ఏలూరులో కారుతో బీభత్సం సృష్టించిన వ్యక్తి అరెస్ట్
ఏలూరు అర్బన్: మద్యం మత్తులో కారు నడిపి వ్యక్తి మరణానికి కారకుడైన డ్రైవర్‌ను టూటౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు స్థానిక టూటౌన్ పోలీసుస్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు.
మద్యం మత్తులో కారుతో బీభత్సం
పోలీసుల అదుపులో నిందితుడు
ఏలూరు అర్బన్: మద్యం మత్తులో కారు నడిపి వ్యక్తి మరణానికి కారకుడైన డ్రైవర్‌ను టూటౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు స్థానిక టూటౌన్ పోలీసుస్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈనెల 4న స్థానిక పాత బస్టాండ్ సెంటర్‌లో మద్యం మత్తులో కారు నడిపిన ఏలూరు మండలం చాటపర్రుకు చెందిన పైలా భాస్కర సత్యప్రకాష్ బీభత్సం సృష్టించాడు. ఈ ప్రమాదంలో స్థానిక తంగెళ్లమూడి శివగోపాలపురానికి చెందిన బంకురు «శివరామకృష్ణ అనే యువకుడు మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సీఐ జి.మధుబాబు నిందితుడిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. సత్యప్రకాష్ తాగిన మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారకుడయ్యాడని నిర్దారించారు. నిందితుడు సత్య ప్రకాష్‌ను చాటపర్రులోని అతని ఇంటి వద్ద అరెస్ట్ చేశారని డీఎస్పీ తెలిపారు.
పదేళ్లు జైలు పడే అవకాశం
మద్యం మత్తులో వాహనం నడిపి వ్యక్తి మరణానికి కారకుడైన సత్య ప్రకాష్‌పై గతంలో ఎన్నడూ లేనివిధంగా ఐపీసీ 304 (2),337, 338 సెక‌్షన్లను నమోదు చేశామని డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు తెలిపారు. నిందితునికి పదేళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపే వారికి ఇలాంటి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సీఐ మ«ధుబాబు, ఎస్సై సాయకం శ్రీరామ గంగాధర్ పాల్గొన్నారు.