
సాక్షి, కృష్ణా జిల్లా: మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడు స్టాంప్ వెండర్ రామ్ ధీరజ్‌ను అరెస్ట్ చేశారు. కైకలూరు పోలీస్ స్టేషన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ వివరాలు వెల్లడించారు. నిందితుడి నుంచి రూ.1.02 కోట్లు నగదు రీవకరీ చేశామని తెలిపారు. నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బాధితులు ఆందోళన చెందనవసరం లేదని ఎస్పీ అన్నారు. నిందితుల నుంచి నూరు శాతం నగదు రికవరీకి చర్యలు చేపట్టామన్నారు.
మిగిలిన మొత్తాన్ని కూడా రికవరీ చేస్తాం: మంత్రి ధర్మాన
ప్రకాశం: రిజిస్ట్రేషన్ శాఖలో రూ.10 కోట్ల అవకతవకలు జరిగినట్లు గుర్తించామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే రూ. 7 కోట్లు రికవరీ చేశామన్నారు. మిగిలిన మొత్తాన్ని కూడా రికవరీ చేస్తామని మంత్రి ధర్మాన అన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.
ఇవీ చదవండి:
'బుల్లెట్ బండి' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఎంపీ
మిస్టరీ వీడింది.. మద్యం మత్తులో సొంత మేనల్లుడే..
Comments
Please login to add a commentAdd a comment