పంజగుట్ట, న్యూస్‌లైన్: ఇంటర్ క్లబ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అర్జున్-విజయ్ జంట టైటిల్ సాధించింది. ఇక్కడి ఆనంద్‌నగర్ కాలనీలో ఆవా ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో డాక్టర్ అర్జున్-విజయ్ ద్వయం వరుస సెట్లలో డాక్టర్ సతీశ్-వేణు జంటపై నెగ్గింది. అర్జున్ జోడి 6-1, 6-1తో ప్రత్యర్థి జంటపై అలవోక విజయంతో టైటిల్ ఎగరేసుకుపోయింది.
టెన్నిస్ శిక్షకులు శ్రీనాథ్, మహేష్‌లు విజేతలకు బహుమతులను అందజేశారు. ప్రతి ఏటా టోర్నీలను నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, పలువురు స్పాన్సర్‌షిప్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని క్లబ్ కార్యదర్శి భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెటరన్ క్రీడాకారులు హనుమంతరావు, డా.సాహు, కరుణాకర్, ఆశిష్, కమల్, ఫణి, కోచ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
అర్జున్-విజయ్ జోడికి టైటిల్
Published Mon, Feb 24 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM
Advertisement
Advertisement