Main accused arrested
-
నకిలీ చలానాల కేసు: ప్రధాన నిందితుడు అరెస్ట్
సాక్షి, కృష్ణా జిల్లా: మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడు స్టాంప్ వెండర్ రామ్ ధీరజ్‌ను అరెస్ట్ చేశారు. కైకలూరు పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ వివరాలు వెల్లడించారు. నిందితుడి నుంచి రూ.1.02 కోట్లు నగదు రీవకరీ చేశామని తెలిపారు. నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బాధితులు ఆందోళన చెందనవసరం లేదని ఎస్పీ అన్నారు. నిందితుల నుంచి నూరు శాతం నగదు రికవరీకి చర్యలు చేపట్టామన్నారు. మిగిలిన మొత్తాన్ని కూడా రికవరీ చేస్తాం: మంత్రి ధర్మాన ప్రకాశం: రిజిస్ట్రేషన్ శాఖలో రూ.10 కోట్ల అవకతవకలు జరిగినట్లు గుర్తించామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే రూ. 7 కోట్లు రికవరీ చేశామన్నారు. మిగిలిన మొత్తాన్ని కూడా రికవరీ చేస్తామని మంత్రి ధర్మాన అన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. ఇవీ చదవండి: 'బుల్లెట్ బండి' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఎంపీ మిస్టరీ వీడింది.. మద్యం మత్తులో సొంత మేనల్లుడే.. -
రైనా మేనమామ హత్య కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మేనమామ అశోక్ కుమార్, అతని కుమారుడు కౌశల్ కుమార్ గతేడాది హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇదివరకే 11 మంది నిందితులను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకోగా, తాజాగా ప్రధాన నిందితుడు చజ్జూ అలియాస్ చైమార్‌ను ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని చైమార్ తెగకు చెందిన దోపిడీ దొంగల ముఠాలకు నాయకుడైన చజ్జూ.. యూపీ సహా పలు రాష్ట్రాల్లో దోపిడీలు, హత్యాకాండలకు తెగబడినట్టు పోలీసులు గుర్తించారు. బరేలీ ప్రాంతంలోని బహేదిలో నివసించే అతను అక్కడ్నించే తన ముఠాను నడిపిస్తుంటాడు. పక్కా సమాచారంతో దాడి చేసిన ఎస్టీఎఫ్ పోలీసులు చజ్జూను అరెస్ట్ చేసి పంజాబ్ పోలీసులకు అప్పగించారు. కాగా, గతేడాది ఆగస్ట్ 19న పంజాబ్‌లోని థరియాల్ గ్రామంలో అశోక్ కుమార్ నివాసంలోకి దోపిడీ దొంగలు చొరబడి అతని కుటుంబసభ్యులపై దాడి చేశారు. బీఎస్ఎఫ్ కాంట్రాక్టర్‌గా విధులు నిర్వహించే అశోక్ కుమార్.. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దోపిడీ దొంగలు కర్రలతో తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అతని భార్య, మరో కుటుంబ సభ్యుడు చావుబతుకులలో పోరాడి కోలుకోగా, కుమారుడు కౌశల్ కుమార్ ప్రాణాలు విడిచాడు. అప్పట్లో ఈ హత్య ఘటనతో దిగ్భ్రాంతికి గురైన సురేశ్ రైనా ఐపీఎల్ ఆడకుండా యూఏఈ నుంచి హుటాహుటిన భారత్‌కు వచ్చేశాడు. తన బంధువుల ఇంట్లో జరిగిన ఘాతుకంపై దర్యాప్తు జరిపించాలంటూ పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్‌కు విజ్ఞప్తి చేశాడు. -
శ్రీగౌతమి హత్య కేసు.. ఇప్పటివరకు ఏడుగురు అరెస్ట్
-
శ్రీగౌతమి హత్య కేసు.. ప్రధాన నిందితులు అరెస్టు
సాక్షి, పాలకొల్లు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన శ్రీ గౌతమి హత్య కేసులో అసలు రహస్యం బట్టబయలైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన మరో ఇద్దరిని పాలకొల్లు పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులైన సందీప్, దుర్గాప్రసాద్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు ఏడుగురిని పట్టుకున్నారు. వీరిద్దరిని విశాఖపట్నంలో అరెస్టు చేసినట్లు పాలకొల్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మొదట ఎనిమిది మంది నిందితులకు సంబందమున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో బెయిల్‌పై బయట తిరుగుతున్న నిందితులు సందీప్, దుర్గాప్రసాద్‌లు టాటా సఫారీతో శ్రీగౌతమిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చిన విదితమే. దీంతో వారిద్దరి బెయిల్ రద్దు చేసి అరెస్ట్‌కు అవకాశం ఇవ్వాలని పాలకొల్లు పోలీసులు కోర్టులో పిటీషన్ వేశారు. గతంలో రోడ్డు ప్రమాదంగా చూపి ఈ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐడీ దర్యాప్తుతో గౌతమి హత్యకేసు వెలుగులోకి రావడవంతో కేసు రీఓపెన్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. 302, 307 సెక్షన్లుగా కేసు మార్పు చేసిన విషయం తెలిసిందే. -
కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
ముంబై/ న్యూఢిల్లీ: ముంబైలో కల్తీ మద్యం సేవించి 102 మంది మృతిచెందిన కేసులో ప్రధాన నిందితుడిని న్యూఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అయితే పూర్తివివరాలను పోలీసులు వెల్లడించలేదు. గత వారం ముంబైలో కల్తీ మద్యం సేవించడం వల్ల 102 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ విషయమై మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ స్వాధీన్ క్షత్రియ ఈ దర్యాప్తుకు నేతృత్వం వహించారు.అక్రమంగా దేశీయ మద్యం తయారు చేయడంతో అది సేవించిన 102 మంది మరణించడంతో పాటు మరో 46 మంది అస్వస్థతకు గురై స్థానిక ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. పశ్చిమ ముంబైలోని మాల్వని కాలనీలో జరిగిన ఈ కల్తీ మద్యం ఘటనపై మూడు నెలల్లో నివేదిక అందిచనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి ఏక్ నాథ్ ఖాడ్సే తెలిపారు. అయితే, మిథనాల్ రంగు కూడా మార్చాలని, లేకుంటే అంధత్వం వచ్చే అవకాశముందని తయారీదారులకు ఆయన సూచించారు. ఇదిలాఉండగా.. 2009లో కల్తీ మద్యంపై తానిచ్చిన కేసును మాల్వాని పోలీసులు నిర్లక్ష్యం చేయడం వల్లనే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని స్థానికుడు ముస్తఫా ఖాన్ మీడియాకు తెలిపాడు. -
సహారన్‌పుర్ అల్లర్ల ప్రధాన నిందితుడి అరెస్ట్
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌లో అల్లర్ల ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొహ్రం అలీ అలియాస్ పప్పుతో పాటు మరో అయిదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందగా ఐదుగురు పోలీసులు సహా 18 మంది గాయపడ్డారు. ఒక వివాదాస్పద భూమి విషయంలో శనివారం చెలరేగిన గొడవ ఇరు వర్గాల మధ్య హింసకు దారితీసింది. ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకున్నారు. ఇళ్లకు, షాపులకు నిప్పుపెట్టారు. అంతేగాక కాల్పులకు కూడా తెగబడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి దనీష్, మహ్మద్ ఇర్షాద్, అబీద్, షహీద్, హజీ మహ్మద్ ఇర్ఫాన్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొహ్రం అలీ అరెస్ట్‌ను జిల్లా పోలీస్ అధికారి రాజేష్ పాండే ధ్రువీకరించారు.