
సజ్జా బుజ్జి, శ్రీగౌతమిల పాత చిత్రం
సాక్షి, పాలకొల్లు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన శ్రీ గౌతమి హత్య కేసులో అసలు రహస్యం బట్టబయలైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన మరో ఇద్దరిని పాలకొల్లు పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులైన సందీప్, దుర్గాప్రసాద్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు ఏడుగురిని పట్టుకున్నారు. వీరిద్దరిని విశాఖపట్నంలో అరెస్టు చేసినట్లు పాలకొల్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో మొదట ఎనిమిది మంది నిందితులకు సంబందమున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో బెయిల్‌పై బయట తిరుగుతున్న నిందితులు సందీప్, దుర్గాప్రసాద్‌లు టాటా సఫారీతో శ్రీగౌతమిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చిన విదితమే. దీంతో వారిద్దరి బెయిల్ రద్దు చేసి అరెస్ట్‌కు అవకాశం ఇవ్వాలని పాలకొల్లు పోలీసులు కోర్టులో పిటీషన్ వేశారు. గతంలో రోడ్డు ప్రమాదంగా చూపి ఈ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐడీ దర్యాప్తుతో గౌతమి హత్యకేసు వెలుగులోకి రావడవంతో కేసు రీఓపెన్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. 302, 307 సెక్షన్‌లుగా కేసు మార్పు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment