ఢిల్లీ: ఢిల్లీలో అక్రమంగా ట్రాఫిక్ చలానా వసూలు చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కొరియా దేశస్థుని వద్ద కానిస్టేబుల్ రిసిప్ట్ ఇవ్వకుండానే రూ. 5000 చలానా వసూలు చేశాడు. నెలక్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
వీడియో ప్రకారం.. కానిస్టేబుల్ మహేష్ చంద్.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కొరియా దేశస్థునికి రూ.5000 జరిమానా విధించినట్లు చెప్పారు. కానీ విదేశీయుడు రూ.500 ఇచ్చాడు. తను అడిగిన డబ్బు రూ. 500 కాదని, రూ. 5000 అని చెప్పి కానిస్టేబుల్ మళ్లి అడిగాడు. చేసేది లేక విదేశీయుడు కానిస్టేబుల్‌కు మిగిలిన డబ్బును ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇద్దరు హ్యాండ్స్ షేక్ చేసుకుని వెళ్లిపోతారు. కానీ జరిమానాకు సంబంధించిన పత్రాన్ని ఆ బాధిత విదేశీయునికి కానిస్టేబుల్ ఇవ్వలేదు.
Video: Delhi Cop Fines Korean Man ₹5,000 Without Receipt, Suspended https://t.co/EaheIf2LvI pic.twitter.com/bX5lLND7vM
— NDTV (@ndtv) July 23, 2023
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సదరు పోలీసు కానిస్టేబుల్‌ను విధుల నుంచి తప్పించారు. సంబంధిత వీడియోపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. జరిమానాకు సంబంధించిన పత్రాన్ని ఇచ్చేలోపే ఆ విదేశీయుడు వెళ్లిపోయినట్లు కానిస్టేబుల్ చెబుతున్నాడు.
ఇదీ చదవండి: సినిమా రేంజ్‌లో.. దంపతుల పక్కా స్కెచ్.. టమాటా లారీ హైజాక్..
Comments
Please login to add a commentAdd a comment