అనంతపురం(క్రైం): పోలీసులమంటూ బైక్‌పై వెళుతున్నవారి దగ్గర నుంచి జరిమాన రూపంలో డబ్బులు గుంజిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు జిల్లాలోని పలుచోట్ల ద్విచక్రవాహనదారుల దగ్గర నుంచి జరిమాన రూపంలో భారీగా డబ్బులు వసూలు చేశారు.
ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు బైకులు, 3 సెల్‌ఫోన్‌లు, రూ. 29,400లను స్వాధీనం చేసుకున్నారు.