీయపరంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావటంతో.. సమగ్ర దర్యాప్తు జరిపి తనకు నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించడంతో.. పోలీసుల నిర్వాకం బయటపడింది. ఇక, పరారీలో ఉన్న సొహైల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
పుష్ప జగదీశ్ కేసు.. అసలు నిజం అదేనన్న నటుడు!
పుష్ప సినిమాలో హీరో స్నేహితునిగా నటించి ఫేమ్ తెచ్చుకున్న నటుడు జగదీశ్ అలియాస్ కేశవ (మచ్చా). ఇటీవలే ఓ యువతి ఆత్మహత్యకు కారణమయ్యాడంటూ పంజాగుట్ట పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ యువతి మరొకరితో సన్నిహితంగా మెలగడం జగదీశ్‌కు నచ్చక ఆమెను వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో ఈ విషయాన్న జగదీశ్ చెప్పినట్లు తాజా సమాచారం. తన దారిలోకి తెచ్చుకునేందుకు ఆమె సన్నిహితంగా ఉన్న ఫోటోలు తీసినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. కాకినాడకు చెందిన యువతి ఓ సంస్థలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే.. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా నటిస్తుండేది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంగీత్‌నగర్‌లో అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్‌లో నివసిస్తుండేది. తల్లి దండ్రులు కాకినాడలోనే ఉండగా.. ఆమెకు భర్తతో విడాకులు అయ్యాయి. కొంతకాలం కిందట ఆ యువతికి మణికొండలో నివసించే నటుడు జగదీశ్ పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారి కొద్దిరోజులు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. జగదీశ్ ఆ యువతిని కాదని మరో యువతిని వివాహం చేసుకోవడంతో ఆమె జగదీశ్‌ను దూరం పెట్టసాగింది. ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేది కాదు. రహస్యంగా ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి.. ఈ క్రమంలో గత నెల 27న మహిళ నివసించే ఫ్లాట్ వద్దకు వచ్చిన జగదీశ్.. సదరు మహిళ మరో యువకునితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను కిటికీలోనుంచి తీశాడు. ఆ తర్వాత డోర్‌కొట్టి లోనికి వెళ్లి మీ బాగోతం మొత్తం రికార్డ్ చేశానంటూ వారిని బెదిరించాడు. ఫొటోలు డిలీట్ చెయ్యా లని ఎంత బతిమిలాడినా వినలేదు. దీంతో ఆ యువతి, యువకుడు పోలీసులకు ఫోన్ చేస్తామనడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు కూడా ఫోన్లో వేధించాడు. 29వ తేదీ ఉదయం ఆ యువతి మరొకరితో సన్నిహితంగా ఉన్న ఫొటో పంపించి.. ఇలాంటి ఫొటోలుఇంకా చాలా ఉన్నాయనీ.. అవన్నీ బయటపెడతానని బెదిరించాడు. దీంతో తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురైన యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎలాంటి సూసైడ్ నోట్ లేకపోవడంతో ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరుసటిరోజు యువతి బంధువులు జగదీశ్ వేధింపులను పోలీసులకు వివరించగా ఆ మేరకు కేసు పెట్టారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు జగదీశ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై.. సాయంత్రం నుంచి పలుచోట్ల మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, నగరంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, సరూర్‌నగర్, మీర్పేట్, చాదర్‌ఘాట్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మణికొండ, పంజాగుట్ల, బంజారాహిల్స్, గోషామహల్, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి, హబీబ్‌నగర్, రాయదుర్గం, అప్జల్‌గంజ్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. అకాల వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. #HyderabadRains pic.twitter.com/IUaeFxv27c — pala hanmi reddy (@hanmireddy) November 23, 2023 @Hyderabadrains it's raining heavily at Raidurgham pic.twitter.com/druN8puIqC — Varun sam (@Varunsam007) November 23, 2023 Heavy rainfall in Hyderabad 🌧#HyderabadRains pic.twitter.com/o93Rq09eGp — Irfan Khan (@IrfanKhanhyd) November 23, 2023 -
హైదరాబాద్‌లో భారీ వర్షం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. సడెన్‌గా కురిసిన భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బాల్కంపేట్, బాలానగర్, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, బేగంపేట, గచ్చిబౌలి, మనికొండ, లింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక, తెలంగాణవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. Heavy rain ☔🌧️ #Hyderabadrains pic.twitter.com/Qw3WJlLlDm — Mohan Kumar (@ursmohan_kumar) September 25, 2023 #25SEP 2:45PM⚠️ Short Duration (10-20mins) Moderate/Heavy Rain Spell Ahead for Many Parts of City during the next 1Hr🌧️#HyderabadRains pic.twitter.com/IX0cBMtOgx — Hyderabad Rains (@Hyderabadrains) September 25, 2023 -
Shriya Saran: పంజాగుట్టలో నటి శ్రియ సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో భారీ వర్ష బీభత్సం
సాక్షి, హైదరాబాద్: అల్పపీడన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన సైతం కురిసింది. దీంతో, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక, శనివారం కూడా తెలంగాణలోని పలు జిల్లాలో వడగండ్లతో భారీ వర్షం కురిసింది. అటు, హైదరాబాద్‌లో కూడా శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, ఉరుములతో కూడిన వడగండ్ల వర్షం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, కూకట్పల్లి, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలో వర్షం కురుస్తోంది. దీంతో, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, జగిత్యాల జిల్లా భీమారంలో వడగండ్ల వాన దంచికొట్టింది.కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో శనివారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈ సందర్భంగా ఈదురు గాలుల తాకిడితో పలు రేకుల షేడ్లు ధ్వంసమయ్యాయి. కరీంనగర్ జిల్లాలో వర్ష బీభత్సం నెలకొంది. గంగాధర మండల కేంద్రంలో వడగండ్ల వాన కురిసింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. ఇక, ఏపీలో కూడా పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. Hailstorm rain 🌧️ at #Hyderabad Total grass covered with ice. pic.twitter.com/niIjsoA3Gx — ma_saravanan (@masaravanan73) March 18, 2023 Ice rain Hyderabad lo pic.twitter.com/NKCZpWtBho — Prabhas (@Kranthi_1322) March 18, 2023 Good rain in Chanda nagar Hyderabad pic.twitter.com/DU1abxHsYk — CV Reddy (@cvreddy2) March 18, 2023 -
పంజగుట్టలో అర్ధరాత్రి గ్యాంగ్ హల్చల్.. యువకుడిపై 15 మంది దాడి
పంజగుట్ట: పంజగుట్టలో అర్ధరాత్రి 15 మంది యువకులు కార్లల్లో వచ్చి హల్చల్ చేశారు. ఓ యువకునిపై విచక్షణారహితంగా దాడి చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఖమ్మంకు చెందిన ఇస్లావత్ జయరామ్ నార్సింగ్‌లో నివాసముంటాడు. ఖమ్మంలో ఇతను ఉండే ఏరియాలోనే దేవరగట్టు శ్రీరామ్ అలియాస్ శ్రీధర్ ఉంటాడు. వీరిద్దరికీ పడదు. తరచూ గొడవలు జరుగుతుంటాయి. గత ఆరు నెలలక్రితం గుజరాత్లో శ్రీరామ్‌ను మనుషులను పెట్టి కొట్టించాడు జయరామ్. దీంతో కక్ష పెంచుకున్న శ్రీరామ్ ఎప్పుడు చాన్స్ దొరికినా జయరామ్ అంతుచూడాలనుకున్నాడు. శనివారం రాత్రి శ్రీరామ్ జయరామ్‌కు ఫోన్‌చేసి అమీర్‌పేట వద్ద ఉన్నాను దమ్ముంటే ఇక్కడకు రా అని ఛాలెంజ్ చేశాడు. దీంతో పంజగుట్ట ప్రాంతంలోనే ఉన్న జయరామ్ భయపడి అతని స్నేహితులు కౌశిక్, అభిలాష్లను పిలిపించుకుని ముగ్గురూ కలిసి యాక్టీవా ద్విచక్రవాహనంపై పంజగుట్ట మెట్రోమాల్ ముందునుండి వెలుతున్నారు. వీళ్లు ఇక్కడ ఉన్నట్లు తెలుసుకున్న శ్రీరామ్ అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో 15 మందితో కలిసి కార్లల్లో వచ్చి జయరామ్‌పై విచక్షణరహితంగా దాడి చేశారు. స్థానికులు ఎంత అడ్డగించినా వినకపోవడంతో జయరామ్ స్నేహితులు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదుచేశారు. వెంటనే పోలీసు పెట్రోకార్ అక్కడకు వెళ్లగానే జయరామ్‌ను వారి కారులో ఎక్కించేందుకు యత్నిస్తున్న శ్రీరామ్ గ్యాంగ్ అక్కడనుండి పారిపోయారు. పోలీసులు వారిని పట్టుకునేందుకు యత్నించినా ప్రయోజనం లేకపోయింది. జయరామ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందించారు. అతని నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. చదవండి: ఖా‘కీచకులు’! విచక్షణ మరిచి సహోద్యోగులనే వేధిస్తున్న అధికారులు -
హైదరాబాద్: పంజాగుట్ట సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు
-
పంజగుట్టలో దారి దోపిడీ.. 3.5 లక్షలున్న బ్యాగ్‌తో పరార్.. పోలీసులు వెంబడించడంతో..
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డన దారి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. పంజగుట్టలో ఓ వ్యక్తి గోల్డ్ షాప్ క్లోజ్ చేసి డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తుండగా.. దృష్టి మళ్లించిన దొంగలు దారి దోపిడికి తెగబడ్డారు. గ్రీన్ ల్యాండ్స్ దారిలో బైక్‌పై వచ్చిన దొంగలు బంగారం షాపు యాజమాని నుంచి రూ. 3.5 లక్షలున్న రెండు బ్యాగ్‌లతో పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు దొంగలను వెంబడించడంతో రూ. 1.5 లక్షలు నగదు ఉన్న బ్యాగ్‌ను రోడ్డు మీదే వదిలేసి 2 లక్షల బ్యాగ్‌తో పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా విచారణ జరుపుతున్నారు. నిందితులు ఎవరు, తెలిసినవాళ్ల పనేనా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. చదవండి: హైదరాబాద్: 60 శాతం బస్సులు మేడారానికే.. ప్రత్యామ్నాయమేదీ? -
పంజగుట్ట కేబుల్ బ్రిడ్జి ప్రారంభానికి సర్వం సిద్ధం
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 1/3లోని పంజగుట్ట శ్మశాన వాటిక పాత ద్వారాన్ని తొలగించి నూతన కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో శ్మశాన వాటికకు వెళ్లేందుకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పాత గేటు నుంచి హైటెన్షన్ విద్యుత్ పోల్ వరకు చేసిన విస్తరణతో నాగార్జున సర్కిల్ నుంచి కేబీఆర్ పార్కు జంక్షన్‌కు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉంటుంది. గ్రేవియార్డ్‌కు వెళ్లేందుకు ఇబ్బందులు తీరుతాయి. ఇందుకోసం జీహెచ్ఎంసీ రూ.17 కోట్లు మంజూరు చేసింది. కేబుల్ బ్రిడ్జి, పాత గేటు నుంచి హెచ్‌టీ లైన్ వరకు రోడ్డును విస్తరించడంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది. ఈ బ్రిడ్జిని గురువారం ఉదయం 10 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. చదవండి: హైదరాబాద్: చలో అంటే చల్తా నై! -
పంజాగుట్ట: మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడులు.. యువతులు, నిర్వాహకుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు మసాజ్ సెంటర్లపై దాడులు చేశారు. ఈ క్రమంలో పలువురు యువతులు, నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చదవండి: బరితెగించిన కామాంధుడు.. వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నం -
పంజగుట్ట: వీడిన చిన్నారి హత్య మిస్టరీ.. తల్లి వివాహేతర సంబంధం.. ప్రియుడితో!
సాక్షి, పంజగుట్ట: చిన్నారిని హత్యచేసి పంజగుట్ట ద్వారకాపూరి కాలనీలో మూసి ఉన్న షట్టర్ పక్కన పడేసి వెళ్లిన ఘటనలో మిస్టరీ వీడింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా గుర్తించారు. ప్రియుడితో కలిసి కన్న తల్లి బిడ్డను దారుణంగా కొట్టి చంపింది. మియాపూర్, డబీర్‌పురా చెందిన నిందితులను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను శుక్రవారం హైదరాబాద్ తీసుకువచ్చిన పోలీసులు శనివారం అతడిని విచారించి మీడిమా ఎదుట ప్రవేశ పెట్టారు. చిన్నారిపై మృతి కేసులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ పూర్తి వివరాలను వెల్లడించారు. చదవండిష్త్: వైద్యుల నిర్లక్ష్యం.. మహిళకు తప్పుడు బ్లడ్ గ్రూప్ ఎక్కించారు.. కాసేపటికే మియాపుర్‌కు చెందిన నిందితురాలు హీనా బేగం భర్త చనిపోయిన తరువాత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. భిక్షాటన కోసం హీనా, ఖాదర్ కలిసి బెంగళూరు, ముంబై, పుణె, జైపూర్ వంటి ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతుంన్నారు. వీరితో పాటు మెహాక్ను కూడా తీసుకెళ్తున్నారు. అక్కడ పిల్లల చేత భిక్షాటన చేయించారు.. అయితే, చిన్నారి బేబీ మెహక్ బెగ్గింగ్ చెయ్యడం ఇష్టం లేక పోవడంతో ప్రతిఘటించింది. నాన్న దగ్గరికి వెళ్తానని గొడవ చేయడంతో తమకు అడ్డు వస్తుందని మొదటి భర్తకు పుట్టిన బిడ్డను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. చదవండి: చేపలు ఉచితంగా ఇవ్వలేదని... తీవ్రంగా కొట్టి కళ్లుపీకి చివరికి.. కాగా ఈ నెల 4న ఉదయం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు దాదాపు నాలుగేళ్ల చిన్నారిని తీసుకువచ్చి పంజగుట్ట ద్వారకాపూరి కాలనీ నుంచి బంజారాహిల్స్ రోడ్డునెంబర్ 1 వైపు వెళ్లే మార్గంలో ఉన్న మూసి ఉన్న దుకాణం ఎదుట పారవేసి వెళ్లారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పోస్టుమార్టం నివేదికలో బాలిక ఊపిరితిత్తుల కింద బలమైన గాయాలు ఉండడం, మొఖంపై ఎవరో బలంగా కొడితే కమిలిపోయినట్లు ఉన్నట్లు వెల్లడి కావడంతో హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించగా ఒక మహిళ, ఒక పురుషుడు పంజగుట్ట మాన్యావర్ సమీపంలోని మసీద్ వద్ద ఆటో దిగి నడుచుకుంటూ వెళ్లి చిన్నారరి శవాన్ని షాప్ ఎదుట పారవేసి తిరిగి నడుచుకుంటూ వెళ్లినట్లు సీసీ గుర్తించారు. సదరు ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఒక మహిళ, ఒక పురుషుడు నాంపల్లిలో ఆటో ఎక్కి ఇక్కడ దిగినట్లు స్పష్టం చేశాడు. నిందితులు సెల్‌ఫోన్, ఎక్కడా వాహనం వాడకపోవడంతో వారిని పట్టుకోవడం సవాల్‌గా మారింది. దీంతో కొన్ని వందల సీసీ కెమెరాల ఫీడ్‌ను తనిఖీ చేసిన 8 బృందాలు దాదాపు వారం రోజులు శ్రమించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
సాక్షి,హైదరాబాద్: గరంలో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్పేట్, కాచిగూడ, గోల్నాక, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, మైత్రివనం, ఆర్టీసీ క్రాస్‌రోడ్, లక్డీకాపూల్, కోఠి, అబిడ్స్, దిల్సుఖ్నగర్, సరూర్‌నగర్, సైదాబాద్, కూకట్పల్లి, ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్, ప్రగతినగర్, నిజాంపేట, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, పాతబస్తీ, చంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, బార్కస్, బహదూర్‌పూర, ఫలక్నామాలో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మాదాపూర్, కూకట్పల్లి ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫిలీంనగర్‌లో బస్తీ నీటమునిగింది. నగర వాసులు ఇంట్లోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించింది. ఈ మేరకు డీఆర్ఎఫ్ను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ.. అవసరమైతే కంట్రోల్ రూం నెంబర్ 040-29555500ను సంప్రదించాలని తెలిపింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. వందలాది వాహనాలు ఎక్కడికక్కడే రోడ్లపైనే నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులను మేయర్ విజయలక్ష్మి అప్రమత్తం చేశారు. సహాయక చర్యల కోసం అత్యవసర బృందాలను రంగంలోకి దించారు. తుఫాన్ గులాబ్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
కుమ్మేసిన కుండపోత: వైరలవుతోన్న ఫోటోలు, వీడియోలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో గురువారం రాత్రి పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. కూకట్పల్లి, బాలానగర్, యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి నగర్, షాపూర్‌నగర్, మూసాపేట, అమీర్‌పేట, మైత్రీవనం, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, సరూర్‌నగర్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, పంజాగుట్ట మెట్రో, ఎర్రగడ్డ, శ్రీనగర్ కాలనీ, రాజ్‌భవన్ రోడ్ లేక్‌వ్యూ గెస్ట్ హౌస్, ఖైరతాబాద్, హబ్సిగూడ, టోలిచౌకి, సికింద్రాబాద్, కోఠి, దిల్సుఖ్నగర్, నారాయణగూడ, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో వర్షం భారీగా కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి. రాత్రి 7.50 నుంచి 9 గంటల వరకు కుంభవృష్టి కుమ్మేసింది. వరదనీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. వాహనాల రాకపోకలు స్తంభించాయి. రాత్రి 11 గంటల వరకూ రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను రోడ్డు క్లియర్ చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. నగరంలో సుమారు వంద ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రి 11 గంటల వరకు జూబ్లీహిల్స్‌లో 9.8, మూసాపేటలో 9.6, చందానగర్‌లో 8.8, సరూర్‌నగర్‌లో 8.3, మోతీనగర్‌లో 7.9, మాదాపూర్‌లో 7.7, యూసఫ్‌గూడలో 7.6, బాలానగర్‌లో 7.1, చాంద్రాయణగుట్టలో 6.9, శ్రీనగర్ కాలనీలో 6.8, ఫాతిమానగర్‌లో 6.5, ఎల్బీనగర్లో 6.3, రంగారెడ్డి నగర్లో 5.9, జీడిమెట్లలో 5.8, ఆసిఫ్‌నగర్, కేపీహెచ్‌బీలలో 5.7, గాజులరామారంలో 5.4, అత్తాపూర్‌లో 4.5 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదయ్యింది. రంగంలోకి జీహెచ్ఎంసీ బృందాలు జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగి రోడ్లపై నిలిచి నీటిని తోడివేశాయి. డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సహాయక చర్యల కోసం 040 21111111 నంబర్‌కు ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఇళ్లలోంచి బయటికి రావద్దని ప్రజలను అప్రమత్తం చేసింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Watch 😱😱 #hyderabadrain #hyderabadflood #heavyrains @HiHyderabad @HiWarangal @balaji25_t @HYDmeterologist pic.twitter.com/8JMkPvlTBd — Mohammad fasahathullah siddiqui (@MdFasahathullah) September 2, 2021 It’s not #istanbul means Old City of #Hyderabad it’s #Dallas of #Telangana #YousufGuda #KrishnaNagar #HyderabadRains pic.twitter.com/lIjQRhCxZK — Mubashir.Khurram (@infomubashir) September 2, 2021 #hyderabadrain #hyderabadflood#hyderabad #StayHomeStaySafe@HiWarangal @HiHyderabad @DonitaJose pic.twitter.com/yFNrlek4VV — Mohammad fasahathullah siddiqui (@MdFasahathullah) September 2, 2021 -
Punjagutta: రూ.కోట్ల ఆస్తి ఉంది.. నిన్ను పెళ్లి చేసుకుంటా
సాక్షి, పంజగుట్ట: ఆన్లైన్లో పరిచయం చేసుకొని, కోట్ల రూపాయల ఆస్తి ఉంది.. నిన్ను పెళ్లి చేసుకుంటా.. ఇద్దరం జీవితాంతం సంతోషంగా ఉందామని మాయమాటలు చెప్పి యువతిని మోసం చేసిన యువకుడిపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన ఆదిత్యకు సోమాజిగూడకు చెందిన బీటెక్ పూర్తిచేసిన ఓ యువతి ఆన్లైన్లో పరిచయం అయ్యింది. ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి నెల రోజులు సహజీవనం చేశారు. మాస్టర్స్ చదివేందుకు యువతి జనవరి 13న అమెరికాకు వెళ్లింది. ప్రతి రోజూ ఆమెకు ఫోన్ చేసి ఇండియాకు రావాలని, తనపేరుమీద రూ.13 కోట్ల ఫిక్స్‌డిపాజిట్లు ఉన్నాయని, బెంగళూరులో ఆస్తులు ఉన్నాయని నమ్మబలికాడు. నమ్మిన యువతి ఫిబ్రవరి 12వ తేదీన చదువు ఆపేసి ఇండియాకు వచ్చింది. మణికొండలో ఇల్లు తీసుకుని ఉన్నారు. ఇద్దరూ కలిసి టూర్ వెళ్లి జూలైలో నగరానికి వచ్చారు. తర్వాత ఇల్లు బంజారాహిల్స్‌కు మార్చారు. బెంగళూరుకు వెళ్లి డబ్బులు తీసుకు వస్తానని చెప్పి ఆదిత్య వెళ్లాడు. తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ముఖం చాటేశాడు. దీంతో యువతి పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత ఆత్మహత్య పంజగుట్ట: వరకట్న వేధింపులకు యువతి బలైన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈస్ట్‌గోదావరి జిల్లా పైడికొండకు చెందిన పి.గంగబాబుకు శివకుమారి(24), శంకరవేణి ఇద్దరు కుమార్తెలు. శివకుమారిని అదే ప్రాంతానికి చెందిన కె.శ్రీనివాస్(35)కి ఇచ్చి వివాహం చేశారు. రూ.2 లక్షల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు కట్నం కింద ఇచ్చారు. అనంతరం శ్రీనివాస్ నగరంలోని శ్రీనగర్‌కాలనీలో నివాసం ఉంటూ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు. అదనపు కట్నం తీసుకురావాలని శివకుమారిని తరచూ శ్రీనివాస్ వేధించేవాడు. ఈ క్రమంలో ఆర్నెళ్ల క్రితం గ్రామంలోని 5 సెంట్ల భూమిని శ్రీనివాస్‌కు ఇచ్చారు. అయినా వేధింపులు ఆపకపోవడంతో గురువారం శివకుమారి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ అతడి తల్లి బాలమ్మపై వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఖైరతాబాద్ చౌరస్తా: కదులుతున్న కారులో మంటలు
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ చౌరస్తా వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తక్షణమే అప్రమత్తమైన డ్రైవర్ కారును ఆపి బయటకు దిగేశాడు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్మం చేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. కారు ఇంజిన్‌లో విద్యుత్ షాక్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పంజగుట్ట : హైటెక్ వ్యభిచారం, ఏడుగురు యువతుల అరెస్టు
-
హైటెక్ వ్యభిచారం, ఏడుగురు యువతుల అరెస్టు
పంజగుట్ట: గుట్టచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం.. సోమాజీగూడ రాజ్ భవన్ రోడ్‌లోని పార్క్ హోటల్లో హైటెక్ వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు శుక్రవారం రాత్రి పంజగుట్ట పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు యువతులు, ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళలను రిస్కీ హోమ్‌కు తరలించారు. -
తెలంగాణలో ఘనంగా వైఎస్ జయంతి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను బుధవారం గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. వైఎస్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. పేదల సంక్షేమం కోసం వైఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నాయకులు కేవీపీ రామచంద్రరా వు, పొన్నాల లక్ష్మయ్య, అంజన్‌కుమార్ యాద వ్, వంశీచంద్‌రెడ్డి, మల్లు రవి, గూడూరు నారాయణరెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు హైదరాబాద్ పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఏపీలో మళ్లీ స్వర్ణయుగం: గట్టు సాక్షి, హైదరాబాద్: ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డితో మళ్లీ వైఎస్సార్ నాటి స్వర్ణయుగం వచ్చిందని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్ పంజగుట్ట చౌరస్తాలోని వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాల వేసి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, సంజీవరావు, వెంకటరమణ, చంద్రశేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ పంజగుట్ట చౌరస్తాలో వైఎస్ విగ్రహం వద్ద కేక్ కట్ చేస్తున్న గట్టు శ్రీకాంత్‌రెడ్డి యాదాద్రి జిల్లాలో వైఎస్ విగ్రహావిష్కరణ యాదగిరిగుట్ట: అభివృద్ధి ఎంత ముఖ్యమో.. సంక్షేమం కూడా అంతే ముఖ్య మని నమ్మిన ప్రజానాయకుడు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు, టీటీడీ బోర్డు సభ్యుడు కొలిశెట్టి శివకుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాంలో వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు పాండురాజు కమలాకర్, బత్తిని బాలరాజుగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వై.ఎస్. రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. -
పంజాగుట్టలో స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మొట్టమొదటి స్టీల్ బ్రిడ్జి శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్టీల్ బ్రిడ్జ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా లాక్డౌన్ తరుణంలో జీహెచ్ఎంసీ వేగంగా చేసిన ప్రాజెక్టుల్లో ఇదొకటి. పంజగుట్ట శ్మశానవాటిక (చట్నీస్) సమీపం నుంచి రహదారి విస్తరణకు అవకాశం లేక తీవ్ర బాటిల్‌నెక్‌తో బ్లాక్‌స్పాట్‌గా మారింది. దీంతో వాహన ప్రమాదాలు జరుగుతుండేవి. సమస్య పరిష్కారం కోసం క్యారేజ్‌వే పెంచేందుకు చిన్న ఫ్లైఓవర్ అవసరమని భావించారు. ట్రాఫిక్ రద్దీ, ఇతరత్రా సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని స్టీల్‌బ్రిడ్జి నిర్మాణాన్ని తలపెట్టారు. బ్రిడ్జి మొత్తం పొడవు వంద మీటర్లు. స్టీల్‌బ్రిడ్జి స్పాన్ 43 మీటర్లు. గత ఫిబ్రవరి నెలాఖరులో పనులు ప్రారంభమయ్యాయి. లాక్డౌన్లో ట్రాఫిక్ లేకపోవడం, మంత్రి కేటీఆర్, మేయర్ రామ్మోహన్ ప్రత్యేక శ్రద్ధ వహించిన నేపథ్యంలో అధికారులు వడివడిగా పనులు పూర్తిచేశారు. ఈ నెల మొదటి వారంలోనే ప్రారంభించాలనుకున్నప్పటికీ.. తుది మెరుగుల కోసం ఆగాల్సి వచ్చింది. ఈ బ్రిడ్జి వినియోగంతో ముఫకంజా కాలేజ్ వైపు నుంచి ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వైపు వాహనాల రాకపోకలకు ట్రాఫిక్ సమస్య తీరడంతోపాటు వాహనదారులకు ప్రయాణ సమయం కలిసివస్తుందని జీహెచ్ఎంసీ పేర్కొంది. లాక్డౌన్ సమయాన్ని సమర్థంగా వినియోగించుకొని మూడు నెలల్లోనే బ్రిడ్జిని పూర్తి చేసినట్లు తెలిపింది. బ్రిడ్జి ఆరు మీటర్లతో పాటు మొత్తం 12 మీటర్ల క్యారేజ్‌వేతో బాటిల్‌నెక్ సమస్య తీరుతుందని పేర్కొంది. మెయిన్‌గర్డర్లు, క్రాస్‌గర్డర్లు స్టీల్‌వి వాడినట్లు తెలిపింది. స్టీల్ బ్రిడ్జి విశేషాలు.. మొత్తం పొడవు: 100 మీటర్లు స్టీల్ బ్రిడ్జి స్పాన్: 43 మీటర్లు (సింగిల్ స్పాన్) అప్రోచెస్ పొడవు: 57 మీటర్లు (ఎన్ఎఫ్సీఎల్ వైపు 35 మీటర్లు, ముఫకంజా కాలేజ్ వైపు 22 మీటర్లు) వెడల్పు: 9.60 మీటర్లు క్యారేజ్ వే: 6 మీటర్లు (రెండు లేన్లు, వన్‌వే), 1 మీటరు ఫుట్‌పాత్ రద్దీ సమయంలో ట్రాఫిక్: 11,305 పీసీయూ 2035– 36 నాటికి ట్రాఫిక్: 17,613 -
త్వరలో అందుబాటులోకి పంజగుట్ట స్టీల్ బ్రిడ్జి
సాక్షి,సిటీబ్యూరో: తీవ్ర ట్రాఫిక్ సమస్యలతో ప్రయాణికులకు అత్యంత ప్రమాదకరంగా ఉన్న పంజగుట్ట శ్మశానవాటిక వద్ద ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ఎస్సార్డీపీ పనుల్లో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన స్టీల్ బ్రిడ్జి పనులు త్వరలో పూర్తి కానున్నాయి. కాంట్రాక్టు అగ్రిమెంట్ మేరకు ఈ పనులు పూర్తయ్యేందుకు సమయం ఉన్నప్పటికీ, లాక్డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకొని ఇంజినీరింగ్ పనుల్ని త్వరితగతిన పూర్తిచేయాలని మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. యంత్రాలు, కార్మికుల సంఖ్యను పెంచి మరీ పనులు త్వరితంగా పూర్తిచేయాలన్నారు. దీంతో మే నెలలోగా పనులు పూర్తి చేసేందుకు అధికారులు వేగం పెంచారు. సోమవారం పంజగుట్ట శ్మశాన వాటిక వద్ద ముఫకంజా కాలేజి వైపు నుంచి నాగార్జున సర్కిల్ వైపు స్టీల్‌బ్రిడ్జి పనుల పురోగతిని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ బొంతు రామ్మోహన్‌లతో కలిసి తనిఖీ చేశారు. పనుల్ని త్వరితగతిన పూర్తిచేయాల్సిందిగా చీఫ్ ఇంజినీర్ శ్రీధర్‌కు మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో ట్రాఫిక్ సమస్యలు లేనందున త్వరితంగా పూర్తిచేసేందుకు మంచి అవకాశమని, కాంట్రాక్టు ఏజెన్సీ ఎక్కువమంది కార్మికులను వినియోగించేలా చూడాలన్నారు. మేయర్ మాట్లాడుతూ.. నిత్యం అత్యంత రద్దీగా వుండే ఈ ప్రాంతంలో శ్మశాన వాటిక– చట్నీస్ మధ్యలో ఇరుగ్గా ఉన్న పంజగుట్ట రహదారిని రెండు వైపులా విస్తరించేందుకు ఎస్సార్డీపీ కింద ప్రభుత్వం పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. లాక్డౌన్ పీరియడ్‌లో ఏర్పడిన వెసులుబాటును ఉపయోగించుకొని నిర్మాణ పనులను 24 గంటల పాటు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ çపనుల్లో భాగంగా రోడ్డుకు రెండు వైపులా రెండు లేన్ల ర్యాంపులు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్మశాన వాటిక వైపు ఉన్న సమాధులకు నష్టం వాటిల్లకుండా మధ్యలో 43 మీటర్ల పొడవుతో స్టీల్ బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ చిక్కులకు ఉపశమనం పంజగుట్ట శ్మశానవాటిక వద్ద తీవ్ర బాటిల్‌నెక్‌తో బ్లాక్‌స్పాట్‌గా మారిన ప్రదేశంలో ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా తగినంత వెడల్పుతో రోడ్డును విస్తరించేందుకు అవకాశం లేకపోవడంతో ఒక స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. దాదాపు 100 మీటర్ల పొడవుతో జరుగుతున్న పనుల్లో స్టీల్ బ్రిడ్జి పొడవు 43 మీటర్లు ఉంటుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రోడ్డు 5 మీటర్ల వెడల్పుతో, రోడ్డుపై బ్రిడ్జి 6 మీటర్ల వెడల్పుతో మొత్తం 11 మీటర్ల క్యారేజ్‌వే అందుబాటులోకి వస్తుందని ఎస్ఈ జ్యోతిర్మయి తెలిపారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే ముఫకంజా కాలేజ్ వైపు నుంచి నాగార్జున సర్కిల్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయన్నారు. మరో స్టీల్ బ్రిడ్జి .. నాగార్జున సర్కిల్ నుంచి ముఫకంజా కాలేజీ వైపు వెళ్లే మార్గంలో ఉన్న శ్మశాన వాటికలోకి వెళ్లే వారికి ఇబ్బంది లేకుండా నేరుగా వెళ్లేందుకు 65 మీటర్ల పొడవుతో మరో స్టీల్‌బ్రిడ్జి నిర్మించనున్నారు. శ్మశానవాటిక ఎగ్జిట్ దారిని అభివృద్ధి చేయనున్నారు. భూసేకరణలతో సహా వీటి అంచనా వ్యయం దాదాపు రూ.17 కోట్లు. రెండు స్టీల్ బ్రిడ్జిలు సహా మొత్తం ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.23 కోట్లు. -
పంజగుట్ట కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, సిటీబ్యూరో: పంజగుట్ట శ్మశానవాటిక వద్ద రోడ్డు విస్తరణ, స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తున్నట్లు ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ శుక్రవారం ప్రకటించారు. ఇవి శనివారం నుంచి ఈ ఏడాది జూన్ 3 వరకు అమలులో ఉంటాయన్నారు. ఎస్ఎన్టీ జంక్షన్ నుంచి ఎన్ఎఫ్సీఎల్, పంజగుట్ట చౌరస్తాల వైపు ఏ భారీ వాహనాలను అనుమతించరు. ఈ నేపథ్యంలో ఫిల్మ్‌నగర్ జంక్షన్, రోడ్ నెం.45 జంక్షన్, రోడ్ నెం.36 వైపు నుంచి వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్–యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్–మైత్రీవనం మీదుగా లేదా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్–రోడ్ నెం.45–బీవీబీ జంక్షన్– రోడ్ నెం.12 మీదుగా ప్రయాణించాలని ఆయన సూచించారు. -
దోపిడీ దొంగల హల్చల్
పంజగుట్ట: దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడి మహిళలను భయభ్రాంతులకు గురిచేశారు. తిరగబడిన మహిళను సుత్తితో బాదడంతో తీవ్ర గాయాల పాలైన ఘటన సోమవారం అర్ధరాత్రి పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అమీర్‌పేటలోని అపరాజితా కాలనీలో పద్మా రఘురాజ్, ఆమె కూతురు నందితా కపూర్, ఆమె కూతురు కీర్తి నివసిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి 2:20 గంటల సమయంలో ముగ్గురు ముసుగు దొంగలు ఇంటి ఆవరణలోకి ప్రవేశించారు. సుమారు 2:50 ప్రాంతంలో ఇంటి కిచెన్ ప్రాంతంలోని మరో తలుపు నుంచి దోమలు రాకుండా వేసిన నెట్‌ను తొలగించి తలుపు లోపలి గడియతీసి ఇంట్లోకి ప్రవేశించారు. చప్పుడు రావడంతో నందితా కపూర్, పద్మా, కీర్తి నిద్ర లేచి బయటకు వచ్చారు. ఎవరు మీరు అంటూ అడ్డుకునేందు కు ప్రయత్నించగా డబ్బు, బంగారం ఎక్కడుందో చెప్పాలంటూ బెదిరించారు. దీంతో నందితా కపూర్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దొంగలు తమ వెంట తీసుకువచ్చిన సుత్తితో ఆమె తలపై బలంగా కొట్టారు. దీంతో నందితా కపూర్ తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అనంతరం పద్మా, కీర్తిలను డబ్బు ఎక్కడుందో చెప్పాలని బెదిరించారు. తమ వద్ద డబ్బులు, బంగారం లేదని వారు చెప్పారు. దీంతో వీరిని పక్కనే ఉన్న బాత్రూంలో ఉంచి బయటనుంచి గడియ పెట్టారు. అన్ని బెడ్రూంల్లోని సామాన్లను చిందరవందర చేశారు. డబ్బు, నగలకోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో టేబుల్‌పై ఉన్న రూ.1,500 తీసుకుని సుమారు 3:30 గంటలకు పరారయ్యారు. దొంగలు వెళ్లిపోయిన అనంతరం బాధితులు నందితా కపూర్‌ను అమీర్‌పేటలోని ఓ ఆస్పత్రికి తీసుకువెల్లి చికిత్స చేయించారు. తెల్లవారుజామున 4:17 గంటల ప్రాంతంలో 100కు ఫోన్ చేయడంతో పంజగుట్ట పోలీసులు ఘటన స్థలానికి వచ్చారు. తెలిసినవారి పనేనా? నిందితులు హిందీ మాట్లాడుతున్నారని, వారు నార్త్ ఇండియన్లుగా భావిస్తున్నామని బాధిత మహిళలు చెబుతున్నారు. ఇంట్లో కేవలం ముగ్గురు మహిళలు ఉంటున్నారని వీరు ముందే తెలుసుకున్నారా? లేదా గతంలో వీరింట్లో పనిచేసిన వారు ఎవరైనా చేసి ఉండవచ్చా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఘటనా స్థలాన్ని టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, డాగ్స్వాడ్, ఫింగర్‌ప్రింట్స్ టీంలు పరిశీలించాయి. ఘటన జరిగిన ప్రాంతాన్ని పశ్చిమ మండల డీసీపీ ఎ.ఆర్.శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ ఇగ్బాల్ సిద్ధిఖీ, ఏసీపీ తిరుపతన్నలు పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. -
శభాష్..ప్రభు
పంజగుట్ట: పంజగుట్ట పోలీస్ కానిస్టేబుల్ మానవత్వాన్ని చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయడిన ఓ మహిళను చేతుల్లో ఎత్తుకుని ఆసుపత్రిలో చేర్పించాడు. వివరాల్లోకి వెళితే బీఎస్ మక్తాకు చెందిన వెంకటరమణ మూర్తి, సుధారాణి దంపతులు సోమవారం బైక్‌పై రాజీవ్ సర్కిల్ నుంచి బేగంపేట వైపు వెళుతుండగా ఓ ఆటో వీరి బైక్ దగ్గరగా వెళ్లడంతో బైక్ అదుపుతప్పి కిందపడడంతో వెంకటరమణ మూర్తికి స్వల్ప గాయాలు కాగా, సుధారాణి నడుము, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె నొప్పితో విలవిలలాడుతుండగా అక్కడే విధుల్లో ఉన్న పంజగుట్ట పెట్రోకార్ కానిస్టేబుల్ ఎన్.ప్రభు ఆమెను చేతులతో ఎత్తుకుని సమీపంలోని వివేకానంద ఆసుపత్రిలో అడ్మిట్ చేశాడు. ఆమె అవస్థను చూడలేక ఎత్తుకుని తీసుకెళ్లినట్లు ప్రభు తెలిపాడు. -
పంజగుట్టలో ‘మహాప్రస్థానం’ ఏదీ?
బంజారాహిల్స్: నగరంలో మరిన్ని శ్మశానవాటికలను ‘మహాప్రస్థానాలు’గా తయారు చేయాలని జీహెచ్ఎంసీ సంకల్పించి ఆ మేరకు కొన్ని శ్మశానవాటికలను గుర్తించింది. అందులో ఒకటి షేక్‌పేట మండలం, జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్–18 పరిధి కిందకు వచ్చే బంజారాహిల్స్ రోడ్ నెంబర్–1లో ఉన్న పంజాగుట్ట హిందూ శ్మశానవాటికను గుర్తించారు. 2008 సంవత్సరంలో అప్పటి ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పంజాగుట్ట శ్మశానవాటిక అభివృద్ధి కోసం సకల సౌకర్యాలు కల్పించే నిమిత్తం రూ.కోటి మంజూరు చేశారు. ఇందులోనే విద్యుత్ దహనవాటిక నిర్మాణాన్ని కూడా ఇంకో రూ.కోటి వెచ్చించి నిర్మించారు. అయితే దురదృష్టవశాత్తు మహానేత మరణించడంతో శ్మశానవాటిక అభివృద్ధి పథకం మూలన పడింది. నిర్మించిన విద్యుత్ దహనవాటిక ఒక్కరోజు కూడా పనిచేయకుండానే ఉండిపోయింది. తరువాత విద్యుత్ దహన వాటిక శిథిలావస్తకు చేరి గోడలు కూలి, కిటికీలు చోరీకి గురై కొన్నాళ్లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. ఇప్పుడది ఎందుకూ పనికిరాని బూత్ బంగ్లాగా మారిపోయింది. మళ్లీ ఈ ఫైల్‌ను తెరమీదకు తీసుకొచ్చేవారు కరువయ్యారు. ఫలితంగా కొన్నాళ్ల నుంచి శ్మశానవాటికలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ముందుకొచ్చిన ఫినిక్స్.. 2017లో మరోసారి పంజాగుట్ట శ్మశానవాటికపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి పెట్టారు. ఫిలింనగర్లో నిర్మించిన మహా ప్రస్థానం తరహాలోనే ఈ శ్మశానవాటికలో కూడా మరో మహాప్రస్థానాన్ని నిర్మించేందుకు ఫినిక్స్ సంస్థ ముందుకొచ్చింది. జీహెచ్ఎంసీ అధికారులతో జరిగిన చర్చలు ఫలవంతం కాగా ఫినిక్స్ ఇక్కడ రూ.కోటి వ్యయంతో మహాప్రస్థానం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. శ్మశానవాటిక చుట్టూ ప్రహారీ ఒకేఒక గేటును ఏర్పాటు చేసి రాకపోకలకు అనుమతిచ్చే విధంగా సంస్థ ప్రారంభించిన చర్యలు మొదట్లోనే బెడిసికొట్టాయి. పునాదులు తీస్తుండగానే వివాదాలు చుట్టుముట్టాయి. ఇక మహాప్రస్థానం డిజైన్లను రూపొందించి ఓ రోజు ప్రదర్శించారు. అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పనులు కూడా ప్రారంభించారు. సరిగ్గా నాలుగు నెలలు పనులు జరిగాయో లేదో జీహెచ్ఎంసీ అధికారుల నుంచి సహకారం కరువైంది. కొన్ని నిర్మాణాలకు ఆటంకాలు ఎదురయ్యాయి. ఎన్ఓసీలు కూడా లభించలేదు. ఫినిక్స్ సంస్థ నిర్వాహకులకు అడుగడుగునా చుక్కెదురైంది. దీనికి తోడు కొంతమంది ఈ నిర్మాణాలకు అడ్డుపుల్లలు వేశారు. ఆందోళనలూ కొనసాగించారు. అరికట్టాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు చోద్యం చూశారు. ఫలితంగా ఫినిక్స్ సంస్థ అర్ధాంతరంగా పనులు ఆపేసి చేతులెత్తేసింది. సుమారు రూ.40 లక్షల మేర ఖర్చు పెట్టారు. ఇంకో రెండు నెలల పాటు పనులు జరిగి ఉంటే పంజాగుట్ట శ్మశానవాటిక కాస్తా మహాప్రస్థానం తరహాలోనే రూపుదిద్దుకొని ఉండేది. అడుగడుగునా నిర్లక్ష్యం.. అధికారుల నిర్లక్ష్యమే పంజాగుట్ట శ్మశానవాటికకు శాపంగా మారిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఒకవైపు శ్మశానవాటికలో ఫినిక్స్సంస్థ నిర్మాణ పనులు జరుపుతుంటే ఒక్కసారి కూడా జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం పర్యవేక్షించిన పాపాన పోలేదు. ఈ సంస్థకు అవసరమయ్యే అనుమతులు కూడా ఇవ్వలేని దుస్థితి దాపురించింది. అడ్డుకునేవారిని పిలిచి మాట్లాడాల్సిన అధికారులు ఆ దిశలో ఎలాంటి చొరవ చూపలేదు. నగరంలో మరిన్ని మహాప్రస్థానాలు నిర్మిస్తామని చెప్పిన ఫినిక్స్ సంస్థ ఇప్పుడు ఆ ఆలోచననే విరమించుకునే స్థాయికి అధికారులు తీసుకొచ్చారు. ఆదినుంచీ అడ్డంకులే.. పంజాగుట్ట హిందూ శ్మశానవాటికను అభివృద్ధి చేయాలని ఎప్పుడు ప్రణాళికలు రూపొందించినా అవి విఫలమవుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్ ఉంటే ఈ శ్మశానవాటిక అన్ని హంగులతో రూపుదిద్దుకొని ఉండేది. దురదృష్టవశాత్తు ఆయన మరణం కూడా ఈ శ్మశానవాటికకు శాపమైంది. ఆయన తర్వాత వచ్చిన పాలకులు ఈ ఫైల్‌ను పట్టించుకోలేదు. కనీసం తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఫినిక్స్ అనే సంస్థ అభివృద్ధికి ముందుకు వచ్చినా పాలకులు అంతగా ప్రోత్సహించలేదు. మరోసారి అర్ధాంతరపనులు అధికార యంత్రాంగ నిర్లక్ష్యానికి నిలువెత్తు దర్పణంగా నిలుస్తున్నాయి. -
‘రాంప్రసాద్‌ను చంపింది నేనే’
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులొకొచ్చింది. రాంప్రసాద్‌ని తానే హత్య చేశానంటూ శ్యామ్ అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చి నేరం ఒప్పుకున్నాడు. తనతోపాటు చోటూ, నరేష్‌తో కలిసి ఈ హత్య చేసినట్టు అతను ఒప్పుకున్నాడు. అయితే హత్య చేయించింది కోగంటి సత్యం అని రాంప్రసాద్ కుటుంబసభ్యులు ఆరోపిస్తుండగా... వాటిని ఖండిస్తూ తానే హత్య చేశానని శ్యామ్ నేరం ఒప్పుకోవడం గమనార్హం. ఈ కేసులో శ్యామ్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం గురించి శ్యామ్ భార్య మాట్లాడుతూ.. ‘మూడు రోజుల క్రితం నా భర్త పని ఉందని బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి వాటర్ ప్లాంట్‌ను నేను చూసుకుంటున్నాను. అయితే రాంప్రసాద్‌ని నా భర్త హత్య చేశాడనే విషయం నాకు తెలీదు. కానీ రాంప్రసాద్ మా మీద పెట్టిన కేసులు వల్ల ఆర్థికంగా నష్టపోయి.. మానసిక ఇబ్బందులు పడ్డాం. రాం ప్రసాద్ పెట్టిన కేసుల వల్ల పోలీసులు అర్థరాత్రి మా ఇంటికి వచ్చి సోదాలు జరిపి ఇంట్లో ఉన్న విలువైన కాగితాలు, డబ్బు, నగలు పట్టుకుపోయారు. రాంప్రసాద్ మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడ’ని తెలిపారు. -
‘ఆ హత్యకేసులో బోండా ఉమ ప్రమేయం ఉంది’
సాక్షి, హైదరాబాద్ : పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్యకేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కోగంటి సత్యం స్పష్టం చేశారు. శనివారం పంజాగుట్టలో రాంప్రసాద్‌ను ముగ్గురు దుండగులు కత్తులతో పొడిచి హత్యచేసి పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ హత్యపై కోగంటి సత్యంకు సంబంధం ఉందని అందుకే అజ్ఞాతంలోకి వెళ్లారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. తనను కావాలనే ఈ కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాంప్రసాద్ నుంచి తనకు 26 కోట్లు రావాలని, అలాంటప్పుడు తానేలా హత్యచేస్తానని ప్రశ్నించారు. నాపై కక్ష్యపూరితంగానే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఈ హత్యకేసులో బోండా ఉమా, ఏబీ వెంకటేశ్వరరావు ప్రమేయం ఉందని అన్నారు. గతంలో కూడా ఏబీ వెంకటేశ్వర రావుతో కలిసి బోండా ఉమా తనపై తప్పుడు కేసులు బనాయించారని గుర్తు చేశారు. తానేమీ అజ్ఞాతంలో లేనని, ఫిజియోథెరపీ కోసం హైదరాబాద్‌కు వచ్చానని తెలిపారు. ఈ కేసులో తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని, తెలంగాణ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఆయన కోరారు. -
పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్యకేసులో కొత్త కోణం
సాక్షి, హైదరాబాద్ : పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్యకేసులో కొత్త కోణం వెలుగుచూసింది. వ్యాపారా లావాదేవీల్లో జరిగిన గొడవలే హత్యకు కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నెలరోజులుగా రాంప్రసాద్‌కు విజయవాడకు చెందిన బిజినెస్ పార్టనర్ నుంచి బెదిరింపులు వస్తూ ఉండేవని, వాటా నిమిత్తం న్యాయంగా రావాల్సిన 50 కోట్లకు సంబంధించి అతగాడిపై కృష్ణలంక పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో రాంప్రసాద్‌ను చంపేశారని చెబుతున్నారు. నిన్న హైదరాబాద్ పంజాగుట్టలో రాంప్రసాద్‌ను ముగ్గురు దుండగులు కత్తులతో పొడిచి హత్యచేసి పారిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు రాంప్రసాద్ హత్య విజయవాడలోనూ కలకలం రేపుతోంది. ఆర్ధిక లావాదేవీలతోనే మాజీ వ్యాపార భాగస్వామి కోగంటి సత్యం...రాంప్రసాద్ హత్యకు స్కెచ్ వేసాడన్న కుటుంబసభ్యుల ఆరోపణపై పోలీసులు దృష్టి పెట్టారు. అయితే రాంప్రసాద్ హత్యకు కోగంటికి ఎలాంటి సంబంధం ఆయన అనుచరులు చెబుతునన్నారు. కాగా పటమటలోని కోగంటి సత్యం నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయన కుటుంబ సభ్యులను విచారణ చేశారు. అయితే కోగంటి సత్యం ప్రతి వారం పటమట పీఎస్‌లో సంతకం చేయాల్సి ఉందని, ఈ వారం రాకపోవడం వల్లే ఆయన కుటుంబసభ్యులను విచారించామని సీఐ దుర్గారావు తెలిపారు. -
పంజాగుట్ట వద్ద ఆర్టీసీ బస్సులో కాల్పుల కలకలం
-
సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఓలా క్యాబ్ బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : పంజాగుట్ట సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం ఓలా కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి ముఖ్యమంత్రి రాకపోకల కోసం ఏర్పాటు చేసిన గేటును ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనలో క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు యువతులకు స్వల్పంగా గాయలయ్యాయి. సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ప్రమాదానికి గురైన కారును తొలగించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డుపై సిగరెట్ తాగినందుకు జరిమానా
పంజగుట్ట: పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో పలుప్రాంతాల్లో రోడ్లపై సిగరెట్ తాగుతున్న, గుట్కాలు నములుతున్న, విక్రయిస్తున్న 22 మంది వ్యక్తులకు అధికారులు జరిమానా విధించారు. తెలంగాణ టోబాకో టెక్నికల్ ఆఫీసర్ ఎస్.నాగరాజు, మాస్ మీడియా ఆఫీసర్ జే.రాములు, డాక్టర్ అనూషాలతో పాటు కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ అఫైర్స్ డిప్యుటీ డైరెక్టర్ డాక్టర్ రాణా, టెక్నికల్ డైరెక్టర్ గోవింద్ త్రిపాఠి బుధవారం పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాన్‌షాప్‌లు, బార్లు, రోడ్లపై బహిరంగంగా సిగరెట్ తాగుతున్న వారిని గుర్తించి జరిమానా విధించారు. 22 కేసులు నమోదు చేయగా వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. పాఠశాలకు 100 గజాల దూరం వరకు పాన్‌షాప్ ఉండరాదని నిబంధనలు అతిక్రమిస్తే చర్య లు తప్పవన్నారు. బార్లలో ఆల్కహాల్ తాగేందు కు మాత్రమే అనుమతి ఉందని, సిగరెట్ నిషేధమన్నారు. పలు బార్లలో తనిఖీలు చేసి నో స్మోకింగ్ బోర్డులు లేకపోవడం, సిగరెట్ తాగినట్లు ఆనవా లు కనిపించడంతో బార్ నిర్వాహకులకు కూడా ఫైన్ వేశారు. తెలంగాణలో నికోలిన్ నిషేధం విధించినా పలు పాన్‌షాప్‌లలో పాన్‌మసాలా, నికోలిన్ వేర్వురుగా విక్రయిస్తున్నట్లు గుర్తించి వారికి జరిమానా విధించడమేగాక కేసులు నమోదు చేశామన్నారు. ఆరుగురు గుట్కా తినేవారిని గుర్తించగా అందులో ఐదుగురు వ్యక్తులకు క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించామన్నారు. ముగ్గురు మూడో స్టేజ్‌లో, ఇద్దరు రెండవ స్టేజ్‌లో ఉన్నట్లు తెలిపారు. వారికి కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. చైన్ స్మొకర్లు, గుట్కాలు తినేవారిని టొబాకో స్ట్రేష్టేషన్ సెంటర్లో చేర్చుకుని వాటిని మానుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
పంజాగుట్టలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ క్రైమ్ : పంజాగుట్టలోని ఓ వైన్ షాపులో సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నిమ్స్ హాస్పిటల్ దగ్గరలో ఉన్న డ్యూ పాయింట్ వైన్స్‌లో ఈ దుర్ఘటన జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. చెలరేగుతున్న మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారుగా రూ. 25 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియలేదు. -
హైదరాబాద్ నిమ్స్‌లో అర్ధరాత్రి అలజడి
-
నిమ్స్‌లో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఏసీలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆస్పత్రిలోని పేషెంట్లు, బంధువులు భయాందోళనకు గురయ్యారు. మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
అక్షర యోధుడు హనుమంతరావు
-
అక్షర యోధుడు హనుమంతరావు
పంజగుట్ట: అక్షరాన్నే నమ్ముకున్న అత్యుత్తమ పాత్రికేయుడు హనుమంతరావును నవతరం జర్నలిస్టులు ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వక్తలు కొనియాడారు. శనివారం సోమాజిగూడలో ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో వయోధిక పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు వరదాచారి అధ్యక్షతన సీనియర్ జర్నలిస్టు హనుమంతరావు సంస్మరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. హనుమంతరావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పిం చారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నా రు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. హనుమంతరావు ఒక తపస్వి అని కొనియాడారు. సమాజాన్ని ప్రభావితం చేసే ఆర్థికపరమైన విషయాలు నిశితంగా పరిశీలించేవారన్నారు. ఆయన పేరుతో యేటా స్మారకోపన్యాసం ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. నిబద్ధతకు అసలైన గురువు హనుమంతరావు అని పేర్కొన్నారు. అక్రిడిటేషన్ కమిటీలో డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు అందులోనూ మహిళలకు 33 శాతం కోటా ఇచ్చామంటే అది ఆయన స్ఫూర్తితోనే అని, ఆయన మహిళా జర్నలిస్టులకు సొంత ఖర్చుతో అవార్డులు ఇచ్చేవారని గుర్తుచేశారు. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ .. రెండు తరాల జర్నలిస్టులకు ఆదర్శప్రాయుడు హనుమంతరావు అని కొనియాడారు. ప్రభుత్వానికి దూరంగా ఉంటూ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపేవారన్నారు. వర్తమాన పరిణామాల నేపథ్యంలో కథనాలు రాసేవారని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఆర్థిక పోకడలు, వైద్యం, ఆరోగ్యంపై ఎన్నో కథనాలు రాశారని గుర్తుచేసుకున్నారు. సమాజాన్ని అన్ని రకాలుగా పరిశీలించి రాసేవారని, కేవలం అక్షరాన్నే నమ్ముకుని జీవితం గడిపిన వ్యక్తి అని కొనియాడారు. హనుమంతరావును కొత్త జర్నలిస్టులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ .. జర్నలిస్టు సమాజం గురించి మాట్లాడాలంటే ముందుగా హనుమంతరావు గురించే మాట్లాడాలన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుంటే జాతి, సమాజ హితానికి ఎంతో మంచిదన్నారు. ప్రస్తుతం నోట్ల రద్దుతో ఎంతో నిష్ణాతులైన ఆర్థిక నిపుణులు కూడా రెండు పాయలుగా చీలారని, అదే ఆర్థిక పరిస్థితులపై హనుమంతరావు వ్యాసాలు ఎంతో సరళంగా ఉండేవన్నారు. సమాజహితం కోసం పనిచేసిన వ్యక్తి హనుమంతరావు అని పేర్కొన్నారు. సీనియర్ పాత్రికేయుడు మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ .. హనుమంతరావు వర్ధంతి రోజు ప్రెస్‌క్లబ్‌లో సభ నిర్వహించాలని సూచించారు. నవ తెలంగాణ సంపాదకుడు వీరయ్య మాట్లాడుతూ.. పాత్రికేయ విలువలకే కాదు సమాజ విలువలకు కూడా కట్టుబడిన వ్యక్తి హనుమంతరావు అని చెప్పారు. ఆయన చనిపోయే ముందు కూడా నవతెలంగాణలో వ్యాసం రాశారని గుర్తుచేసుకున్నారు. హన్మంతరావు కుమారుడు, సీనియర్ జర్నలిస్టు సతీష్ మాట్లాడుతూ .. నాన్న బతికున్న సమయంలో అంత్యక్రియలు నిర్వహించవద్దని చెప్పేవారని, గాంధీ మెడికల్ కాలేజీకి తన భౌతికకాయాన్ని ఇవ్వాలని కోరేవారని, ఆయన అభిప్రాయాన్ని గౌరవించామన్నారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలిపారు. ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ .. ప్రెస్‌క్లబ్ వ్యవస్థాపక సభ్యుడైన హనుమంతరావు ఆశయాలను ముందు కు తీసుకువెళతామని, ప్రతీ సంవత్సరం ఆయన మెమోరియల్ స్పీచ్‌ను ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హనుమంతరావు అర్ధాంగి సరళ, కొడుకు చలపతిరావు, సతీష్‌బాబు, కోడళ్లు రమ, మాధురి, కూతురు పద్మ, సీనియర్ జర్నలిస్టులు జ్వాలా నర్సింహారావు, తెలకపల్లి రవి, పాశం యాదగిరి, నగేశ్ కుమార్, లక్ష్మి, బండారి శ్రీనివాస్, రాధాకృష్ణ, వేణుగోపాల్, గాయత్రి, రాజమౌళి చారి తదితరులు పాల్గొన్నారు. -
బైక్‌ను ఢీకొన్న లారీ: ఒకరు మృతి
-
పంజాగుట్టలో జ్యువెలరీ కలెక్షన్స్ షో
-
జ్యువెలరీ కలెక్షన్స్ షో
పెళ్లి వేడుకల్లో చిరునవ్వులు ఒలకబోసే వధువుకు తగిన ఆభరణాలు తోడైతే ఆ అందం.. చందమే వేరు. పంజగుట్టలోని మానేపల్లి జ్యువెలరీలో ఏర్పాటు చేసిన బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్స్ షో దీనికి అద్దం పట్టింది. ఈ సందర్భంగా మోడల్స్ గోల్డ్, డైమండ్ కలెక్షన్స్ ప్రదర్శించారు. – సాక్షి, వీకెండ్ ప్రతినిధి -
సత్తా చాటుతున్న ఫ్యాషన్ డిజైన్ విద్యార్థులు
-
లేటెస్ట్ ఫ్యాషన్
సోమాజిగూడ: ఇనాళ్లూ తాము నేర్చుకున్న పాఠాలకు న్యాయం చేశారు ఆ విద్యార్థులు. తమలోని సృజనను వెలికితీసి సరికొత్త శ్రేణి డిజైన్లు సృష్టించారు. పంజాగుట్టలోని హామ్స్టెక్ ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో బుధవారం ‘ హె లేబుల్ ’ పేరుతో సోమాజిగూడ పార్క్‌హోటల్‌లో ప్రత్యేక ప్రదర్శన, అమ్మకాలు నిర్వహించారు. ఔత్సాహిక డిజైనర్లు పాల్గొని తాము రూపొందించిన దుస్తులు ప్రదర్శించారు. కళాశాల ఎమ్డీ అజితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రజాకార్ల పాలన:రాజాసింగ్
పంజగుట్ట: తెలంగాణలో నిజాం కాలంనాటి రజకార్లపాలన కొనసాగుతోందని గోషామహల్ ఎమ్మెల్యే, గోరక్షాదళ్ అధ్యక్షుడు రాజాసింగ్ అన్నారు. పోలీసులు రజ్వీ అనుచరుల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల తో మాట్లాడుతూ ... ప్రభుత్వం పోలీస్ బందోబస్తు మధ్య ఆవులను కసాయి వారికి అప్పగిస్తుందన్నారు. సోమవారం మైలార్‌దేవుల పల్లి ప్రాంతంలో ఆవులను అక్రమ రవాణా చేస్తుండగా గోరక్షాదళ్ కార్యకర్తలు అడ్డుకుని పోలీసులకు అప్పగించగా, వారు సత్యం శివం సుందరం గోశాలకు వాటిని అప్పగించినట్లు తెలిపారు. అయితే గోషాల వద్ద ఎంఐఎం కార్యకర్తలు గొడవ చేయడంతో పోలీసులు బందోబస్తు మధ్య ఆవులను కబేళాలలకు తరలించడం దారుణమన్నారు. ఏటా బక్రీద్ ముందు ప్రభుత్వం చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఆవుల అక్రమ రవాణాను అడ్డుకునేదని, అయితే ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి తనిఖీలు నిర్వహించడంలేదని ఆరోపించారు. బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్, సంఘ్, గోరక్షాదళ్ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి బెదిరిస్తున్నారన్నారు. ఎవరైనా ఆవులను బలిచేస్తే ఊరుకునేది లేదని భవిష్యత్ పరిణామాలకు ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి, నగర కమిషనర్లకు లేఖలు రాసినట్లు తెలిపారు. -
11 గిన్నిస్ రికార్డుల వీరుడు
పంజగుట్ట: గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించడమంటే మాటలు కాదు.. కఠోర శ్రమ చేస్తే కానీ సాధ్యం కాదు. అలాంటిది ఏకంగా 11 గిన్నిస్ రికార్డులు సృష్టించడమంటే ఎందరికో సాధ్యం కాదు. తైక్వాండోలో ఆయన రికార్డులను బద్దలు కొట్టాలంటే ఇక అసాధ్యం అనేలా చేశారు నగరానికి చెందిన జేఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు జయంత్‌రెడ్డి. అతను అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించారు. ఇతడి వద్ద ఇప్పటివరకు దాదాపు ఐదు లక్షల మంది శిక్షణ పొందారు. ఆయన శిషు్యలు కూడా ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఇతని శిషు్యడు కొండా సహదేవ్ ఇప్పటికే పలు గిన్నిస్ రికార్డులు సాధించాడు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన శిషు్యలు జయంత్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏషియన్ గేమ్స్, ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధించాలన్నదే తన లక్ష్యమన్నారు. ఇటీవలే 55 సంవత్సరాల వయస్సులో ఎడమ చేతితో ఒక్క నిమిషంలో 352 పంచ్‌లు కొట్టి గిన్నిస్ రికార్డు అందుకున్నట్లు తెలిపారు. త్వరలోనే తైక్వాండో ఫెడరేషన్ స్థాపించి వచ్చే ఒలంపిక్స్‌లో తైక్వాండో 8 కేటగిరీల్లో అన్నింటిలోనూ పతకాలు సాధించేలా కృషి చేస్తానని వెల్లడించారు. -
డ్రంకన్ డ్రైవ్‌లో ఏడుగురి అరెస్ట్
-వాహనాలు స్వాధీనం పంజాగుట్ట: నగరంలోని పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్థరాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. పంజాగుట్ట ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలు జరిగాయి. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చి శనివారం న్యాయస్థానంలో హాజరుపరుస్తామని సీఐ చెప్పారు. -
రిక్షాలో దర్జాగా తిరిగేవాళ్లం..
జ్ఞాపకం గొల్లపూడి మారుతీరావు.. పరిచయం అక్కరలేని ప్రముఖ రచయిత, గొప్ప నటుడు. కాలమిస్టు. భాగ్యనగరంతో ఆయనది 64 ఏళ్ల బంధం. ఇక్కడ జరిగిన ప్రతి మార్పును దగ్గర నుంచి చూసిన వ్యక్తి. ఆ జ్ఞాపకాల దొంతరలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. - సాక్షి, సిటీబ్యూరో ‘విసిరేసినట్లు జనం..! విపరీత చలి.. సాయంత్రమైతే నక్కల అరుపులు.. దాదాపు 40 ఏళ్ల క్రితం వరకు హైదరాబాద్ ఓ పల్లె వాతావరణాన్ని తలపించేది. ఇప్పుడు మహానగరంగా మారిపోయింది. 1952లో నాకు 12 ఏళ్ల వయసులో తొలిసారి హైదరాబాద్ వచ్చాను. పంజగుట్టలో నా బాల్య స్నేహితుల ఇళ్లు ఉండేది. అక్కడకు వచ్చేవాడిని. అప్పుడు బిక్కు బిక్కు మనేలాంటి పరిస్థితి. అక్కడక్కడ విసిరేసినట్టుగా జనం కన్పించేవారు. మడతలో కూర్చొని ప్రయాణించే రిక్షాలు రవాణా సాధనాలు. అప్పుడు లక్డీకాపూల్ చిన్న సెంటర్లా ఉండేది. తర్వాత ఖైరతాబాద్ ఉన్నట్టు లేనట్టు కన్పించేది. ఖైరతాబాద్‌కు ఎడమవైపు పెద్ద పెద్ద గుట్టలు దర్శనమిచ్చేవి. పంజగుట్ట ఎత్తు భాగంలోని ప్రస్తుత శ్రీనగర్ కాలనీ రోడ్డులో మా మిత్రుని ఇల్లు చివరగా ఉండేది. ఆ తర్వాత ఎటు చూసినా ఖాళీ ప్రదేశమే. అమీర్‌పేట, మైత్రీవనం, భరత్ నగర్ ఇవేమీ అప్పటికి లేవు. అక్కడక్కడ చిన్నచిన్న పల్లెలు మాత్రమే ఉండేవి. సాయంత్రం 4 దాటిందంటే నక్కల అరుపులు విపరీతంగా వినిపించేవి. కొత్తవాళ్లు జడుసుకునే వారు. ఇప్పటి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు లేవు. ఆ ప్రాంతమంతా కొండలే. పక్షుల కిలకిల రావాలు వినసొంపుగా వినిపించేవి. పిచ్చుకలు, గువ్వల సవ్వడులు ప్రతిధ్వనించేవి. 40 ఏళ్ల తర్వాత.. సుమారు 40 ఏళ్ల క్రితం మద్రాసు నుంచి అక్కినేని నాగేశ్వరరావు వచ్చి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో నిర్మించారు. అప్పటికి బంజారాహిల్స్‌కు కొంత రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఉదయం, సాయంత్రం విపరీతమైన చలి ఉండేది. పంజగుట్ట నుంచి ఇప్పటి బంజారాహిల్స్, అమీర్‌పేట, హుస్సేన్‌సాగర్ వైపు చూస్తే పచ్చని పొలాలతో చూడచక్కని నిర్మానుష్య ప్రాంతం. కార్లు ఎక్కడా కనిపించేవి కావు. దూరప్రాంతాలకు రిక్షాలే దిక్కు. వాటిలో దర్జాగా కాలుమీద కాలు వేసుకొని కూర్చొని ప్రయాణించే అమరిక ఉండేది. రిక్షాలు చాలా పొడవుగా ఉండేవి. పబ్లిక్‌గార్డెన్ ఒక ఆకు పచ్చని మహావనం. ఇప్పటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాలను తలపించే వాతావరణం హైదరాబాద్ సొంతం. చల్లటి, సుందర, ప్రశాంత నగరం మన హైదరాబాద్. ఎంత మధురంగా ఉండేదో వర్ణించలేను. ఆ వాతావరణాన్ని మళ్లీమళ్లీ ఆస్వాదిద్దామా! అన్నట్టు మనసు పులకించేది. ఆ చల్లటి వాతావరణం గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా మనసు పులకిస్తుంది. ఇప్పుడు ఆ పచ్చదనం పోయి జనం మహావృక్షంలా పెరిగిపోయారు. నగరం మెట్రో స్థాయికి చేరింది’. -
ఖైరతాబాద్-పంజాగుట్ట: బస్సుల మళ్లింపు
హైదరాబాద్: మెట్రోరైలు నిర్మాణ పనుల దృష్ట్యా పంజాగుట్ట - ఖైరతాబాద్ మార్గంలో ఆర్టీసీ బస్సులను దారి మళ్లించనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ పురుషోత్తమ్ నాయక్ సోమవారం వివరాలను వెల్లడించారు. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే కొన్ని బస్సులను రాజ్‌భవన్, యశోద హాస్పిటల్, సోమాజీగూడ క్రాస్‌రోడ్స్, పంజాగుట్ట క్రాస్‌రోడ్స్ మీదుగా అమీర్‌పేట వైపు మళ్లిస్తారు. మరికొన్ని బస్సులను ఖైరతాబాద్, ఆర్టీఏ కార్యాలయం, తాజ్‌బంజారా, జీవీకే మాల్, నిమ్స్ వెనుక గేట్, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట క్రాస్‌రోడ్స్ మీదుగా అమీర్‌పేట వైపు మళ్లించనున్నట్టు తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి 25 వరకు ఈ మార్పులు అమల్లో ఉంటాయని.. ప్రయాణీకులు సహకరించాలని కోరారు. -
సెక్యూరిటీ గార్డు గన్ను.. దోచుకెళ్ళాడిలా..!
-
అర్జున్-విజయ్ జోడికి టైటిల్
పంజగుట్ట, న్యూస్‌లైన్: ఇంటర్ క్లబ్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జున్-విజయ్ జంట టైటిల్ సాధించింది. ఇక్కడి ఆనంద్‌నగర్ కాలనీలో ఆవా ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో డాక్టర్ అర్జున్-విజయ్ ద్వయం వరుస సెట్లలో డాక్టర్ సతీశ్-వేణు జంటపై నెగ్గింది. అర్జున్ జోడి 6-1, 6-1తో ప్రత్యర్థి జంటపై అలవోక విజయంతో టైటిల్ ఎగరేసుకుపోయింది. టెన్నిస్ శిక్షకులు శ్రీనాథ్, మహేష్‌లు విజేతలకు బహుమతులను అందజేశారు. ప్రతి ఏటా టోర్నీలను నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, పలువురు స్పాన్సర్షిప్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని క్లబ్ కార్యదర్శి భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెటరన్ క్రీడాకారులు హనుమంతరావు, డా.సాహు, కరుణాకర్, ఆశిష్, కమల్, ఫణి, కోచ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
8న అమెరికన్ ఫుట్‌బాల్ పోటీలు
పంజాగుట్ట, న్యూస్‌లైన్ : ది ఎలైట్ ఫుట్‌బాల్ లీగ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 8న గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో అమెరికన్ ఫుట్‌బాల్ పోటీలు జరుగనున్నాయి. మొత్తం ఆరు జట్లు పాల్గొంటుండగా హైదరాబాద్ స్కైకింగ్స్ జట్టు ముంబై గ్లాడియేటర్ జట్టుతో... ఢిల్లీ డిఫెండర్స్, బెంగుళూరు వార్హావ్క్స్తో... కోల్‌కతా వైపర్స్, పుణే మారథాన్ మధ్య పోటీలు జరుగనున్నాయని పేర్కొన్నారు. ప్రతీ మ్యాచ్ గంట పాటు కొనసాగుతుందని, ఏసీబీ డెరైక్టర్ ఏకే ఖాన్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నట్టు హైదరాబాద్ స్కైకింగ్స్ జట్టు ప్రధాన కార్యదర్శి కార్తీక్, హెడ్ కోచ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ పోటీలకు మీడియా భాగస్వామిగా సాక్షి వ్యవహరించడం సంతోషకరమని అన్నారు. -
17 నుంచి బేస్‌బాల్ ప్రీమియర్ లీగ్
పంజగుట్ట, న్యూస్‌లైన్: వరుసగా రెండో ఏడాది బేస్‌బాల్ ప్రీమియర్ లీగ్‌కు రంగం సిద్ధమైంది. గత ఏడాది విజయవంతంగా జరిగిన ఈ టోర్నీని ఈ నెల 17 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు టోర్నీ వివరాలు వెల్లడించారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగే ఈ పోటీల్లో ఆరు ఫ్రాంచైజీ జట్లు పాల్గొంటున్నాయి. భారత్, కొరియా, నేపాల్‌లకు చెందిన దాదాపు 100 మంది జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు ఇందులో పాల్గొంటున్నారు. ప్రతీ రోజు మూడు సెషన్ల పాటు పోటీలు నిర్వహిస్తారు. ఈ టోర్నీకి ఎస్బీహెచ్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. గత ఏడాది ప్రీమియర్ లీగ్‌కు లభించిన ఆదరణను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది విదేశీ ఆటగాళ్లతో టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ సీవీ ప్రతాప్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బేస్‌బాల్ సంఘం కార్యదర్శి ఎల్.రాజేందర్, సంయుక్త కార్యదర్శి అమిత్ గాడ్సే తదితరులు పాల్గొన్నారు. టోర్నీలో పాల్గొనే జట్లు 1. అపోలో రాకెట్స్, 2. మైలాన్ పైరేట్స్, 3. ఐబీఏ బెంగళూరు, 4. ప్రొ ఫిట్ స్మాషర్స్, 5. సీఈఏ జెయింట్స్, 6. యంగ్‌మెన్ క్లబ్స్