
లేటెస్ట్ ఫ్యాషన్
సోమాజిగూడ: ఇనాళ్లూ తాము నేర్చుకున్న పాఠాలకు న్యాయం చేశారు ఆ విద్యార్థులు. తమలోని సృజనను వెలికితీసి సరికొత్త శ్రేణి డిజైన్లు సృష్టించారు. పంజాగుట్టలోని హామ్స్‌టెక్ ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో బుధవారం ‘ హె లేబుల్ ’ పేరుతో సోమాజిగూడ పార్క్‌హోటల్‌లో ప్రత్యేక ప్రదర్శన, అమ్మకాలు నిర్వహించారు. ఔత్సాహిక డిజైనర్లు పాల్గొని తాము రూపొందించిన దుస్తులు ప్రదర్శించారు. కళాశాల ఎమ్‌డీ అజితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.