
రోడ్డుపై సిగరెట్ తాగుతున్న వారికి చలానా విధిస్తున్న అధికారులు
పంజగుట్ట: పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో పలుప్రాంతాల్లో రోడ్లపై సిగరెట్ తాగుతున్న, గుట్కాలు నములుతున్న, విక్రయిస్తున్న 22 మంది వ్యక్తులకు అధికారులు జరిమానా విధించారు. తెలంగాణ టోబాకో టెక్నికల్ ఆఫీసర్ ఎస్.నాగరాజు, మాస్ మీడియా ఆఫీసర్ జే.రాములు, డాక్టర్ అనూషాలతో పాటు కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ అఫైర్స్ డిప్యుటీ డైరెక్టర్ డాక్టర్ రాణా, టెక్నికల్ డైరెక్టర్ గోవింద్ త్రిపాఠి బుధవారం పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాన్‌షాప్‌లు, బార్లు, రోడ్లపై బహిరంగంగా సిగరెట్ తాగుతున్న వారిని గుర్తించి జరిమానా విధించారు.
22 కేసులు నమోదు చేయగా వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. పాఠశాలకు 100 గజాల దూరం వరకు పాన్‌షాప్ ఉండరాదని నిబంధనలు అతిక్రమిస్తే చర్య లు తప్పవన్నారు. బార్‌లలో ఆల్కహాల్ తాగేందు కు మాత్రమే అనుమతి ఉందని, సిగరెట్ నిషేధమన్నారు. పలు బార్‌లలో తనిఖీలు చేసి నో స్మోకింగ్ బోర్డులు లేకపోవడం, సిగరెట్ తాగినట్లు ఆనవా లు కనిపించడంతో బార్ నిర్వాహకులకు కూడా ఫైన్ వేశారు. తెలంగాణలో నికోలిన్ నిషేధం విధించినా పలు పాన్‌షాప్‌లలో పాన్‌మసాలా, నికోలిన్ వేర్వురుగా విక్రయిస్తున్నట్లు గుర్తించి వారికి జరిమానా విధించడమేగాక కేసులు నమోదు చేశామన్నారు. ఆరుగురు గుట్కా తినేవారిని గుర్తించగా అందులో ఐదుగురు వ్యక్తులకు క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించామన్నారు. ముగ్గురు మూడో స్టేజ్‌లో, ఇద్దరు రెండవ స్టేజ్‌లో ఉన్నట్లు తెలిపారు. వారికి కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. చైన్ స్మొకర్లు, గుట్కాలు తినేవారిని టొబాకో స్ట్రేష్టేషన్ సెంటర్‌లో చేర్చుకుని వాటిని మానుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment