
విజయవాడ:నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఇ–చలానా ద్వారా జరిమానాలు చిత్రవిచిత్రంగా విధిస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రతి రోజూ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్‌లేని వారికి జరిమానాలు విధిస్తున్నారు. కొందరు వాహనాలను సీజ్ చేస్తున్నారు. గురువారం వన్ ట్రాఫిక్ పోలీసులు సెక్టార్–2లో జరిపిన తనిఖీల్లో కారు నడిపే వ్యక్తికి హెల్మెట్ లేదని ఇ–చలానాపై కేసు నమోదు చేశారు. కారు నంబర్ ఏపీ16 డీ ఎం.2229ను ఆపి కాగితాలు తనిఖీ చేశారు.
అన్ని కాగితాలు సక్రమంగా ఉన్నా ఏదో విధంగా జరిమానా విధించాలని భావించిన ట్రాఫిక్ సి బ్బంది ఇ–చలానాలో కేసు బుక్ చేశారు. హె ల్మెట్ లేదని ఆ కారు నడిపిన వ్యక్తిపై కేసు న మోదు చేసి రూ.135 జరిమానా విధిస్తూ ఆన్‌లై న్‌లో చలానా పంపారు. ఇది చూసిన కారు య జమాని ఆశ్చర్యపోయారు. ఈ విషయం బయటకు రావడంతో కారు నడిపే వారు విస్మయానికి గురయ్యారు. ట్రాఫిక్ పోలీసుల నిర్వాకం ఇలా ఉందని మరికొందరు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment