
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఏసీలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
దీంతో పెను ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆస్పత్రిలోని పేషెంట్లు, బంధువులు భయాందోళనకు గురయ్యారు. మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment