
సాక్షి, హైదరాబాద్: కిక్కు లేకుంటే రోడ్డెక్కలేరు కొంత మంది మద్యం ప్రియులు, కానీ అందువలన జరిగే ప్రమాదాలను మాత్రం వాళ్లు డోంట్ కేర్ అనుకుంటారు. అటువంటి ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్‌లు నిర్వహిస్తుంటారు. దురదృష్టవశాత్తు ఆ ప్రమాదాలు పోలీసులకే జరిగిన ఘటన శనివారం రాత్రి కుకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం........ రాత్రి 11 గంటల సమయంలో నిజాంపేట రోడ్డులోని కొలను రాఘవరెడ్డి గార్డెన్స్ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ ను పోలీసులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో కారు డ్రైవర్ అస్లాం మద్యం తాగి కారు నడుపుతూ అదే దారిలో వస్తున్నాడు. ఆ ప్రాంతంలో చెకింగ్ నిర్వహిస్తున్న పోలీసులను చూసి భయపడి తప్పించుకోవడానకి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్‌ఐ మహీపాల్ రెడ్డిని తన కారుతో ఢీకోట్టడంతో అతను గాయపడ్డాడు. అనంతరం చికిత్స నిమిత్తం ఏఎస్‌ఐ ను కొండాపూర్‌లోను కిమ్స్ కు తరలించారు.
అదే ప్రాంతంలో అదే తరహాలో మరో ప్రమాదం
దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగిన కొద్ది నిమిషాల తరువాత, మద్యం తాగిన మరో వ్యక్తి అదే ప్రాంతంలో తన కారుతో అక్కడున్న హోమ్ గార్డును ఢీకొట్టాడు. గాయపడిన హోమ్ గార్డ్‌ను సమీపంలోని ఆసుపత్రికి పంపారు.
Comments
Please login to add a commentAdd a comment