సానియా మీర్జాకు జరిమానా
హైదరాబాద్: ప్రముఖ టెన్నిస్ తారా సానియా మీర్జాకు నగర ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో చలానా విధించారు. సోమవారం రాత్రి పదిగంటలకు జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 10 నుంచి తెలుపురంగు ఫార్చునర్ కారు టీఎస్ 09 ఈజీ1 నెంబర్ ప్లేట్‌తో వెళ్తుండగా వాహానాలు తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు ధ్రువపత్రాలు తనిఖీ చేశారు.
నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్‌పై టీఎస్ 09 ఈజీ 0001 ఉండాలి. దీంతో ఆ కారు వివరాలు సేకరించగా సానియా మీర్జాది అని తేలింది. దీంతో ఆమెకు రూ.200 ఫైన్ వేశారు. నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం ఉండకుంటే నేరమే అవుతుందని, సానియా కారు నెంబర్ ఫ్యాన్సీ మ్యానర్ లో కనిపించిందని, అది వాహనాల చట్టం ప్రకారం విరుద్ధమైనందున జరిమానా విధించామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.