drink and drive
-
బైక్ నడుపుతూ బీర్ తాగిన యువకుడు.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు
లక్నో: ఓ యువకుడు అతిగా ప్రవర్తించాడు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతూ బీర్ తాగాడు. రహదారిపై ఇతడు చేసిన చేష్టలను స్నేహితులే వీడియో తీశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన ఉత్తర ప్రదేశ్ గాజియాబాద్ పోలీసులు యువకుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. రూ.31,000 చలనా విధించారు. హెల్మెట్ ధరించకపోగా బైక్ నడుపుతూ మద్యం సేవించినందుకు ఇంత భారీమొత్తంలో జరిమానా వేశారు. ఇందుకు సంబంధించిన చలానాను సోషల్ మీడియాలో షేర్ చేశారు. #Ghaziabad DME पर बीयर पीकर रील रिकॉर्ड करने वाले इस सूरमा ने तो @Gzbtrafficpol की चालानी कार्यवाई की पोल खोल दी, DME पर 2 व्हीलर नही जा सकते यहाँ तो पूरी शूटिंग जारी है। मसूरी थाना क्षेत्र है। @ghaziabadpolice @uptrafficpolice @sharadsharma1 @bstvlive @DCPRuralGZB pic.twitter.com/Mvbj2sFZ2H — Lokesh Rai 🇮🇳 (@lokeshRlive) January 20, 2023 చదవండి: రష్యా నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు -
ఈ తాగుబోతులు ఏకంగా పోలీసులనే ఢీకొట్టారు
సాక్షి, హైదరాబాద్: కిక్కు లేకుంటే రోడ్డెక్కలేరు కొంత మంది మద్యం ప్రియులు, కానీ అందువలన జరిగే ప్రమాదాలను మాత్రం వాళ్లు డోంట్ కేర్ అనుకుంటారు. అటువంటి ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు నిర్వహిస్తుంటారు. దురదృష్టవశాత్తు ఆ ప్రమాదాలు పోలీసులకే జరిగిన ఘటన శనివారం రాత్రి కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం........ రాత్రి 11 గంటల సమయంలో నిజాంపేట రోడ్డులోని కొలను రాఘవరెడ్డి గార్డెన్స్ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ ను పోలీసులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో కారు డ్రైవర్ అస్లాం మద్యం తాగి కారు నడుపుతూ అదే దారిలో వస్తున్నాడు. ఆ ప్రాంతంలో చెకింగ్ నిర్వహిస్తున్న పోలీసులను చూసి భయపడి తప్పించుకోవడానకి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ మహీపాల్ రెడ్డిని తన కారుతో ఢీకోట్టడంతో అతను గాయపడ్డాడు. అనంతరం చికిత్స నిమిత్తం ఏఎస్ఐ ను కొండాపూర్లోను కిమ్స్ కు తరలించారు. అదే ప్రాంతంలో అదే తరహాలో మరో ప్రమాదం దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగిన కొద్ది నిమిషాల తరువాత, మద్యం తాగిన మరో వ్యక్తి అదే ప్రాంతంలో తన కారుతో అక్కడున్న హోమ్ గార్డును ఢీకొట్టాడు. గాయపడిన హోమ్ గార్డ్‌ను సమీపంలోని ఆసుపత్రికి పంపారు. -
జూబ్లీహిల్స్‌లో మద్యం మత్తులో యువతి వీరంగం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో పోలీసులు శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో 15 యువతి, యువకులు మద్యం సేవించి వాహనం నడపుతూ దొరికినట్లు చెప్పారు. వీరిలో ఓ యువతి మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. వాహనదారులకు పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ప్రజల మంచికోసమే ప్రభుత్వం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను ఏర్పాటు చేసిందని అధికారులు చెప్పారు. దయచేసి మద్యం సేవించి వాహనం నడపొద్దని కోరారు. పోలీసులకు సహాకారం అందిస్తున్న మీడియాకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
మద్యం మత్తులో యువతి వీరంగం
-
ఏలూరులో కారుతో బీభత్సం సృష్టించిన వ్యక్తి అరెస్ట్
మద్యం మత్తులో కారుతో బీభత్సం పోలీసుల అదుపులో నిందితుడు ఏలూరు అర్బన్: మద్యం మత్తులో కారు నడిపి వ్యక్తి మరణానికి కారకుడైన డ్రైవర్‌ను టూటౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు స్థానిక టూటౌన్ పోలీసుస్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈనెల 4న స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో మద్యం మత్తులో కారు నడిపిన ఏలూరు మండలం చాటపర్రుకు చెందిన పైలా భాస్కర సత్యప్రకాష్ బీభత్సం సృష్టించాడు. ఈ ప్రమాదంలో స్థానిక తంగెళ్లమూడి శివగోపాలపురానికి చెందిన బంకురు «శివరామకృష్ణ అనే యువకుడు మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సీఐ జి.మధుబాబు నిందితుడిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. సత్యప్రకాష్ తాగిన మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారకుడయ్యాడని నిర్దారించారు. నిందితుడు సత్య ప్రకాష్‌ను చాటపర్రులోని అతని ఇంటి వద్ద అరెస్ట్ చేశారని డీఎస్పీ తెలిపారు. పదేళ్లు జైలు పడే అవకాశం మద్యం మత్తులో వాహనం నడిపి వ్యక్తి మరణానికి కారకుడైన సత్య ప్రకాష్‌పై గతంలో ఎన్నడూ లేనివిధంగా ఐపీసీ 304 (2),337, 338 సెక్షన్లను నమోదు చేశామని డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు తెలిపారు. నిందితునికి పదేళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపే వారికి ఇలాంటి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సీఐ మ«ధుబాబు, ఎస్సై సాయకం శ్రీరామ గంగాధర్ పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్‌లో అర్థరాత్రి హిజ్రా హల్చల్
-
జూబ్లీహిల్స్‌లో అర్థరాత్రి హిజ్రా హల్చల్
అది హైదరాబాద్‌లో సంపన్నులు ఉండే ప్రాంతం. అర్ధరాత్రి దాటినా రోజులాగే వాహనాలతో రద్దీగా ఉంది ఆ ప్రాంతం. అంతేకాదు.. వారాంతం కావటంతో మందుబాబుల హంగామా కూడా అంతా ఇంతా కాదు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు ఫుల్స్టాప్ పెట్టాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ ఖాకీలు.... జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా అలజడి. అంతే అక్కడ వున్న పోలీసులు.... మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. తీరా విషయం తెలుసుకుని షాక్ తిన్నారు. ఇంత హడావుడికి కారణం ముంబైకి చెందిన సీమా అనే ఓ హిజ్రా. లిప్ట్ అంటూ ఓ కారు ఎక్కింది. కొద్దిదూరం వెళ్లాక... కారు నడుపుతున్న వ్యక్తి మెడలోని బంగారు గొలుసు తీసుకుని పారిపోబోయింది. అంతే... పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు... ఇదేమిటిరా అని తేరుకున్న కారు డ్రైవర్ అరవటం మొదలుపెట్టాడు. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు, మీడియా ప్రతినిధులు హిజ్రాను పట్టుకునే యత్నం చేశారు. అది చూసి... మీడియాపై రాళ్లు రువ్వే యత్నం చేసింది. అంతేకాకుండా తాను దొంగను కాదు... కారు డ్రైవర్ బంగారు గొలుసు... బండిలోనే ఉందంటూ... దబాయించింది. చివరికి... పారిపోతున్న హిజ్రాను పట్టుకుని పోలీసులు తమ వాహనంలో లిప్ట్ ఇచ్చి స్టేషన్‌ను తీసుకెళ్లారు. -
ఇక పై నిషా మీరితే కష్టమే