
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్టలోని ఓ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాన్‌బాగ్ హోటల్‌లోని ఐదో అంతస్తులో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
కాగా, పుప్పాలగూడ పాషా కాలనీలో నిన్న(శుక్రవారం) సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కిరాణా షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు, దట్టమైన పొగలు చెలరేగాయి. భవనం మొదటి, రెండో అంతస్తులకు వ్యాపించడంతో ఊపిరి ఆడక ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన విషాదాన్ని నింపింది.
స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. పాషా కాలనీ ప్లాట్ నెంబర్ 72లో ఉస్మాన్‌ఖాన్, అతని తమ్ముడు యూసుఫ్ ఖాన్ కుటుంబాలు నివసిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని తన కిరాణా దుకాణంలో ఉస్మాన్ ఖాన్ ఉండగా.. ఆకస్మికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న పార్కింగ్‌లో నిలిపిన రెండు కార్లకు అంటుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment