Updates..
19: 20PM
తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరీ సభ
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు స్కీంలు ఇవే..
- 1. మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500, రూ. 500లకే మహిళలకు గ్యాస్ పిలిండర్, టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
- 2. రైతుభరోసా కింద రూ. 15 వేల పెట్టబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల సాయం, వరి పంటకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్
- 3. గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్
- 4. గృహ నిర్మాణానికి రూ. 5లక్షల సాయం
- 5. విద్యార్థులకు రూ. 5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్
- 6. వృద్ధులకు నెలకు రూ. 4వేల చొప్పున పెన్షన్, రూ. 10 లక్షల వరకూ రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా
18.02 PM
► తుక్కుగూడలో జరుగుతున్న విజయ భేరీ సభ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. సభాప్రాంగణానికి కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు ఖర్గే చేరుకున్నారు.
►తాజ్‌కృష్ణలో రెండో రోజు సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
► సోనియా గాంధీ ప్రకటించబోయే 6 గ్యారెంటీ స్కీంలు ఇవే..
1. రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్.
2. ఏక కాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ.
3. రెండు లక్షల ప్రభుత్వ ఉధ్యోగాల భర్తీ.
4. దలిత, గిరిజనులకు 12 లక్షల ఆర్థిక సహాయం.
5. ఇందిరమ్మ ఇళ్ళకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం.
6. మహిళా సాధికారతకు ప్రత్యేక నిధి.
► కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. పార్టీలో క్రమశిక్షణను పాటించాలి. సొంత పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దు. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించకూడదు. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై రివ్యూ. 5 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల నుంచి నివేదిక. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఏఐసీసీ నేతల ప్రచారంపై త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తాం.
► హోటల్ తాజ్‌కృష్ణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ తరపున జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సీడబ్ల్యూసీ సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేయడం తెలంగాణకు ఎంతో కీలకం. బీఆర్‌ఎస్, ఎంఐఎం బీజేపీకి పరోక్ష మద్దతుదారులు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలపై నిన్న సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించాం. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఇవాళ జరిగే సమావేశంలో చర్చిస్తాం. సాయంత్రం జరిగే విజయభేరిలో సోనియాగాంధీ గ్యారంటీలను ప్రకటిస్తారు. బోయిన్ పల్లి రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్‌కు సభలోనే శంఖుస్థాపన చేస్తారు. తెలంగాణ ఇస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టే.. ఇవాళ విజయభేరిలో ఇవ్వబోయే గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేస్తుంది. అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో పథకాలు అన్నీ అమలు చేసేలా గ్యారెంటీ ఇవ్వబోతున్నాం. సాయంత్రం తుక్కుగూడలో జరిగే విజయభేరి సభకు లక్షలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
► డీకే శివకుమార్ మాట్లాడుతూ.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఈ సమావేశం ఎజెండా. విద్వేష రాజకీయాలను దేశం నుంచి పాలద్రోలడమే కాంగ్రెస్ లక్ష్యం. సరైన ఎజెండా చెప్పకుండా పార్లమెంట్ ప్రత్యేక సోషన్ పెడుతున్నారు.
► కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక.
► నగరంలోని తాజ్‌కృష్ణ వేదికగా కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. రెండో రోజు సమావేశాలు ఆదివారం ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.
► ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు పాల్గొననున్నారు.
► తొలిరోజు సమావేశంలో 14 జాతీయ అంశాలపై తీర్మానం.
► ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా ఆదివారం సాయంత్రం నిర్వహించతలపెట్టిన కాంగ్రెస్ విజయభేరి సభకు సర్వం సిద్ధమైంది. ప్యాబ్‌సిటీ సమీపంలోని వంద ఎకరాల విస్తీర్ణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
► కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సహా యువనేత రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ సహా సీడబ్ల్యూసీ ముఖ్యులు, అన్ని రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు, డీసీసీలు, అనుబంధ సంఘాల నేతలు హాజరు కానున్నారు.
రెయిన్ ఫ్రూప్ టెంట్లు..
భారీ వర్షానికి సైతం నేతలు తడవకుండా ఉండేందుకు రెయిన్ ఫ్రూప్ టెంట్లను వేశారు. నేతల ప్రసంగాలు స్పష్టంగా విన్పించేందుకు సభాస్థలికి నాలుగు వైపులా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేశారు.
►సభా ప్రాంగణం చుట్టూ పెద్ద సంఖ్యలో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు.
►స్వాగత తోరణాలు, భారీ కటౌట్లు, ఫ్లెక్సీల ఏర్పాటులో ఎల్‌బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు పోటీపడ్డారు.
►సీడబ్ల్యూసీ ముఖ్య నేతల కోసం ప్రధాన వేదికను కేటాయించారు. పీసీసీలు, మాజీ మంత్రులు, ఎంపీల కోసం ఒకటి.. డీసీసీలు, అనుబంధ సంఘాల నేతలు, కళాకారుల కోసం మరో స్టేజీని కేటాయించారు.
►ఈ మూడు వేదికలపై సుమారు 250 మంది ఆసీనులు కానున్నారు. సభకు వచ్చే ముఖ్య నేతల వాహనాలను ప్రధాన వేదిక వెనుక భాగంలోనే పార్కింగ్ చేయించనున్నారు.
భారీ బందోబస్తు..
తుక్కుగూడకు వచ్చి వెళ్లే నాలుగు ప్రధాన రహదారులపై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 27 మంది సీఐలు, 61 మంది మంది ఎస్‌ఐలు, 600 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
► ఆదివారం సాయంత్రం 5 గంటలకు తాజ్‌కృష్ణ హోటల్ నుంచి బయలుదేరే ముఖ్య నేతల వాహనాలు శంషాబాద్ నుంచి ఓఆర్‌ఆర్ మీదుగా తుక్కుగూడకు చేరుకుంటాయి. అటు నుంచి ర్యాలీగా ప్రధాన వేదిక వెనుకభాగంలోని ప్యాబ్‌సిటీ నుంచి సభా ప్రాంగణానికి అనుమతించనున్నారు. మిగిలిన వాహనాలను ప్రధాన రహదారి నుంచి అనుమతిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment