Challan
-
బ్యాంకులో కుప్పకూలిన న్యాయవాది
కంటోన్మెంట్(హైదరాబాద్): కోర్టు చలాన్ డబ్బులు జమ చేసే నిమిత్తం బ్యాంకుకు వచ్చిన ఓ న్యాయవాది బ్యాంకులోనే కుప్పకూలి మరణించిన ఘటన మారేడుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకలో ఉంటున్న న్యాయవాది వెంకటరమణ (58) సికింద్రాబాద్ కోర్టులో కేసులు వాదిస్తుంటారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మారేడుపల్లి కొండారెడ్డి స్ట్రీట్‌లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు ఆయన వెళ్లారు. బ్యాంకు చలాన్ రిసీట్ తీసుకుంటూనే ఫ్లోర్‌పై కుప్పకూలడంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు వెంకటరమణకు సీపీఆర్ చేసేందుకు యతి్నంచినా ఫలితం లేకపోయింది. వెంకటరమణ మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద కుమార్తె అమెరికాలో ఉండగా, చిన్న కుమార్తె తల్లిదండ్రులతోనే ఉంటోంది. ఇటీవలే చిన్న కూతురు పెళ్లి నిశ్చయమైనట్లు సమాచారం. తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే బ్యాంకుకు చేరుకున్న వెంకటరమణ కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కదిలించింది. మారేడుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘అమ్మా బంగారు తల్లీ.. కారులో అలా చేయొద్దమ్మా!’
వైరల్: కరోనా టైం నుంచి వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు ప్రపంచం అలవాటు పడిపోయింది. ఒకానోక టైంకి వచ్చేసరికి.. ఈ తరహా పని తీరు ఉద్యోగుల మానసిక స్థితిపైనా ప్రభావం చూపెట్టడం మొదలుపెట్టింది. అయితే పరిస్థితులు మారుతున్నా కొద్దీ క్రమక్రమంగా కంపెనీలు హైబ్రీడ్ విధానానికి వాళ్లను అలవాటు చేశాయి. ఈ క్రమంలో.. అటు ఆఫీస్.. ఇటు ఇల్లు కాని పరిస్థితుల్లో ఉద్యోగులు నలిగిపోతుండడం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఎక్కడపడితే అక్కడ తమ లాప్‌ట్యాప్‌లతో వర్క్ చేస్తున్న దృశ్యాలు తరచూ వైరల్ అవుతున్నాయి. అయితే ఇలాంటి చేష్టలకు దిగిన బెంగళూరు మహిళా టెకీకి పోలీసులు సర్ప్రైజ్ ఇచ్చారు. బెంగళూరులోని ఆర్టీ నగర్ ప్రాంతంలో కారులో వెళ్తూ ఓ మహిళా టెకీ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసింది. అదే సమయంలో డ్రైవింగ్ కూడా చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఇది బెంగళూరు పోలీసుల దృష్టికి చేరడంతో.. వాళ్లకు చర్యలకు ఉపక్రమించారు. ఓవర్ స్పీడింగ్, డ్రైవింగ్‌లో అలసత్వంగా ఆమె చర్యను గుర్తించి రూ.వెయ్యి ఫైన్ విధించారు. వర్క్‌ఫ్రమ్ ‘హోమ్’.. కారులో కాదమ్మా! అంటూ.. జరిమానా నోటీసు అందిస్తూ.. ఎక్స్‌లో బెంగళూరు నార్త్ ట్రాఫిక్ డీసీపీ పోస్ట్ చేశారు."work from home not from car while driving" pic.twitter.com/QhTDoaw83R— DCP Traffic North, Bengaluru (@DCPTrNorthBCP) February 12, 2025 -
ఆర్టీసీ ‘చలాన్’ బకాయి రూ.కోటి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలో ప్రైవేట్ వాహనాలతో ఆర్టీసీ బస్సులు పోటీ పడుతున్నాయి. టీజీఎస్ఆర్టీసీ బస్సులపై ఏటా ట్రాఫిక్ పోలీసులు వేల సంఖ్యలో ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. 2022 నుంచి గత నెల 27 వరకు ఆర్టీసీ బస్సులకు 25,609 ఈ–చలాన్లు జారీ చేశారు. వీటికి సంబంధించి ఆర్టీసీ రూ.కోటికి పైగా చెల్లించాల్సి ఉంది. స్వచ్ఛంద సంస్థ యుగాంతర్ ఫౌండేషన్‌కు చెందిన యూఆర్టీఐ సంస్థ సమాచార హక్కు చట్టం కింద ట్రాఫిక్ పోలీసు విభాగం నుంచి ఈ సమాచారం సేకరించింది. ప్రయాణీకుల కోసమే ఉల్లంఘనలు..ఆర్టీసీ బస్సుల ట్రాఫిక్ ఉల్లంఘనల్లో ఎక్కువగా ప్రయాణికుల కోసం చేస్తున్న పొరపాట్లే ఉంటున్నాయి. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ బస్సులు ఆపడం, బస్‌బేలను పట్టించుకోకపోవడం, స్టాప్‌లైన్ క్రాసింగ్, ఫ్రీ లెఫ్ట్ వయలేషన్ వంటి ఉల్లంఘనలపై పోలీసులు అధికంగా చలాన్లు విధిస్తున్నారు. కొందరు ప్రయాణికులు ఎక్కడపడితే అక్కడ బస్సులను ఆపాలని కోరుతున్నారు.]సంస్థ ఆదాయం గురించి ఆలోచిస్తున్న డ్రైవర్లు.. చెయ్యెత్తిన చోట బస్సులు ఆపుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. బస్ స్టాపుల్లో ఆటోలు తిష్టవేస్తుండటంతో బస్సులు రోడ్ల పైనే ఆగాల్సి వస్తోంది. కాగా, ట్రాఫిక్ జరిమానాలను చెల్లించడంలో ఆర్టీసీ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ప్రైవేటు వాహనాల మాదిరిగా ట్రాఫిక్ పోలీసులు ఆర్టీసీ బస్సులపై కఠిన చర్యలు తీసుకోకపోవటంతో చలాన్లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. -
న్యూఇయర్ వేళ.. 18 వేల ట్రాఫిక్ ఉల్లంఘనలు.. ఎక్కడంటే?
ముంబై : న్యూఇయర్ వేడుకల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు భారీ మొత్తంలో నమోదైనట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. దేశంలో అత్యధికంగా ముంబైలో ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినట్లు తెలుస్తోంది. ఫలితంగా మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లలో వాహనదారుల నుంచి రూ.89లక్షల ఫైన్ల రూపంలో వసూలు చేశారు. ముంబై పోలీసుల సమాచారం మేరకు..న్యూఇయర్‌లో మొత్తం 17,800 ఇ-చలాన్లను జారీ చేశారు. అందులో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 2,893 కేసులు, హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వ్యక్తులపై 1,923 కేసులు, ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్ చేసిన 1,731 కేసులు, ప్రజా రవాణాకు అర్హతలేని వాహనాల్ని డ్రైవ్ చేసినందుకు 1,976 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు నగరంలో మితిమీరిన వేగానికి 842 చలాన్, సీటు బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడంపై 432 చలాన్లు వేసినట్లు పోలీసులు వెల్లడించారు. న్యూఇయర్ సందర్భంగా మద్యం తాగి డ్రైవ్ చేసిన వారికి 153 చలాన్లు, డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడినందుకు 109 చలాన్లు, ట్రిపుల్ రైడింగ్ 123 చలాన్లను, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసినందుకు 40 చలాన్లు విధించారు. అలా మొత్తంగా విధించిన చలాన్లతో రూ.89,19,750 వసూలు చేసినట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు. మీడియా కథనాల ప్రకారం 2025 నూతన సంవత్సర వేడుకల్లో ఎనిమిది మంది అదనపు కమిషనర్లు, 29 మంది డిప్యూటీ కమిషనర్లు, 53 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 2184 మంది ఇన్స్పెక్టర్లు, 12,000 మందికి పైగా కానిస్టేబుళ్లు ముంబై వీధుల్లో విధులు నిర్వహించారు. -
కొత్త బండి మోజు తీరకుండానే చలాన్ల మోత.. ఎందుకో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: కొత్త బండి మోజు తీరకుండానే చలాన్లు మోత మోగిస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదవుతున్నాయి. ఆర్సీలు లేకుండా నడుపుతూ అడ్డంగా బుక్ అవుతున్నారు. నిజానికి తప్పిదం తమది కాకపోయినా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ఆర్టీఏ కార్యాలయాల నుంచి వాహనదారులకు సకాలంలో ఆర్సీ స్మార్ట్‌కార్డులు అందకపోడం వల్ల ఈ పరిస్థితి నెలకొంటోంది. కొత్త బండి కొనుగోలు చేసిన సంతోషం క్షణాల్లో ఆవిరవుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీఏలో వాహనం నమోదైన వారం, పది రోజుల్లోనే స్మార్ట్‌కార్డు ఇంటికి చేరాల్సి ఉండగా, అందుకు విరుద్దంగా నెలలు గడిచినా కార్డులు రావడం లేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణాశాఖలో స్మార్ట్‌కార్డుల కొరత వల్లనే ఈ జాప్యం చోటుచేసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. స్మార్ట్‌కార్డుల నాణ్యత పెంచేందుకు ఇటీవల పాత కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు. కానీ దాని స్థానంలో కొత్త కాంట్రాక్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం వల్ల రవాణాశాఖకు స్మార్ట్‌కార్డుల మెటీరియల్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో కొన్ని చోట్ల స్మార్ట్ కార్డులు అందుబాటులో ఉన్నప్పటికీ మరికొన్ని ఆర్టీఏ కేంద్రాల్లో కొరత ఏర్పడింది. ఇది వాహనదారులకు ఆర్థిక భారంగా మారింది. గ్రేటర్లో వేలల్లో డిమాండ్గ్రేటర్ హైదరాబాద్‌లోని 10 ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతిరోజూ సుమారు 2,500 వాహనాలు కొత్తగా నమోదవుతాయి. అలాగే బ్యాంకు ఈఎంఐలు చెల్లించిన అనంతరం స్మార్ట్‌కార్డుల్లో హైపతికేషన్ రద్దు కోసం వచ్చే వాహనదారులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. దీంతో తెలంగాణలోని ఇతర ప్రాంతాలకంటే హైదరాబాద్‌లో డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఆర్సీల కోసం ముద్రించే స్మార్ట్‌కార్డులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రెండు కేటగిరీల్లో కనీసం రోజుకు 5,000 కార్డులను ప్రింట్ చేసి స్పీడ్ పోస్టు ద్వారా వాహనదారులకు చేరవేయాల్సి ఉంటుంది. ఒక్కో కార్యాలయం నుంచి సుమారు 500 కార్డులకు డిమాండ్ ఉంటుంది. కానీ ఇందుకు తగిన విధంగా కార్డుల మెటీరియల్ లేకపోవడం వల్ల కొరత తలెత్తుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షకుపైగా కార్డుల కొరత ఉండగా, సెప్టెంబర్ నాటికి 40 వేలకు పైగా అందజేసినట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరికొద్ది రోజుల్లో కొత్త కార్డుల సరఫరాకు ఒప్పందం ఏర్పడనుందని, ఆ తర్వాత పూర్తిస్థాయిలో కార్డులను జారీ చేస్తామని తెలిపారు. కానీ ప్రస్తుతం నెలకొన్న జాప్యం వల్ల వాహనదారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ‘హైపతికేషన్ కాన్సిల్ చేసుకొని నెల దాటింది. కానీ ఇప్పటి వరకు కార్డు రాలేదు. బండి బయటకు తీయాలంటే భయమేస్తోంది..’ అని తుర్కయంజాల్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ అనే వాహనదారుడు విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటికే చలాన్ల పేరిట రూ.300 చెల్లించినట్లు చెప్పారు. మరోవైపు స్మార్ట్‌కార్డుల కోసం ఆర్టీఏ చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తుందని, గంటల తరబడి పడిగాపులు కాసినా అధికారులు స్పందించడం లేదని చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఓ వాహనదారుడు ఆందోళన వ్యక్తం చేశారు.ఒక్కో కార్డు రూ.685డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల కోసం ఆర్టీఏకు ఆన్లైన్లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్సుల కేటగిరీ మేరకు రూ.685 నుంచి రూ.1500 వరకు ఖర్చవుతుంది. ఆర్సీలకు మాత్రం రూ.685 వరకు చెల్లించాలి. ఇందులో సర్వీస్ చార్జీల రూపంలో రూ.400, స్మార్ట్‌కార్డుకు రూ.250 చొప్పున చెల్లించాలి. మరో రూ.35 స్పీడ్‌పోస్ట్ చార్జీలు చెల్లించాలి. ఇలా అన్ని చార్జీలు కలిపి ముందే చెల్లించినా నెలల తరబడి పడిగాపులు కాయాల్సి రావడం గమనార్హం. చదవండి: ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలపై వేటుసారథి వస్తే ఆన్లైన్లోనే.. మరోవైపు తరచూ కార్డుల జారీలో నెలకొంటున్న జాప్యం, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఆధార్ తరహా ఆన్లైన్లోనే డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలను డౌన్లోడ్ చేసుకొనే సదుపాయాన్ని అధికారులు సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న సారథి సాంకేతిక వ్యవస్థ పూర్తిస్థాయిలో అమలైతే ఈ సేవా కేంద్రాల నుంచే స్మార్ట్ కార్డులను అందజేసే అవకాశం ఉంటుందని ఒక అధికారి చెప్పారు. ఇందుకు మరి కొంత సమయం పట్టవచ్చు. -
కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు చలాన్ జారీ
పట్నా: కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌కు చలాన్ జారీ అయింది. మితిమీరిన వేగంతో ఆయన కారు వెళ్లినందుకు బీహార్‌లోని ఓ టోల్ ప్లాజా వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఈ-డిటెక్షన్ సిస్టం చలాన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి పాశ్వాన్ నేషనల్ హైవేపై హాజీపూర్ నుంచి చంపారన్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు.మరోవైపు.. బిహార్ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్, ట్రాఫిక్ పోలీసులు ఇప్పటివరకు కొత్త ఈ డిటెక్షన్ సిస్టం ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగఘించిన 16,700 మందికి ఈ-చలాన్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ చలాన్ల విలువ సుమారుగా రూ. 9.49కోట్ల ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొత్తగా తీసుకువచ్చిన ఈ డిటెక్షన్ సిస్టంను మోటార్ వాహన చట్టం కింద రాష్ట్రంలోని 13 టోల్ ప్లాజాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ-డిటెక్షన్ సిస్టం వాహనాలను చెక్ చేస్తూ.. సరైన పత్రాలు లేనట్లైతే ఆటోమేటిక్‌గా చలాన్ జారీ అవుతుందని అధికారులు పేర్కొన్నారు. -
బాప్రే.. పార్కింగ్ జరిమానా రూ.11 లక్షలా?
లండన్: మూడేళ్ల నుంచి నిత్యం తాను పార్కింగ్ చోటే కదా అనుకుంది. ఎప్పటిలాగే ఆరోజూ తన వాహనాన్ని నిలిపింది. తీరా చూస్తే అధికారులు.. కొత్త రూల్ పేరుతో ఆమెకు పెద్ద షాకిచ్చారు. వాళ్లు పంపిన జరిమానా చూసి ఆమె కళ్లు బయర్లు కమ్మాయి. యూకేలోని కౌంటీ దుర్హంలో హెన్నా రాబిన్సన్కు చేదు అనుభవం ఎదురైంది. ఫీథమ్స్ లీజర్ సెంటర్లో ఐదు నిమిషాల పార్కింగ్ రూల్ కారణంగా.. ఆమె 11 వేల పౌండ్లు(మన కరెన్సీలో రూ.11 లక్షలు) చెల్లించుకోవాల్సి వచ్చింది. అయితే పర్మిట్ కోసం తాను డబ్బులు చెల్లించినప్పటికీ.. ఈ జరిమానాను అందుకోవాల్సి వచ్చిందని ఆమె వాపోతున్నారు. 2021 నుంచి ఆమె ఆ పార్కింగ్ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే కొత్త రూల్ అమలయ్యాక.. అప్పటి నుంచి ఆమె కారు కదలికలను అధికారులు లెక్కేశారు. అలా మొత్తం 67 చలాన్లకు.. ఒక్కో చలాన్‌కు 170 పౌండ్లు(1,800రూ.) చొప్పున ఇప్పుడు జరిమానా విధించారు. యూకేలో ఎక్సెల్ పార్కింగ్ సర్వీసెస్(EPS) తాజాగా ఈ ఐదు నిమిషాల నిబంధనను అమల్లోకి తెచ్చింది. కొందరు డ్రైవర్లు పార్కింగ్ ఏరియాల దగ్గర ఉత్తపుణ్యానికి వెయిట్ చేయడం, డబ్బులు చెల్లించకుండా కార్ పార్కింగ్‌లను పికప్ ఏరియాలుగా ఉపయోగించుకుంటుండడంతోనే ఈ రూల్‌ను తేవాల్సి వచ్చిందని ఈపీఎస్ చెబుతోంది. ఐదు నిమిషాల రూల్ ప్రకారం.. కార్క్ పార్కింగ్ దగ్గర ఏర్పాటు చేసే ఏఎన్పీఆర్ కెమెరాలు ఎంట్రీని, ఎగ్జిట్‌ను రికార్డు చేసి.. ఛలానాను జనరేట్ చేస్తాయి. అయితే.. కస్టమర్స్ అక్కడికి చేరుకున్న ఐదు నిమిషాల్లోపే టికెట్ కొనాల్సి ఉంటుంది. కానీ, కార్ పార్క్ వద్ద ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో ట్రాన్జాక్షన్స్ తాను చేయలేకపోయానని హెన్నా రాబిన్సన్ చెబుతోంది. ఆమె మాత్రమే కాదు.. ఇలా పార్కింగ్ వద్ద ఐదు నిమిషాల నిబంధన కారణంగా తామూ చలాన్లు అందుకున్నామంటూ పలువురు వాపోతున్నారు ఇప్పుడు. -
విదేశీయుని వద్ద రూ.5000 చలానా వసూలు చేసిన పోలీసు.. రిసిప్ట్ ఇవ్వకుండానే..
ఢిల్లీ: ఢిల్లీలో అక్రమంగా ట్రాఫిక్ చలానా వసూలు చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కొరియా దేశస్థుని వద్ద కానిస్టేబుల్ రిసిప్ట్ ఇవ్వకుండానే రూ. 5000 చలానా వసూలు చేశాడు. నెలక్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. కానిస్టేబుల్ మహేష్ చంద్.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కొరియా దేశస్థునికి రూ.5000 జరిమానా విధించినట్లు చెప్పారు. కానీ విదేశీయుడు రూ.500 ఇచ్చాడు. తను అడిగిన డబ్బు రూ. 500 కాదని, రూ. 5000 అని చెప్పి కానిస్టేబుల్ మళ్లి అడిగాడు. చేసేది లేక విదేశీయుడు కానిస్టేబుల్‌కు మిగిలిన డబ్బును ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇద్దరు హ్యాండ్స్ షేక్ చేసుకుని వెళ్లిపోతారు. కానీ జరిమానాకు సంబంధించిన పత్రాన్ని ఆ బాధిత విదేశీయునికి కానిస్టేబుల్ ఇవ్వలేదు. Video: Delhi Cop Fines Korean Man ₹5,000 Without Receipt, Suspended https://t.co/EaheIf2LvI pic.twitter.com/bX5lLND7vM — NDTV (@ndtv) July 23, 2023 ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సదరు పోలీసు కానిస్టేబుల్‌ను విధుల నుంచి తప్పించారు. సంబంధిత వీడియోపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. జరిమానాకు సంబంధించిన పత్రాన్ని ఇచ్చేలోపే ఆ విదేశీయుడు వెళ్లిపోయినట్లు కానిస్టేబుల్ చెబుతున్నాడు. ఇదీ చదవండి: సినిమా రేంజ్లో.. దంపతుల పక్కా స్కెచ్.. టమాటా లారీ హైజాక్.. -
రూ .231 కోట్లు కొట్టేశారు!
సాక్షి, హైదరాబాద్/బోధన్: బోధన్ నకిలీ చలాన్ల కుంభకోణం కేసులో ఎట్టకేలకు చార్జి షీట్ దాఖలైంది. 2017 నుంచి ఆరేళ్ల పాటు సుదీర్ఘంగా దర్యాప్తు చేసిన తెలంగాణ సీఐడీ అధికారులు ఇటీవల కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్ వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 34 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో 22 మంది వాణిజ్య పన్నుల విభాగానికి చెందిన అధికారులే.మొత్తం 123 మంది సాక్షులను విచారించినట్టు చార్జిషీట్లో పేర్కొన్నారు. 68 రకాల సాఫ్ట్వేర్ మెటీరియల్‌తో పాటు 143 డాక్యుమెంట్లు, మూడు ఆడిట్ రిపోర్ట్‌లను సాక్ష్యాలుగా కోర్టుకు సమరి్పంచారు. ఈ కుంభకోణంలో నిందితులు మొత్తం రూ.231.22 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి కొల్లగొట్టినట్టు తేల్చారు. దీనికి సంబంధించి 2005 నుంచి 2016 వరకు బోధన్, నిజామాబాద్ వాణిజ్య పన్నుల శాఖలో పని చేసిన అధికారుల వివరాలు సీఐడీ సేకరించింది. ఇలా దోచేశారు.. వాణిజ్య పన్నులశాఖ బోధన్ సర్కిల్లో జరి గిన నకిలీ చలాన్ల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పన్నులు చెల్లించకుండానే నకిలీ చలాన్లు సృష్టించి కోట్ల రూపాయలు కొట్టేశారు. వ్యాపారాలు చేసేవారు వాణిజ్య పన్నుల శాఖ ద్వారా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నులు చలానా రూపంలో చెల్లిస్తారు. ప్రతి చలానాకు ప్రత్యేక నంబర్ ఉంటుంది. ఖజానా (ట్రెజరీ)లో ఈ నంబర్ వేయించుకుని ప్రభుత్వం అనుమతించిన బ్యాంకులో పన్ను మొత్తాన్ని జమ చేయాలి. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్, అతడి కుమారుడు సునీల్‌లు బోధన్ వాణిజ్య పన్నులశాఖ కార్యాలయ సిబ్బందితో కుమ్మక్కయ్యారు. పన్నులు చెల్లించకుండానే చెల్లించినట్టుగా నకిలీ చలాన్లు సృష్టించారు. కొంత మొత్తాన్ని చెల్లించి ఎక్కువ మొత్తంలో చెల్లించినట్టు చూపారు. ఒకరు చెల్లించిన చలానాతోనే పదుల సంఖ్యలో వ్యాపారులు, పలు వ్యాపార సంస్థలు చెల్లించినట్టుగా రికార్డులు సృష్టించారు. వ్యాపారుల సొమ్మును పక్కదారి పట్టించి తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెట్టారు. ఎక్కడికక్కడ అధికారులను తమ దారికి తెచ్చుకుని ఏళ్ల తరబడి ఈ కుంభకోణం కొనసాగించారు. అయితే నిజామాబాద్ జిల్లా బోధన్ సర్కిల్ సీటీఓ ఎల్.విజయేందర్ బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్లో 2017 ఫిబ్రవరి 2న చేసిన ఫిర్యాదుతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. దర్యాప్తులో ఉద్యోగుల అవినీతి బాగోతానికి సంబంధించి పక్కా సాక్ష్యాలు లభించాయి. ఫోర్జరీ, మోసం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నేరపూరిత కుట్ర, లంచం తీసుకోవడం వంటి నేరాలు ఉండడంతో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం డీఎస్పీ ఎన్.శ్యామ్ ప్రసాద్‌రావు దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. కేసు నీరుగార్చే యత్నాన్ని బయటపెట్టిన ‘సాక్షి’.. ఈ భారీ కుంభకోణం దర్యాప్తులో ఆద్యంతం అనేక మలుపు చోటు చేసుకున్నాయి. చలాన్లు పెట్టేందుకే నిందితులు ఏకంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటి నిండా చలాన్లు ఉండటాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. మరోవైపు దర్యాప్తును నీరుగార్చేందుకు ఏకంగా ఐఏఎస్ స్థాయి అధికారి ఒకరు ప్రయత్నించిన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఆ తర్వాతే కేసు దర్యాప్తులో వేగం పెరిగింది. తీగలాగితే డొంక కదిలిన చందంగా వాణిజ్య పన్నుల విభాగానికి చెందిన అనేకమంది అధికారుల పాత్ర వెల్లడైంది. ఈ క్రమంలో సీఐడీ విచారణాధికారికి కోటి రూపాయల ఎర వేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ డీఎస్పీ విజయ్‌కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అరెస్టు అయ్యింది వీరే.. ఈ కుంభకోణానికి కీలక సూత్రధారులుగా ఉన్న సింహాద్రి లక్ష్మీ శివరాజ్ (ఏడాది క్రితం మరణించాడు), అతని కుమారుడు సింహాద్రి వెంకట సునీల్‌లను సీఐడీ అరెస్టు చేసింది. వీరిద్దరు నిజామాబాద్ పట్టణంలో సేల్స్ ట్యాక్స్ ప్రైవేటు ఆడిటర్లుగా ఉంటూ ఈ కుంభకోణానికి తెగబడ్డారు. వీరితో పాటు వారి సిబ్బంది విశాల్ పాటిల్ అలియాస్ విశాల్ కాంతిపాటిల్, కమ్మర రామలింగం అలియాస్ రామ లింగడు, నారాయణదాస్ వెంకట కృష్ణమాచారి, ఎన్.సత్యవెంకట కృష్ణకుమార్ అలియాస్ పంతులు, ఎం.మల్లేశ్, గంగొనే రాకేశ్, మడపల్లి రమణ, వంగల శ్రీనివాస్, మహ్మద్ నజీముద్దీన్ అలియాస్ అబీబుద్దీన్, అర్రోజుల రాజేశ్ కూడా ఉన్నారు. ఇక వాణిజ్య పన్నుల శాఖ అధికారులు..రాథోడ్ ధర్మ విజయకృష్ణ, అనంతశ్యానం వేణుగోపాల స్వామి, బి.హనుమంతు సింగ్, ధరణి శ్రీనివాసరావు, టి.పూర్ణచంద్రారెడ్డితో పాటు బోధన్ సర్కిల్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు (ఏసీటీఓలు) ఆర్.కిషన్, కె.నాగేశ్వర్రావు, కె.విజయకుమార్, ఎస్.రత్నకుమారి, బీఎన్ ఇందిర, జె.రాజయ్య, ఎస్.సాయిలు, సీనియర్ అసిస్టెంట్లు సి.స్వర్ణలత, కె. అరుణ్‌రెడ్డి, బి.పీరాజి, రవీంద్రబాబు, ఆర్.బాలరాజు, జూనియర్ అసిస్టెంట్లు చంద్రహాస్, ఆర్.వినోద్‌కుమార్, బి.రంగారావు, ఎల్.భజరంగ్, సి.శ్రీధర్‌లు కూడా కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారు. -
ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన
ఆధార్ కార్డ్-పాన్ లింకింగ్‌కు గడువు నిన్నటి(జూన్ 30)తో ముగిసిన నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆధార్-పాన్ లింకింగ్ కోసం పెనాల్టీ చెల్లించిన తరువాత చలాన్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో సమాచారాన్ని పోస్ట్ చేసింది. అంతేకాదు మరోసారి గడువు పెంపు ఉంటుందనే ఊహాగానాలకు ఆదాయపు పన్ను శాఖ చెక్ పెట్టింది. ప్యాన్-ఆధార్‌లో లింకింగ్‌లో పాన్ హోల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆధార్-పాన్ లింకింగ్ కోసం రుసుము చెల్లించిన తర్వాత చలాన్ డౌన్లోడ్ చేయడంలో పాన్ హోల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రసీదు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని, అయితే ఇ-పే ట్యాక్స్ ట్యాబ్‌లో చలాన్ చెల్లింపు వివరాలను చెక్ చేసుకోవచ్చని సూచించింది. అయితే ఇ-పే ట్యాక్స్‌లో ఇబ్బందులున్నాయని కొంతమంది యూజర్లు ట్విటర్లో ఫిర్యాదు చేశారు. (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!) పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడడం 2017 జులై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి గడువును కేంద్రం చాలాసార్లు పొడిగించింది.జూన్ 30వ తేదీ లోపు పాన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయకపోతే, లింక్ కాని పాన్ కార్డులు చెల్లుబాటు కావడం ఆదాయపన్ను శాఖ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. Kind Attention PAN holders! Instances have come to notice where PAN holders have faced difficulty in downloading the challan after payment of fee for Aadhaar-PAN linking. In this regard, it is to be informed that status of challan payment may be checked in ‘e-pay tax’ tab of… — Income Tax India (@IncomeTaxIndia) June 30, 2023 -
ఏఐ చేసిన పనికి బిత్తరపోయిన జనం
కృత్రిమ మేధను ప్రపంచాన్నే మెచ్చుకుంటున్న వేళ దిగ్బ్రాంతి కలిగించే సంఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది. ఇది విన్న ప్రజలు ఒక్కసారిగా నివ్వెరపోతున్నారు. ఇంతకీ అంతలా ఆశ్చర్యపరిచిన సంఘటన ఏంటి? దాని వెనుకున్న అసలు నిజాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొన్ని రోజులకు ముందు కేరళ ప్రభుత్వం ట్రాఫిక్ నియమాలను మరింత కఠినతరం చేయాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 726 ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కెమెరాలను అమర్చింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధిన చాలా విషయాలు స్వయంచాలకంగా రికార్డవుతాయి, రూల్స్ అతిక్రమించిన వారికి చలానాలు జారీ చేస్తాయి. (స్టార్ క్రికెటర్ కోహ్లీ పార్టనర్, ఈ బిలియనీర్ గురించి తెలుసా? నెట్‌వర్త్ ఎంతంటే?) ఇటీవల AI కెమెరా ఒక బైకర్ గంటకు 1240 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు గుర్తించి వారికి చలాన్ కూడా జరీ చేసింది. బైక్ ఏంటి? గంటకు 1240కిమీ వేగం ఏంటి అని చాలామందికి సందేహం రావొచ్చు.. ఇక్కడమే మనకు అర్థమైపోతుంది ఇది 'ఏఐ' లోపమే అని. దీనిపైన స్పందించిన సంబంధిత అధికారులు ఇలాంటి పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా అడ్డుకుంటామని, దానికి తగిన చర్యలు కూడా తీసుకుంటామని వెల్లడించారు. (ఇదీ చదవండి: నెటిజన్లను భయపెడుతున్న ఆనంద్ మహీంద్రా ట్విటర్ వీడియో) ఈ ఘటనకు సంబంధించిన వీడియో జైహింద్ టీవీ తమ యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసింది. ఇందులో ఏఐ కెమెరా మోటార్ సైకిల్ వేగాన్ని తప్పుగా గుర్తించినట్లు పేర్కొంది. కెమెరా ఫోటో తీసి కంట్రోల్ రూమ్‌కి పంపిందని ఆ తరువాత ఓవర్ స్పీడ్ 1240 కిమీ అని చలాన్ జారీ చేసింది. కానీ ఇది హెల్మెట్ ధరించకపోవడం వల్ల వేసిన జరిమానా అని అధికారులు మొదట్లో పేర్కొన్నారు, ఆ తరువాత బైకర్ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని ఎటువంటి జరిమానా విధించలేదని తెలిసింది. -
బాడీగార్డ్ బైక్‌పై అనుష్క శర్మ చక్కర్లు... చలాన్ వేసిన పోలీసులు
స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గురించి అటు సినిమా, ఇటు క్రికెట్ ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'రబ్ నే బనాదే జోడీ' మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్లో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఓవైపు హీరోయిన్గా నటిస్తూనే నిర్మాతగానూ పలు సినిమాలు చేస్తోంది. అలాంటి ఈమె ఇప్పుడు ఓ కాంట్రవర్సీలో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని ఓ ప్రాంతానికి షూటింగ్ కోసం వెళ్తున్న క్రమంలో అక్కడ ట్రాఫిక్ ఎక్కువైంది. తన కారు ముందుకెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో అనుష్క బైక్‌ను ఆశ్రయించింది. బైక్‌పై తన బాడీగార్డ్‌తో కలిసి లొకేషన్‌కు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా ఆమె, డ్రైవర్ ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోలేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. దీనిపై ముంబై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. అనుష్క బాడీగార్డ్ కమ్ డ్రైవర్ సోనూ షేక్‌కు రూ.10,500 జరిమానా విధించామని, ఆ డబ్బులు మొత్తం చెల్లించేశారని ముంబై పోలీసులు పేర్కొన్నారు. ఈ మధ్యే బిగ్ బీ అమితాబ్ కూడా హెల్మెట్ లేకుండా బైక్‌పై ప్రయాణించారు. ఆయనకు రూ.1000 జరిమానా విధించగా ఆ మొత్తాన్ని చెల్లించేశారని పోలీసులు ట్వీట్ చేశారు. Challan has been issued under Sec 129/194(D), Sec 5/180 & Sec 3(1)181 MV act to the driver along with an fine of Rs. 10500 & been paid by the offender. https://t.co/aLp6JEstLO pic.twitter.com/Br0ByHZk4T — Mumbai Traffic Police (@MTPHereToHelp) May 16, 2023 చదవండి: 11 నెలల బాబును డబ్బు కోసం వదిలేసి వెళ్లానని తిట్టారు: యాంకర్ శ్యామల -
కోరుట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం : ఇవేం మ్యూటేషన్లు బాబోయ్
కోరుట్ల: సాధారణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ తయారీ కోసం రైటర్లను ఆశ్రయించడం సాధారణంగా మారింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో అవగాహన లేనికొంత మంది డాక్యుమెంట్ రైటర్లు.. నివాసం లేదా ఖాళీస్థలం క్రయ, విక్రయాల డాక్యుమెంట్ తయారు చేసే సమయంలో తప్పలతడకగా వివరాలు నమోదు చేయడం.. అదే నమూనాతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్ర క్రియ పూర్తిచేయడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇంటి నంబర్లతో రిజిస్ట్రేషన్లకు ఓ సె క్షన్, ఖాళీస్థలాల రిజిస్ట్రేషన్లకు మరో సెక్షన్ ఉంటుంది. ఖాళీ స్థలాలకు వీఎల్టీ నంబరుతో రిజి స్ట్రేషన్లు చేయాల్సి ఉండగా.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంతో ఇంటిస్థలాల నంబర్లతో ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి.. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇక్కడే సమస్య తలెత్తుతోంది. ఈ రెండు పద్ధతుల్లో పొరపాట్లు చోటుచేసుకోవడంతో యజమానులకు తెలియకుండానే.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వెళ్లకుండానే ఒకరి ఆస్తులు మరొకరి పేరిట నమోదు కావడం గందరగోళానికి దారితీసోంది. వెలుగులోకిరాని ఇలాంటి తప్పిదాలు అనేకం జరిగినా అధికారులు స్పందించడంలేదు. దిద్దుబాటు పరేషాన్.. ● పొరపాటుగా ఆస్తులకు చెందిన వీఎల్టీ లేదా ఇంటి నంబర్లు మారి రిజిస్ట్రేషన్లు జరగడంతో ఆ వివరాలు ఆటో మ్యుటేషన్ ప్రక్రియ ద్వారా ఆన్లైన్లో మున్సిపల్ కార్యాలయానికి చేరుతున్నాయి. ● ఆ వివరాల ప్రకారం.. మున్సిపల్ అధికారులు పేరు మార్పిడి చేసి ఆస్తి పన్ను లేదా ఖాళీ స్థలాల పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. ● మున్సిపల్ అధికారులు పన్నుల వసూలుకు వెళ్తున్న సందర్భంలో లేదా ఆస్తి హక్కుదారులు పన్ను చెల్లించే సందర్భంగా జరిగిన పొరపాట్లు వెలుగులోకి వస్తున్నాయి. ● ఈ పొరపాటును సరిదిద్దే అంశం తమ పరిధిలో లేదని మున్సిపల్ అధికారులు తేల్చి చెపుతుండగా.. మున్సిపాల్టీలో సరిదిద్దే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదని..తాము సమస్యను జిల్లా రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్తే కాలాయాపన జరుగుతుందని సబ్ రిజిస్ట్రార్ అధికారులు అంటున్నారు. ● మొత్తం మీద పొరపాట్లు అధికారులు చేస్తే ఆస్తి హక్కుదారులు మాత్రం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తిప్పలు పడుతున్నారు. ● ఉన్నతాధికారులు తగిన రీతిలో స్పందించి అవసరమైన చర్యలు తీసుకుని పొరపాట్లును సరిదిద్దాలని బాధితులు కోరుతున్నారు. ఇతడి పేరు తోట గంగారాం. ఆస్తిపన్ను చెల్లించేందుకు వారంక్రితం కోరుట్ల మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాడు. ఇంటి నంబరు చెప్పగానే గంగారాం పేరిట ఇల్లే లేదని అధికారులు తేల్చేశారు. వేరేవాళ్ల పేరు ఎలా వచ్చిందని బిత్తరపోయిన గంగారాం.. ఇదేమిటని ప్రశ్నిస్తే.. రిష్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి అడుగు అని ఉచిత సలహా ఇచ్చారు. అక్కడికి వెళ్లి ఆరా తీస్తే.. తన ప్రమే యం లేకుండానే ఇతరులు చేసుకున్న రిజిస్ట్రేషన్‌లో తనఇంటి నంబరు నమో దు చేసి.. ఆ వివరాలను ఆన్లైన్ ద్వారా బల్దియా కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. దానిప్రకారం ఏడాది క్రితమే ఆటో మ్యుటేషన్‌తో తన ఇల్లు వేరేవారి పేరిట నమోదైనట్లు స్పష్టమైంది. కోరుట్ల మెయిన్డ్డుడ్లోని ఓ దుకాణా యజమాని.. తన ఇంటి సమీపంలోని ఖాళీస్థలాన్ని వీఎల్టీ నంబరుతో తన బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. వారంక్రితం అతడు ఆస్తిపన్ను చెల్లించడానికి బల్దియా కార్యాలయానికి వెళ్తే.. ఖాళీ స్థలమే కాకుండా తన బంధువుల పేరిట నమోదు అయిందని తెలిసి నివ్వెరపోయాడు. జిల్లా రిజిస్ట్రార్‌కు నివేదిస్తాం వీఎల్టీ, ఇంటి నంబర్ల నమోదులో పొరపాట్లు జరగడంతో తప్పులు చోటు చేసుకున్నట్లుగా భావిస్తున్నాం. వీటిని సరిదిద్దడానికి జిల్లా రిజిస్ట్రార్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పొరపాటున ఆస్తుల వివరాలు మారిన వారు మాకు దరఖాస్తు చేసుకోవాలి. కొంత కాలయాపన జరిగినా ఆటో మ్యుటేషన్లో జరిగిన పొరపాట్లు సరిచేస్తాం. – శ్రీధర్‌రాజు, ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్, కోరుట్ల -
Hyderabad: పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై టూ వీలర్ ప్రవేశానికి చెక్..
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు వ్యతిరేకంగా పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్స్‌ప్రెస్‌వే పై ద్విచక్ర వాహనదారులు ప్రయాణించకుండా ఉండేందుకు హెచ్ఎండీఏతో కలిసి తగు చర్యలు తీసుకుంటున్నామని రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్యామ్‌సుందర్‌రెడ్డి తెలిపారు. సరోజినీదేవి ఆసుపత్రి నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు 11 కిలో మీటర్ల మేర నిర్మించిన పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే కేవలం కార్లకు మాత్రమే అనుమతి ఉందన్నారు. ద్విచక్ర వాహనాదారులు, భారీ వాహనాలకు అనుమతి లేదన్నారు. కానీ కొందరు ద్విచక్ర వాహనాదారులు ఈ వంతెనపై నుంచి ప్రయాణిస్తూ ఇబ్బందులు సృష్టిస్తున్నారన్నారు. ► గతంలో ఈ వంతెనపై ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై మృతి చెందిన ఘటనలు సైతం జరిగాయన్నారు. ►ఈ నేపథ్యంలో పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే ద్విచక్ర వాహనదారుల ప్రవేశాన్ని అరికట్టేందుకు హెచ్ఎండీఏతో పలుమార్లు సంప్రదింపులు జరిపి తగు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ►ఎక్స్‌ప్రెస్‌వే వంతెనపై ఎక్కేందుకు, దిగేందుకు ఏర్పాటు చేసిన ర్యాంపుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ► ఈ నెల చివరి నాటికి ఈ పనులు పూర్తి అవుతాయన్నారు. సీసీ కెమెరాల ద్వారా వాహనాదారులను గుర్తించి అపరాధ రుసుం వేస్తామన్నారు. ►సీసీ కెమెరాలను పర్యవేక్షించేందుకు పోలీస్‌స్టేషన్‌లోనే తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఫ్లై ఓవర్ ర్యాంపుల వద్ద సీసీ కెమెరా వాహనాన్ని గుర్తించి అపరాధ రుసుం విధించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. -
బైక్ నడుపుతూ బీర్ తాగిన యువకుడు.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు
లక్నో: ఓ యువకుడు అతిగా ప్రవర్తించాడు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతూ బీర్ తాగాడు. రహదారిపై ఇతడు చేసిన చేష్టలను స్నేహితులే వీడియో తీశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన ఉత్తర ప్రదేశ్ గాజియాబాద్ పోలీసులు యువకుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. రూ.31,000 చలనా విధించారు. హెల్మెట్ ధరించకపోగా బైక్ నడుపుతూ మద్యం సేవించినందుకు ఇంత భారీమొత్తంలో జరిమానా వేశారు. ఇందుకు సంబంధించిన చలానాను సోషల్ మీడియాలో షేర్ చేశారు. #Ghaziabad DME पर बीयर पीकर रील रिकॉर्ड करने वाले इस सूरमा ने तो @Gzbtrafficpol की चालानी कार्यवाई की पोल खोल दी, DME पर 2 व्हीलर नही जा सकते यहाँ तो पूरी शूटिंग जारी है। मसूरी थाना क्षेत्र है। @ghaziabadpolice @uptrafficpolice @sharadsharma1 @bstvlive @DCPRuralGZB pic.twitter.com/Mvbj2sFZ2H — Lokesh Rai 🇮🇳 (@lokeshRlive) January 20, 2023 చదవండి: రష్యా నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు -
Hyderabad: ఎఫ్ఐఆర్లు.. జరిమానాలు..రెడ్ నోటీసులు
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వద్ద రోడ్డుకు రెండువైపులా ఫుట్‌పాత్ ఆక్రమణలు, రోడ్డు పక్కనే అక్రమ పార్కింగ్లు, పుట్‌పాత్‌పైనే చిరు వ్యాపారాలు జోరుగా సాగేవి.. ఇక్కడికి అంబులెన్స్ రావాలంటే నరకయాతన అయ్యేది. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు గత రెండు నెలలుగా ఈ అక్రమ పార్కింగ్లు, ఫుట్‌పాత్ ఆక్రమణలపై కొరడా ఝులిపిస్తుండటంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ ప్రాంతంలో కొంత మేర వాహనాలు తేలికగా రాకపోకలు సాగించే విధంగా ట్రాఫిక్ అడ్డంకులు తొలగిపోయాయి. గతంలో పదేపదే చెప్పినా పెడచెవిన పెడుతూ రోడ్లపక్కనే బండ్లు పెట్టుకొని హోటళ్లు నడిపిస్తున్న వ్యాపారులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడమే కాకుండా సంబంధిత భవన యజమానులకు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా రోడ్లపక్కన అక్రమ పార్కింగ్ చేసిన వాహనాలను సీజ్ చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారు. అపోలో ఆస్పత్రి వద్ద నో పార్కింగ్ జోన్లో వాహనాలను లిఫ్ట్ చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులు ►దీంతో అపోలో పరిసరాల్లో వాహనం పెడితే పోలీసులు లిఫ్ట్ చేస్తారని చిరు వ్యాపారాలు నిర్వహిస్తే జరిమానాలు విధిస్తారని భావించిన వీరంతా గత నాలుగు వారాల నుంచి వీటి జోలికి పోవడం లేదు. ►ఫలితంగా ఈ ప్రాంతంలో కొంత మేర ట్రాఫిక్ అడ్డంకులు తొలగిపోయి వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలవుతోంది. ►గతంలో రోజుకు రెండు మూడుసార్లు ట్రాఫిక్ పుష్‌కాట్ వాహనాలను తిప్పిన ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు గంటలో నాలుగైదు సార్లు తిప్పుతుండటంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ►ఇది కేవలం అపోలో ఆస్పత్రికే పరిమితం చేయకుండా స్టార్ ఆస్పత్రి, బసవతారకం కేన్సర్ ఆస్పత్రి, స్టార్ బక్స్, తాజ్‌మహల్ హోటల్, రియాట్ పబ్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, బంజారాహిల్స్ రోడ్ నం.1, బంజారాహిల్స్ రోడ్ నం.12, ఫిలింనగర్‌లకు విస్తరించారు. ►బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుకు, ఫుట్‌పాత్‌లకు అడ్డంకులు సృష్టిస్తున్న 30 మంది చిరు వ్యాపారులపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ►మరో వైపు బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వైపు ఇష్టానుసారంగా గతంలో వాహనాలు నిలిపేవారు. ► ఇప్పటికే ఈ ఆస్పత్రికి రెడ్‌నోటీసులు జారీ చేశారు. ఆస్పత్రికి వైపు మాత్రమే పార్కింగ్ చేసుకోవాలని, రెండోవైపు వాహనాలు పార్కింగ్ చేస్తే వీల్ క్లాంప్లు వేస్తున్నామని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్ పరిధిలో.. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు సైతం గత ఐదు వారాల నుంచి అక్రమ పార్కింగ్‌లపై కొరడా ఝులిపిస్తున్నారు. ►రోడ్డుకు రెండువైపులా చిరు వ్యాపారులు రోడ్డును, ఫుట్‌పాత్‌ను ఆక్రమించి ఇబ్బందులు కల్గిస్తుండటంతో జరిమానాలు విధిస్తున్నారు. ఫలితంగా ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాటు అక్రమ పార్కింగ్‌లకు 80 శాతం వరకు తెరపడింది. ►నిత్యం ఇక్కడి పోలీసులు ట్రాఫిక్ పుష్‌కాట్ వాహనంతో వాహనాలు స్టేషన్‌కు తరలిస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో ఉన్న వ్యాపార కేంద్రాలకు ఒక్కదానికి కూడా పార్కింగ్ సౌకర్యం లేదు. ►ఈ రోడ్డులో హోటళ్లు, ఆభరణాల షోరూంలు, బొటిక్‌లు ఎక్కువగా ఉన్నాయి. వీరందరికీ ఇప్పటికే పలుమార్లు అవగాహన కలిగించి లైన్ దాటితే జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ► వివాహ భోజనంబు, అంతేరా, స్పైసీ అవెన్యూ, వ్యాక్స్ బేకరీ, బ్రీవ్ 40, సెవన్త్ హెవన్, కేఫ్ కాఫీడే తదితర వ్యాపార సంస్థలకు ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ►జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రోడ్డు, ఫుట్‌పాత్ అడ్డంకులు న్యూసెన్స్‌కు పాల్పడుతున్న 25 మంది వ్యాపారులపై ఎఫ్ఐఆర్లో నమోదయ్యాయి. భారీగా జరిమానాలు విధించారు. పంజగుట్టలో.. ►పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు అక్రమ పార్కింగ్లు అధికంగా ఉండే సోమాజిగూడ యశోదా ఆస్పత్రి రోడ్డుపై దృష్టి సారించారు. ►ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజుకు సుమారు 25 వాహనాలను స్టేషన్‌కు తరలిస్తున్నారు. ►అక్రమ పార్కింగ్లు చేస్తున్న బైక్‌లను తరలిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఈ రోడ్డులో చిరువ్యాపారులను మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తుండటంతో సహజంగానే రోడ్డు మరింత ఇరుకుగా మారుతోంది. ►ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీతో పాటు, పంజగుట్ట ప్రధాన రహదారిలోని మెరీడియన్, రెడ్‌రోజ్ హోటల్, రాజ్‌భవన్ రోడ్డులో నిత్యం వాహనాలను సీజ్ చేస్తున్నారు. -
ఇంత దారుణమా? చలానా కట్టమన్నందుకు 4 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు
భోపాల్: డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటమే కాకుండా ప్రశ్నించిన ట్రాఫిక్ పోలీసు పట్ల దురుసుగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. చలాన్ కట్టమన్నందుకు కారు బానట్‌పై ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను 4 కిలోమీటర్లు లాక్కెళ్లాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో జరిగింది. ఇండోర్ నగరంలోని సత్య సాయి జంక్షన్ వద్ద ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శివ సింగ్ చౌహాన్(50) విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే కారులో వచ్చిన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు. ఫోన్ మాట్లాడటం తప్పు అని చెప్పి జరిమానా కట్టాలని సూచించాడు కానిస్టేబుల్. దీంతో ఆగ్రహించిన కారు డ్రైవర్.. కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగాడు. జరిమానా తప్పించుకునేందుకు కానిస్టేబుల్ అడ్డుగా ఉన్నప్పటికీ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ పోలీసు కారు బానట్పైకి దూకాడు. అయినప్పటికీ.. కారును ఆపకుండా అలానే 4 కిలోమీటర్లు కారు నడిపాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌కు గాయాలైనట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్ 279, 332 కింద కేసు నమోదు చేసినట్లు లసుదియా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ దండోతియా తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఓ పిస్తోల్, ఓ రివాల్వర్ సైతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే, అవి లైసెన్స్‌తో తీసుకున్నవని నిందితుడు తెలిపాడన్నారు. ग्वालियर के केशव उपाध्याय ने इंदौर में गाड़ी चलाने के दौरान फोन पर बात करते हुए ट्रैफिक तोड़ा और रोकने पर ट्रैफिक कांस्टेबल शिव सिंह चौहान को चार किलोमीटर तक अपने बोनट पर टांग कर ले गए। बताया जा रहा है के FIR कर छोड़ दिया गया।pic.twitter.com/PXEhQ3lm31 — काश/if Kakvi (@KashifKakvi) December 12, 2022 ఇదీ చదవండి: మూన్‌లైటింగ్ కూలీ: రాత్రి పూట రైల్వే స్టేషన్లో.. మరి పగటి పూట! -
ప్రూఫ్ ఏంటంటూ నిలదీసిన వాహనదారుడు.... పోలీసుల రియాక్షన్‌తో సైలెంట్
రోడ్లపై వెళ్లే ద్విచక్ర వాహనదారులు హెల్మట్ ధరించడం తప్పనిసరి. ఒకవేళ ఏ కారణం చేతనైనా ధరించకపోతే ట్రాఫిక్ పోలీసలు ఫోటో తీసి చలాన్ పంపించడం వంటివి చేస్తారు. ఇది సర్వసాధారణం. మాములుగా ఎవరైనా చలాన్ చూసుకుని కట్టడం వంటివి చేస్తారు గానీ ఎప్పుడూ జరిగింది ఏంటని ఎవరూ పోలీసులను నిలదీయరు. కానీ ఇక్కడొక వాహనదారుడు మాత్రం ఎవిడెన్స్ కావాలంటూ పోలీసులకే దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. వివారల్లోకెళ్తే...ఫెలిక్స్రాజ్ అనే వ్యక్తి బెంగళూరు రహదారిపై హెల్మట్ ధరించకుండా స్కూటర్‌పై ప్రయాణించాడు. దీంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అతనికి తన బండి, నెంబర్ ప్లేట్ ఫోటోలు తీసి పంపించి ఫైన్ విదిస్తూ చలాన పంపించారు. దీంతో సదరు వాహనదారుడు ట్విట్టర్ వేదికగా ట్రాఫిక్ పోలీసులను ఉద్దేశిస్తూ..మీరు నా బండి ఫోటో, నెంబర్ ప్లేట్ పంపించారు. కానీ నేను రైడ్ చేస్తున్నట్లు చూపించలేదు. కాబట్టి నేనే రైడ్ చేశాననడానకి ప్రూఫ్ ఏంటని ప్రశ్నించాడు. గతంలో ఇలానే పంపిచారని, జరిమాన చెల్లించానని చెప్పుకొచ్చాడు. మళ్లీ మళ్లీ ఇలా జరిగితే ఊరుకోను. తాను హెల్మట్ లేకుండా ప్రయాణించినట్లు ప్రూఫ్ చూపించండి. అప్పుడే ఫైన్ కడతా లేకపోతే మీరు కేసు అయినా తీసేయండి అని పోలీసులకే సవాలు విసురుతూ ట్వీట్ చేశాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి.... అతగాడు డ్రైవ్ చేస్తున్న ఫోటో తోపాటు ఎప్పుడూ ఏ సమయంలో ఎలా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాడో వంటి ఆధారాలు, పోటోలతో సహా పోస్ట్ చేశారు. దీంతో సదరు వాహనదారుడు... ఆధారాలు సమర్పించినందుకు ట్రాఫిక్ పోలీసులకు ధన్యావాదాలు. ఇలా ప్రశ్నించడం ప్రతి ఒక్కరి హక్కు అని సమర్థించుకోవడమే గాక ఫైన్ కట్టేస్తానని పోలీసులకు చెప్పాడు. ఈ ఘటన సంబంధించిన విషయాన్ని వివరిస్తూ ఫోటోలను ట్విట్టర్లో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు పోస్ట్ చేయడంతో నెట్టింట ఈ విషయం వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు సదరు యువకుడి తీరుపై మండిపడటమే గాకుండా హెడ్ ఫోన్స్పెట్టుకుని మరీ వాహనాన్ని నడుపుతున్నట్లు తెలుస్తోంది కాబట్టి పోలీసులు మరో నేరం మోపి అరెస్టు చేయాలి అంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. pic.twitter.com/jRd7FX0KNs — ಬೆಂಗಳೂರು ಸಂಚಾರ ಪೊಲೀಸ್ BengaluruTrafficPolice (@blrcitytraffic) October 19, 2022 (చదవండి: రూల్ అంటే రూలే.. సాక్షాత్తు పోలీస్ అయినా తప్పదు జరిమానా!) -
బైక్‌లో సరిపడా పెట్రోల్ లేదని ఫైన్.. చలాన్ ఫోటో వైరల్
తిరువనంతపురం: బైక్‌పై వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించకపోయినా, ట్రాఫిక్ నిబంధనలు పాటించకున్నా ఫైన్ వేయడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ కేరళలోని ఓ ట్రాఫిక్ పోలీస్ మాత్రం బైక్‌లో సరిపడా పెట్రోల్ లేదని రూ.250 ఫైన్ వేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను బసిల్ శ్యామ్ అనే వ్యక్తి తన ఫేస్బుక్లో షేర్ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారింది. బైక్‌లో పెట్రోల్ లేకపోతే కూడా ఫైన్ వేస్తారా? ఇలాంటి రూల్ కూడా ఉందా? అని నెటిజన్లు కేరళ ట్రాఫిక్ పోలీసులపై సెటైర్లు వేస్తున్నారు. బసిల్ శ్యామ్ తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై ఆఫీస్‌కు వెళ్లే క్రమంలో వన్ వే స్ట్రీట్‌లో అపసవ్యదిశగా బండి నడిపాడు. అది చూసి ట్రాఫిక్ పోలీస్ బైక్ ఆపాడు. రూ.250 ఫైన్ కట్టమన్నాడు. అందుకు ఒప్పుకుని అతను చెల్లించాడు. అయితే తీరా ఆఫీస్‌కు వెళ్లాక చలాన్ చూస్తే.. బైక్‌లో సరిపడా పెట్రోల్ లేనందుకు ఫైన్ వేసినట్టుంది. దీంతో అతడు షాక్ అయి చలాన్ ఫోటో తీసి ఫేస్బుక్లో పోస్టు చేశాడు. అది కాస్తా వైరల్ అయ్యింది. భారత మోటారు వాహన చట్టం, కేరళ చట్టంలో బైక్‌లో పెట్రోల్ సరిపడా లేకపోతే ఫైన్ వేయాలనే నిబంధన ఎక్కడా లేదు. అయితే బస్సు, కారు, వ్యాను, ఆటో వంటి కమర్షియల్ వాహనాలు పెట్రోల్,డీజిల్ సరిపడా లేకుండా ప్రయాణించి ప్రయాణికులకు ఇబ్బంది కల్గిస్తే రూ.250 ఫైన్ కట్టాలనే నిబంధన కేరళ రవాణా చట్టంలో ఉంది. కానీ ఇది బైక్‌లకు వర్తించదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని మాజీ అధికారులు రవాణా శాఖకు సూచించారు. చదవండి: త్వరలో శివసేన నుంచి మరో సీఎం.. ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు -
బంజారాహిల్స్: ఖరీదైన కార్లే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు
స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు హై ఎండ్ కార్ల భరతం పట్టారు. ఈ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పది వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ దర్జాగా తిరుగుతున్న ఖరీదైన కార్లు పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి. సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్టడీ సర్కిల్, తాజ్ మహల్ హోటల్, టీవీ చౌరస్తా, కళింగ కల్చరల్ సెంటర్ చౌరస్తా, తాజ్‌కృష్ణ ఎదురుగా బంజారాహిల్స్, ఎస్సార్‌నగర్, సైఫాబాద్, నారాయణగూడ, చిక్కడపల్లి ట్రాపిక్ పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ఐలు బృందాలుగా ఏర్పడి తనఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా డ్రైవింగ్ లైసెన్సు లేకుండా నడుపుతున్న ఓ వ్యక్తి కారును సీజ్ చేశారు. ► నంబర్ ప్లేటు లేకుండా తిరుగుతున్న నాలుగు కార్లను సీజ్ చేశారు. ఈ అయిదు కార్లపై ఛార్జిషీటు దాఖలు చేయనున్నారు. ►బ్లాక్ ఫిల్మ్‌లతో తిరుగుతున్న 35 మంది కారు యజమానులకు ఒకొక్కరికి రూ. 700లు చొప్పున జరిమానా విధించారు. ఇర్రెగ్యులర్, ఇన్‌ప్రాపర్ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 32 మంది వాహనదారులకు రూ. 200ల చొప్పున జరిమానా విధించారు. ►ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 39 మంది వాహనదారులకు రూ. 200ల చొప్పున జరిమానా విధించారు. రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతున్న మూడు కారు యజమానులకు రూ. 2000ల ప్రకారం జరిమానా విధించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. ► జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, నీరూస్ జంక్షన్, రోడ్ నంబర్ 45, ఫిలింనగర్, రోడ్ నంబర్ 36 కళాంజలి వద్ద జూబ్లీహిల్స్ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్తు, మారేడుపల్లి, మహంకాళి, గోపాలపురం ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల నుంచి అయిదు చోట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ► బ్లాక్ ఫిల్మ్‌లతో తిరుగుతున్న 48 టాప్ మోడల్ కార్ల యజమానులకు రూ. 700ల ప్రకారం జరిమానా విధించారు. ► ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 13 వాహనాలపై జరిమానా విధించారు. ► ఇంప్రాపర్, ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్లతో ప్రయాణిస్తున్న 45 కార్లకు రూ. 200ల వంతున జరిమానా విధించారు. నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 2 వాహనాలపై చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. సర్వీసు రోడ్డులో పార్కింగ్ చేసిన ఒక వాహనంపై జరిమానా విధించారు. ► ఇద్దరు వాహనదారులపై 41(ఐ) సీపీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి పాదచారులకు ఇబ్బంది కల్గిస్తున్న ఒక వాహనదారుడిపై కేసు నమోదైంది. అక్రమ పార్కింగ్ చేసిన ఇద్దరు వాహనదారులకు జరిమానా విధించారు. -
కార్ల పైనా కన్నేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన పెండింగ్‌లో ఉండిపోయిన ఈ–చలాన్లు క్లియర్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. గతానికి భిన్నంగా కార్ల వంటి తేలికపాటి వాహనాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఫలితంగానే శనివారం ఎమ్మెల్యే దానం నాగేందర్ కారు చిక్కింది. నగరంలో ఉన్న వాహనాల్లో 72 శాతం టూ వీలర్లే. తేలికపాటి వాహనాలు 18 శాతం, మరో పది శాతం మిగిలిన కేటగిరీలకు చెందిన వాహనాలు ఉన్నాయి. గతంలో ట్రాఫిక్ పోలీసుల దృష్టంతా ద్విచక్ర వాహనాల పైనే ఉండేది. వీటినే రోడ్లపై ఆపుతూ పెండింగ్ చలాన్లు వసూలు చేయడానికి ప్రయత్నించే వాళ్లు. తేలికపాటి వాహనాల జోలికి తక్కువగా... హైఎండ్ కార్ల జోలికి అస్సలు పోయేవాళ్లు కాదు. ఈ నేపథ్యంలోనే ఈ వాహనాలపై పెండింగ్ చలాన్లు పెరిగిపోయాయి. ఈ విషయం గుర్తించిన సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, హైఎండ్ కార్లనూ ఆపి తనిఖీలు చేయాలని, పెండింగ్‌లో చలాన్లు ఉంటే కట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో గడిచిన కొన్ని రోజులుగా ట్రాఫిక్ పోలీసుల వీటిపై దృష్టి పెట్టారు. పెండింగ్ చలాన్లు వసూలుతో పాటు చలాన్ల విధింపులోనూ ఈ కేటగిరీలకు చెందిన వాహనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. శనివారం ఒక్క రోజే ట్రాఫిక్ విభాగం అధికారులు 1745 వాహనాలపై చలాన్లు విధించారు. వీటిలో ద్విచక్ర వాహనాలు 943, త్రిచక్ర వాహనాలు 108, తేలికపాటి వాహనాలు 688 ఉన్నాయి. మిగినవి ఇతర రకాలకు చెందిన వాహనాలు. వాహనాలను ఆపుతున్న ట్రాఫిక్ విభాగం అధికారులు తమ వద్ద ఉన్న ట్యాబ్స్ ద్వారా డేటాబేస్‌లో వాటి రిజిస్ట్రేషన్ నెంబర్లను సెర్చ్ చేస్తున్నారు. ఇలా చేసినప్పుడు ఆ వాహనంపై పెండింగ్ చలాన్లు ఉండే ఆ విషయం ట్రాఫిక్ పోలీసులకు తెలుస్తోంది. సదరు వాహనచోదకుడు ఆ మొత్తం క్లియర్ చేసే వరకు వాహనాన్ని లేదా «ధ్రువీకరణ పత్రాలన పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. గడువు ఇచ్చి చార్జ్‌షీట్ దాఖలు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, పెండింగ్ చలాన్ల వసూలు విషయంలో అన్ని రకాలైన వాహనాలకు సమప్రాధాన్యం ఇస్తున్నాం. మహిళలు, యువతులు, కుటుంబాలతో ప్రయాణిస్తున్న వారి వాహనాల వివరాలను తనిఖీ చేసినప్పుడు వారికి కొన్ని వెసులుబాట్లు ఇస్తున్నాం. ఇలాంటి వారి వాహనాలపై పెండింగ్ చలాన్లు ఉంటే వెంటనే కట్టాలని ఒత్తిడి చేయట్లేదు. వాటిని క్లియర్ చేసుకోవడానికి గరిష్టంగా 72 గంటల సమయం ఇస్తున్నాం. ఆ గడువు తర్వాత క్లియర్ చేయని వాహనాలపై న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేస్తున్నాం. – ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్ చీఫ్ (చదవండి: సికింద్రాబాద్ విధ్వంసంలో 46 మంది అరెస్ట్.. వారి వల్లే ఇలా జరిగింది) -
పోలీసుకు తన ‘పవర్’ చూపాడు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌కే పవర్ కట్
లక్నో: అధికారం ఉంది కదా అని ఎవరితోనైనా ఆటాడుకోవచ్చనుకుంటే ఏమవుతుంది.. ఒక్కోసారి అదే అధికారం రివర్స్ దాడి చేస్తుంది! ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఇటీవల భగవాన్ స్వరూప్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మోదీసింగ్ అనే పోలీసు అధికారి అతన్ని ఆపాడు. బండి కాగితాలు చూపాలని అడిగాడు. అయితే అత్యవసర పని మీద వెళ్తున్నందున కాగితాలు వెంట తెచ్చుకోవడం మరచిపోయానని స్వరూప్ బదులిచ్చాడు. కావాలంటే ఇంటికి వెళ్లి కాగితాలు తీసుకొచ్చి చూపుతానని బతిమిలాడాడు. కానీ ఆపింది పోలీసు కదా.. అదేం కుదరదని తేల్చిచెప్పాడు. రూ. 500 జరిమానా కట్టాలంటూ చలాన్ వేశాడు. మోదీసింగ్ చర్యతో స్వరూప్ రగిలిపోయాడు. అసలే ‘కరెంటోడు’ కావడంతో పోలీ'సులకు తన స్టయిల్లో గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఇంకేముంది.. తన సహచర విద్యుత్ సిబ్బందితో కలసి వెళ్లి మోదీసింగ్ పనిచేసే హర్దాస్పూర్ పోలీసుస్టేషన్‌కు పవర్ కట్ చేసి పారేశాడు! ఎందుకిలా చేశావని.. మీడియా ప్రతినిధులు అడిగితే పోలీసుస్టేషన్ సిబ్బంది విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని... అందుకే విద్యుత్ సరఫరా నిలిపివేశానని చెప్పుకొచ్చాడు. చదవండి: రెండో రోజు విచారణకు రాహుల్ గాంధీ.. ఢిల్లీలో ఆంక్షలు -
ఎస్వీ కృష్ణారెడ్డి కారుకు జరిమానా, డైరెక్టర్ షాకింగ్ రియాక్షన్
కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు చెక్ పోస్టులు పెట్టి కార్లను తనిఖీ చేస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ ఫిలింస్ ఉన్నాయని గత కొన్ని రోజులుగా చాలా మంది సెలబ్రిటీల కార్లకి చలానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. తాజాగా ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కారుకి కూడా జరిమానా విధించారు. మంగళవారం సుల్తాన్ బజార్ బ్యంక్ స్ట్రీట్ రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో అటుగా వెళుతున్న ఎస్వీ కృష్ణారెడ్డి కారును పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. ఆయన కారుకు ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు చలానా విధించారు. చదవండి: హిందీ బుల్లితెర ప్రేక్షకులకు షాకిచ్చిన కరణ్ జోహార్ ఈ సందర్భంగా ఎస్వీ కృష్ణా స్పందించిన తీరు అందరిని షాక్‌కు గురి చేస్తోంది. తప్పు తనదేనని, నెంబర్ ప్లేట్ సరి చేసుకుంటానని ఆయన పోలీసులు వివరణ ఇచ్చారు. అనంతరం ఈ మండుటెండల్లో సైతం బాధ్యతగా విధులు నిర్వహిస్తోన్న ట్రాఫీక్ పోలీసులను డైరెక్టర్ అభినందించారు. కాగా టాలీవుడ్‌కు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన ఆయన కామెడీ సినిమాలతో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ జోనర్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డైరెక్టర్‌గా, నిర్మాతగా, నటుడిగా మాత్రమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గా, రైటర్‌గా కూడా ఆయన మల్టీ టాలెంట్ చూపించారు. ఇక కొంతకాలంగా దర్శకత్వానికి బ్రేక్ ఇచ్చిన ఆయన ప్రస్తుతం బిగ్‌బాస్ సోహైల్ హీరోగా ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1601343008.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రభాస్‌పై ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన పీఆర్ టీమ్
హీరో ప్రభాస్ కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారంటూ వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. బ్లాక్ ఫిలింతో పాటు కాలం చెల్లిన ఎంపీ స్టిక్కర్‌ను వేసుకున్నందుకు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రూ. 1600 జరిమానా విధించారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అసలు విషయం బయటికి వచ్చింది. నిజానికి అది ప్రబాస్ కారు కాదంట. ఈ మేరకు ప్రభాస్ పీఆర్ టీం స్పష్టతనిచ్చింది. హైదరాబాద్ రోడ్ నెంబర్ 36లో ప్రభాస్ కారుకి పోలీసులు ఫైన్ వేశారని వార్తలు వస్తున్నాయి. ఆ కారుకి, ప్రభాస్‌కి ఏ విధమైన సంబంధం లేదని తెలియజేస్తున్నాం. దయచేసి గమనించగలరు అని పీఆర్ టీం చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ ఫేక్ న్యూస్‌పై ప్రభాస్ వ్యక్తిగత సహాయకుడు రామకృష్ణ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించారు. కారు ప్రభాస్ పేరు మీద లేదని, ఆయన బంధువు నరసింహరాజు పేరు మీద ఉందంటూ దానికి సంబంధించిన పత్రాలను సమర్పించారు. దీంతో రూమర్స్‌కి చెక్పెట్టినట్లయ్యింది. కాగా సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిన ప్రభాస్ త్వరలోనే భారత్‌కు రానున్నారు. అనంతరం ఆయన సలార్ షూటింగ్లో పాల్గొంటారు. చదవండి: పెళ్లిపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు -
అవన్నీటితో సంబంధం లేదు.. చల్లాన్లు విధించడంలో బీజీ బీజీ...
సాక్షి, నాగోలు: ట్రాఫిక్ పోలీసుల ముఖ్య విధి ట్రాఫిక్‌ను నియంత్రించడం... ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే వెంటనే రంగంలోకి దిగి వాహనాలు సాఫీగా ముందుకు సాగేలా చేయడం... ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు తీసుకోవడం.. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు తమ విధులను పక్కన పెట్టి కేవలం వాహనదారులకు చలాన్లు విధించడంలోనే బిజీగా ఉంటుండంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ►ఎల్బీనగర్ పరిధిలోని వివిధ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు తమ విధులను పక్కన పెట్టి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాహనదారులకు చలాన్లు విధించే పనిలోనే ఎప్పుడూ నిమగ్నమై ఉంటున్నారు. ►చౌరస్తాల వద్ద ట్రాఫిక్ జామ్ అయినా.. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిపోయినా తమకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు. కానిస్టేబుళ్లు అందరూ పోగై వాహన తనిఖీలు చేపడుతున్నారు. ► రహదారిపై ఏదైనా ప్రమాదం జరిగితే కొంత మంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లు అసలు పట్టించుకోవడం లేదు. ►రహదారుల వెంబడి ఉన్న బడా హోటల్ వద్ద అక్రమంగా పార్కింగ్ చేస్తున్న వాహనాల వైపుకూడా కన్నెత్తి చూడటం లేదు. ►ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ సమీపంలో ఉన్న ఓ హోటల్ నిర్వాహకులు తమ హోటల్‌కు వచ్చే వినియోగదారులు వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేయిస్తున్నారు. దీంతో రోడ్డు ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ►వివిధ చౌరస్తాల వద్ద ట్రాఫిక్ సిబ్బంది నిలబడి చేతిలో కెమెరాలు పట్టుకొని కేవలం హెల్మెట్ లేని వారు, త్రిబుల్ రైడింగ్ చేసేవారికి ఫొటోలు తీస్తున్నారు. ►వీరు రోజూ కనీసం 100 చలాన్లు విధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ►కొన్నిచోట్ల రోడ్లపై వారాంతపు సంతలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. ► వివిధ చౌరస్తాల వద్ద ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికి చాలన్ విధించడమే పనిగా పెట్టుకున్నారు. ►వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఐలతో పాటు కిందస్థాయి సిబ్బంది తమ వెంట తీసుకుని వచ్చిన వాహనలకు పత్రాలు లేని వారి నుంచి పెద్ద ఎత్తున్న డబ్బు వసలు చేస్తున్నారు. ►సర్వీస్ రోడ్డును పూర్తిగా ఆక్రమించుకొని వాహనాలను పార్క్ చేసి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చల్లాన్లు విధించడంలో బీజీ బీజీ... ట్రాఫిక్ నియంత్రణ కోసం చౌరస్తాల్లో నియమిస్తున్న ట్రాఫిక్ పోలీసులు విధులను సక్రమంగా నిర్వర్తించడంలేదు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ట్రాఫిక్ నియంత్రణను పక్కకు వదిలేసి చేతిలో కెమెరా.. ట్యాబ్ పట్టుకొని చలాన్లు విధిస్తూ వాహనదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు కేవలం ఫొటోలు తీయడమే కాకుండా ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేయాలని కోరుతున్నారు. -
ట్రాఫిక్ చలాన్ వేశారని బుల్లెట్ యజమాని ఆత్మహత్యాయత్నం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఒక యువకుడు ట్రాఫిక్ పోలీసులు తనపై.. అకారణంగా చలాన్ వేశారని, కమిషనర్ ఆఫీస్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మీరట్ జిల్లాలో జరిగింది. యూపీ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం గంగానగర్-మవాన్‌రోడ్‌లో సాకేత్ క్రాసింగ్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో రోహిత్ అనే యువకుడు గత మంగళవారం తన తల్లికి మందులను కొనుగోలు చేయడానికి బుల్లెట్ వాహనంపై బయలుదేరాడు. బుల్లెట్ వాహనం నుంచి పెద్దగా శబ్దం వస్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు అతడిని ఆపివేశారు. శబ్ధం ఎక్కువగా వస్తుండడంతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ మిశ్రా రూ.16 వేల చలాన్ వేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఈ విషయంపై కొద్దిసేపు తర్వాత రోహిత్ తన తల్లిదండ్రులతో కలిసి మీరట్‌లోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాడు. అయితే ఎస్పీ అందుబాటులో లేరు. దీంతో ఈ రోజు బుధవారం తల్లిదండ్రులతో రోహిత్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించారు. గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ అనిల్‌కుమార్ తమను మానసికంగా వేధిస్తున్నాడని, ఎన్కౌంటర్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధిత యువకుడు కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే కమిషనర్ కార్యాలయం ఎదుట న్యూసెన్స్ చేయడంతో రోహిత్, అతడి తల్లిదండ్రులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి.. తీరా పెళ్లి అనేసరికి.. -
జనగామ కలెక్టర్ వాహనంపై రూ.22 వేల చలాన్లు
జనగామ: జనగామ జిల్లా కలెక్టర్ వాహనం (టీఎస్ 27ఏ 0001) పై యూజర్ చార్జీలు కలుపుకుని చలాన్ల కింద రూ.22,905 జరిమానా విధించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా కలెక్టర్ వాహనం 23 సార్లు ఓవర్ స్పీడ్‌తో వెళ్లినందుకుగాను సంబంధిత పోలీసులు ఈ జరిమానా విధించారు. ఈ చలాన్లు ఏడాదికాలంగా నమోదయ్యాయి. (చదవండి: భర్తీ చేయకుండా నిర్వీర్యం చేస్తారా?) -
నకిలీ చలాన్ల వ్యవహారం: తిన్నది కక్కిస్తున్నారు!
సాక్షి, అమరావతి బ్యూరో: నకిలీ చలాన్ల స్కాంలో స్వాహా చేసిన సొమ్మును వసూలు చేయడంలో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వేగం పెంచారు. జిల్లాలోని గాంధీనగర్, గుణదల, పటమట, జిల్లాలోని కంకిపాడు, మండవల్లి, నందిగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఇప్పటివరకు 772 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.5.21 కోట్ల సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ కట్టకుండా దస్తావేజు లేఖర్లు కొల్లగొట్టినట్టు నిర్ధారించారు. కొన్నాళ్లుగా ఈ వ్యవహారంపై రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఉన్నతాధికారులు లోతుగా పరిశీలన జరుపుతున్నారు. ఈ ఆరింటిలో ఒక్క మండవల్లి సబ్ రిజిస్ట్రార్ పరిధిలోనే 581 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.2.62 కోట్లు ఖజానాకు కన్నం పెట్టినట్టు తేల్చారు. ఇది రాష్ట్రంలో నకిలీ చలాన్ల ద్వారా జరిగిన అవినీతిలోకెల్లా ఇదే అధిక మొత్తం. అంతేకాదు.. ఈ సొమ్మునంతటినీ కాజేసింది అక్కడ ఉన్న బాలాజీ అనే ఒకే ఒక్క దస్తావేజు లేఖరి కావడం గమనార్హం! అలాగే విజయవాడలోని పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 143 దస్తావేజులకు సంబంధించి రూ.1.82 కోట్ల స్వాహా జరిగినట్టు తనిఖీల్లో గుర్తించారు. బాధ్యులపై చర్యలు.. ఈ నకిలీ చలాన్ల వ్యవహారం వెలుగు చూసినప్పట్నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సొమ్ము రికవరీపై దృష్టి సారించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు. ఇలా మండవల్లి, పటమట సబ్ రిజిస్ట్రార్లతో పాటు పటమట రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక జూనియర్ అసిస్టెంట్‌ను ఇటీవల సస్పెండ్ చేశారు. మండవల్లి దస్తావేజు లేఖరి బాలాజీపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆస్తి యజమాని నుంచి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజును వసూలు చేసి, తప్పుడు మార్గాల్లో మార్ఫింగ్ ద్వారా దస్తావేజు లేఖర్లు అవినీతికి పాల్పడినట్టు నిర్ధారణకు వచ్చారు. దీంతో సంబంధిత యజమానులకు అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. జరిగిన మోసంపై కంగుతిన్న సదరు యజమానులు ఆయా దస్తావేజు లేఖరులపై ఒత్తిడి పెంచడంతో వారు స్వాహా చేసిన సొమ్మును క్రమంగా రికవరీ చేయగలుగుతున్నారు. ఇలా ఇప్పటిదాకా విజయవాడ గాంధీనగర్, నందిగామ, కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో సంబంధీకుల నుంచి పూర్తి స్థాయిలో సొమ్ము రికవరీ చేశారు. మరోవైపు మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.2.62 కోట్ల సొమ్మును దిగమింగిన దస్తావేజు లేఖరి బాలాజీ నుంచి ఇప్పటి దాకా దాదాపు రూ.కోటి వరకు వసూలు చేశారు. మిగిలిన సొమ్మును త్వరలో రికవరీ చేస్తామని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు బాలాజీ కుమారుడు రామ్ధీరజ్ డాక్యుమెంట్ వెండర్‌గా ఉన్నాడు. ఆయన కూడా తండ్రి బాటలోనే పయనించాడు. దస్తావేజుల అమ్మకానికి వీలుగా చలాన్ల ద్వారా ప్రభుత్వానికి నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కానీ ధీరజ్ కూడా నకిలీ చలాన్ల ద్వారా రూ.1.53 లక్షలు స్వాహా చేసినట్టు అధికారులు గుర్తించి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. ధీరజ్ స్వాహా చేసిన రూ.1.53 లక్షలను అధికారులు వసూలు చేశారు. రూ.2.72 కోట్ల రికవరీ.. జిల్లాలో నకిలీ చలాన్ల ద్వారా కొల్లగొట్టిన రూ.5,21,27,931లో ఇప్పటివరకు రూ.2,72,22,719 లను (52.22 శాతం) అధికారులు రికవరీ చేశారు. మిగతా రూ.2,49,05,212 సొమ్ము వసూలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ రవీంద్రనాథ్ ‘సాక్షి’కి చెప్పారు. ఇవీ చదవండి: టీడీపీ విష ప్రచారం: కళ్లకు పచ్చ గంతలు ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు -
నకిలీ చలానాల కేసు: ప్రధాన నిందితుడు అరెస్ట్
సాక్షి, కృష్ణా జిల్లా: మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడు స్టాంప్ వెండర్ రామ్ ధీరజ్‌ను అరెస్ట్ చేశారు. కైకలూరు పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ వివరాలు వెల్లడించారు. నిందితుడి నుంచి రూ.1.02 కోట్లు నగదు రీవకరీ చేశామని తెలిపారు. నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బాధితులు ఆందోళన చెందనవసరం లేదని ఎస్పీ అన్నారు. నిందితుల నుంచి నూరు శాతం నగదు రికవరీకి చర్యలు చేపట్టామన్నారు. మిగిలిన మొత్తాన్ని కూడా రికవరీ చేస్తాం: మంత్రి ధర్మాన ప్రకాశం: రిజిస్ట్రేషన్ శాఖలో రూ.10 కోట్ల అవకతవకలు జరిగినట్లు గుర్తించామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే రూ. 7 కోట్లు రికవరీ చేశామన్నారు. మిగిలిన మొత్తాన్ని కూడా రికవరీ చేస్తామని మంత్రి ధర్మాన అన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. ఇవీ చదవండి: 'బుల్లెట్ బండి' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఎంపీ మిస్టరీ వీడింది.. మద్యం మత్తులో సొంత మేనల్లుడే.. -
నకిలీ చలానాల వ్యవహారంలో భారీగా రికవరీ
సాక్షి, కృష్ణా: విజయవాడలో నకిలీ చలానాల వ్యవహారంలో భారీగా రికవరీ చేపట్టినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. కాగా, రూ. 3కోట్లను రికవరీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒక్క పటమట సబ్ రిజిస్ట్రార్ పరిధిలోనే రూ.1.22 కోట్లు రికవరీ చేసినట్లు తెలిపారు. మండవల్లి రైటర్ సుబ్రహ్మాణ్యం నుంచి రికవరీకి చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. మొత్తం నకిలీ చలానాలు ఒకే రైటర్ సృష్టించినట్లు గుర్తించారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపై విచారణ చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. చదవండి: ఎద్దు అంతిమ సంస్కారం.. 3 వేల మంది హాజరు -
ఒక్క మాస్క్‌తో రూ.7.5 కోట్లు వసూళ్లు
గురుగ్రామ్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం సెల్‌ఫోన్ లేకున్నా పర్లేదు కానీ మాస్క్ మాత్రం తప్పనిసరి. మాస్క్ ధరించడం తప్పనిసరి. అయితే కొందరు నిర్లక్ష్యంతో మాస్క్‌లు ధరించడం లేదు. వారి నిర్లక్ష్యం వారి కుటుంబంతో పాటు సమాజంలో మరికొందరికి వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా మాస్క్ విధిగా ధరించాలనే నిబంధన అమల్లో ఉంది. ఉల్లంఘిస్తే జరిమానాలు భారీగా విధిస్తున్నారు. మరికొన్ని చోట్ల మాస్క్ ధరించకుండా ఉల్లంఘించిన వారికి బుద్ధి వచ్చేలా పలు వింత శిక్షలు విధించారు. అయితే తాజాగా గురుగ్రామ్ ఒక్క ఏడాదిన్నరలోనే రూ.ఏడున్నర కోట్ల ఆదాయం ఒక్క మాస్క్ ద్వారానే చేకూరింది. కరోనా మొదటి దశ వ్యాప్తి నుంచి భౌతిక దూరంతో పాటు శానిటైజర్ వాడకం, మాస్క్ తప్పనిసరిగా ధరించడం మనం చేస్తున్నాం. అయితే కొందరి నష్టంతో రెండో దశ తీవ్రస్థాయిలో దాడి చేసింది. ఈ నేపథ్యంలోనే హరియాణా రాష్ట్రం గురుగ్రామ్ పట్టణంలో మాస్క్ లేని వారికి పెద్ద ఎత్తున జరిమానా విధించడం మొదలుపెట్టారు. గతేడాది జనవరి 23వ తేదీన మొదలుపెట్టిన జరిమానాలు ఇప్పటివరకు కొనసాగుతోంది. ఎన్ని జరిమానాలు విధిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. ఈ ఏడాదిన్నర వ్యవధిలో మాస్క్ లేకుండా తిరిగిన వారు లక్షన్నర మందికిపైగా ఉన్నారని గురుగ్రామ్ పోలీస్ కమిషనర్ కేకే రావు తెలిపారు. మాస్క్ ధరించకపోవడంతో రూ.500 జరిమానా విధించారు. ఈ జరిమానాలతో ఏకంగా రూ.7.5 కోట్లు వచ్చాయని వెల్లడించారు. ఇంత ఆదాయం వచ్చిందంటే ఎంతలా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అధికారికంగా ఇంతమంది ప్రజలను గుర్తించామంటే తమకు తెలియకుండా ఎంతమంది మాస్క్ లేకుండా తిరుగుతున్నారో అని పోలీసులు పేర్కొంటున్నారు. ఎంతమందికి అని జరిమానాలు వేస్తాం.. ప్రజలకు స్పృహ.. బాధ్యత అనేది ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒక్క గురుగ్రామ్‌లోనే ఇంత మంది ఉంటే దేశవ్యాప్తంగా చూస్తే అర కోటి మందికి పైగా మాస్క్ లేకుండా తిరిగి ఉండవచ్చు అని నిఘా వర్గాలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రజలు విధిగా మాస్క్ ధరించాలని.. కరోనాను పారదోలేందుకు కృషి చేయాలని ప్రజలకు అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. -
నో మాస్క్: అధికారులపై మహిళ వీరంగం..జుట్టు పట్టుకొని!
కరోనా ప్రారంభమైనప్పటి నుంచి.. అంటే దాదాపు ఏడాదిన్నరగా మాస్కు ధరించడం, భౌతిక దూరం అనివ్యార్యమైపోయింది. వ్యాక్సిన్లు వచ్చినా మహమ్మారిని అడ్డుకునేందుకు కోవిడ్ నిబంధనలను పాటించడం తప్పనిసరి అయ్యింది. కరోనా తగ్గినట్లే తగ్గి కొత్త కొత్త అవతారాల్లో పుట్టుకొస్తుంది. అందుకే మాస్క్ ధరించకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్న వారిపై ఇప్పటికీ పోలీసులు జరిమానా విధిస్తున్నారు. అయితే ఎంత ప్రయత్నించినా కొందరిలో మార్పు రావడం లేదు. మొండి వైఖరి వీడకుండా తనకు నచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. అంతేగాక కరోనా మార్గదర్శకాలను పాటించాలని కోరిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మాస్క్ ధరించమని అడగిన అధికారులపై ఓ మహిళ రెచ్చిపోయింది. ఈ ఘటన దేశ రాజధాని డిల్లీలో చోటుచేసుకుంది. పీరాగారి మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అధికారులు చలాన్లు విధిస్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు మహిళలను ఆపి మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. మాస్క్ లేనందుకు జరిమానా కట్టాలని చలాన్ విధించారు. దీంతో మహిళలకు అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తరువాత ఇద్దరిలో ఓ మహిళా.. విధుల్లో ఉన్న అధికారులపై దాడికి తెగబడింది. చెంపదెబ్బలు కొడుతూ, వారిపై పిడిగుద్దుల వర్షం కురిపించింది. అధికారుల జుట్టు పట్టుకొని వీరంగం సృష్టించింది. ఆమెను ఆపేందుకు అక్కడి వారు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
ఓ స్క్రూ.. ఇలా కన్ఫ్యూజ్ చేసింది..!
సాక్షి, హైదరాబాద్: ఓ చిన్న ‘స్క్రూ ఓ వాహనం అడ్రస్‌నే’ మార్చేసింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనంపై కాకుండా మరో వాహనంపై ఈ–చలాన్ జారీ అయ్యేలా చేసింది. దీంతో బాధితుడు సిటీ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. టీఎస్––5570 రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన వాహనం నెంబర్ ప్లేట్‌పై మొదటి అంకె ‘5’ ముగింపులో స్క్రూను బిగించారు. దీంతో దూరం నుంచి చూసే వాళ్లకు ఇది ‘6’గా కనిపిస్తోంది. ఫలితంగా ఆ వాహనం నెంబర్ ‘6570’గా కనిపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించినపుడు ట్రాఫిక్ పోలీసులు తీసిన స్టిల్ కెమెరాల్లో ఈ నెంబర్ క్యాప్చర్ అయింది. ఆనెంబరు ‘6570’గా భావించి ఈ–చలాన్లు పంపుతూ వచ్చారు. దీంతో ఆ నెంబరుగల వాహన యజమాని.. గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తన వాహన నెంబర్ వినియోగిస్తున్నారని భావించారు. ఈ విషయాన్ని నగర ట్రాఫిక్ విభాగం అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు ఆరా తీయగా ‘5570’ నెంబర్ గల వాహనం ఉల్లంఘనలకు పాల్పడిందని, అయితే నెంబర్ ప్లేట్ బిగించడానికి వాడిన స్క్రూ కారణంగా అది ‘6570’గా మారిందని గుర్తించారు. దీంతో పెండింగ్ చలాన్లను నిజంగా నిబంధనలు ఉల్లంఘించిన వాహనానికి విధించారు. -
Viral Video: టికెట్ లేకుండా దొరికాడు.. ఆపై మన్‌కీబాత్‌తో ముంబైనే కదలించాడు!
ఏదైనా ఒక్కడితోనే మొదలవుతుంది అంటుంటారు పెద్దలు. అలాగే ముంబై మొత్తాన్ని ఆ ఒక్కడి వీడియో కదిలించింది. ‘టికెట్ లేని ప్రయాణం నేరం’ అనే ఆదేశాలకు తలొగ్గిన ఆ యువకుడు.. తనలాంటి వేలమంది ఆవేదనను ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఎందుకు అర్థం చేసుకోవట్లేదంటూ నిలదీశాడు. ఆ వీడియో గంటల వ్యవధిలోనే వైరల్ కావడంతో వేలమంది అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. ముంబై: మహానగరం.. జూన్ చివరివారంలో ఒక రోజు. లోకల్ రైలులో ప్రయాణిస్తున్న ఆ యువకుడ్ని.. పరేల్ స్టేషన్ వద్ద టీసీ దొరకబట్టాడు. టికెట్ లేదని, పైగా అనుమతి లేకున్నా రైళ్లో ప్రయాణిస్తున్నాడని ఛలానా రాయబోయాడు. ఆ యువకుడు బతిమాలడమో, లేదంటే పారిపోవడమో లాంటి ప్రయత్నాలు చేయలేదు. సరాసరి టీసీ వెంట ఆఫీస్‌కి వెళ్లాడు. అక్కడ తనకు విధించిన ఫైన్‌ను కట్టడానికి కూడా సిద్ధం అయ్యాడు. కానీ, ఆ ఘటనంతా సెల్ఫోన్లో రికార్డ్ చేస్తుండగా.. అధికారులు సైతం అడ్డుచెప్పలేదు. ‘‘ఒకప్పుడు నెలకు 35 వేల రూపాయలు సంపాదించేవాడ్ని. ఏడాదిన్నర క్రితం ఉద్యోగం పోయింది. ఖర్చులన్నీ పోనూ నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు 400రూ. చేరింది. ఈ మధ్యే జాబ్ దొరికింది. వెళ్లాలంటే రైలు మార్గం తప్ప నాకు వేరే దిక్కులేదు. కానీ, రెండో రోజే ఇలా టీసీకి దొరికిపోయా. టీసీ సాబ్ తన డ్యూటీ తాను చేశాడు. అలాగే ఫైన్ కట్టడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, లాక్‌డౌన్‌తో నాకంటే దారుణమైన కష్టాలు పడుతున్నవాళ్లను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు. This situation is there with the youth now in Mumbai. Same story can be guessed for me & my fellow DJ's from the Entertainment Industry. The government should look into this very seriously..#LockDown #adityathackeray #mumbailocal @AUThackeray @UdhavThackeray @VijayWadettiwar pic.twitter.com/8pnqtHWPyu — Omkar Raut (@djomkar) June 27, 2021 ఇప్పుడు రోజూ రైళ్లలో నాలాంటి వందల మంది ప్రయాణిస్తున్నారు. వాళ్లంతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాళ్లే. కానీ, అది సరదా కోసం చేయట్లేదు కదా. కుటుంబాల్ని పోషించుకోవాలనే తాపత్రయంతోనే అలా చేస్తున్నారు. కరోనా.. లాక్డౌన్ ఇక చాలు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులే సంపాదించుకోవడానికి అర్హులా? మాలాంటి వాళ్లకు రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతులు ఇవ్వరా? దయచేసి ప్రభుత్వం ఆ నిబంధనల్ని ఎత్తేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇదేం పబ్లిసిటీ స్టంట్ కాదు’’ అని మాట్లాడాడు ఆ యువకుడు. వెల్లువలా మద్దతు కరోనా కమ్మేసిన మహా నగరం ముంబైలో.. ఆంక్షల్ని క్రమంగా సడలిస్తూ వస్తోంది బీఎంసీ. అయితే లోకల్ ట్రైన్లను నడిపిస్తున్నా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురాలేదు. అత్యవసర సర్వీసుల పేరుతో గవర్నమెంట్ ఉద్యోగులకు, ఎమర్జెన్సీ కేటగిరీలో చేర్చిన ఉద్యోగులకు మాత్రమే లోకల్ ట్రైన్ ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. ఈ తరుణంలో తనలాంటి వేల మంది ప్రైవేట్ ఉద్యోగుల ఆవేదనను ప్రతిబింబిస్తూ ప్రశ్నించాడు ఆ యువకుడు. దీంతో సోషల్ మీడియా మొత్తం అతనికి మద్ధతుగా నిలుస్తోంది. ప్రైవేట్ వాహనాలకు రోజూ బోలెడు ఖర్చులు చేస్తున్నామని..భరించలేకపోతున్నామని కొందరు, ప్రభుత్వ ఉద్యోగుల వేళలు మార్చాలని మరికొందరు, గవర్నమెంట్ ఉద్యోగులతో కరోనా వ్యాపించదా?.. అందరికీ అనుమతులు ఇవ్వాల్సిందేనని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక కరోనా సాకుతో సామాన్యుడికి లోకల్ రైలులో ప్రయాణాలపై ఆంక్షలు విధించిన అధికార యంత్రాగం.. బస్సు ప్రయాణాలకు అనుమతి ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని కొందరు అంటున్నారు. ఇలా ఆ యువకుడి వీడియో సోషల్ మీడియాలో, టీవీ ఛానెల్లో చర్చకు దారితీసింది. పరిష్కారం ఏమిటసలు? కరోనా మహమ్మారి భయం పూర్తిగా పోని తరుణంలో.. రైలు ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తేయడం సరికాదనే అభిప్రాయంలో ఉన్నారు అధికారులు. లోకల్ రైళ్లలో గుంపులుగా ప్రయాణిస్తారు గనుకే ధైర్యం చేయడం లేదని బీఎంసీ చీఫ్ ఇక్బాల్ చాహల్ వెల్లడించారు. అయితే త్వరలో ఆ ఆంక్షల్ని సడలిస్తామని, ముందుగా మహిళలకు, ఆపై మిగతా సెక్టారలకు ఒక్కో దశలో అనుమతులు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. చదవండి: బాప్రే.. మాస్క్ లేకుండా నెలలో లక్షమంది!! -
ఇతగాడి పెండింగ్ చలానాలను చూస్తే అవాక్కవ్వాల్సిందే..
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా ఓ ద్విచక్ర వాహనదారుడు రణదీర్ కొన్నాళ్లుగా పెండింగ్ చలానాలతో తప్పించుకు తిరుగుతూ దొరికిపోయాడు. పోలీసులు పరిశీలించగా ఈ యువకుడు నడుపుతున్న ద్విచక్ర వాహనంపై 90చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. రూ.21,510 జరిమానాలు పెండింగ్‌లో ఉండటంతో పోలీసులు వాటిని అప్పటికప్పుడే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. పెండింగ్ లిస్టు చూసి పోలీసులు ముక్కుమీద వేలేసుకున్నారు. చదవండి: 28 నెలలకే జన్మించిన శిశువు.. -
అధికార మదం.. డబ్బుల్ని పోలీసులపైకి విసిరికొట్టిన ఎమ్మెల్యే
రూర్కీ: అధికార మదంతో ఓ ఎమ్మెల్యే పోలీస్ అధికారిపై డబ్బులు విసిరికొట్టిన ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ఛలానా కట్టమన్న అధికారులపై తన ఆక్రోశం వెల్లగక్కాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో ఆ బీజేపీ ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ప్రదీప్ బత్రా ఆదివారం సాయంత్రం తన కుటుంబంతో కలిసి షికారుకు వెళ్లాడు. ఆ టైంలో ముస్సోరి దగ్గర మాల్ రోడ్లో ఆయన కారును పోలీసులు ఆపారు. కొవిడ్ రూల్స్ ప్రకారం..బయట తిరిగే టైం ముగియడంతో పాటు ఆ టైంలో బత్రా మాస్క్ పెట్టుకోలేదని చెబుతూ పోలీసు అధికారి ఒకరు ఛలానా రాశాడు. అయితే తాను ఎమ్మెల్యేనని, తనకే ఛలానా రాస్తారా? అంటూ అధికారులపై ఊగిపోయాడు ప్రదీప్. అయినప్పటికీ ఆ అధికారి మాత్రం ఛలానా కట్టాల్సిందేనని స్పష్టం చేశాడు. దీంతో కారులోంచి డబ్బు తెచ్చి పోలీసులపై విసిరి.. ‘ఎంత కావాలో తీసుకో!’ అంటూ.. ఎమ్మెల్యే ప్రదీప్ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయాడు. pic.twitter.com/xrFPXWXf0J — ashwik (@ursashwik) June 17, 2021 ఇక అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి.. వైరల్ చేశాడు. దీంతో ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం మొదలైంది. పోలీస్ అధికారికి ఆ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఉత్తరాఖండ్ పోలీసుల సంఘం ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేసింది. అయితే ఆ టైంలో తాను, తన కుటుంబం మాస్క్ పెట్టుకునే ఉన్నామని, ఐడీ కార్డు చూపించినా ఆ అధికారి వినలేదని, పైగా పోలీసులే తనతో దురుసుగా ప్రవర్తించారని ప్రదీప్ చెప్తున్నాడు. ఇక ఈ ఘటనలో అధికారి తన డ్యూటీ సక్రమంగా చేశాడని, విమర్శల నేపథ్యంలో ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేపడతామని ఉన్నతాధికారులు తెలిపారు. చదవండి: గాడిదపై తిరుగుతున్నారేమో! -
మాస్కు లేకుండా మాజీ ఎమ్మెల్యే తీగల, రూ.1000 ఫైన్
సాక్షి, హైదరాబాద్: మాజీ శాసన సభ్యులు, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డికి సరూర్‌నగర్ పోలీసులు చలానా విధించారు. కారులో మాస్క్ లేకుండా వెళుతున్న తీగల కృష్ణారెడ్డికి పోలీసులు 1000 రూపాయల చలానా వేశారు. కర్మన్‌ఘాట్ చౌరస్తా వద్ద సరూర్‌నగర్ పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. అదేసమయంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తన కారులో వెళ్తున్నారు. పోలీసులు ఆయన కారును తనిఖీ చేశారు. ఆ సమయంలో తీగల కృష్ణారెడ్డి మాస్క్ ధరించలేదు. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని సరూర్‌నగర్ సబ్ ఇన్స్పెక్టర్ ముకేష్.. మాజీ ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. కారులో వెళ్తున్నా మాస్కు ధరించాలా? అంటూ ఆయన ఎస్ఐతో గొడవకు దిగారు. ఈ క్రమంలో సబ్ఇన్స్పెక్టర్ ముకేశ్‌కు తీగల కృష్ణారెడ్డికి మధ్య వాగ్వాదం నెలకొంది. మాకు అంతా సమానులే అంటూ పోలీసులు తీగలకు ఎట్టకేలకు 1000 రూపాయల చలానా విధించారు. -
ఇదేం చిత్రం: హెల్మెట్ లేదని ట్రక్కు డ్రైవర్‌కు జరిమానా
భువనేశ్వర్: నిబంధనల పేరిట ట్రాఫిక్ పోలీసులు విచ్చలవిడిగా జరిమానాలు విధిస్తూ వాహనదారుల జేబుకు చిల్లు వేస్తున్నారు. ప్రశ్నిస్తే మీ రక్షణ.. మీ భద్రత కోసమే ఇలా చేస్తున్నామని బదులు ఇస్తున్నారు. అయితే ఒక్కోసారి వీరి చేష్టలు.. ప్రవర్తన.. పని ప్రజలకు చిర్రెత్తుత్తుంది. తాజాగా అలాంటి సంఘటనే ఒడిశా రాష్ట్రంలో జరిగింది. హెల్మెట్ ధరించలేదని ట్రక్కు డ్రైవర్‌కు రూ.వెయ్యి జరిమానా విధించడం తీవ్ర దుమారం రేపుతోంది. అక్కడి ట్రాఫిక్ పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకునేందుకు ట్రక్కు డ్రైవర్ ప్రమోద్ కుమార్ శ్వాన్ జిల్లా కేంద్రం గంజంలోని స్థానిక ప్రాంతీయ రవాణా కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ అధికారులు అతడి వివరాలు పరిశీలించగా ఒక జరిమానా పెండింగ్‌లో ఉందని గుర్తించారు. అదేమిటంటే ‘హెల్మెట్ లేకుండా వాహనం నడపడం’ అని ఉంది. దీన్ని చూసి ప్రమోద్ కుమార్ షాక్‌కు గురయ్యాడు. ట్రక్కు నడిపే డ్రైవర్ హెల్మెట్ ధరించడమేంటి అని సందేహం వ్యక్తం చేశాడు. ట్రక్కు వాహనం నంబర్‌పైనే హెల్మెట్ లేకుండా వాహనం నడిపాడని జరిమానా విధించడం గమనార్హం. అధికారులకు ఎంత చెప్పినా వినకపోవడంతో ఆ డ్రైవర్ ప్రమోద్ కుమార్ రూ.వెయ్యి జరిమానా కట్టేశాడు. అనంతరం అతడి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేశారు. ‘మూడేళ్లుగా ట్రక్కు నడుపుతున్నా. నీటి సరఫరా చేసేందుకు ట్రక్కు వినియోగిస్తున్నా. నా పర్మిట్ గడువు ముగియడంతో రెన్యూవల్ కోసం ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్లాను. అక్కడ హెల్మెట్ లేకుండా ట్రక్కు నడుపుతున్నానని జరిమానా విధించారు. డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తున్నారు. అవసరం లేకున్నా వేధిస్తున్నారు. ఇలాంటి తప్పులను ప్రభుత్వం నిరోధించాలి’ అని ట్రక్కు డ్రైవర్ ప్రమోద్ కుమార్ మీడియాతో చెప్పాడు. -
ఎన్టీఆర్ చలానా కట్టిన అభిమాని, కానీ!
హీరో కోసం ఏదైనా చేస్తారు అభిమానులు. ఇదిగో ఇక్కడ చెప్పుకునే అభిమాని కూడా అంతే! పెద్ద మనసుతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కారుకు సంబంధించిన ట్రాఫిక్ చలానాను చెల్లించాడు. దీనికి ప్రతిఫలంగా చిన్న కోరికను తీర్చమని హీరోను అడిగాడు. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీని చదివేయండి.. గత నెలలో నెహ్రూ ఔటర్ రింగు రోడ్డు మీద మితిమీరిన వేగంతో కారు నడిపినందుకుగానూ తెలంగాణ పోలీసులు జూనియర్ ఎన్టీఆర్‌కు రూ.1035 జరిమానా విధించారు. ఇప్పటివరకు తారక్ ఆ జరిమానా చెల్లించనేలేదు. ఈ విషయం తెలుసుకున్న ఓ అభిమాని హీరోకు విధించిన చలానా మొత్తం కట్టేశాడు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దీనికి ప్రతిఫలం ఆశించాడు. 'నాకు, నా స్నేహితులు కొందరికి మల్లికార్జున లేదా భ్రమరాంభ థియేటర్లలో ఆర్ఆర్ఆర్ టికెట్లు ఇప్పించండి' అని రాసుకొచ్చాడు. మరి దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తారో, లేదో చూడాలి! (చదవండి: ప్రభుదేవా తమ్ముడి డాన్స్ రాజా) కాగా స్వాతంత్ర సమర యోధులు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం రౌధ్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్). అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏ ఏడాదే రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. జక్కన్న రాజమౌళి చెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో చరిత్రలో ఎప్పుడూ ఎదురుపడని కొమురం భీమ్, సీతారామరాజు సినిమాలో మాత్రం ఓ మంచిపని కోసం కలిసి యుద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: ఆర్ఆర్ఆర్: కథ క్లైమాక్స్‌కు వచ్చింది) -
కరోనా: భారీ స్థాయిలో చలాన్లు
లక్నో: అలీఘర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం పోలీసులు 1000 చలాన్లు జారీ చేశారు. కోవిడ్ ప్రోటోకాల్ గురించి అవగాహన కల్పించడానికి పోలీసులు నిర్వహించిన ప్రచారంలో భాగంగా ముఖానికి మాస్కులు ధరించని డ్రైవర్లపై రూ.100 చొప్పున జారీమానా విధించారు. జిల్లాలోని ప్రజలందరూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరిస్తున్నారా అని తెలుసుకునేందుకు నగరమంతా పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సర్కిల్ ఆఫీసర్ అనిల్ మాట్లాడుతూ, ‘కరోనా ప్రోటోకాల్ గురించి అవగాహన కల్పించడానికి రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి కారులో ముగ్గురు కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించకూడదు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరిస్తున్నారా లేదా అని తనిఖీ చేస్తున్నాం. ఇప్పటివరకు సుమారు 1,000 చలాన్లు జారీ చేశాం’ అని తెలిపారు. ఇప్పటి వరకు ఉత్తర ప్రదేశ్‌లో 55,538 యాక్టివ్ కరోనావైరస్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,76,677 మంది రికవరీ కాగా 3,542 మంది మరణించారు. చదవండి: భారత్‌లో ఒక్కరోజే 83వేల కేసులు -
మాస్క్ 'ఫైన్' పడింది!
వరంగల్ క్రైం: కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ మేరకు మాస్క్ లేకుండా బయటకు రావొద్దని, అత్యవసర పనులపై బయటకు వచ్చిన సమయంలో భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం, వైద్యాధికారులు సూచిస్తున్నారు. అయినా చాలా మంది పట్టించుకోవడం లేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం నుంచి వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో తనిఖీలు విస్తృతం చేశారు. ఈ మేరకు 467 మందిపై ఈ పిటీ కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి ఇష్టరాజ్యంగా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో భాగంగా మాస్కులు ధరించని వారి వివరాలను ట్యాబ్‌ల్లో నమోదు చేసి ఆన్లైన్ ద్వారా జరిమానా విధిస్తున్నారు. కేసులు నమోదైన వ్యక్తులు కోర్టుకు వెళ్లి జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. మాస్క్‌లు తప్పనిసరి... కరోనా వ్యాప్తిని నిరోధించడానికి, వ్యక్తిగతంగా ఎవరికి వారు రక్షణ కోసం తప్పక మాస్క్ ధరించాలి. ఈ మేరకు మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఈ విషయంలో ప్రజలు మరింత అవగాహన పెంపొందించుకోవాలి. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న పోలీసులకు సహకరించాలి.– వి.తిరుపతి, సెంట్రల్ జోన్ ఇన్చార్జ్ డీసీపీ -
ఈఎంఐ కట్టనందుకు ఏడు రెట్ల జరిమానా
కర్ణాటక ,హుబ్లీ: ప్రభుత్వ ఆదేశాలకు తిలోదకాలు ఇచ్చి కర్ణాటక బ్యాంక్ వినియోగదారుని నుంచి పరోక్షంగా దోపిడీకి పాల్పడుతోందని విమర్శలు సర్వత్రా వెల్లువెత్తాయి. ఆ బ్యాంక్ ఈఎంఐ చెల్లింపులో జాప్యం జరిగినందుకు ఒకే నెలలో ఏడు రెట్ల జరిమానా విధించి సదరు బ్యాంకు వినియోదారున్ని నిలువునా వేధించింది. బాధితుడు సంగమేష్ హడపద తెలిపిన వివరాల మేరకు తమ సెలూన్ షాపు బంద్ అయినందు వల్ల ఈఎంఐ చెల్లించలేకపోయానన్నాడు.(మారిటోరియం పొడిగింపుతో మరిన్ని డిఫాల్ట్స్!) ఒక్క నెల ఈఎంఐ జాప్యం చేయడంతో రూ.590లు చొప్పున బ్యాంక్ మొత్తం ఏడు రెట్లు రూ.4150లను వసూలు చేసిందని వాపోయాడు. దీనిపై సంబంధిత అధికారులను వివరణ అడిగితే ఉదాసీనంగా జవాబు చెప్పారన్నారు. బజాజ్ ఫైనాన్స్‌లో రూ.30 వేలు రుణం తీసుకొన్న సంగమేష్ ప్రతి నెల రూ.3 వేలు ఈఎంఐ చెల్లించేవారు. ఈఎంఐ చెల్లింపులను వాయిదా వేస్తూ కేంద్రం ఆదేశాలు ఉన్నా బ్యాంకులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. దీంతో బతుకుబండిని సాగించడమే కష్టమైందని బ్యాంక్ మేనేజర్‌కు వివరించగా త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని బాధితుడు పేర్కొన్నాడు. -
కేటీఆర్ ఫైర్.. 20 వేల జరిమానా
ఎర్రగడ్డ : ఎవరు ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది...నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని చెప్పాం కదా...అయినా ఎందుకు ఏర్పాటు చేశారంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని సుల్తాన్‌నగర్‌బస్తీ ప్రాంతంలో శుక్రవారం మంత్రి కేటీఆర్ బస్తీ దవాఖానాను ప్రారంభించారు. ఇందుకోసం మద్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడకు కేటీఆర్ కారు దిగగానే రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీని తొలగిస్తే తప్ప తాను బస్తీ దవాఖానాను ప్రారంభించేది లేదని అధికారులకు తెలిపారు. అప్పటికప్పుడు జీహెచ్ఎంసీ సర్కిల్–19 డీఎంసీ రమేష్‌ను, ఏఎంఓహెచ్ డాక్టర్ బిందును పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. ఫ్లెక్సీని ఏర్పాటు చేయించిన స్థానిక కార్పొరేటర్ షహీన్ బేగంకు అప్పటికప్పుడు రూ.20 వేలు జరిమానాను విధించారు. ఇందుకు సంబంధించిన రసీదును అధికారులు కార్పొరేటర్‌కు అందజేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ స్థానికంగా ఏర్పాటు చేసిన దవాఖానాను ప్రారంభించారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
అధిక ధరలకు మాస్క్‌లు.. 20 వేలు జరిమానా
గచ్చిబౌలి: అధిక ధరలకు మాస్క్‌లు విక్రయిస్తున్న మెడికల్ షాప్ యజమానికి రూ.20 వేలు జరిమానా విధించినట్లు శేరిలింగంపల్లి సర్కిల్–21 ఉప వైద్యాధికారి డాక్టర్ రంజిత్ తెలిపారు. అంజయ్యనగర్‌లోని సాయిదుర్గ మెడికల్ స్టోర్‌లో కరోనా సాకుతో మాస్క్‌లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఉప వైద్యాధికారి రంజిత్, సిబ్బంది మెడికల్ స్టోర్ యజమానికి రూ.20 వేలు జరిమానా విధించారు. మంగళవారం నుంచి మెడికల్ స్టోర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. అధిక ధరకు విక్రయిస్తే ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. మెడికల్ షాపులపై ఫిర్యాదు భాగ్యనగర్‌కాలనీ: అధిక ధరలకు మాస్క్‌లు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై ఫోరం ఫర్ అగెనెస్ట్ కర ప్షన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కాట్రగడ్డ సాయితేజ కూకట్పల్లి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. బాలాజీనగర్‌లోని మారుతి మెడికల్ షాపు వద్దకు వెళ్లి మాస్క్‌లు కొనుగోలు చేయగా సుమారు 30 నుంచి 80 రూపాయల వరకు ఎక్కువ ధరకు విక్రయించారు. మరోక మెడికల్ షాపు శ్రీసాయి మెడికల్ అండ్ జనరల్ స్టోర్‌కు వెళ్లి మాస్క్‌లు కొనుగోలు చేయగా అక్కడ కూడా అధిక ధరలకు విక్రయించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారించగా అధిక ధరలకు మాస్కులు విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. దీంతో వారి వద్ద నుంచి 18 మాస్క్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
సీఎం ఫెక్ల్సీకి.. పెనాల్టీ!
సాక్షి, సిటీబ్యూరో: సీఎం బర్త్‌డే సందర్భంగా మొక్కలు నాటుదాం అంటూ పిలుపునిస్తూ ఫెక్ల్సీ ఏర్పాటు చేసినందుకు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్(జెడ్సీ) ప్రావీణ్యకు సోమవారం జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం రూ.10 వేలు ఈ–చలానా జారీ చేసింది. గోల్కొండ కోట సమీపంలో సీఎం ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉల్లంఘనలకు పాల్పడ్డారని పేర్కొంటూ చలాన్లు జారీ చేశారు. దీనిపై కమిషనర్‌తో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటానని ప్రావీణ్య తెలిపారు. ఈ విషయంపై కమిషనర్‌ను సంప్రదించగా, బ్యానర్లు క్లాత్వా, ఫ్లెక్సీలా అనేది పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తాము క్లాత్‌వి ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు సూచించామన్నారు. ఒకవేళ ఫ్లెక్సీలైతే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా గోల్కొండ కోట వద్ద ఇలాంటి ప్రచారం ఫెక్ల్సీలు ఏంటని ఓ సంస్థ ట్విట్టర్లో ఫిర్యాదు చేయడం వల్లే చలానా విధించారని తెలిసింది. -
మందుబాబులూ.. మీ జేబు జాగ్రత్త
సాక్షి, సిటీబ్యూరో: ‘‘వీకెండ్.. ఫ్రెండ్ పార్టీకి పిలిచాడు.. ఒకటి రెండు పెగ్గులేసి వాహనం డ్రైవ్ చేసుకుంటూ ఇంటికిపోదాం.. ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే మహా అయితే రూ.2 వేలు ఫైను కోర్టులో కట్టేస్తే సరి’’ అనుకుంటూ లైట్ తీసుకుంటే కుదరదు. మద్యం తాగి వాహనాలు నడిపే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న న్యాయస్థానాలు భారీ మొత్తం జరిమానాలు విధిస్తున్నాయి. ఇటీవల సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓ మందుబాబుకు రూ.25 వేల జరిమానాతో పాటు మూడు రోజుల జైలు శిక్ష కూడా పడింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చిక్కిన ‘నిషా’చరులకు రూ.16 వేల నుంచి రూ.21 వేల వరకు జరిమానాలు విధించారు. ‘డిసెంబర్ 31’ సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో డ్రంకన్ డ్రైవ్‌పై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. సాధారణంగా పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనల్ని మూడు రకాలుగా విభజిస్తుంటారు. వాహన చోదకుడికి మాత్రమే ముప్పుగా మారేవి. ఎదుటి వ్యక్తిని ముప్పుగా పరిగణించేవి, వాహన చోదకుడితో పాటు ఎదుటి వారికీ ముప్పు తెచ్చేవి. మిగిలిని రెండింటి కంటే మూడో కోవకు చెందిన వాటిని ట్రాఫిక్ విభాగం అధికారులు తీవ్రంగా పరిగణిస్తారు. మద్యం తాగి వాహనాలు నడపటం కూడా ఈ కోవకు చెందినదే కావడంతో స్పెషల్ డ్రైవ్స్ సహా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ‘నిషా’చరులకు జరిమానాతో పాటు జైలు శిక్షణ విధించే అవకాశం మోటారు వాహన చట్టంలో ఉంది. ట్రాఫిక్ పోలీసులు ఈ డ్రైవ్‌ను మోటారు వెహికల్ యాక్ట్‌లోని సెక్షన్ల ప్రకారం చేస్తారు. మద్యం తాగి చిక్కిన వారిని కోర్టుకు తీసుకువెళ్లాలంటే సెక్షన్ 185 ప్రకారం బుక్ చేసి, ఆధారాలతో వెళ్లడం అవసరం. చట్ట ప్రకారం ప్రతి 100 మిల్లీ లీటర్ల రక్తంలో 30 మిల్లీ గ్రాములు, అంతకంటే ఎక్కువ ఉంటేనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే, ట్రాఫిక్ పోలీసులు గతంలో ‘నిషా’చరులను ర్యాష్ డ్రైవింగ్ (సెక్షన్ 184బి) కిందే కేసు నమోదు చేసి ఫైన్‌తో సరిపెట్టేవారు. ఆపై సెక్షన్ 185 ప్రకారం బుక్ చేసి కోర్టుకు తరలిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్ నుంచి వచ్చిన ప్రింట్ అవుట్‌ను ఆధారంగా చూపి చిక్కిన వ్యక్తిని కోర్టులో ప్రవేశపెడుతున్నారు. ఈ ఉల్లంఘనకు ఈ ఏడాది ఆగస్టు వరకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించేవారు. అయితే, సెప్టెంబర్ 1 నుంచి భారీ స్థాయిలో జరిమానాలు విధిస్తున్నారు. చోదకుడు అత్యంత ప్రమాదకర స్థాయిలో మద్యం తాగాడని లేదా పదేపదే మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కుతున్నాడని న్యాయమూర్తి భావిస్తే 2 నెలల వరకు జైలు శిక్ష కూడా విధిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిలో ఎక్కువ మోతాదు కౌంట్ చూపించిన వారికి, ఒకటి కంటే ఎక్కువ సార్లు చిక్కిన వారికి న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తుండడంతో భయపడిన కొందరు తమ వాహనాలకు ట్రాఫిక్ పోలీసుల వద్దే వదిలేస్తున్నారు. ఈ తరహా 430 కార్లు/ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోలు ఆయా ట్రాఫిక్ ఠాణాల్లో పడి ఉన్నాయి. భారీ జరిమానాల్లో కొన్ని.. ♦ ఈ ఏడాది సెప్టెంబర్ 22న అల్వాల్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన ద్విచక్ర వాహన చోదకుడికి న్యాయస్థానం రూ.25 వేల జరిమానా, మూడు రోజుల జైలు శిక్ష విధించింది. ♦ అక్టోబర్ 8న జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చిక్కిన వాహన చోదకుడిని కోర్టు రూ.21 వేలు జరిమానా విధించింది. ♦ నగరంలోని వివిధ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల పరిధిలో చిక్కిన పలువురు ‘నిషా’చరులకు కోర్టులు రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు జరిమానాలుగా విధించాయి. ‘డిసెంబర్ 31’ వరకు ప్రతి రోజూ.. నగరంలో వాహన చోదకులతో పాటు పాదచారుల భద్రత, ప్రమాదాలు నిరోధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. అందులో భాగంగా మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్స్ చేపడుతున్నాం. సాధారణ రోజుల్లో వారానిరి రెండు మూడు రోజులు ఈ డ్రైవ్స్ ఉంటాయి. ‘డిసెంబర్ 31’ సమీపిస్తున్న నేపథ్యంలో అది ముగిసే వరకు ప్రతి రోజూ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశాం. నిత్యం 10 నుంచి 15 బృందాలు, వారాంతాల్లో 30 నుంచి 35 టీమ్స్ వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాయి. చిక్కిన ప్రతి ఒక్కరికీ కౌన్సిలింగ్ చేసి కోర్టుకు తరలిస్తున్నాం. జరిమానా విధింపు అనేది న్యాయస్థానం పరిధిలోని అంశం. ఒకటి కంటే ఎక్కువ సార్లు చిక్కిన వారికి కోర్టులు జైలు శిక్షలు కూడా వేస్తున్నాయి. – అంజనీకుమార్, సిటీ పోలీసు కమిషనర్ -
గ్రానైట్ రైట్ ‘రాతి’రేల కాసుకో
సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి, ఏలూరు: తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి వస్తున్న గ్రానైట్ ఓవర్‌లోడ్ వాహనాల నిమిత్తం చెల్లించాల్సిన జరిమానా ఎగ్గొట్టేందుకు అక్రమార్కులు పన్నాగం పన్నారు. దీంతో వాహనాలు రాత్రుళ్లు దొడ్డిదారిన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో రాజమండ్రి–హైదరాబాద్ హైవేపై ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వద్ద తెలంగాణ సర్కారు, పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి వద్ద ఆంధ్రా ప్రభుత్వం చెక్‌పోస్టులను ఏర్పాటు చేసుకున్నాయి. ఓవర్‌లోడ్‌తో వస్తున్న గ్రానైట్ వాహనాలు ఈ చెక్ పోస్టుల ద్వారా కాకుండా వేరే మార్గాల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. ఏపీలోకి వచ్చే వాహనాల నుంచి ఓవర్లోడింగ్కు టన్నుకు రూ.వెయ్యి చొప్పున అధికారులు వసూలు చేస్తారు. ఒక్కో లారీ 20 టన్నుల వరకూ ఓవర్‌లోడ్‌తో వస్తున్నాయి. అంటే ఒక్కోవాహనానికి రూ.20 వేల వరకూ జరిమానా ఎగ్గొట్టడానికి అక్రమార్కులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. తెలంగాణ నుంచి రోజూ వందలాది గ్రానైట్ లారీలు మన రాష్ట్రంలోని కృష్ణపట్నం, కాకినాడ, విశాఖ పోర్టులకు వెళ్తున్నాయి. దీంతో రాష్ట్ర ఆదాయానికి గండిపడుతోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో ఉదయం బయలుదేరి..! తెలంగాణలోని ఖమ్మం, ఇతర జిల్లాల నుంచి గ్రానైట్ కాకినాడ, విశాఖపట్నం పోర్టుల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది. దీంతో గ్రానైట్ లోడ్ వాహనాలు ఉదయం తెలంగాణలో బయలుదేరి సాయంత్రం, రాత్రికి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు చేరుకుంటాయి. ఇవి ఎక్కువ ఓవర్‌లోడింగ్‌తో వస్తుంటాయి. ఒక్కో లారీపై సుమారు 60 టన్నుల వరకూ లోడింగ్‌కు అనుమతి ఉంటుంది. అయితే 75 నుంచి 80 టన్నులకుపైగా బరువైన గ్రానైట్ రాళ్లతో ఇవి వస్తున్నాయి. ఓవర్‌లోడ్ ఉంటే బోర్డర్ చెక్‌పోస్టు వద్ద టన్నుకు రూ.వెయ్యి వరకూ జరిమానా చెల్లించాలి. అంటే ఒక్కో లారీకి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు జరిమానా కట్టాలి. అయితే ఎక్కువ శాతం రవాణాదారులు జరిమానా ఎగ్గొట్టేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. చాలా వరకూ గ్రానైట్ నకిలీ వే బిల్లులతో రవాణా అవుతున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ, మైనింగ్ టాక్స్‌లూ ఎగ్గొడుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి పన్నులను చెల్లించకుండా కోట్ల రూపాయల విలువైన రాయిని కాకినాడ, విశాఖ పోర్టుల ద్వారా ఇతర దేశాలకు తరలిస్తున్నారు. ఈ విషయం వాణిజ్యపన్నుల శాఖ అధికారులకుతెలిసినా వారు పట్టించుకోరు. వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల నుంచి వెళ్లడానికి అభ్యంతర పెట్టకుండా ఉండేందుకు ఆయా శాఖలకు నెలవారీ మామూళ్లు ఇస్తున్నట్లు సమాచారం. రోజుకు 40 నుంచి 60 లారీల వరకూ ఓవర్‌లోడ్ తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రెండురోజల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే 11 లక్షల రూపాయల వరకూ జరిమానా వసూలైంది. కళ్లుగప్పేదిలా..! గ్రానైట్ వాహనాలు అధికారుల కళ్లుగప్పి ఆంధ్రాలోకి ప్రవేశించడమే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు వెళ్తున్నాయి. తెలంగాణ నుంచి వచ్చే వాహనాలు అశ్వారావుపేట, జీలుగుమిల్లి మీదుగా కాకుండా, గంగారం నుంచి రాఘవాపురం మీదుగా ఏలూరు చేరుకుని విజయవాడ– కోల్‌కతా హైవే ఎక్కుతున్నాయి. అదేవిధంగా మేడిశెట్టివారిపాలెం, అడ్డరోడ్డు నుంచి మళ్ళి యర్రగుంటపల్లి, మక్కినవారిగూడెం, లక్ష్మీపురం మీదుగా హైదరాబాద్ –రాజమండ్రి హెవేపైకి చేరుకుని మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో ఏపీకి రావాల్సిన ఆదాయానికి రూ.కోట్లల్లో గండి పడుతోందని సమాచారం. సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి దొడ్డి దారిన వెళ్తున్న వాహనాల నుంచి పన్నులు వసూలు చేస్తే మన ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. రోజూ ఆంధ్రా సరిహద్దులోకి చేరుకున్నాక రాత్రి 9 గంటల తరువాతే ఈ వాహనాలన్నీ చెక్ పోస్టులు లేని దారుల్లో నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేసిస్తున్నాయి. ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో మరిన్ని చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేస్తే అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం ఖాయం. తనిఖీలు నిర్వహిస్తాం చెక్‌పోస్టులు తప్పించుకునేందుకు భారీ వాహనాలు వేరే మార్గాలను ఎంచుకోవడంపై దృష్టి పెడుతున్నాం. వాణిజ్యపన్నుల శాఖ, రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం ద్వారా ఈ అక్రమ రవాణాను అడ్డుకుంటాం. మాపై ఎటువంటి ఒత్తిళ్లూ లేవు.– రేవు ముత్యాలరాజు, జిల్లా కలెక్టర్ -
ఇక నుంచి నో పార్కింగ్ జరిమానా రూ.5 వేలు
సాక్షి, మేడ్చల్‌జిల్లా: నో పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు నిలిపిన వారికి రూ.5 వేలు జరిమానా విధించాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. తక్షణమే నోపార్కింగ్ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీ, పంచాయతీశాఖ సిబ్బంది నో పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు నిలపకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నేర ప్రవృత్తి కలిగిన వారి పట్ల పోలీసులు నిరంతరం నిఘా పెట్టాలని కలెక్టర్ సూచించారు. అసాంఘిక శక్తులకు నిలయంగా ఉన్న అడ్డాలను గుర్తించి పోలీసు వ్యవస్థను పటిష్టపరచాలన్నారు. పోలీసు పెట్రోలింగ్ కూడా నిరంతరంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా సంస్థలు, ప్రార్థన మందిరాలు, ఖాళీ స్థలాల వద్ద మద్యం తాగకుండా ఉండేలా ఎక్సైజ్‌శాఖ నిఘా పెట్టాలన్నారు. స్కూళ్లలో విద్యార్థులకు స్వీయరక్షణపై ఉపాధ్యాయులు, ఇళ్లల్లో తల్లిదండ్రులు బోధన చేయాలన్నారు. శంషాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ‘దిశ’ తహసీల్దార్ విజయారెడ్డి, అటెండర్ చంద్రయ్య ఘటనలను ప్రస్తావిస్తూ, వారికి నివాళులర్పించారు. ప్రతి మహిళ స్వీయరక్షణ, ఆత్మస్థయిర్యం పెంపొందించుకోవాలన్నారు. గృహహింస, పనిచేసేచోట, లైంగిక, వరకట్నం వేధింపుల నుంచి రక్షణ పొందటానికి మహిళలు 181 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలన్నారు. ఆపదలో ఉన్న పిల్లల కోసం 1098 టోల్‌ఫ్రీ నంబరును సంప్రదించాలన్నారు. నాటిన ప్రతి మొక్కనుబతికించాలి హరితహారంలో నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలని కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. చనిపోయిన మొక్క స్థానంలో మరో మొక్కను నాటాలన్నారు. మొక్కలు నాటటం, వాటిని కాపాడటం ఒక దైవంగా భావించాలన్నారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు తమ పరిధిలోని ప్రతి మొక్కను బతికించాలన్నారు. శానిటేషన్, పరిశుభ్రత, రోడ్ల మరమ్మతులను ఎప్పటికప్పుడు గుర్తించి వెంటనే పనులు చేపట్టాలన్నారు. విద్యుదాఘాతంతో మరణించిన పశువులకు నష్టపరిహారాన్ని సంబంధిత రైతులకు అందించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ విద్యాసాగర్, డీఆర్ఓ మధుకర్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. -
జొమాటోకు రూ. లక్ష జరిమానా
చెన్నై : అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న జొమాటో సంస్థకు చెందిన బ్యాగులను గుర్తించి రూ. లక్ష జరిమానాను చెన్నై కార్పొరేషన్ అధికారులు విధించారు. చెన్నైలో డెంగీ నివారణ చర్యలు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా ఎక్కడెక్కడ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయో తనిఖీలు చేసి, ఆయా సంస్థలు, కార్యాలయాలకు కార్పొరేషన్ అధికారులు జరిమానా విధిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై చేట్‌పెట్ ఎంసీ నికల్సన్ రోడ్డు ఓ భవనంలో ప్రముఖ ఆన్లైన్ ఆహార సంస్థగా ఉన్నజొమాటోకు చెందిన బ్యాగులు అపరిశుభ్రంగా ఉండడం గుర్తించి రూ.లక్ష జరిమానా విధించారు. -
సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌కు జరిమానా
సాక్షి, రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌కు జీహెచ్ఎంసీ అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. బిర్యానీకి జాతీయ స్థాయిలో పేరున్న ఈ హోటల్లో అపరిశుభ్ర వాతావరణం, పాడైపోయిన కూరగాయలు కనిపించడంతో అధికారులు ఈ జరిమానా విదించారు. గురువారం హోటల్‌కు వచ్చిన ఓ వినియోగదారులు బిర్యానీలో వెంట్రుకలు కనిపించడంతో సిబ్బందిని నిలదీశారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆయన జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ సుదర్శన్‌రెడ్డి, ఏఎంహెచ్‌వో రవీందర్‌గౌడ్, వెటర్నరీ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డిలు హోటల్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. హోటల్లో సింగల్ యూజ్ ప్లాస్టిక్ క్యారీబాగులు కనిపించాయి. అలాగే కుళ్లిపోయిన కూరగాయలు వినియోగిస్తుండటం కిచన్లో అపరిశుభ్ర వాతావరణం కనిపించింది. దీంతో అధికారులు హోటల్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి నోటీసులు జారీ చేసి లక్ష రూపాయల జరిమానా విధించారు. మరోమారు ఇలాగే ఉంటే హోటల్‌ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్యారడైజ్ హోటల్లో తనిఖీలు చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు జమ్జమ్ బేకరీకిరూ.15వేల జరిమానా ప్యారడైజ్ సర్కిల్లో ఉండే జంజం బేకరీకి రూ.15వేల జరిమానా విదించారు. ఈ బేకరిలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడుతుండటం, కిచన్లో అపరిశుభ్రత కనిపించడంతో నోటీసులు జారీ చేసి జరిమానా విధించారు. జమ్జమ్ బేకరికి జరిమానా విధిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు -
పాచిపోయిన పులిహోర.. 51 వేలు ఫైన్
రాజేంద్రనగర్: పాచిపోయిన పులిహోరను వినియోగదారులకు అందించిన ఓ హోటల్‌కు రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రూ. 51 వేల జరిమానాను విధించారు. బండ్లగూడలోని శ్రీకృష్ణ ఉడిపి హోటల్ నిర్వహకులు శుక్రవారం పాడైపోయిన పులిహోరాను వినియోగదారులకు అందించారు. ఈ విషయమై వినియోగదారులు మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ రమేశ్‌కు ఫిర్యాదు చేయడంతో హోటల్ తనిఖీలు నిర్వహించారు. పాచిపోయిన పులిహోరాతో పాటు ఇతర పదార్థాలను గుర్తించిన అధికారులు హోటల్ నిర్వహకుడికి రూ. 51 వేల జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే హోటల్‌ను సీజ్ చేస్తామని హెచ్చరించామ న్నారు. మున్సిపల్ సిబ్బంది మధ్యాహ్న భోజనం కోసం ఉడిపి హోటల్‌కు రావడంతో విషయం వెలుగుచూసిందని తెలిపారు. తనిఖీ చేస్తున్న కార్పొరేషన్ అధికారులు -
రోడ్డుపై నీటిని వదిలినందుకు రూ. 2లక్షల జరిమానా
రాయదుర్గం: నగరం నుంచి గచ్చిబౌలివైపు వచ్చే ప్రధాన పాతముంబయ్ జాతీయ రహదారిలో రోడ్డుపైకి వ్యర్థనీటిని వదిలినందుకు రూ. 2 లక్షల జరిమానాను జీహెచ్ఎంసీ అధికారులు విధించారు. అధికారులు తెలిపిన మేరకు.. దాబా కూడలి నుంచి గచ్చిబౌలికి వెళ్లే రోడ్డులో పక్వాన్ హోటల్ ఎదురుగా నందన వెంచర్స్ సెల్లార్ నిర్మాణం చేస్తున్నారు. సెల్లార్లో పేరుకుపోయిన వ్యర్థ నీటిని పైప్‌లైన్ ద్వారా రోడ్డుపైకి వదిలేశారు. దీంతో రోడ్డంతా చిత్తడిగా మారి వాహనాల రాకపోకలకు ఇక్కట్లు సృష్టిస్తోంది. అసలే రోడ్డుపై ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తుండడంతో రోడ్డంతా ఇరుకుగా మారింది. ఈనేపథ్యంలో వ్యర్థనీటిని రోడ్డుపైకి వదిలినందును సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంçసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రోడ్డును పరిశీలించి నీటిని వదిలేసినది గమనించి నిర్మాణం చేస్తున్న నందన వెంచర్ సంస్థకు రెండు లక్షల రూపాయల జరిమానాను విధించారు. -
రూ.కోటి దాటిన స్పెషల్ డ్రైవ్ జరిమానాలు
సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛ హైదరాబాద్ అమలులో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టిన జీహెచ్ఎంసీ... ప్రజలు, దుకాణదారులు, వివిధ సంస్థల నిర్వాహకుల్లో తగిన మార్పు కనిపించకపోవడంతో జరిమానాల బాట పట్టింది. ‘స్వచ్ఛ’ కార్యక్రమాల అమలుపై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించింది. అయినా ఉల్లంఘనలకు పాల్పడితే పెనాల్టీలు విధించాలని నిర్ణయించింది. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా మే 24 నుంచి ఇప్పటి వరకు దాదాపు నాలుగు నెలల్లోనే రూ.కోటికి పైగా జరిమానాలు విధించింది. రోడ్లపై, నాలాల్లో చెత్త వేయడం, భవన నిర్మాణ వ్యర్థాలు పారబోయడం, బహిరంగంగా చెత్తను తగలబెట్టడం, బహిరంగ మల, మూత్ర విసర్జన తదితర ఉల్లంఘనలకు పాల్పడిన వారికి ఈ పెనాల్టీలు వేసింది. మొత్తం 8,475 పెనాల్టీల ద్వారా రూ.1,03,31,620 వసూలు చేసింది. టాప్ 5 సర్కిళ్లు ఇవీ... చందానగర్‌లో 518 పెనాల్టీల ద్వారా రూ.16.90 లక్షలు, శేరిలింగంపల్లిలో 312కు గాను రూ.13.90 లక్షలు, ఖైరతాబాద్‌లో 627కు రూ.8.41 లక్షలు, జూబ్లీహిల్స్‌లో 462కు రూ.6.85 లక్షలు, మూసాపేట్లో 350కు రూ.5.15 లక్షలు వసూలు చేసినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. -
ఒక బైక్.. 31 చలానాలు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఫేజ్ 03లో నివసించే పోలిరెడ్డి ప్రతాప్ టీఎస్ 09 ఈఎక్స్ 6724 హోండా యాక్టీవా బైక్‌కు 31 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయన రూ. 5,385 జరిమానా చెల్లించాల్సి ఉంది. అయితే పెండింగ్ చలానాలు కట్టకుండా తిరుగుతున్న ఈ వాహనాన్ని జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో పట్టుకున్నారు. 31 చలానాలు పెండింగ్‌లో పెట్టుకొని తిరుగుతుండగా పట్టుకున్న పోలీసులు వాటిని తిరిగి చెల్లించిన తర్వాతనే వదిలిపెట్టారు. నంబర్ ప్లేట్‌ను మలిచి తిరుగుతున్న వ్యక్తికి జరిమానా బంజారాహిల్స్: నంబర్ ప్లేట్‌ను మలిచి ట్రాఫిక్ పోలీసులకు, సీసీ కెమెరాలకు, పోలీసు కెమెరాలకు చిక్కకుండా అడ్డదారుల్లో వాహన నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న ఓ పూజారిని జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకొని చలానా విధించారు. బంజారాహిల్స్ రోడ్ నం.10లోని నూర్‌నగర్‌కు చెందిన యశ్వంత్‌శర్మ(19) గత కొంత కాలంగా హోండా యాక్టీవా బైక్ నంబర్ ప్లేట్‌ను సంఖ్య కనిపించకుండా ఒక మూలలో మలిచారు. అయితే వాహన తనిఖీల్లో భాగంగా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.ముత్తు ఈ వాహనాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బాధితుడికి జరిమానా విధించారు. -
మేకలకు ఫైన్
జవహర్‌నగర్: జవహర్‌నగర్ కార్పోరేషన్ అధికారులు రోడ్డు పక్కన నాటిన మొక్కలను మేసిన మేకలకు ఫైన్ విధించారు. బుధవారం బాలాజీనగర్‌లోని శ్మశానవాటిక సమీపంతో పాటు గబ్బిలాలపేటలో నాటిన మొక్కలను కొన్ని మేకలు మేశాయి. దీంతో కార్పొరేషన్ సిబ్బంది వాటిని కార్పొరేషన్‌కు తీసుకువచ్చి రెండు వేల రూపాయల ఫైన్ వేసి మేకల యజమానులను హెచ్చరించి వదిలిపెట్టారు. -
హెల్మెట్ ధరించకుంటే రూ.1000 జరిమానా
తమిళనాడు, టీ.నగర్: హెల్మెట్ ధరించకుంటే రూ.1,000 అపరాధం విధించే చట్ట సవరణ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపినట్లయితే రూ.వెయ్యి అపరాధం విధించబడుతుందని ఇటీవల ట్రాఫిక్ పోలీసు శాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. మోటార్ వాహన చట్టంలో కేంద్ర ప్రభుత్వం సవరణ జరిపి దాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1,00 నుంచి రూ.1,000కి పెంచారు. వెనుక కూర్చున్నవారు హెల్మెట్ ధరించనట్లయితే ఖచ్చితంగా అపరాధం వసూలు చేయబడుతుందని నగర ట్రాఫిక్ పోలీసులు ప్రకటనలో తెలిపారు. చెన్నై నగర పోలీసు సర్కిల్ ప్రాంతంలో ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అరుణ్ ఉత్తర్వుల మేరకు గురువారం నుంచి హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపినవారికి రూ.1,000 అపరాధం విధించారు. అలాగే వెనుక కూర్చున్న వారి వద్ద అపరాధాన్ని వసూలు చేశారు. ముఖ్యంగా చెన్నై కామరాజర్ రోడ్డు, ఈస్ట్‌కోస్ట్ రోడ్డు, ఓఎంఆర్ రోడ్డు, మౌంట్‌రోడ్డు, పూందమల్లి హైరోడ్డు సహా నగరవ్యాప్తంగా 100కు పైగా ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు జరిపి అపరాధ సొమ్మును వసూలు చేశారు. -
వేడుకున్నా వదల్లే..
ట్రాఫిక్ పోలీసులకు చేతులెత్తి మొక్కుతూ.. కాళ్లావేళ్లా పడుతున్న ఈ పెద్దాయన పేరు అమర్‌సింగ్(55). మధ్యప్రదేశ్‌కు చెందిన ఈయన అక్కడ ఉపాధి లేక బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి చింతల్ హెచ్ఎంటీ ప్రధాన రోడ్డులో చిన్న షెడ్డు వేసుకుని రగ్గులు, దుప్పట్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారులు సంయుక్తంగా ఇక్కడ ఆక్రమణల తొలగింపు చేపట్టారు. పోలీసులను బతిమిలాడుతున్న అమర్‌సింగ్ ఈక్రమంలో రోడ్డు పక్కనున్న అమర్‌సింగ్ షెడ్డును కూడా తొలగిస్తుండగా.. తన బతుకు నాశనం చేయొద్దంటూ అక్కడున్న ట్రాఫిక్ ఎస్ఐ రమేష్‌సింగ్ కాళ్లపై పడి వేడుకున్నాడు. ఆయన పట్టించుకోకపోవడంతో అక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కాళ్లపై కూడా పడ్డాడు. అయినా అధికారులు కనికరం చూపకుండా అమర్‌సింగ్ షెడ్డును తొలగించి, సామగ్రిని జప్తు చేశారు. దాంతో బాధితుడు కన్నీళ్లు పెట్టుకోవడం మినహా మరేం చేయలేకపోయాడు. ఇతడి లాగే మరికొందరు బడుగుల బతుకును అధికారులు కూల్చివేశారు. బడాబాబుల ఆక్రమణలపై కన్నెత్తి చూడలేని అధికారులు తమ ఉనికిని చాటుకునేందుకు ఇలాంటి చిరుజీవులపై ప్రతాపం చూపుతున్నారని అక్కడి పరిస్థితిని గమనించిన కొందరు చెప్పుకోడం గమనార్హం. -
ఖాకీలకు ఫైన్
గోల్కొండ: అనుమతి లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన గోల్కొండ పోలీసులకు బల్దియా అధికారులు జరిమానా విధించారు. గురువారం గోల్కొండ కోట బోనాల సందర్భంగా గోల్కొండ పోలీస్‌స్టేషన్ సిబ్బంది అమ్మవారి చిత్రంతో పాటు డీజీపీ, నగర పోలీస్ కమిషనర్‌తో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని కోట వద్ద ఏర్పాటు చేశారు. ఈ విషయం బల్దియా అధికారులకు తెలియడంతో వెంటనే డిప్యూటీ కమిషనర్ పబ్లిక్ స్థలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు గోల్కొండ ఎస్హెచ్ఓకు రూ.10 వేల జరిమానా విధించారు. -
కిరాక్ ఆన్సర్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసు
సాక్షి, హైదరాబాద్: ఫొటో చూసి ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు అని భ్రమపడ్డారా.? మీరే కాదండోయ్.. తెలంగాణ పోలీసులు కూడా అలానే భావించారు. అంతేనా.. వారికి ఆన్లైన్లో చలానా కూడా విధించారు. ఇది చూసి వాహనదారుడు షాకయ్యాడు. ఎందుకంటే అందరూ అనుకుంటున్నట్టుగా అది ట్రిపుల్ రైడ్ కానే కాదు. ముందు వేరే వాహనంపై వెళ్తున్న వ్యక్తి సరిగ్గా ఇతని వాహనాన్నే నడుపుతున్నట్టుగా అనిపించడంతో పోలీసులు చలానా జారీచేశారు. కానీ కాస్త పరిశీలించి చూస్తే అది అబద్ధమని రుజువైంది. చేయని తప్పుకు చలానా విధిస్తారా అంటూ సదురు వాహనదారుడు పోలీసులపై మండిపడ్డాడు. సరిగ్గా చూడండి. మీకే తెలుస్తుంది వాహనంపై ముగ్గురున్నామా? లేక ఇద్దరున్నామా..? అంటూ పోలీసులనే ప్రశ్నించాడు. ఈ దెబ్బకు పోలీసులు తొలుత నాలుక్కరుచుకున్నారు. ఆ తర్వాత అతనికి దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. ‘మీ అభ్యర్థనను స్వీకరించాం. ఆ చలానాను ట్రిపుల్ రైడింగ్ నుంచి హెల్మెట్ పెట్టుకోనందుకుగా మార్చుతున్నాం’ అంటూ సమాధానమిచ్చారు. మీరు హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ ట్రాఫిక్ ఆంక్షలను ఉల్లంఘించారని, ట్రాఫిక్ నిబంధనలను పాటించండి.. ఎప్పుడూ హెల్మెట్ ధరించండి అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఇది చూసిన సోషల్‌మీడియా జనాలు పాపం.. ఆ వ్యక్తి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టైంది అని సెటైర్స్ వేసుకుంటున్నారు. -
సిగరెట్ తెచ్చిన తంటా
సాక్షి, క్రైమ్: కెనడా పోలీసులకు పంచ్ విసరబోయి ఇరకాటంలో పడ్డాడో వాహనదారుడు. సిగరెట్ పీకే కదా అని నిర్లక్ష్యంగా కారు కిటికీ నుంచి బయటపడేశాడో వ్యక్తి. అది చూసిన పోలీస్ డెల్ మనాక్ నేరుగా ఆ వాహనం దగ్గరికి వెళ్లి ఆ వ్యక్తిని ప్రశ్నించగా అతను దురుసుగా బదులిస్తూ కారు కాలి పోకూడదనే బయటకు విసిరేశానని చెప్పాడు. అంతే ఘాటుగా స్పందించిన పోలీస్ ముందు కారులో సిగరెట్ తాగడం మానేయ్ అంటూ ఝలక్ ఇచ్చాడు. ఆ పోలీస్ అతని దూకుడుకు కళ్లెం వేయడమే కాక, మరెవరూ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా తగిన బుద్ధి చెపాలని భావించాడు. అనుకున్నదే తడవుగా కాలుతున్న సిగరెట్ పీకను బయటకు విసరకూడదనేందుకు 575 కారణాలున్నాయని చెప్పి, అందుకు ప్రతిగా 575 కెనడా డాలర్ల జరిమానా విధించాడు. ఇది భారతీయ కరెన్సీలో సుమారు రూ.30,000 లతో సమానం. పోలీస్ అధికారి ట్విట్టర్లో తాను విధించిన చలానా ఫోటోతో సహా ఈ వివరాలు పంచుకున్నాడు. ఇది చూసిన నెటిజన్లు పోలీసు పనితీరు అద్భుతమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
అందంగా ఉన్నావంటూ ‘ఆమె’కు ఫైన్
హెల్మెట్ పెట్టుకోలేదని, సీటు బెల్టు పెట్టుకోలేదని, బైక్‌పై ముగ్గురు వెళుతున్నారని, రాంగ్ రూట్లో వెళ్తున్నారని ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారు. అది ఎక్కడైనా సహజమే. కానీ ఉరుగ్వేలో బైక్‌పై వెళుతున్న ఓ అమ్మాయికి ఫైన్ వేశారు. ఇంతకీ చలానా ఎందుకు వేసారో తెలుసా...ఆమె చాలా అందంగా ఉందని!. నోరెళ్లపెట్టకండి. మే 25న పేసందు అనే పట్టణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అంతేకాదు చలానాను చించి ఇచ్చాడు. పైగా దానిపై ‘చాలా అందంగా ఉండి పబ్లిక్ రోడ్డుపై వెళ్తుందుకు ఫైన్ కట్టండి’ అంటూ ట్రాఫిక్ పోలీస్ రాసిచ్చాడు. అందంగా ఉన్నవారికి ఫైన్ వేయాలని ఏమైనా చట్టం ఉందా అంటే అదీ లేదు. ఇంతకీ ఆ ఫైన్ ఎందుకు వేశాడో తెలుసా. ఆ యువతిని చూడగానే ఆ పోలీస్ మనసు పారేసుకున్నాడు. వెంటనే ఆమెను ఆకట్టుకునేందుకు ఇదో ట్రిక్‌గా భావించాడు. ఆ చాలాన చివరలో ఐ లవ్ యూ అని కూడా రాశాడు. అయితే అది పెద్ద వివాదాస్పదమైంది. అధికారిక చలానాలను సొంత వ్యవహారాల కోసం వాడుకున్నందుకు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మనోడి మన్మథ కళలకు ఉద్యోగం ఊడేలా ఉందిప్పుడు. -
కోళ్లకు టికెట్ లేదా.. అయితే ఫైన్ కట్టు !
బొమ్మనహళ్లి : కోళ్లకు టికెట్ తీసుకోలేదని జరిమానా విధించిన ఘటన కర్ణాటకలో జరిగింది. గురువారం ఉదయం ఓ వ్యక్తి మూడు కోళ్లను తీసుకుని కోడు నుంచి మంగళూరు వెళ్లే బస్సు ఎక్కాడు. నిజాయితీగా టికెట్ తీసుకున్నాడు. ఇంతలో కొంత దూరం ప్రయాణం అనంతరం తనిఖీ బృందం వచ్చి టికెట్లు తనిఖీ చేస్తుండగా కోళ్లకు టికెట్ తీసుకోలేదని గుర్తించి సదరు ప్రయాణికుడికి రూ. 500 జరిమానా విధించారు. కేఎస్ఆర్టీసీలో ప్రాణులు, ఇతర పక్షులను తీసుకువెళ్లే సమయంలో తప్పకుండా అర టికెట్ తీసుకోవాలనే నిబంధన ఉంది. దీంతో విషయం తెలియని వ్యక్తి జరిమానా కట్టి కోళను వెంట తెచ్చుకున్నాడు. -
చలానాలో చిలక్కొట్టుడు..!
విజయనగరం ఫోర్ట్: ‘గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన శిరికి రమణ అనే వ్యక్తి ఫిబ్రవరి 24వ తేదీన టూవీలర్ లెర్నర్ లైసెన్సు (ఎల్ఎల్ఆర్) కోసం అవసరమై చలానా తీసేందుకు ఉడాకాలనీలో ఉన్న ఆన్లైన్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ ఎల్ఎల్లర్ చలానా ఇచ్చి రూ.350 తీసుకున్నారు. చలానాలో రూ.260 ఉంది కదా రూ.350 ఎందుకని అడిగితే సర్వీస్ చార్జీగా బదులిచ్చారు. దీంతో చేసేది లేక మిన్నుకుండిపోయారు’. ఈ సమస్య ఈ ఒక్క వాహనచోదకుడితే కాదు. వేలాదిమందికి ఎదురవుతున్న సమస్య. ఎల్ఎల్ఆర్ లేదా డ్రైవింగ్ లైసెన్సు కోసం చలానా కోసం వెళితే వాహన చోదకుడి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. గత కొద్ది నెలలుగా ఈ తంతు జరుగుతున్నా రవాణశాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వాహన చోదకులు చేతిచమురు వదిలించుకోవాల్సిన దుస్థితి. 400కు పైగా సీఎస్సీ సెంటర్స్.. రవాణ శాఖలో ఆన్లైన్ సేవలను జిల్లాలో ఉన్న సీఎస్సీ (కామన్ సర్వీసెస్ సెంటర్స్)కు అప్పగించారు. రవాణ శాఖకు సంబంధించి పలు సేవలను ఈ సెంటర్స్‌లో పొందవచ్చు. అలాగే, మీ– సేవ కేంద్రాల్లో రవాణశాఖ సేవలు పొందవచ్చు. అయితే, కొన్ని సీఎస్సీ సెంటర్స్, కొన్ని మీ సేవ కేంద్రాల్లో వాహన చోదకుల నుంచి నిర్దేశించిన చలానా కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణులు వినిపిస్తున్నాయి. చలానా కంటే రూ.50 నుంచి రూ.100 వరకు అధికంగా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే, కొన్ని చోట్ల అయితే రూ.150 రూ.200 కూడా వసూలు చేస్తున్నట్టు సమాచారం. వాస్తవంగా చలానాలు ఇలా... రవాణ శాఖకు ద్విచక్ర వాహనం ఎల్ఎల్ఆర్ చలానా కోసం రూ.260 చెల్లించాలి. అయితే, దీనికోసం రూ.300 నుంచి రూ.350 వరకు వసూలు చేస్తున్నారు. అలాగే, నాలుగు చక్రాల వాహనం ఎల్ఎల్ఆర్ కోసం రూ.410 చెల్లించాలి. దీనికి రూ.450 నుంచి రూ.500, కొన్ని చోట్ల రూ.550 కూడా వసూలు చేస్తున్నారు. అలాగే, టూవీలర్ లైసెన్స్ కోసం రూ.950 చెల్లించాలి. అయితే, రూ.1000, రూ.1050 తీసుకుంటున్నారు. అలాగే, ఫోర్ వీలర్ లైసెన్సు కోసం రూ.1260 తీసుకోవాలి. దీనికోసం రూ.1300 నుంచి రూ.1350 వసూలు చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం... కొన్ని సీఎస్సీ సెంటర్స్‌ల్లో చలానా కంటే అధికంగా వసూలు చేసినట్టు మా దష్టికి వచ్చింది. లిఖత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఆయా సెంటర్లపై చర్యలు తీసుకుంటాం.– ఎ.దుర్గాప్రసాద్‌రావు, వెహికల్ ఇనస్పెక్టర్ -
పెనాల్టీ పడుద్ది
సాక్షి,సిటీబ్యూరో: రోడ్లమీద చెత్త , డెబ్రిస్ వంటివి వేసినా.. బహిరంగ మూత్ర విసర్జన చేసినా జరిమానాలు విధిస్తోన్న జీహెచ్ఎంసీ త్వరలో.. రోడ్లను ఇష్టానుసారం తవ్వి వ్యర్థాలను అలాగే వదిలేస్తున్న ప్రభుత్వ విభాగాలు, ప్రైవేటు ఏజెన్సీలకు సైతం పెనాల్టీలు విధించనుంది. తమ పనుల కోసం హైదరాబాద్ మెట్రోరైల్ (హెచ్ఎంఆర్ఎల్), హైదరాబాద్ రోడ్ డవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్), వాటర్ సప్లై అండ్ సివరేజి బోర్డు (జలమండలి)రోడ్లను తవ్వుతున్నాయి. వెలువడే వ్యర్థాలను ఎక్కడికక్కడ అలాగే వదిలేస్తున్నాయి. తమ పనులు ముగిశాక తిరిగి పూడ్చివేసేందుకు ఎంతో సమయం పడుతోంది. అప్పటి వరకు ఆ వ్యర్థాలు అలాగే ఉంటున్నాయి. అంతేకాదు.. పూడ్చివేతల తర్వాత సైతం వ్యర్థాలతో నగర అందం దెబ్బతింటోంది. ఓడీఎఫ్ ర్యాంకింగ్‌లో.. స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్‌లో నగరం మిగతా మెట్రో నగరాల కంటే ఎంతో ముందంజలో ఉంటున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు మాత్రం నగరాన్ని అందవిహీనంగా మారుస్తున్నాయి. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న నగరానికి వచ్చే పర్యాటకులూ పెరుగుతున్నారు. నగరంలో రోడ్ల వెంబడి ఈ వ్యర్థాలు అందవిహీనం చేస్తుండగా, వ్యర్థాలుండటంతో పారిశుధ్య చర్యలు సైతం అధ్వాన్నంగా మారుతున్నాయి. కొత్తగా వచ్చేవారెవరైనా తొలుత చూసేది రోడ్లనేనని.. వాటిని అద్దాల్లా తీర్చిదిద్దాలని భావించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ఆమేరకు చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా వ్యర్థాలను తొలగించని వారు ఎవరైనా సరే.. ప్రభుత్వ విభాగాలే అయినా సరే నగర అందాన్ని చెడగొడితే పెనాల్టీలు విధించాలని భావించారు. అలాంటి వారిని గుర్తించి రోడ్డు కటింగ్ చార్జీల అంచనాలో 10 శాతం జరిమానాగా విధించాలని భావించారు. ఈమేరకు ప్రతిపాదనలు రూపొందించారు. శనివారం జరిగే జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందాక ప్రభుత్వ అనుమతి కోసం పంపనున్నారు. కేబుల్ సంస్థలతో మరింత అధ్వానం.. పలు కేబుల్ సంస్థలు తమ అవసరాల కోసం రహదారులను తవ్వి.. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. దీంతో రహదారి అందం మొత్తం దెబ్బతినడమే కాకుండా అది జీహెచ్ఎంసీ ఇమేజ్‌నూ దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో పెనాల్టీ చర్యలకు సిద్ధమయ్యారు. ఉదాహరణకు రోడ్ కటింగ్‌లకు చ.మీ.కు రూ.800 చార్జి కాగా, ఇలా వ్యర్థాలను వదిలేస్తే అందులో పది శాతం అంటే..రూ.80 పెనాల్టీగా వసూలు చేస్తారు. హైదరాబాద్ రహదారుల్ని పరిశుభ్రంగా ఉంచేందుకే ఈ చర్యలని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ (మెయింటనెన్స్) జియాఉద్దీన్ పేర్కొన్నారు. -
పొరపాటున బయట పోస్తే వంద పడుద్ది!
సాక్షి, సిటీబ్యూరో: సిటీజనులూ..తస్మాత్ జాగ్రత్త. నగరంలో ఎక్కడైనా పొరపాటున బహిరంగ మూత్ర విసర్జనకు పాల్పడ్డారా రూ.100 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే రూ.1000, రోడ్లపై పెద్దమొత్తంలో చెత్త వేస్తే రూ. రెండు వేలు, చెత్తకుండీల్లో బదులు చెత్తకుండీ పక్కన చెత్తవేస్తే రూ.100, నిర్మాణ వ్యర్థాలను బహిరంగంగా రోడ్లపై వేస్తే రూ.10 వేలు, నాలాల్లో వ్యర్థాలు, చెత్త వేస్తే రూ. 10 వేలు చెల్లించాల్సి రావచ్చు. స్వచ్ఛ కార్యక్రమాల అమలులో భాగంగా నిబంధనలు ఉల్లంఘించేవారికి పై జరిమానాలు ఎప్పటినుంచో ఉన్నప్పటికీ అమలు చేయడం లేదు. వచ్చేనెల4వ తేదీనుంచి నెలాఖరువరకు స్వచ్ఛసర్వేక్షన్– 2019 ర్యాంకుల్ని ప్రకటించేందుకు స్వచ్ఛ భారత్మిషన్ ప్రతినిధుల బృందం నగరంలో పర్యటించనున్నందున ర్యాంకింగ్ కోసం జీహెచ్ఎంసీ ఈ జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఎన్ని కార్యక్రమాలు చేసినా.. జీహెచ్ఎంసీలో బహిరంగ మూత్రవిసర్జన నివారణకు జీహెచ్ఎంసీ ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అన్ని సర్కిళ్లలోనూ బహిరంగ మల, మూత్ర విసర్జన ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ సదుపాయాలు కల్పించింది. సదరు ప్రాంతాలను తిరిగి పాడుచేయకుండా ఉండేందుకు అక్కడ అందమైన ముగ్గులు, పెయింటింగ్‌లు వేయించడం, మొక్కలు పెంచ డం వంటి కార్యక్రమాలు చేపట్టింది. ప్రత్యేకంగా స్వచ్ఛ వాలంటీర్లను నియమించింది. పెట్రోల్ బంక్‌లు, హోటళ్లలోని టాయ్లెట్లను ప్రజలు వినియోగించుకునేందుకు నిర్వాహకులను ఒప్పించింది. అయినప్పటికీ ఇంకా బహిరంగ మూత్ర విసర్జన తరచూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతినిధుల బృందం రానుండటంతో బహిరంగ మూత్ర విసర్జనచేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. 28 ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు.. ఇందులో భాగంగా నగరంలో 28 ప్రాంతాలను అత్యంత సమస్యాత్మక బహిరంగ మూత్ర విసర్జన కేంద్రాలుగా జీహెచ్ఎంసీ గుర్తించింది. ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది. ఇందుకుగాను ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం, స్వచ్ఛ కార్యకర్తలను నియమించి బహిరంగ మూత్ర విసర్జనను నివారించడంతో పాటు యూరినల్ టాయ్లెట్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. అయినప్పటికీ బాధ్యతారహితంగా వ్యవహరించి బహిరంగ మూత్రవిసర్జన చేసినవారిని గుర్తించి పెద్ద ఎత్తున జరిమానాలు విధించాలని క్షేత్రస్థాయి అధికారులకు కూడా సూచించారు. -
తల్లి, ఆమె ప్రియుడికి ఏడాది జైలు
నెల్లూరు, గూడూరు: ప్రియుడి మోజులో పడిన ఓ తల్లి కన్న కొడుకు అడ్డుగా ఉన్నాడని అడ్డు తొలగించుకునేందుకు చిత్రహింసలకు గురిచేసిన ఘటన కేసులో ఆమెకు, ఆమెకు సహకరించిన ప్రియుడికి ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ బుధవారం గూడూరు ప్రిన్సిపల్ జుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కె జయలక్ష్మి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం పొదలకూరుకు చెందిన వరలక్ష్మి మూడు వివాహాలు చేసుకుని అందరితో తెగతెంపులు చేసుకుంది. ఈ క్రమంలో ఆమెకు మగబిడ్డ కలిగాడు. ఒంటరిగి ఉంటున్న ఆమెకు 2017లో అదే ప్రాంతానికి చెందిన వేలు మురుగన్‌తో స్నేహం ఏర్పడి, అతనితో సహజీవనం చేస్తోంది. అయితే అతను ఇంటికి వచ్చి పోయే సమయంలో తన ఆరేళ్ల కొడుకు అడ్డుగా ఉండడంతో వరలక్ష్మి, వేలుమురుగన్ ఆ బాలుడ్ని చిత్రహింసలకు గురిచేయడం మొదలు పెట్టారు. ఈ బాధలు భరించలేక బాలుడు కేకలు వేస్తుండడాన్ని గుర్తించిన అమ్మమ్మ కల్లూరు రమణమ్మ, తన కుమార్తె వరలక్ష్మి, వేలుమురుగన్‌పై పొదలకూరు పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు చార్జిషీట్‌ను గూడూరు కోర్టులో దాఖాలు చేశారు. కేసు విచారణలో నిందితులపై నేరారోపణలు రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితులకు పైమేరకు శిక్ష, జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ సుకుమార్ వాదించారు. -
రెరాలో నమోదు కాలేదా? రూ.50 వేలు జరిమానా!
తెలంగాణలోని రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఏజెంట్లూ! మీరు ఇంకా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా)లో తమ పేర్లను, ప్రాజెక్ట్‌లను నమోదు చేయలేదా? అయితే రూ.50 వేలు జరిమానా చెల్లించాల్సిందే. పెనాల్టీ కట్టి వచ్చే వారం రోజుల్లోగా నమోదు చేసుకోకపోతే మొదటి వారం రూ.లక్ష, ఆ తర్వాతి వారం రూ.2 లక్షలు ఫైన్ తప్పదు. అప్పటికీ రిజిస్టర్ కాకపోతే ఏకంగా ప్రాపర్టీ సీజ్! సాక్షి, హైదరాబాద్: కేంద్రం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చట్టం–2016ను అమల్లోకి తీసుకొచ్చిన ఏడాది తర్వాత తెలంగాణ ప్రభుత్వం 2017లో రెరాను నోటీఫై చేసింది. 2017, జనవరి 1 తర్వాత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీఎస్ఐఐసీ, మున్సిపాలిటీ, పంచాయతీల నుంచి అనుమతి పొందిన 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్ల కంటే ఎక్కువుండే ప్రతి ప్రాజెక్ట్ టీ– రెరాలో నమోదు చేసుకోవాలన్న విషయం తెలిసిందే. నమోదు గడువును 2018 నవంబర్ 30 వరకు విధించింది. రిజిస్టర్ చేసుకోని ప్రాజెక్ట్ ప్రమోటర్లపై రెరా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేందుకు టీ–రెరా అధికారులు సిద్ధమయ్యారు. 1,200 ప్రాజెక్ట్‌ల నమోదు.. గతేడాది జనవరి 1 తర్వాత ఆయా విభాగాల నుంచి సుమారు 5 వేల ప్రాజెక్ట్‌లు అనుమతి పొందాయి. కానీ, ఇప్పటివరకు టీ–రెరాలో వెయ్యి మంది ప్రమోటర్లు, వెయ్యి మంది ఏజెంట్లు నమోదయ్యారని.. సుమారు 1,200 ప్రాజెక్ట్‌ల వరకు రిజిస్టరయ్యాయని టీ–రెరా అధికారి ఒకరు ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో మినహా ఇతర ప్రాంతాల్లో తక్కువ సంఖ్యలో ప్రమోటర్లు, ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయని ఇవి సుమారు 200 ప్రాజెక్ట్‌ల వరకుంటాయని చెప్పారు. నేటి నుంచి జరిమానాలు షురూ.. టీ–రెరా రికార్డుల ప్రకారం తెలంగాణలో ఇంకా 2,000–2,500 ప్రాజెక్ట్‌లు నమోదు కావాల్సి ఉందని సమాచారం. నేటి నుంచి ఆయా ప్రాజెక్ట్ ప్రమోటర్లకు రూ.50 వేల జరిమానా విధించనున్నామని టీ–రెరా అధికారి ఒకరు ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. వారం రోజుల్లోగా నమోదు కాకపోతే జరిమానాల మొత్తాలను పెంచుతామని, అయితే అది ఎంతనేది ఈనెల 7 తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అప్పటికీ ముందుకొచ్చి రెరాలో రిజిస్టర్ కాకపోతే ప్రాజెక్ట్ సైట్లను టీ–రెరా బృందం ప్రత్యక్షంగా తనిఖీ చేసి రెవిన్యూ చట్టం కింద ప్రాపర్టీలను సీజ్ చేస్తామని చెప్పారాయన. 2019 మార్చి 31 వరకూ పొడిగించాలి టీ–రెరా ప్రాజెక్ట్‌లు, డెవలపర్లు, ఏజెంట్ల నమోదు గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించాలని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) కోరింది. ఈ మేరకు పురపాలక నిర్వహణ మరియు పట్టణ అభివృద్ధి శాఖ (ఎంఏ అండ్ యూడీ) ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు వినతిపత్రాన్ని అందించారు. రాష్ట్రంలో డెవలపర్లకు రెరా చట్టం గురించి పూర్తి స్థాయిలో అవగాహన రాలేదని.. నమోదు ప్రక్రియలో డెవలపర్లకు సహాయం చేసేందుకు కూడా కన్సల్టెంట్లు పెద్దగా లేరని అందుకే నమోదు గడువును పొడిగించాలని టీబీఎఫ్ ప్రెసిడెంట్ సీ ప్రభాకర్ రావు తెలిపారు. త్వరలోనే 20 మంది డెవలపర్లపై చర్యలు టీ–రెరాలో నమోదు చేయకుండా ప్రాజెక్ట్‌లను అడ్వర్టయిజింగ్ చేసిన 40 మంది డెవలపర్లకు ఇటీవలే షోకాజ్ నోటీసులు జారీ చేసి.. నవంబర్ 20 లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. వీరిలో కొంత మంది డెవలపర్లు అడ్వర్టయిజింగ్ చేసిన ప్రాజెక్ట్‌లలో కొన్ని 2015, 2016లో అనుమతి తీసుకున్నవని వివరణ ఇచ్చారని టీ–రెరా అధికారి ఒకరు తెలిపారు. మరొక 20 మంది డెవలపర్లు మాత్రం టీ–రెరాలో నమోదు అర్హత ఉన్న ప్రాజెక్ట్‌లనే ప్రచారం చేశారని త్వరలోనే వీరికి జరిమానాలు విధించనున్నామని చెప్పారు. ఆయా ప్రాజెక్ట్ సైట్లను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేశామని త్వరలోనే టీం సైట్ విజిట్స్ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. రెరా నిబంధనల ప్రకారం ప్రాజెక్ట్‌లను రిజిస్టర్ చేయకుండా అడ్వర్టయింజింగ్ చేసినా లేదా విక్రయించినా శిక్షార్హమే. సెక్షన్ 59 ప్రకారం తొలుత ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా ఉంటుంది. అథారిటీకి సరైన వివరణ ఇవ్వకపోయినా లేదా అప్పటికీ రిజిస్టర్ చేయకపోయినా సరే సంబంధిత డెవలపర్‌కు మూడేళ్ల పాటు జైలు శిక్ష లేదా ప్రాజెక్ట్ వ్యయంలో 20 శాతం జరిమానా విధిస్తుంది. -
ట్రాఫిక్ చీఫ్‌కూ ఈ–చలాన్
సాక్షి, హైదరాబాద్: నగర ట్రాఫిక్ చీఫ్‌గా వ్యవహరించే అదనపు పోలీసు కమిషనర్ అనిల్‌కుమార్ వాహనానికీ జరిమానా తప్పలేదు. ఆయన వాహనాన్ని డ్రైవర్ నో పార్కింగ్ ఏరియాలో ఉంచారు. ఈ రాంగ్ పార్కింగ్ వ్యవహారాన్ని ఓ నెటిజనుడు తన కెమెరాలో బంధించి ట్రాఫిక్ వింగ్‌కు ట్వీట్ చేశాడు. స్పందించిన అధికారులు తక్షణమే ఈ–చలాన్ జారీ చేయడంతోపాటు బాధ్యుడితో ఫైన్ కూడా కట్టించారు. అనిల్‌కుమార్ గత కొన్ని రోజులుగా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. దీనిలో భాగంగా వివిధ ట్రాఫిక్ ఠాణాలతోపాటు ఏసీపీ కార్యాలయాలకూ వెళ్తున్నారు. గురువారం నార్త్‌జోన్ పరిధిలో ఉన్న మహంకాళి ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌కు అనిల్‌కుమార్‌తో పాటు డీసీపీ ఎల్ఎస్ చౌహాన్ సైతం వచ్చారు. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్ సమీపంలోని భవనం మొదటి అంతస్తులో ఉన్న ఈ ఠాణాకు ఒకరి తర్వాత ఒకరుగా వచ్చిన ఈ అధికారులు తమ వాహనాలు దిగి లోపలకు వెళ్లిపోయారు. వాహనాలను సక్రమంగా నిలపాల్సిన బాధ్యత ఆ వాహనాల డ్రైవర్లకే ఉంటుంది. అనిల్‌కుమార్‌కు డ్రైవర్‌గా వ్యవహరించిన సిబ్బంది దాన్ని రోడ్డు పక్కగా ఆపారు. అదే ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన నోపార్కింగ్ బోర్డు ఉంది. నెటిజనుడి ఫొటోతో వెలుగులోకి.. ఇలా రాంగ్ పార్కింగ్‌లో ఉన్న వాహనం, దానికి పోలీసుల అధికారులకు చెందినదని చెప్పే ఆనవాళ్లు ఉండటం గమనించిన ఓ నెటిజనుడు ఫొటో తీశాడు. దీన్ని మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నగర ట్రాఫిక్ పోలీసు అధికారిక ట్విట్టర్ ఖాతాకు ట్వీట్ చేశాడు. స్పందించిన అధికారులు అదనపు సీపీ వాహనంపై రూ.235 జరిమానా విధిస్తూ ఈ–చలాన్ జారీ చేశారు. ఇది తెలుసుకున్న అనిల్‌కుమార్ ఆరా తీయగా డ్రైవర్ చూపిన నిర్లక్ష్యం బయటపడింది. దీంతో తొలుత అతడితో రూ.235 జరిమానా కట్టించి ఈ–చలాన్ క్లోజ్ చేయించారు. ఆపై కొద్దిసేపటికి ట్రాఫిక్ చీఫ్ సదరు డ్రైవర్‌కు తన జేబు నుంచి ఆ మొత్తం ఇచ్చినట్లు తెలిసింది. -
మెట్రో ట్రాక్ దాటితే రూ.500 ఫైన్
సాక్షి,సిటీబ్యూరో: మెట్రో రైలు పట్టాలపై ఒక వైపు నుంచి మరో వైపునకు దాటే ప్రయాణికులపై మెట్రో యాక్ట్ ప్రకారం రూ.500 జరిమానా, ఆరునెలల జైలుశిక్ష తప్పదని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ, వేగం పెరిగినందున పట్టాలను నేరుగా దాటేవారు ప్రమాదాల బారిన పడతారని ఆయన హెచ్చరించారు. ఇటీవల కొన్ని మెట్రో స్టేషన్ల వద్ద కొందరు మెట్రో పట్టాలపై ఒక వైపు నుంచి మరోవైపునకు దాటినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్లాట్‌ఫారంపై ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లాలనుకునేవారు మెట్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులను వినియోగించి మధ్యభాగం(కాన్కోర్స్)కు చేరిన తర్వాతే మరో వైపునకు మారాలని సూచించారు. పలు మెట్రో నగరాల్లో పట్టాలు దాటుతూ ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
రోడ్డుపై సిగరెట్ తాగినందుకు జరిమానా
పంజగుట్ట: పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో పలుప్రాంతాల్లో రోడ్లపై సిగరెట్ తాగుతున్న, గుట్కాలు నములుతున్న, విక్రయిస్తున్న 22 మంది వ్యక్తులకు అధికారులు జరిమానా విధించారు. తెలంగాణ టోబాకో టెక్నికల్ ఆఫీసర్ ఎస్.నాగరాజు, మాస్ మీడియా ఆఫీసర్ జే.రాములు, డాక్టర్ అనూషాలతో పాటు కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ అఫైర్స్ డిప్యుటీ డైరెక్టర్ డాక్టర్ రాణా, టెక్నికల్ డైరెక్టర్ గోవింద్ త్రిపాఠి బుధవారం పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాన్‌షాప్‌లు, బార్లు, రోడ్లపై బహిరంగంగా సిగరెట్ తాగుతున్న వారిని గుర్తించి జరిమానా విధించారు. 22 కేసులు నమోదు చేయగా వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. పాఠశాలకు 100 గజాల దూరం వరకు పాన్‌షాప్ ఉండరాదని నిబంధనలు అతిక్రమిస్తే చర్య లు తప్పవన్నారు. బార్లలో ఆల్కహాల్ తాగేందు కు మాత్రమే అనుమతి ఉందని, సిగరెట్ నిషేధమన్నారు. పలు బార్లలో తనిఖీలు చేసి నో స్మోకింగ్ బోర్డులు లేకపోవడం, సిగరెట్ తాగినట్లు ఆనవా లు కనిపించడంతో బార్ నిర్వాహకులకు కూడా ఫైన్ వేశారు. తెలంగాణలో నికోలిన్ నిషేధం విధించినా పలు పాన్‌షాప్‌లలో పాన్‌మసాలా, నికోలిన్ వేర్వురుగా విక్రయిస్తున్నట్లు గుర్తించి వారికి జరిమానా విధించడమేగాక కేసులు నమోదు చేశామన్నారు. ఆరుగురు గుట్కా తినేవారిని గుర్తించగా అందులో ఐదుగురు వ్యక్తులకు క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించామన్నారు. ముగ్గురు మూడో స్టేజ్‌లో, ఇద్దరు రెండవ స్టేజ్‌లో ఉన్నట్లు తెలిపారు. వారికి కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. చైన్ స్మొకర్లు, గుట్కాలు తినేవారిని టొబాకో స్ట్రేష్టేషన్ సెంటర్లో చేర్చుకుని వాటిని మానుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
ఇక టోలు తీస్తారు
సాక్షి ప్రతినిధి, చెన్నై: జాతీయ రహదారుల్లోని టోల్గేట్ల మీదుగా పయనించే అన్నిరకాల వాహనాలకు రుసుమును వసూలు చేసే ప్రక్రియ ఎంతోకాలంగా సాగుతోంది. ఏ కేటగిరి వాహనాలకు ఎంత వసూలు చేయాలో జాతీయరహదారుల శాఖే నిర్ణయిస్తోంది. టోల్గేట్లో చార్జీల వసూళ్లకు ప్రభుత్వం టెండర్లు పిలిచి ఎంపిక చేస్తుంది. ఈ కారణంగా ఒక్కో టోల్గేట్లో ఒక్కో చార్జీని వసూలు చేస్తున్నారు. టోల్గేట్ చార్జీల వసూళ్లలో పేరొందిన రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటిగా నిలిచి ఉంది. ఈ దశలో రాష్ట్రంలోని దక్షిణ, పశ్చిమ జిల్లాల వైపు వెళ్లే జాతీయ రహదారుల్లోని 14 టోల్గేట్ల చార్జీలను పదిశాతం పెంచాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వస్తాయని అధికారులు చెప్పారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను కేంద్రం త్వరలో విడుదల చేస్తుందని అన్నారు. సేలం–ఉళుందూరుపేట–మేట్టుపట్టి– దిండివనం–నల్లూరు, చెన్నై–తిరుచ్చిరాపల్లి–దిండుగల్లు, నత్తకరై,–వీరచోళపురం–విక్కిరవాండి–తడ (ఆంధ్రప్రదేశ్)–పొన్నంబళ్పట్టిలలోని 14 టోల్గేట్లలో పెరిగిన చార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపారు. కార్లకు పదిశాతం, బస్సులు, లారీలకు 4 నుంచి 6 శాతం వరకు పెరుగుతుందని చెప్పారు. వసూళ్లేగానీ వసతులేవీ: టోల్గేట్ల ద్వారా ముక్కుపిండి వసూళ్లు చేయడమేగానీ, అందుకు తగినట్లుగా వసతులులేవని టోల్‌గేటు చార్జీల పెంపుపై వాహన యజమానులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు. వారు మాట్లాడుతూ, రోజురోజుకూ పెరుగుతున్న డీజిల్, పెట్రోలు ధరలతో ఎంతో బాధపడుతున్నాం, ఇపుడు టోల్గేట్ చార్జీలు కూడా పెంచడం వల్ల మోయలేని భారం పడుతుందని అన్నారు. ఈ ఏడాది మార్చిలో చెన్నై, చెన్నై శివార్లలోని 6 టోల్గేట్లు సహా మొత్తం 20 టోల్గేట్ల చార్జీలను పెంచారని తెలిపారు. రెండేళ్లలో తమిళనాడులో టోల్గేట్ చార్జీలు 21 శాతం పెరిగాయని ఆయన అన్నారు. టోల్గేట్ ద్వారా వచ్చే వసూళ్లతో రహదారుల మరమ్మతులు, పర్యవేక్షణకు వినియోగిస్తామని అధికారులు చెబుతుంటారు, అయితే వాస్తవానికి అనేక రహదారులు పర్యవేక్షణ లోపంతో వాహనదారులను బాధిస్తున్నాయి. అధికా రులే హామీ ఇచ్చినట్లుగా రహదారుల్లోఅక్కడక్కడ టెలిఫోన్, తాగునీటి వసతి, ఫుడ్‌కోర్టులు లేవు. ముఖ్యంగా పారిశుధ్యమైన టాయిలెట్లు లేనికారణంగా బాహ్యప్రదేశంలోనే కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన దుస్థితిని వాహనదారులు ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు. -
అంత జరిమానా కట్టలేను.. స్కూటరే తీసుకోండి !
మైసూరు : పలుమార్లు ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన ఓ స్కూటర్ యజమానికి రాచనగరి పోలీసులు షాకిచ్చారు. ఏకంగా రూ. 63,500 ఫైన్ కట్టమని నోటీసు జారీ చేశారు. దీంతో సదరు వాహనదారుడు స్కూటర్ విక్రయించినా అంత ధర రాదు, వాహనం మీరో ఉంచుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు... కర్ణాటకలోని మైసూరు నగరానికి చెందిన మధుకుమార్ కొన్నాళ్లుగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినట్లు గుర్తించారు. శుక్రవారం ఉదయం ట్రాఫిక్ పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా కే.ఏ.09 హెచ్డి.4732 నంబర్ కలిగిన స్కూటర్‌ను గుర్తించారు. అప్పటి నంచి లెక్క కట్టగా 635 కేసులు ఆ స్కూటర్‌పై నమోదు కావడంతో పోలీసులు ఏకంగా లెక్కకట్టి రూ. 63,500 ఫైన్ కట్టమని రశీదు ఇచ్చారు. దీంతో నివ్వెరపోయిన సదరు స్కూటర్ యజమాని వాహనం అమ్మినా అంత ధర రాదని, వాహనం మీరో ఉంచుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు ఏమి చేయాలో దిక్కుతోచక నిలబడిపోయారు. -
అధికారులపై కలెక్టర్ కొరడా
ఏలూరు(మెట్రో) : నిర్ణీత కాల వ్యవధిలో ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే ఆయా శాఖల అధికారులకు రూ.100 చొప్పున జరిమానా విధిస్తానని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారుల సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అందించిన వినతిపత్రాలు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కారం కావాలని ఆదేశించారు. నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కారం కాని ఒకొక్క ఫిర్యాదుకు రూ.100 చొప్పున జరిమానా విధిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. జరిమానా ఇలా.. ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ 34 ఫిర్యాదులకు రూ.3,400, సర్వే సెటిల్మెంట్ శాఖకు 19 ఫిర్యాదులకు రూ.1,900, పౌరసరఫరాల శాఖకు రూ.1,600, మత్స్య శాఖకు రూ.1,000, పంచాయతీ కార్యదర్శులకు రూ.600, దేవాదాయశాఖకు రూ.700 జరిమానా విధిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులపై చర్యలు మీకోసం కార్యక్రమంలో వచ్చిన ప్రజాసమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లికకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ డీఆర్ఓను ఆదేశించారు. అలాగే పశుసంవర్ధకశాఖ జేడీని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ డీఎం, మార్క్‌ఫెడ్ డీఎం, జిల్లా గ్రంథాలయ సంస్థ, ఏపీఐఐసీ శాఖల ఉన్నతాధికారులకు ఈ–ఫైలింగ్ అమలు చేయని కారణంగా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఆర్ఓ సత్యనారాయణను కలెక్టర్ ఆదేశించారు. 10వ తరగతి ఫలితాల్లోవెనుకబాటు ఎందుకు జిల్లాలో ఉపాధ్యాయులంతా బాధ్యతగా పాఠాలు చెబితే పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వెనుకబాటు ఎందుకు వచ్చిందని, దీనికి ఏయే టీచర్ బాధ్యులో గుర్తించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ డీఈఓ రేణుకను ఆదేశించారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
తాగారో.. బేడీలే
సంగారెడ్డి క్రైం: మద్యం తాగి వాహనాలను నడిపి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. వారి వల్ల ఇతరులకూ ప్రమాదాలు జరిగి ఎన్నో కుటుంబాల్లో చీకట్లు నిండిన సంఘటనలు కోకొల్లలు. యువత ఎక్కువగా మద్యానికి బానిసై వాహనాలు నడిపి ప్రమాదాల కొని తెచ్చుకొని తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిలిస్తున్నారు. స్వరాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పింఛన్లపై అధ్యయనం చేశారు. వీటిలో వితంతు పింఛన్ పొందుతున్న వారిలో 35 ఏళ్లలోపు మహిళలు ఎక్కువగా ఉన్నారు. మద్యం తాగి వాహనాలను నడపడం వల్లే వారి కుటుంబాల్లో చీకట్లు కమ్ముకున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో వాటి నియంత్రణ కోసం డ్రంకెన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.. పెరుగుతున్న డ్రంకెన్ డ్రైవ్ కేసులు రోజు రోజుకూ ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు పెరగడంతో ప్రభుత్వానికి కూడా అదే స్థాయిలో ఆదాయం సమకూరుతుంది. మద్యం తాగి వాహనాలు నడపడంతో సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు రింగురోడ్డుపై తరచుగా ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. 65వ జాతీయ రహదారి సంగారెడ్డి జిల్లా మీదుగా వెళుతుండడంతో మద్యం తాగి వాహనాలు నడిపే వారిని నియంత్రించడానికి రామచంద్రపురం, పటాన్చెరువు, బీడీఎల్ భవనాలు, సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్, మునిపల్లి, జహీరాబాద్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. మెదక్ జిల్లాలో 44వ జాతీయ రహదారి ఉండటంతో నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్గీగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే పెద్దపెద్ద గూడ్స్ లారీల డ్రైవర్లు మద్యం తాగి నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కాళ్లకల్, తూప్రాన్ దగ్గర్లో నాగులపల్లి చౌరస్తా చేగుంట, రామాయంపేట ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారుల పక్కనే దాబాల్లో మద్యం సిట్టింగ్ ఉండటం ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం అవుతున్నాయని చెప్పొచ్చు. అవగాహన సదస్సులతో.. జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలను నివారించడానికి పోలీస్ యంత్రాంగం చొరవ చూపుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లకు, ఇతర ప్రైవేట్ వాహనదారులకు ఆర్టీఏ అధికారులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, సదస్సులను నిర్వహిస్తున్నారు. సిద్దిపేటలో ప్రత్యేక కార్యక్రమాలు.. సిద్దిపేట జిల్లాలో పోలీస్ యంత్రాంగం ‘‘కనువిప్పు’’ అనే కార్యక్రమం పేరుతో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో డ్రంకెన్ డ్రైవ్, రైతు ఆత్మహత్యలు, బాల్యవివాహాలు, మూఢ నమ్మకాలు, నకిలీ బంగారు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వారంలో నాలుగు రోజులు కళా బృందాలతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 105 గ్రామాల్లో అవగాహన కల్పించారు. దీని ద్వారా చాలా వరకు డ్రంకెన్ డ్రైవ్ కేసులు తగ్గాయని అధికారులు తెలిపారు. పర్సంటేజీ ప్రకారమే శిక్ష డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి మద్యం తాగిన పర్సంటేజీని బట్టి కేసు నమోదు చేయడంతోపాటు జైలుకు పంపే విధానాన్ని ఖరారు చేశారు. సుమారు 30కి పైగా పర్సంటేజీ వస్తే కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తారు. జడ్జి తీర్పునుబట్టి శిక్ష ఖరారవుతుంది. 30లోపు పర్సంటేజీ వస్తే పోలీసులే జరిమానాలతోపా టు కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారు. మెదక్ జిల్లాలో ఈ ఏడాది 23 మంది మద్యం తాగి వాహనాలు నడిపి జైలు కు వెళ్లారు.సంగారెడ్డిలో 2017లో 299 మంది జైలుకు వెళ్లారు. పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరి«ధిలో డ్రంకెన్ డ్రైవ్ కార్యక్రమాలను నిర్వహిస్తూ మద్యం తాగి వాహనాలు నడపకుండా పర్యవేక్షిస్తున్నాం. పట్టుబడిన మద్యం ప్రియులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. – చందనదీప్తి, మెదక్ ఎస్పీ చాలా వరకు కేసులు తగ్గాయి డ్రంకెన్ డ్రైవ్ నిరంతరం కొనసాగించడంతో మద్యం తాగి వాహనాలు నడిపేవారి సంఖ్య చాలా వరకు తగ్గింది. మద్యం తాగి వాహనాలు నడపకుండా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. డ్రైవర్లకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. హైవేలపై పెట్రోలింగ్ వాహనాలతో గస్తీలు ము మ్మరం చేశాం.–చంద్రశేఖర్‌రెడ్డి, సంగారెడ్డి ఎస్పీ -
ట్రాఫిక్ చలానా ఎస్ఎంఎస్ రూపంలో
బనశంకరి: నగరంలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే సమయంలో జరిమానా వసూలు చేయడానికి క్యాష్‌లెస్ విధానం అనుసరిస్తున్న బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీసులు ఇకనుంచి పేపర్‌లెస్‌కు మారాలని నిర్ణయించారు. వాహనదారులకు జరిమానా రాసేటప్పుడు, లేదా సిగ్నల్ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా వారి చిరునామాలకు పోస్టులు పంపడానికి పెద్దమొత్తంలో పేపర్ ఖర్చవుతోంది. రసీదు రోల్, ఇంక్, ప్రింటర్ నిర్వహణకు ఏటా లక్షలాదిరూపాయలు ఖర్చుచేయాలి. దీనికి బదులు వారి మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపిస్తే పేపర్ ఖర్చు మిగిలిపోతుందని నగర ట్రాఫిక్ పోలీస్ అదనపు కమిషనర్ ఆర్.హితేంద్ర తెలిపారు. కొన్ని సందర్భాల్లో 50 సార్లు నిబంధనలు ఉల్లంఘన కేసులకు మీటర్లు మేర రసీదు అందించిన పరిస్ధితులు ఉన్నాయన్నారు. ముమ్మరంగా కసరత్తు ఇప్పటివరకు ట్రాఫిక్ నిబంధనలు, వాహనాల సంఖ్య, తేదీ, సమయం, స్థలం, జరిమానా విధించే అధికారి పేరు, పోలీస్ స్టేషన్ పేరు, ఆన్లైన్ జనరేట్ సంఖ్యతో కూడిన పూర్తి సమాచారంతో రసీదు ప్రింట్ చేస్తున్నారు. ఇకముందు వాహనదారు మొబైల్ నెంబరు తీసుకుని పూర్తి వివరాలతో కూడిన ఎస్ఎంఎస్ పంపిస్తామని హితేంద్ర తెలిపారు. బీ ట్రాక్ పథకం కింద ఎస్ఎంఎస్ రసీదు పథకాన్ని అమల్లోకి తీసుకువస్తారు. దీనికోసం ఎస్ఎంఎస్ పంపడానికి ప్రైవేటు టెలికాం సంస్థలతో చర్చలు కూడా జరిపారు. త్వరలో కొన్ని పోలీస్స్టేషన్లలో సిబ్బందికి శిక్షణనిచ్చి ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు, తరువాత నగరమంతటా విస్తరిస్తారు. నోటీస్‌లకు బదులు చిరుసందేశమే: హితేంద్ర సీసీ కెమెరాలు గుర్తించిన ట్రాఫిక్ కేసుల్లో బండి నంబర్ ఆధారంగా వాహనదారుల ఇళ్లకు పోస్టు ద్వారా నోటీస్ పంపించేవారు. దీనికి ఒక్క రూపాయి వరకు ఖర్చవుతుతోంది. అయితే పోస్టల్ సిబ్బంది కొన్నిసార్లు గేట్ వద్దే పడేసి వెళతారు. ఎస్ఎంఎస్తో ఈ సమస్య ఉండదు, ఖర్చు కూడా 10 పైసలే అవుతుంది. అలాగే జరిమానా వసూలు చేశాక రసీదుగా ఇవ్వడానికి బదులుగా ఎస్ఎంఎస్నే పంపించాలని నిర్ణయించారు. దీనిపై ప్రజలు నిర్భయంగా సలహాలు సూచనలు ఇవ్వవచ్చు. -
హెల్మెట్ ధరించలేదని కారు డ్రైవర్‌కు జరిమానా
విజయవాడ:నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఇ–చలానా ద్వారా జరిమానాలు చిత్రవిచిత్రంగా విధిస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రతి రోజూ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్‌లేని వారికి జరిమానాలు విధిస్తున్నారు. కొందరు వాహనాలను సీజ్ చేస్తున్నారు. గురువారం వన్ ట్రాఫిక్ పోలీసులు సెక్టార్–2లో జరిపిన తనిఖీల్లో కారు నడిపే వ్యక్తికి హెల్మెట్ లేదని ఇ–చలానాపై కేసు నమోదు చేశారు. కారు నంబర్ ఏపీ16 డీ ఎం.2229ను ఆపి కాగితాలు తనిఖీ చేశారు. అన్ని కాగితాలు సక్రమంగా ఉన్నా ఏదో విధంగా జరిమానా విధించాలని భావించిన ట్రాఫిక్ సి బ్బంది ఇ–చలానాలో కేసు బుక్ చేశారు. హె ల్మెట్ లేదని ఆ కారు నడిపిన వ్యక్తిపై కేసు న మోదు చేసి రూ.135 జరిమానా విధిస్తూ ఆన్లై న్లో చలానా పంపారు. ఇది చూసిన కారు య జమాని ఆశ్చర్యపోయారు. ఈ విషయం బయటకు రావడంతో కారు నడిపే వారు విస్మయానికి గురయ్యారు. ట్రాఫిక్ పోలీసుల నిర్వాకం ఇలా ఉందని మరికొందరు విమర్శిస్తున్నారు. -
ఆపే "దమ్ము" లేదా..?
సినిమా హాళ్లలో హెచ్చరికలు, టీవీ సీరియళ్లలో స్క్రోలింగ్‌లు, హోర్డింగుల్లో సూచనలు తప్పితే ధూమపాన నిషేధ చట్టం వాస్తవంలో అమలు కావడం లేదు. బహిరంగ ప్రదేశాల్లోనే గుప్పుగుప్పుమంటూ పొగ వదులుతున్నా చర్యలు తీసుకునే నాథుడు కానరావడం లేదు. యువకుల నుంచి వృద్ధుల వరకు ఎక్కడపడితే అక్కడ ఇష్టానుసారం పొగరాయుళ్లు ‘టొబాకోపనిషత్తు’ను వల్లె వేస్తున్నా పల్లెత్తు మాటనే వాడు కనిపించడం లేదు. ఫలితంగా ఇప్పటికే కాలుష్యంతో పొగ బారిన పరిసరాలు ఇంకాస్త కలుషితమవుతున్నాయి. మరీ ముఖ్యంగా నిషేధ చట్టం ఉందనే విషయమే మర్చిపోయే ప్రమాదం కలుగుతోంది. శ్రీకాకుళం: ప్యాషన్ అంటూ కొందరు, అలవాటంటూ ఇంకొందరు పొగాకును కాల్చి పారేస్తున్నారు. ఇందులో విద్యార్థులు, యువకులు అధికంగా ఉన్నారు. అడిగేవారు లేరని ఇష్టానుసారంగా బహిరంగ ధూమపానం చేస్తున్నారు. బస్టాండు, సినిమా హాళ్లు, టీ దుకాణాల వద్ద విచ్చలవిడిగా పొగ తాగుతున్నారు. ధూమపాన నిషేధ చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడంతో వీరి అలవాటుకు అడ్డుకట్ట పడడం లేదు. పొగ తాగేవారితోపాటు ఆ పొగ పీల్చే వారిలో 30 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్లు వస్తున్నా యి. పొగాకు, సిగరెట్టు ఉత్పత్తులతో తలెత్తుతున్న అనర్థాలను దృష్టిలో ఉంచుకొని బహిరంగ ప్రదేశాలలో ధూమపానాన్ని నిషేధిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుం బ సంక్షేమ మంత్రిత్వశాఖ 2008, అక్టోబర్ 2న బహిరంగ ధూమపాన నిషేధ చట్టం (సీఓటీపీ–2008) రూపొందించింది. చట్టం ఏమి చెబుతోంది..? సీఓటీపీ చట్టం ప్రకారం బస్టాండు, రైల్వే స్టేషన్, సినిమా హాళ్లు, మార్కెట్, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, జనసంచారం ఉండే ప్రదేశాల్లో ధూమపాన నిషేధం అమలులో ఉంది. దీన్ని అతిక్రమిస్తే రూ. 200 జరిమానాతోపాటు జైలు శిక్ష విధించాలని చట్టం చెబుతోంది. పొగాకు ఉత్పత్తులను 18 ఏళ్లలోపు ఉన్న వారికి అమ్మినా జరిమానా విధించాలి. పొగాకు నియంత్రణ, బహిరంగ ధూమపానాన్ని అరికట్టేందుకు, చట్టం అమలు బాధ్యతను పోలీసు శాఖకు అప్పగించింది. చాలా ప్రాంతాల్లో పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో పొగతాగే వారిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. పోలీసు అధికారులకు చట్టం గురించి అవగాహన ఉన్నా తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నష్టాలే నష్టాలు పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల ఎక్కువగా క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతోపాటుపాటు ఇతర ప్రాణాంతక జబ్బులు వచ్చే అవకాశం ఉంది. వీటిని ప్రత్యక్షంగా తీసుకోకున్నా ఇతరులు వదిలే పొగ పీల్చినా వ్యాధుల బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. పోలీసు అధికారులు ఇప్పటికైనా స్పందించి బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధ చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలి. సిగరెట్ల రేట్లు పదిశాతం పెంచితే వాటి వాడకం నాలుగైదు శాతం తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు పేర్కొన్న విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. శ్వాసకోస వ్యాధులు వస్తాయి పొగరాయుళ్లు వదిలే పొగను పక్కన ఉన్న వ్యక్తులు పీల్చుకోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులు చెడిపోతాయి. బహిరంగ ధూమపానం మంచిది కాదు. – డాక్టర్ సునీల్‌నాయక్, రిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ -
మెట్రో : టోకెన్ పోతే వడ్డింపే
మెట్రో రైల్ ప్రయాణిలకు ముఖ్య గమనిక. స్టేషన్లలో ఇచ్చే టోకెన్లను ఇకనుంచి జాగ్రత్తగా ఉంచుకోండి. దానిని పోగొట్టుకుంటే భారీగా జరిమానా చెల్లించాల్సి రావచ్చు. కొందరు చేసే పోకిరి పనుల వల్ల అందరూ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. సాక్షి, బెంగళూరు: కొంతకాలంగా మెట్రోరైల్వే స్టేషన్లలో టికెట్ల సందర్భంగా ఇచ్చే టోకెన్లను తస్కరిస్తున్న ఘటనలు పెరిగిపోవడంతో దీనిని అరికట్టడానికి మెట్రో సంస్థ (బీఎంఆర్సీఎల్).. టోకెన్లను పోగొట్టుకున్న వారికి జరిమానాను పెంచింది. చూడడానికి ఆకర్షణీయంగా ఉండడంతో కొందరు తుంటరిలు మెట్రో టోకెన్లను కొనుగోలు చేసి, అసలు ప్రయాణమే చేయకుండా వాటిని జేబులో వేసుకుని వెళ్తుంటారు. మైక్రోచిప్ కలిగిన ఈ టోకెన్లను తయారు చేయడానికి ఒక్కొక్క టోకెన్‌కు రూ.35 ఖర్చవుతుండగా, పొరపాటున టోకెన్‌ను పోగొట్టుకుంటే రూ.50 జరిమానా విధించేవారు. దీంతో టోకెన్ల తమవద్ద ఉన్నా కూడా కొంతమంది పోగొట్టుకున్నామంటూ రూ.50 జరిమానా చెల్లించి వాటిని తీసుకెళ్లేవారు. దీంతో ఇప్పటి వరకు 1,500 టోకెన్లు తస్కరణకు గురికావడంతో ఆ విషయాన్ని గుర్తించిన బీఎంఆర్సీఎల్ అధికారులు జరిమానాను రూ.50 నుంచి రూ.500 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దొడ్డిదారిలో వెళ్తూ తస్కరణ మెట్రో స్టేషన్లోకి ప్రవేశించగానే మార్గాన్ని బట్టి ప్రయాణికులకు సిబ్బంది టోకెన్లను ఇస్తారు. తమ స్టేషన్ రాగానే బయటకు వెళ్లే ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బాక్సుల్లో ఆ టోకెన్‌ను వేస్తే ద్వారం తెరచుకుని బయటకు వెళ్లగలరు. కొంతమంది టోకెన్లను కొట్టేయడానికి సాధారణ ద్వారం నుంచి కాకుండా మరో మార్గం ద్వారా బయటకు వెళ్లడం తెలుసుకున్నారు. ఒకవేళ తనిఖీల్లో దొరికితే రూ.200 వరకు జరిమానా తప్పదు. అయినప్పటికీ మెట్రో టోకెన్ల మిస్సింగ్ ఘటనలు ఆగకపోవడంతో మెట్రో టోకెన్లు పోతే విధించే జరిమానాను భారీగా పెంచడం విశేషం. దీంతో పాటు టోకెన్లు పోగొట్టుకున్న వ్యక్తులు మెట్రోలో గరిష్ట టికెట్ ధర రూ.60 చెల్లించి మరో టోకెన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. పెంపు అందుకే ‘టోకన్లు తీసుకొని ప్రయాణించిన అనంతరం తాము దిగాల్సిన స్టేషన్ రాగానే టోకన్లు తిరిగి అప్పగించకుండా తమతోపాటే తీసుకెళుతున్న ఘటనలో అనేకం జరిగినట్లు మా దృష్టికి వచ్చింది.వీటిని నివారించడానికే జరిమానాను భారీగా పెంచడానికి నిర్ణయించుకున్నాం. దీంతోపాటు బయటకు వెళ్లే ద్వారాల వద్ద డిటెక్టర్లను ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం’. –ప్రదీప్‌సింగ్ ఖరోలా, బీఎంఆర్సీఎల్ ఎండీ. -
రోజులో ఎన్నిసార్లు చిక్కితే అన్ని చలాన్లు!
► వాహన అద్దాల ‘రంగు’ వదలాల్సిందే! ► వాటి లోపలి భాగం స్పష్టంగా కనిపించాల్సిందే ► సోమవారం నుంచి ఉల్లంఘనులకు రూ.500 వడ్డన ► మరోసారి ‘ఆపరేషన్ బ్లాక్‌ఫిల్మ్’ :జేసీపీ రవీందర్ సాక్షి, సిటీబ్యూరో: ‘కార్లు తదితర వాహనాల అద్దాలపై ఉంటున్న రంగు ఫిల్మ్‌లు, ఇతర పదార్థాలను వెంటనే తొలగించండి. వాటి లోపలి భాగాలు స్పష్టంగా బయటకు కనిపించేలా చర్యలు తీసుకోండి’ అంటూ 2012లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను నగర ట్రాఫిక్ విభాగం అధికారులు మరోసారి అమలులోకి తీసుకురానున్నారు. ఆ ఏడాది తొలిదశ స్పెషల్ డ్రైవ్ చేపట్టిన అధికారులు వాహనచోదకుల్లో అవగాహన తీసుకువచ్చారు. ఫలితంగా సిటీలో దాదాపు 95 శాతం వాహనాల అద్దాలకు ఉన్న బ్లాక్‌ఫిల్మ్ తొలగింది. అయితే ఇంకా మిగిలిన వాహనాలు ఇప్పటికీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని సంయుక్త పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) డాక్టర్ వి.రవీందర్ బుధవారం వెల్లడించారు. వీరిపై సోమవారం నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించడం, ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉండని అర్ధరాత్రి వేళ వాహనాలతో బయటకు రావడం చేస్తున్నట్లు పరిగణిస్తున్నామన్నారు. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు సైతం బ్లాక్‌ఫిల్మ్‌తో కూడి ఉంటున్నట్లు అధ్యయనంలో తేల్చామని రవీందర్ తెలిపారు. వివిధ సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు ఈ తరహా ఉల్లంఘనలపై 44,079 కేసులు నమోదు చేశారన్నారు. సోమవారం నుంచి చేపట్టబోయే స్పెషల్ డ్రైవ్‌లో చిక్కిన వాహనాలకు రూ.500 జరిమానా విధిస్తామని తెలిపారు. సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు ఓ ఉల్లంఘనపై జరిమానా విధిస్తే... మళ్ళీ 24 గంటలు దాటే వరకు అదే ఉల్లంఘనపై, అదే వాహనానికి మరోసారి జరిమానా విధించే ఆస్కారం ఉండదు. అయితే బ్లాక్‌ఫిల్మ్ కేసుల్లో ఒక రోజులో ఎన్ని చోట్ల వాహనం చిక్కితే అన్ని చలాన్లు జారీ చేస్తామని రవీందర్ స్పష్టం చేశారు. లైసెన్స్ లేని చోదకులకు జైలు... డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ... ట్రాఫిక్ పోలీసులకు నాలుగో సారి చిక్కిన వాహన చోదకులకు సికింద్రాబాద్ న్యాయస్థానం ఐదు రోజుల జైలు శిక్ష విధించిందని జేసీపీ రవీందర్ బుధవారం తెలిపారు. దీంతో పాటు వీరికి రూ.వెయ్యి జరిమానా సైతం పడిందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నిరోధం, ట్రాఫిక్ సజావుగా సాగేందుకు లైసెన్స్ లేని వాహనచోదకులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులు చేపట్టే స్పెషల్‌డ్రైవ్స్‌లో చిక్కిన ఉల్లంఘనుల నుంచి వెహికిల్ స్వాధీనం చేసుకుంటామని, జరిమానా చెల్లించడంతో పాటు ఆర్టీఏ అధికారుల నుంచి లైసెన్స్/లెర్నింగ్ లైసెన్స్ పొందిన తర్వాతే వాహనాన్ని విడిచిపెడతామని పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనులకు కౌన్సిలింగ్ ఇచ్చి న్యాయస్థానాల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. -
ఈ–చలాన్ చెల్లించకుంటే ‘ఇంటికే’!
►పెండింగ్ ఈ–చలాన్ల వసూళ్ళకు ప్రత్యేక బృందాలు ► టాప్ వైలేటర్స్ ఇళ్ళకు వెళ్తున్న ట్రాఫిక్ పోలీసులు ►25 కంటే ఎక్కువ ఉంటే వాహనం స్వాధీనం, చార్జ్‌షీట్ ►10 కంటే ఎక్కువ ఉన్న వాహనాల పైనా అభియోగపత్రాలు సిటీబ్యూరో: ఎడాపెడా ఉల్లంఘనలకు పాల్పడటం..జారీ అయిన ఈ–చలాన్లు చెల్లించకుండా తప్పించుకు తిరగడం... ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే చెల్లిద్దాంలే అనుకోవడం...ఇలాంటి వాహనచోదకులకు చెక్ చెప్పడానికి సిటీ ట్రాఫిక్ వింగ్ అధికారులు చర్యలు ప్రారంభించారు. 25 కంటే ఎక్కువ ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న వారి ఇళ్ళకు వెళ్ళి మరీ వాహనాలు స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. టాప్ వైలేటర్స్ టీమ్స్‌గా పిలిచే ఈ బృందాలు ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల వారీగా పని చేస్తున్నాయని డీసీపీ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పుడంతా నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్... ప్రస్తుతం సిటీలో పూర్తి స్థాయిలో నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానం అమలవుతోంది. క్షేత్రస్థాయిలో ఉండే ట్రాఫిక్ పోలీసులు నేరుగా జరిమానాలు విధించడం మానేశారు. కేవలం తమ వద్ద ఉన్న కెమెరాలో ఉల్లంఘనని బంధించడం ద్వారా పోలీసుస్టేషన్ నుంచి ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అప్లోడ్ చేస్తారు. అక్కడి అధికారులు ఈ ఫొటోల ఆధారంగా వాహనచోదకులకు పోస్టు ద్వారా ఈ–చలాన్లు పంపిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్నవి 70 లక్షల పైనే... నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఉల్లంఘనులకు జారీ చేస్తున్న ఈ–చలాన్లు భారీ స్థాయిలో పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు సంబంధించి 2014–17 మే మధ్య జారీ అయిన ఈ–చలాన్లలో 70,92,753 పెండింగ్‌లోనే ఉన్నాయి. హైదరాబాద్‌లో 42.33 లక్షలు, సైబరాబాద్‌లో 25.60 లక్షలు, రాచకొండలో 2.98 లక్షలు (ఈ కమిషనరేట్ 2016 మధ్యలో ఏర్పాటైంది) ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ చలాన్లకు సంబంధించిన జరినామాను వాహనచోదకులు చెల్లించని కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా ట్రాఫిక్ పోలీసుస్టేషన్ వారీగా టాప్ వైలేటర్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. నగరంలోని 25 ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల నుంచి ఒక కానిస్టేబుల్, హోంగార్డ్ చొప్పున ఎంపిక చేసి వీటికి రూపమిచ్చారు. ఇళ్ళకు వెళ్ళి వాహనాలు సీజ్... ఈ టాప్ వైలేటర్స్ టీమ్స్‌కు 25 కంటే ఎక్కువ ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాల జాబితాలను ఠాణాల వారీగా అప్పగించారు. ఆర్టీఏ డేటాబేస్ ఆధారంగా వాహన యజమాని చిరునామా తెలుసుకుంటున్నారు. వారి ఇళ్ళకు వెళ్తున్న ప్రత్యేక బృందాలు వాహనాలను స్వాధీనం చేసుకుని ట్రాఫిక్ ఠాణాకు తీసుకువస్తున్నారు. వీరిపై న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేసిన తర్వాత, కోర్టు విధించిన జరిమానా, ఈ–చలాన్ పెండింగ్ మొత్తం చెల్లించాకే వాహనాలను విడిచి పెడుతున్నారు. ఇప్పటి వరకు 25 ఠాణాల పరిధిలో అనేక వాహనాలను ఈ బృందాలు సీజ్ చేసినట్లు డీసీపీ రంగనాథ్ పేర్కొన్నారు. చిక్కితే కోర్టుకు వెళ్ళాల్సిందే... క్షేత్రస్థాయిలో ఉండే ట్రాఫిక్ పోలీసులు ఓ వెహికిల్‌ను ఆపినప్పుడు తమ వద్ద ఉన్న పీడీఏ యంత్రాల్లో వాహనాలపై ఉన్న ఈ–చలాన్ పెండెన్సీని తనిఖీ చేస్తున్నారు. పెండింగ్ ఈ–చలాన్లు ఉన్నట్లు తేలితే... రసీదు ఇచ్చి, ఆ మొత్తం చెల్లించి వచ్చిన తర్వాత వాహనాన్ని అప్పగిస్తారు. అయితే 10 కంటే ఎక్కువ ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న వారికి ఆ చాన్స్ లేనట్లే. వారంతట వారుగా ఆన్లైన్లో తనిఖీ చేసుకుని చెల్లిస్తే ఇబ్బంది లేదు. అలా కాకుండా క్షేత్రస్థాయి తనిఖీల్లో చిక్కితే మాత్రం అప్పుడు నేరుగా నగదు చెల్లించడానికి ఆస్కారం లేదు. వీరిపై కచ్చితంగా న్యాయస్థానాల్లో అభియోగపత్రాలు దాఖలు చేయాల్సిందే. కోర్టు ఉత్తర్వుల ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చిరునామాలతో చిక్కులు... ఈ–చలాన్లను ట్రాఫిక్ విభాగం అధికారులు ఆర్టీఏ అధికారుల రికార్డుల్లో ఉన్న చిరునామాల ఆధారంగా జారీ చేస్తున్నారు. ఆ డేటాబేస్‌తో అనుసంధానం ఏర్పాటు చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు తమ కంప్యూటర్లో ఓ ఉల్లంఘనకు పాల్పడిన వాహనం నెంబర్ ఎంటర్ చేస్తే... ఆటోమేటిక్‌గా ఆర్డీఏ డేటాబేస్ నుంచి సదరు వాహనం చిరునామా గుర్తించే సర్వర్ ఆ చిరునామాతో ఈ–చలాన్ జారీ చేస్తుంది. దీన్ని పోస్టు ద్వారా బట్వాడా చేయిస్తారు. అయితే ప్రస్తుతం ఆర్టీఏ డేటాబేస్‌లో దాదాపు 50 శాతం వాహనదారుల చిరునామాలు అప్డేట్ కాలేదు. వాహనం ఖరీదు చేసినప్పుడు దాని యజమాని ఉన్న చిరునామానే రిజిస్ట్రేషన్ సమయంలో రికార్డుల్లో పొందుçపరుస్తున్నారు. ప్రస్తుతం యజమాని మరో చిరునామాలో నివసిస్తున్నాడు. అయినప్పటికీ ఆర్టీఏ రికార్డుల్లో మాత్రం పాత చిరునామానే ఉంటోంది. దీంతో ఈ చలాన్లు వాహన యజమానికి డెలివరీ కాకపోవడంతో తమ వాహనంపై చలాన్ జారీ అయిందనే విషయం యజమానికి తెలియట్లేదని ట్రాఫిక్ పోలీసులే అంగీకరిస్తున్నారు. ఈ–చలాన్ స్టేటస్ తెలుసుకోండిలా... ఇలాంటి వాహనచోదకులు తమ వాహనంపై జారీ అయి ఉన్న పెండింగ్ ఈ–చలాన్ వివరాలు తెలుసుకోవడానికి ప్రధానంగా కొన్ని మార్గాలు ఉన్నాయని అధికారులు సూచిస్తున్నారు. ఈ–చలాన్ స్టేటస్ తెలుసుకునే మార్గాలు...నగర ట్రాఫిక్ పోలీసు వెబ్సైట్ (www.ht p.gov.in), సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు వెబ్సైట్ (www.ctp.gov.in)లతో పాటు (HyderabadTrafficLive, Telanfana EChallan, Telanfana Traffic Police) మొబైల్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం).