
లక్నో: ఓ యువకుడు అతిగా ప్రవర్తించాడు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నడుపుతూ బీర్ తాగాడు. రహదారిపై ఇతడు చేసిన చేష్టలను స్నేహితులే వీడియో తీశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీంతో రంగంలోకి దిగిన ఉత్తర ప్రదేశ్ గాజియాబాద్ పోలీసులు యువకుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. రూ.31,000 చలనా విధించారు. హెల్మెట్ ధరించకపోగా బైక్ నడుపుతూ మద్యం సేవించినందుకు ఇంత భారీమొత్తంలో జరిమానా వేశారు. ఇందుకు సంబంధించిన చలానాను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
#Ghaziabad DME पर बीयर पीकर रील रिकॉर्ड करने वाले इस सूरमा ने तो @Gzbtrafficpol की चालानी कार्यवाई की पोल खोल दी, DME पर 2 व्हीलर नही जा सकते यहाँ तो पूरी शूटिंग जारी है। मसूरी थाना क्षेत्र है। @ghaziabadpolice @uptrafficpolice @sharadsharma1 @bstvlive @DCPRuralGZB pic.twitter.com/Mvbj2sFZ2H
— Lokesh Rai 🇮🇳 (@lokeshRlive) January 20, 2023
చదవండి: రష్యా నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు