నగరంలో సునీల్ శెట్టి..
బంజారాహిల్స్: ‘సేవ్ ద చిల్డ్రన్’ పేరుతో తన అత్తగారు విపులా కద్రి 27 ఏళ్ల క్రితం స్థాపించిన స్వచ్ఛంద సంస్థ నిర్వహణలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని సినీనటుడు సునీల్ శెట్టి అన్నారు. తన భార్య మనా శెట్టితో కలిసి బుధవారం తాజ్‌కృష్ణా హోటల్‌లో ఏర్పాటు చేసిన ‘ఆరాయిష్’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.
ఎగ్జిబిషన్ ద్వారా నిధులు సేకరించి... సంస్థ నిర్వహిస్తున్నామని చెప్పారు. వస్త్రాలు, ఆభరణాలు, పాదరక్షలు తదితర ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మనా శెట్టి మాట్లాడుతూ సామాజిక సేవకు గ్లామర్ రంగాన్ని వినియోగించుకోవడం ఆనందంగా ఉందన్నారు.