హెల్మెట్ పెట్టుకోలేదని, సీటు బెల్టు పెట్టుకోలేదని, బైక్‌పై ముగ్గురు వెళుతున్నారని, రాంగ్ రూట్‌లో వెళ్తున్నారని ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారు. అది ఎక్కడైనా సహజమే. కానీ ఉరుగ్వేలో బైక్‌పై వెళుతున్న ఓ అమ్మాయికి ఫైన్ వేశారు. ఇంతకీ చలానా ఎందుకు వేసారో తెలుసా...ఆమె చాలా అందంగా ఉందని!. నోరెళ్లపెట్టకండి. మే 25న పేసందు అనే పట్టణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అంతేకాదు చలానాను చించి ఇచ్చాడు. పైగా దానిపై ‘చాలా అందంగా ఉండి పబ్లిక్ రోడ్డుపై వెళ్తుందుకు ఫైన్ కట్టండి’ అంటూ ట్రాఫిక్ పోలీస్ రాసిచ్చాడు.
అందంగా ఉన్నవారికి ఫైన్ వేయాలని ఏమైనా చట్టం ఉందా అంటే అదీ లేదు. ఇంతకీ ఆ ఫైన్ ఎందుకు వేశాడో తెలుసా. ఆ యువతిని చూడగానే ఆ పోలీస్ మనసు పారేసుకున్నాడు. వెంటనే ఆమెను ఆకట్టుకునేందుకు ఇదో ట్రిక్‌గా భావించాడు. ఆ చాలాన చివరలో ఐ లవ్ యూ అని కూడా రాశాడు. అయితే అది పెద్ద వివాదాస్పదమైంది. అధికారిక చలానాలను సొంత వ్యవహారాల కోసం వాడుకున్నందుకు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మనోడి మన్మథ కళలకు ఉద్యోగం ఊడేలా ఉందిప్పుడు.
Comments
Please login to add a commentAdd a comment