cloth exhibition
-
సత్తా చాటుతున్న ఫ్యాషన్ డిజైన్ విద్యార్థులు
-
లేటెస్ట్ ఫ్యాషన్
సోమాజిగూడ: ఇనాళ్లూ తాము నేర్చుకున్న పాఠాలకు న్యాయం చేశారు ఆ విద్యార్థులు. తమలోని సృజనను వెలికితీసి సరికొత్త శ్రేణి డిజైన్లు సృష్టించారు. పంజాగుట్టలోని హామ్స్టెక్ ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో బుధవారం ‘ హె లేబుల్ ’ పేరుతో సోమాజిగూడ పార్క్‌హోటల్‌లో ప్రత్యేక ప్రదర్శన, అమ్మకాలు నిర్వహించారు. ఔత్సాహిక డిజైనర్లు పాల్గొని తాము రూపొందించిన దుస్తులు ప్రదర్శించారు. కళాశాల ఎమ్డీ అజితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పటోలా చీరలు ప్రత్యేకం
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్.1లోని సింఘానియాస్ స్టోర్‌లో పటోలా చీరల ప్రత్యేక ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మోడల్స్ వీటిని మంగళవారం ప్రదర్శించారు. సహజ ఉత్పత్తులతో వీటిని తయారు చేస్తారని స్టోర్ యజమాని శేలేష్ సింఘానియా తెలిపారు. -
మాదాపూర్‌లో చే'నేత'..
మాదాపూర్: ‘సంఘం ది వీవింగ్ జర్నీ’ చేనేత వస్త్రప్రదర్శన మాదాపూర్ ఎన్ కన్వెన్షన్‌లో ఆదివారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు సాగనున్న ఈ ప్రదర్శనను ఎంపీ కవిత ప్రారంభించారు. డీకే ఆరుణ, పురందేశ్వరి ఈ ప్రదర్శనను సందర్శించి ఉత్పత్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి, పింకిరెడ్డి, ఉమారెడ్డి, నాగ సుశీల, రజనీ యార్లగడ్డ, పలువురు డిజైనర్లు పాల్గొన్నారు. -
నగరంలో సునీల్ శెట్టి..
బంజారాహిల్స్: ‘సేవ్ ద చిల్డ్రన్’ పేరుతో తన అత్తగారు విపులా కద్రి 27 ఏళ్ల క్రితం స్థాపించిన స్వచ్ఛంద సంస్థ నిర్వహణలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని సినీనటుడు సునీల్ శెట్టి అన్నారు. తన భార్య మనా శెట్టితో కలిసి బుధవారం తాజ్‌కృష్ణా హోటల్లో ఏర్పాటు చేసిన ‘ఆరాయిష్’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఎగ్జిబిషన్ ద్వారా నిధులు సేకరించి... సంస్థ నిర్వహిస్తున్నామని చెప్పారు. వస్త్రాలు, ఆభరణాలు, పాదరక్షలు తదితర ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మనా శెట్టి మాట్లాడుతూ సామాజిక సేవకు గ్లామర్ రంగాన్ని వినియోగించుకోవడం ఆనందంగా ఉందన్నారు.