vijayawada police
-
కాదంబరి కోరాలే గానీ..
సాక్షి, అమరావతి/ఇబ్రహీంపట్నం : వలపువల విసిరి బడా బాబులను బురిడీ కొట్టించే కాదంబరి జత్వానీ టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఏకంగా విశిష్ట అతిథిగా మారిపోయారు. ఫోర్జరీ పత్రాలతో భూములు విక్రయించే మోసానికి పాల్పడిన కేసులో నిందితురాలైన ఆమెను రాష్ట్ర ప్రభుత్వ మర్యాదలు లభిస్తుండటం విస్మయపరుస్తోంది. తాను చెప్పింది చేయాలంటూ ఏకంగా పోలీసు శాఖనే బ్లాక్మెయిల్ చేసే స్థాయిలో ఆమె చెలరేగిపోతుండటం.. విజయవాడ పోలీసులు ఆమె డిమాండ్లకు జీహుజూర్ అంటుండటం వెనుక ప్రభుత్వ పెద్దల వత్తాసు ఉందన్నది స్పష్టమవుతోంది. విజయవాడ పోలీసులు అధికారులు, సిబ్బందితో కూడిన బృందాన్ని అనధికారికంగా కేటాయించడం, ఆమెకు ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేయడం విస్మయపరుస్తోంది. కొన్ని రోజులుగా విజయవాడలోనే ఉంటున్న ఆమెకు విజయవాడ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ అతిథి స్థాయిలో ప్రొటోకాల్ మర్యాదలు అందిస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి విజయవాడలోని స్టార్ హోటల్ వరకు ఆమెకు పోలీసులు ఎస్కార్ట్‌గా ఉంటున్నారు. పోలీసులనే బ్లాక్ మెయిల్ కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఆమెను ఓ సాధనంగా మలచుకున్నారు. తాము చెప్పినట్టుగా కొందరికి వ్యతిరేకంగా ఫిర్యాదులు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు ఆమెకు చెప్పినట్టు సమాచారం. ఏకంగా పోలీసు అధికారులనే బ్లాక్ మెయిల్ చేసే స్థాయిలో ఆమె వ్యవహరిస్తున్నారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. తనను వేధించారంటూ విజయవాడలో గతంలో పనిచేసిన ముగ్గురు పోలీసు అధికారులతో పాటు పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌పై కేసు నమోదు చేయాలని ఆమె పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఐపీఎస్ అధికారులపై కేసు నమోదు చేయాలని ఒత్తిడి చేయడంపై పోలీసు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఆమె శుక్రవారం సాయంత్రం హఠాత్తుగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసి.. వెంటనే కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. కేసు నమోదు చేసేవరకు పోలీస్ స్టేషన్ నుంచి కదిలే ప్రసక్తే లేదని భీష్మించారు. జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుని తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. కాగా ఇప్పటికే కేసు నమోదు చేయాలని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు వ్యవహరిస్తున్నారని సమాచారం. అసలు జత్వానీకి ఏ హోదాతో అంతటి ప్రాధాన్యం ఇస్తున్నారన్నది పోలీసువర్గాల్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
జత్వానీ కేసులో సర్కారు జిత్తులు!
సాక్షి, అమరావతి : అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ నేతలను వేధించాలన్న రాజకీయ కుట్రతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బరితెగిస్తోంది. ఏకంగా న్యాయస్థానాల పరిధిలో ఉన్న అంశాల్లో కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. వలపు వల (హనీట్రాప్)తో పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలను బురిడీ కొట్టించి మోసాలకు పాల్పడుతున్న ఈ ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసేలా విజయవాడ పోలీసులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీసులు ఇటువంటి దుందుడుకు చర్యలకు దిగుతున్నారు.కీలక సాక్ష్యాలు సేకరించిన ఆనాటి పోలీసులుహనీట్రాప్తో కాదంబరి జత్వానీ మోసాలపై 2019 ఫిబ్రవరిలో ఫిర్యాదు వచ్చింది. ఆమె తనను వేధిస్తోందని, జగ్గయ్యపేట వద్ద ఉన్న తన 5 ఎకరాలను ఫోర్జరీ పత్రాలు సృష్టించి మరీ విక్రయించేందుకు యత్నిస్తోందని కుక్కల విద్యాసాగర్ అనే పారిశ్రామికవేత్త ఆధారాలతోసహా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై బాధ్యతాయుతంగా స్పందించిన విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయస్థానం అనుమతితో ముంబై వెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో ఆమెను అరెస్ట్ చేశారు.ఆమెను విచారించి కీలక ఆధారాలు సేకరించారు. జత్వానీ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను ముంబైలోని న్యాయస్థానంలో హాజరుపరచి ట్రాన్సిట్ వారంట్‌పై విజయవాడకు తీసుకువచ్చి ఇక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో విజయవాడలోని సబ్ జైలుకు తరలించారు.ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షల నిమిత్తం న్యాయస్థానం అనుమతితో ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించారు. ఈ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉంది. కీలక ఆధారాలైన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఫోరెన్సిక్ లేబొరేటరీలోనే ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం రాగానే..రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ కేసును నీరుగార్చే కుట్రకు తెరలేచింది. అంతేకాదు.. ఆనాటి ఐపీఎస్ అధికారులపై కక్ష సాధింపునకు ఈ కేసును వక్రీకరిస్తూ టీడీపీ ప్రభుత్వం కుతంత్రానికి తెరతీసింది. టీడీపీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల కనుసన్నల్లో ఈ కుట్రను అమలు చేశారు. కాదంబరి జత్వానీతో ఆనాటి ఐపీఎస్ అధికారులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించారు. అనంతరం ఆమె విజయవాడ వచ్చి గతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న తన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అప్పగించాలని కోరారు. ఆమె కోరిందే తడవుగా ప్రస్తుత విజయవాడ పోలీసులు ఆఘమేఘాలపై స్పందించారు. ఫోరెన్సిక్ లేబొరేటరీలో ఉన్న ఆమె ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విజయవాడ తెచ్చేశారు. కోర్టు పరిధిలో ఉన్న ఈ కేసులో కీలక ఆధారాలు తీసుకువచ్చేందుకు న్యాయస్థానం అనుమతి తీసుకోవాలన్న ఆలోచన కూడా పోలీసులు చేయలేదు.దీనిపై కిందిస్థాయి పోలీసు అధికారి ఒకరు అభ్యంతరం తెలపడంతో వాటిని ప్రస్తుతానికి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఉంచారు. కొద్ది రోజుల్లోనే వాటిని జత్వానీకి అప్పగించాలని పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు ఈ కేసులో కీలక ఆధారాలు ధ్వంసం కాకుండా పోలీసులను కట్టడి చేయాలని ఫిర్యాదుదారు కుక్కల విద్యాసాగర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కీలక ఆధారాలు ధ్వంసం చేసే కుట్రే!కాదంబరి జత్వానీ కుట్ర, మోసానికి సంబంధించిన కీలక ఆధారాలను ధ్వంసం చేసేందుకే విజయవాడ పోలీసులు ఆమె ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఆమెకు అప్పగించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం కేసులో కీలక ఆధారాలను నిందితులకు, మరెవ్వరికీ కూడా అప్పగించకూడదు. కేసు ముగిసేవరకు వాటిని ఫోరెన్సిక్ లేబొరేటరీ లేదా పోలీసులు లేదా న్యాయస్థానం ఆధీనంలోనే ఉంచాలి. కానీ జత్వానీ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఆమెకు అప్పగించేందుకు నిర్ణయించడం గమనార్హం. -
వలంటీర్ల ఆందోళన బాట.. పోలీసుల అత్యుత్సాహం
ఎన్టీఆర్, సాక్షి: పింఛన్ల పంపిణీని సచివాలయ ఉద్యోగులతో చేయించడంతో వలంటీర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో తమకు జీతాలు పెంచుతామని చెప్పిన కూటమి నేతలు.. తీరా అధికారంలో వచ్చాక విధులకు తమను దూరం చేయడాన్ని ప్రతికూల సంకేతంగా భావిస్తున్నారు. వలంటీర్ వ్యవస్థకు భద్రత కల్పించాలని కోరుతూ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. వలంటీర్లు చలో విజయవాడకు పిలుపు ఇచ్చారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో విజయవాడలో హైఅలర్ట్ నెలకొంది. కలెక్టరేట్ వద్ద పోలీస్ సిబ్బంది భారీగా మోహరించారు. నగర వ్యాప్తంగా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వలంటీర్లను అదుపులోకి తీసుకునేందుకు బస్టాండ్, రైల్వే స్టేషన్లలో పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరినీ చెక్ చేయడంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. కేవలం వాట్సాప్ గ్రూపుల్లో జరిగిన ప్రచారంతో ఇంత హడావిడి చేయడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ర్యాలీ, ప్రదర్శనలకు వలంటీర్లు తమను ఎలాంటి అనుమతి కోరలేదని విజయవాడ పోలీసులు చెబుతున్నారు. శాంతి భద్రతల కట్టడి సెక్షన్లు అమలులో ఉన్నాయని వారు చెబుతున్నారు. మరోవైపు వలంటీర్ సేవల్ని ఎలా ఉపయోగించుకుంటారు?.. వాళ్ల ఉద్యోగ భద్రతపై ఇప్పటిదాకా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం. -
‘రైల్ టికెట్’తో చిక్కిన హంతకులు: సంచలనం రేపిన ‘ఫాతిమా’ కేసు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): ‘మానసికంగా కుంగిపోయిన యువతిని తిరిగి ఆరోగ్యవంతురాలిని చేస్తానని ఓ భూత వైద్యుడు నమ్మించి ఢిల్లీ రప్పించుకున్నాడు. తన వద్దకు చేరిన యువతిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని ఆశలు కల్పించి సన్నిహితంగా మెలిగాడు. ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు మొదటి భార్య అడ్డు చెప్పడంతో వదిలించుకునేందుకు స్నేహితుడి సాయంతో నదిలోకి తోసి హత్యచేశాడు. అయితే తన కుమార్తె అదృశ్యమైందని యువతి తండ్రి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు, రైలు టికెట్ ఆధారంగా కేసును ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వెస్ట్ జోన్ ఇన్చార్జి డీసీపీ కె.బాబూరావు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. చిట్టినగర్‌కు చెందిన నజీర్ అహ్మద్ తన కుమార్తె ఫాతిమా అనారోగ్యానికి గురవడంతో ఉత్తరప్రదేశ్ లోని షహరానాపూర్‌కు చెందిన భూతవైద్యుడు మహ్మద్ వాసిఫ్‌ను విజయవాడకు పిలిపించాడు. అతను పది రోజులు నగరంలో ఉండి ఫాతిమాకు భూతవైద్యం చేశాడు. అనంతరం అతను స్వస్థలానికి వెళ్లిపోయాడు. ఇది జరిగిన కొద్ది కాలం తరువాత ఫాతిమా ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో నజీర్ అహ్మద్ తన కుమార్తె కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుక్ చేసిన రైల్ టికెట్టే పట్టించింది.. ఫాతిమా అదృశ్యం కేసు పూర్వాపరాలను పరిశీలించిన కొత్తపేట సీఐ మోహన్‌రెడ్డి యువతి వినియోగించిన సెల్‌ఫోన్‌ను చివరి సారి ఎక్కడ వాడోరో గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ఫోన్ కాల్‌డేటా, మెసేజ్‌లను పరిశీలించారు. యువతి సెల్‌ఫోన్‌కు ఢిల్లీకి వెళ్లేందుకు రైల్వే టికెట్‌ను బుక్ చేసినట్లు మెసెజ్‌ను గుర్తించారు. ఆ టికెట్‌ను భూతవైద్యుడు మహ్మద్ వాసిఫ్ బుక్‌చేశాడని తేల్చారు. దీంతో ఫాతిమా కేసులో పురోగతి వచ్చింది. ఢిల్లీకి వెళ్లిన ఫాతిమాను మహ్మద్ వాసిఫ్, అతని స్నేహితుడు మహ్మద్ తయ్యద్ తమ స్వగ్రామైన షహరానాపూ ర్కు తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వాసిఫ్ కొద్ది రోజుల పాటు ఫాతిమాతో సన్నిహితంగా ఉండటంతోపాటు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ విషయం వాసిఫ్ భార్యకు తెలియడంతో ఆమె గొడవ చేసింది. దీంతో పెళ్లి కుదరదని వెంటనే ఢిల్లీ వెళ్లిపోవాలని వాసిఫ్ ఫాతిమాకు చెప్పాడు. ఆమె మాట వినకపోవడంతో బైక్‌పై మీర్జాపూర్ సమీపంలోని హత్నికుండ్ డ్యామ్ వద్దకు తీసుకెళ్లాడు. స్నేహితుడు తయ్యద్ సాయంతో నదిలోకి తోసేశాడు. ఆమె మృతదేహం ఇటీవల బయటపడింది. రైల్ టికెట్ ఆధారంగా కేసు దర్యాప్తు కోసం షహరానాపూర్‌కు వెళ్లిన కొత్తపేట పోలీసులు కొద్ది రోజుల్లోనే కేసును ఛేదించారు. హత్య కేసులో ప్రధాన నిందితులు మహ్మద్ వాసీఫ్(30), మహ్మద్ తయ్యద్(29) అరెస్టు చేసి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. మీడియా సమావేశంలో వెస్ట్ ఏసీపీ హనుమంతరావు, కొత్తపేట సీఐ మోహన్‌రెడ్డి, ఎస్ఐ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫాతిమా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
సాక్షి, విజయవాడ: ఇటీవల సంచలనం రేపిన ఫాతిమా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని సహరంపూర్ కోర్టు అనుమతితో ఏపీ పోలీసులు ఇద్దరు నిందితులు వాసిమ్, తయ్యబ్‌లను విజయవాడకు తీసుకొచ్చారు. జూలై 10వ తేదీన విజయవాడలోని ఇంటి నుంచి వెళ్లిన ఫాతిమా అదృశ్యమైంది. కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రేమ పేరుతో నిందితులు ఫాతిమాను ఉత్తరప్రదేశ్‌కు రప్పించుకుని డబ్బు, బంగారం కాజేసి హత్య చేసినట్లు గుర్తించారు. అయితే ఫాతిమాను వాసిమ్, తయ్యబ్‌లే హత్య చేశారా?.. ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసుల విచారణ చేపడుతున్నారు. నిందితులను పూర్తి స్థాయిలో విచారించనున్నారు. -
Cyber Crime: లింక్ నొక్కితే.. నిలువు దోపిడీ
మీ వాట్సాప్ ఆకర్షణీయమైన పింక్ కలర్లో చూసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా ఈ లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లో అన్ని రకాల సినిమాలను హై క్వాలిటీలో చూడాలనుకుంటున్నారా? ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను లైవ్‌లో చూసి ఆనందించాలనుకుంటున్నారా? అయితే మీరు డబ్బులు చెల్లించకుండానే వాటిని అమెజాన్ ప్రైమ్, నెటిఫ్లిక్స్‌లో ఆస్వాదించండి. మీరు చేయాల్సిందల్లా ఈ లింక్‌ను క్లిక్ చేయడమే. మీ స్మార్ట్ ఫోన్లోని ఆండ్రాయిడ్ వెర్షన్లో మీరు ఊహించని గేమ్స్, సినిమాలు, మరెన్నో యాప్‌లు తక్కువ రేటుకే సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? వెంటనే ఈ లింక్‌ను ఓపెన్ చేసి మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇటువంటి ఆకర్షణీయమైన, ఆకట్టుకునే ప్రకటనలతో నమ్మకంగా పంపించే లింకులను క్షణం ఆలోచించకుండా క్లిక్ (ఓపెన్) చేస్తే మీరు తప్పులో కాలేసినట్టే. సైబర్ నేరగాళ్లు నయా దందాలకు ఇటువంటి ఎత్తుగడలు వేస్తున్నట్టు సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఇటీవల ఫేస్బుక్ అక్కౌంట్లను హ్యాక్ చేసి ఖాతాదారు ఫ్రెండ్స్‌తో మెసెంజర్ ద్వారా నమ్మకంగా చాటింగ్ చేసి డబ్బులు దండుకుంటున్న సైబర్ క్రైమ్ ముఠాలు చెలరేగిపోయాయి. తాజాగా వాట్సాప్ గ్రూపులకు యాప్‌లు, ఆఫర్లు, సినిమాలు, గేమ్స్ అంటూ లింక్‌లు పెట్టి డేటా దోచేసే ముఠాలు పేట్రేగిపోతున్నాయి. ప్రస్తుతం ఫోన్లు, వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమవుతున్న సంక్షిప్త ప్రకటనలతో వచ్చే లింక్‌ను క్లిక్ చేస్తే.. ఫోన్లోని సమాచారం చోరీ అవుతోంది. ఇన్స్టాల్ పేరుతో ఆయా లింక్‌లను క్లిక్ చేసి ఆన్లైన్ స్ట్రీమింగ్కు అనుమతిస్తే వెంటనే మన ఫోన్ సైబర్ నేరస్తుల స్వాధీనంలోకి వెళ్లిపోతోంది. లా ఫోన్లోని డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల సర్వర్లోకి చేరుతోంది. ఆ డేటాను ఉపయోగించుకుని మన మొబైల్ ఫోన్లో ఆన్లైన్ బ్యాంకింగ్ ఉంటే మనకు తెలియకుండానే డబ్బులు లాగేయడం, వ్యక్తిగతమైన ఫొటోలు, వీడియోలు చిక్కితే న్యూడ్ ఫొటోలు, వీడియోలు అంటూ డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడం, మన కాంటాక్ట్స్‌కు కాల్చేసి డబ్బులు అడగడం వంటి మోసాలు చేసేందుకు అవకాశం ఉంది. - సాక్షి, అమరావతి సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దు సోషల్ మీడియా ద్వారా ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో కొద్ది రోజులుగా పింక్ వాట్పాప్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి లింక్‌లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అటువంటి వాటిని క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దు. మనకు తెలియని, అవగాహన లేని లింక్‌లను తెరిస్తే ఫోన్లోని కాంటాక్ట్స్, ఫొటోలు, వీడియోలు, ఆన్లైన్ బ్యాంకింగ్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల పాలయ్యే ప్రమాదం ఉంది. వీటిపై ఇప్పటివరకు మా పరిధిలో ఎటువంటి కేసు నమోదు కాలేదు. అయినా ఇటువంటి లింక్‌ల పట్ల సోషల్ మీడియా యూజర్లు అప్రమత్తంగా ఉండాలి. - బి.రాజారావు, సైబర్ క్రైమ్ ఏసీపీ, విజయవాడ -
బెజవాడలో హవాలా దందా..
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ హవాలా ముఠాలకు హబ్‌గా మారింది. హవాలా, జీరో వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. వస్తు, ధన రూపంలో రూ.కోట్లలో లావాదేవీలు చప్పడులేకుండా చేస్తున్నారు. ఇదంతా జీఎస్టీ అధికారులకు, ఆదాయపన్ను శాఖాధికారులకు, పోలీసులకు తెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారని విమర్శలున్నాయి. అందుకు మామూళ్లే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.కోట్లలో వ్యాపారం వాణిజ్య నగరం విజయవాడ. ఈ నగరంలో బంగారం, వస్త్ర, చెప్పులు తదితర వ్యాపారాలకు ప్రసిద్ధి. మరీ ముఖ్యంగా బంగారం కొన్ని కుటుంబాలు రోజూ రూ.కోట్లలో వ్యాపారం చేస్తుంటారని ఇక్కడి వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇంచుమించు ఇదే తరహాలో వస్త్ర, చెప్పుల వ్యాపారం. వ్యాపారులు కేంద్ర, రాష్ట్రాలకు పన్నుల చెల్లింపుల నుంచి తప్పించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. వివిధ నగరాల నుంచి దుకాణాలకు తెప్పించుకునే సరుకులో సగానికి మాత్రమే బిల్లులు చూపుతూ.. మిగిలిన సగం సరుకు జీరో కింద ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు. అలాగే వ్యాపారులకు ఇచ్చే డబ్బును హవాలా(హుండీ) మార్గం ద్వారా యథేచ్ఛగా చెల్లింపులు చేస్తున్నారు. పశి్చమగోదావరి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న హవాలా డబ్బుపై మంగళవారం ఆకాశరామన్నలు పోలీసులకు పక్కా సమాచారం ఇవ్వడంతోనే వెలుగులోకి వచ్చింది. అడపాదడపా కేసులు.. జీరో, హవాలా వ్యాపారాలపై అడపాదడపా ఆకాశరామన్నలు అందిస్తున్న సమాచారంతో టాస్‌్కఫోర్స్ పోలీసులు ఈ ముఠాలను పట్టుకుంటున్నారు. వారికి అధికారాలు పరిమితంగానే ఉండటంతో సంబంధిత శాఖలకు ఈ కేసులను అప్పగించి చేతులు దులిపేసుకుంటున్నారు. ♦ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవాడలోని కొత్తపేట పరిధిలోని గణపతి రోడ్డులో ఈ కేఆర్ ఫ్యాషన్ వరల్డ్ షాపు రాజస్థాన్‌కు చెందిన జగదీష్ వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నారు. అతడు హవాలా మార్గం ద్వారా ఇతరులకు పంపాల్సిన రూ.35 లక్షలు తన షాపులో లెక్కిస్తుండగా కొత్తపేట పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఆదాయపన్ను శాఖకు సమాచారం ఇచ్చారు. ♦అదే నెలలో విజయవాడలోని వన్‌టౌన్ పరిధిలో జీరో వ్యాపారం కోసం ఈ నెల 12న ముంబాయి నుంచి మరుదూరు కొరియర్ సరీ్వస్‌కు వచ్చిన రూ.17.37 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను టాస్‌్కఫోర్స్ పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. వాటికి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో జీఎస్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ♦మే నెలలో ఢిల్లీ నుంచి విజయవాడ నగరానికి ట్రక్‌లో తరలిస్తున్న రూ.2.99 కోట్ల విలువైన నిషేధిత సిగరెట్లను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్(డీఆర్ఐ) అధికారులు విజయవాడ గ్రామీణ పరిధిలోని పి.నైనవరంలో పట్టుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం రాష్ట్ర జీఎస్టీ అధికారులకు అప్పగించారు. -
విజయవాడ: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం
-
దర్జాగా తిరుగుతూ.. అడ్డంగా దొరికి..
సాక్షి, విజయవాడ: ఫేక్ ఐడీ సృష్టించి.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి దర్జాగా తిరుగుతున్న నకిలీ ఎస్ఐకి భవానీపురం పోలీసులు అరదండాలు వేశారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన గుత్తాల ప్రశాంత్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఛానల్ లో కరెస్పాండెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడ దాకా బాగానే ఉంది. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి రెగ్యులర్ గా తిరిగే ప్రశాంత్ కి కోవిడ్ నిబంధనలు అడ్డంకిగా మారాయి. చెక్ పోస్టుల వద్ద చెకింగ్ తప్పించుకొనేందుకు, టోల్ ప్లాజా వద్ద ఫీజు ఎగ్గొట్టేందుకు పోలీస్ అవతారం ఎత్తాడు. సైబరాబాద్ సిటీ ఎస్ఐ గా ఫేక్ ఐడీ సృష్టించాడు. కారు నంబర్ ప్లేట్ కూడా మార్చేశాడు. AP 05 DP 5911 గా ఉన్న కార్ నంబర్ ను TS 08 DP 5911 గా మార్పు చేసి దర్జాగా తిరిగేస్తున్నారు. ఆపిన చోటల్లా ఎస్ఐ ని అంటూ బిల్డప్ ఇచ్చి ఖాకీలకే కుచ్చుటోపీ పెట్టాడు. (24 రోజులు...12 హత్యలు!) ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి చెక్ పోస్టులు దాటుకొని వచ్చిన ప్రశాంత్ ని వాహన తనిఖీలు చేస్తున్న భవానీపురం పోలీసులు చెక్ చేశారు. ఐడీ కార్డు తేడా గా ఉండటంతో అదుపులోకి తీసుకొన్నారు. ఖాకీ మార్కు ట్రీట్ మెంట్ ఇవ్వటం తో నకిలీ ఎస్ఐ వాస్తవాలను వెళ్లగక్కాడు. ప్రశాంత్ కి గతం లో కూడా నేర ప్రవృత్తి ఉందా, పాత కేసులు ఉన్నాయా, ఎస్ఐ పేరు తో ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాడు, అతను చెప్పిన కారణాలు ఎంతవరకు నిజం, అక్రమ దందా ఏమైనా చేస్తున్నాడా అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐపీసీ 170 ,419 ,465 ,468 ,471 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. (పోలీసునంటాడు.. సెల్ఫోన్లతో ఉడాయిస్తాడు) -
బెజవాడ రౌడీషీటర్లకు ఫైనల్ వార్నింగ్..
సాక్షి, విజయవాడ: నేరాల అదుపుతోపాటు, శాంతి భద్రతలపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నగర సీపీ బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు నగరంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అజిత్ సింగ్ నగర్, నున్న పోలీస్‌స్టేషన్ పరిధిలో పాత నేరస్తులకు సీఐలు లక్ష్మీనారాయణ, ప్రభాకర్ లు కౌన్సిలింగ్ ఇచ్చి, వారి నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఎక్కడ నివాసం ఉంటున్నారు. ఏం పని చేసి జీవిస్తున్నారో ఆరా తీశారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 47 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. (నందిగామలో దారుణం : హత్య చేసి ఆపై..) నగరంలో ఎక్కడైనా పాత నేరస్తులు ఇబ్బంది పెడుతుంటే తమ దృష్టికి తేవాలని సీఐలు విజ్ఞప్తి చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్లు అందరితో కలసిపోయి మంచిగా జీవనం సాగించాలన్నారు. మంచిగా జీవిస్తున్న వారిని తమ దృష్టికి తీసుకువస్తే అధికారులతో చర్చించి రౌడీషీట్ ఎత్తివేసేలా కృషిచేస్తామని పోలీసులు చెప్పారు. (కలకలం రేపిన వృద్ధురాలి హత్య) -
ఇంటి నుంచే ‘మార్పు ’ప్రారంభం కావాలి
సాక్షి, విజయవాడ: ‘దిశ’ హత్యోదంతం నేపథ్యంలో మహిళలు, యువతుల భద్రతకు బెజవాడ పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. గురువారం సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ‘భద్రం బిడ్డ’ పేరుతో అవగాహన కార్యక్రమాలకు సీపీ ద్వారకా తిరుమలరావు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏదైనా సంఘటన జరిగినప్పుడల్లా కొత్త చట్టాల డిమాండ్ వినిపిస్తోందని.. ఆ ఆలోచనా ధోరణి సరైంది కాదన్నారు. ఉన్న చట్టాలని సక్రమంగా అమలు చేస్తే చాలని తెలిపారు. నిర్భయ, పోక్సో చట్టాలు చాలా పటిష్టమైనవన్నారు. ‘100’ ఒక్క నంబర్ గుర్తు పెట్టుకొని ఆపద ఉంటే కాల్ చేయాలని.. ఆరు నిమిషాల్లో పోలీసులు మీ ముందు ఉంటారన్నారు. కొన్ని దేశాల్లో ఇప్పటికీ కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారని.. ఉరి తీయమనేంత ఆక్రోశం కలిగించిన దారుణ ఘటన ‘దిశ’ ఘటన అని పేర్కొన్నారు. ‘ఇంటి నుంచి పిల్లలు బయటకెళ్లే సమయంలో తల్లిదండ్రులు ఆడ పిల్లలకు మాత్రమే జాగ్రత్తలు చెబుతారు. మహిళల పట్ల ఎలా మసులుకోవాలో మగ పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించాలని’ సూచించారు. మార్పు అనేది ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వాట్సాప్ వీడియో కాల్స్ కి రెస్పాండ్ కాకూడదన్నారు. లఘు చిత్రాల ప్రదర్శన ద్వారా పోలీసు యాప్‌లపై కళాశాల విద్యార్థినిలకు ఆయన అవగాహన కల్పించారు. 100,1090,1091,121,181 వంటి యాప్‌ల గురించి సీపీ వివరించారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని కళాశాలల్లో కార్యక్రమాలు చేపట్టి అవగాహన కల్పిస్తామని సీపీ తిరుమలరావు వెల్లడించారు. -
డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. భద్రతకు భరోసా
‘ఎప్పుడైతే అర్ధరాత్రి రోడ్డుపై మహిళలు స్వేచ్ఛగా, భయం లేకుండా తిరగగలుగుతారో అప్పుడే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లవుతుంది’ ఇదీ జాతిపిత మహాత్మా గాంధీ అన్న మాటలు.. అయితే ప్రస్తుతం దేశంలో ఆ పరిస్థితి కనిపిస్తుందా అంటే లేదనే చెప్పాలి. ‘నిర్భయ’.. లాంటి అమానవీయ ఘటనలు మహిళా భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ నగర పోలీసులు సగటు మహిళకు జరుగుతున్న ప్రమాదాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక యాప్ ‘బీసేఫ్’ను ప్రవేశపెడుతోంది. దీనిలో మహిళా భద్రతతో పాటు హెల్మెట్, సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల జరిగే అనర్థాలపై ఆడియో, వీడియోలను పొందుపరిచింది. ఇది ఈ నెల మూడో తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. సాక్షి, అమరావతి బ్యూరో : సాంకేతికత ఎంత పెరుగుతుందో.. నేరాలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. మరోవైపు గుమ్మం దాటిన ఆడపడుచు తిరిగి ఇంటికి చేరే వరకు ప్రాణాలు అరచేతిలో ఉంచుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి. ఎక్కువ మంది ప్రమాదాలపై అవగాహన లేక.. విపత్కర పరిస్థితుల్లో ఏమి చేయలో పాలుపోక తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగర పోలీసు శాఖ ప్రత్యేక చర్యలను ప్రారంభించింది. ప్రమాదాలు.. జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళిక చేసింది. దీనిలో భాగంగా “బీ సేఫ్’ పేరిట ఓ యాప్‌ను రూపొందించింది. ఆడియో, వీడియోలను యాప్‌లో పొందుపరిచింది. ప్రమాదాలపై అవగాహన.. నగరం రాజధాని ప్రాంతంలో భాగమవడంతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మాల్స్ సంస్కృతి పెరిగింది. పాశ్చాత్య పోకడలు పెరిగాయి. నగరంలో నిత్యం ఏదో ఒక పోలీసు స్టేషన్లో మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు, అత్యాచారం వంటి ఘటనలపై కేసులు నమోదవుతున్నాయి. వీటిని నివారించేందుకు నగర పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రత్యేక నంబర్లు ఉన్నా అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శక్తి బృందాలు, డయల్ 100, బ్లూ కోల్ట్సŠ, ఇంటర్సెప్టార్, వాట్సాప్ లాంటి సౌకర్యాలు ఉన్నా.. చిక్కులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో మహిళా భద్రతలపై చర్యలు చేపట్టిన నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు “బీసేఫ్’ అనే ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. తద్వారా ప్రజలు.. ముఖ్యంగా మహిళలు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికి సిద్ధమయ్యారు. ఈ యాప్ ద్వారా డయల్ 100, గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, ఓటీపీ, ఫేస్బుక్ మోసాలతోపాటు సురక్షిత ప్రయాణం, దొంగల బారిన పడకుండా తీసుకోవాల్సిన రక్షణ చర్యలు వంటి అంశాలపై ఆడియో, వీడియో రూపంలో అవగాహన కల్పిస్తారు. డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. బీసేఫ్ యాప్‌ను సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాచారం మొత్తం మీ ముందు దృశ్యశ్రవణ రూపంలో కనిపిస్తుంది. ఏదైనా సంఘటన చూసినా.. వారి కళ్లముందు ప్రమాదం జరిగినా, అమ్మాయిలను ఎవరైనా ఈవ్ టీజింగ్ చేస్తున్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంపూర్ణ అవగాహన కల్పించే విధంగా యాప్‌కు రూపకల్పన చేశారు. ఈ యాప్ పోస్టర్లను నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లతోపాటు పాఠశాలలు, కళాశాలలు, వీధుల్లో ఏర్పాటు చేయబోతున్నారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి లేదా.. ఆయా పోస్టర్ల మీద ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకుని ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. -
రెండు గంటల్లో ఛేదించారు
చిన్నారి అపహరణకు గురైందని ఫిర్యాదు వచ్చిన వెంటనే విజయవాడ నగర పోలీసులు వేగంగా స్పందించారు. సాంకేతిక పరిజ్ఞానం తోడ్పాటుతో నిందితుడి ఆచూకి తెలుసుకున్నారు. నిందితుడిని తమదైన శైలిలో ప్రశ్నించారు. రెండు నెలల ఆరు రోజుల చిన్నారి దేవికా వెంకట ధాత్రిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. సాక్షి, అమరావతి : చిన్నారి అపహరణకు గురైందని ఫిర్యాదు వచ్చిన వెంటనే విజయవాడ నగర పోలీసులు వేగంగా స్పందించారు. సాంకేతిక పరిజ్ఞానం తోడ్పాటుతో నిందితుడి ఆచూకీ తెలుసుకున్నారు. నిందితుడిని తమదైన శైలిలో ప్రశ్నించారు. రెండు నెలల ఆరు రోజుల చిన్నారి దేవికా వెంకట ధాత్రిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురులోని మాదు తిరుపతిరావు నగర్లో చల్లా అమర్నాథ్, చల్లా కమలకుమారి దంపతులు నివసిస్తున్నారు. అమర్నాథ్ గుంటూరులోని సిల్క్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ప్లేస్మెంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. జూలై 27న కమలకుమారి పాపకు జన్మనిచ్చింది. చిన్నారికి దేవికా వెంకట ధాత్రిగా పేరు పెట్టారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన కుమార్తెను తన పెద్దనాన్న కుమారుడైన కుడిపుడి అఖిల్‌కు అప్పగించి స్నానం చేయడానికి వెళ్లింది. తిరిగి వచ్చి చూసేసరికి పాప, అఖిల్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కలా గాలించారు. అయినా వారి ఆచూకీ తెలియకపోవడంతో 5 గంటల సమయంలో పెనమలూరు పోలీసుస్టేషన్లో పాప కనిపించలేదని ఫిర్యాదు చేశారు. రెండు గంటల్లో కనిపెట్టారు.. విషయం తెలిసిన వెంటనే నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు డీసీపీ–1 హర్షవర్థన్ నేతృత్వంలో సెంట్రల్‌జోన్ ఏసీపీ నాగరాజురెడ్డి, పెనమలూరు సీఐ ఆధ్వర్యంలో నాలుగు టీమ్‌లను ఏర్పాటు చేసి దర్యాప్తునకు ఆదేశించారు. సీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీల ఫుటేజీలను పరిశీలించగా.. యనమలకుదరు కొండవెనుక ఉన్న సాయిబాబా దేవాలయానికి చెందిన సీసీ టీవీ ఫుటేజీలో కుడిపుడి అఖిల్ ఒక బ్యాగు తీసుకుని వెళ్తున్నట్లుగా గుర్తించారు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 7 గంటల సమయంలో పెనమలూరులో నిందితుడిని గుర్తించిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా కిడ్నాప్ వివరాలు వెల్లడించాడు. అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోగా.. తన బ్యాంకు అకౌంట్ ఉన్న డబ్బును సైతం తల్లి డ్రా చేసుకోనివవ్వడం లేదనే కారణంతో పాపను కిడ్నాప్ చేసినట్లు అంగీకరించాడు. బ్యాగ్‌లో పెట్టి.. పొలాల్లో వదిలేసి.. కుటుంబసభ్యులపై ఉన్న కోపంతో తన మేనకోడలిని కిడ్నాప్ చేసిన కుడిపుడి అఖిల్ పాపను ఒక బ్యాగ్‌లో దాచిపెట్టి సైకిల్‌పై తన తండ్రి కుడిపుడి ఏడుకొండలతో కలిసి పెదపులిపాక వైపు తీసికెళ్లాడు. సుమారు 6 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత పాపను బ్యాగ్‌లో నుంచి బయటకు తీసి సమీప పొలాల్లో వదిలేసి అక్కడి నుంచి వెనక్కి ఇంటికి వచ్చేశాడు. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో అఖిల్ ఇంటికి తిరిగా రాగా, తండ్రి ఏడుకొండలు ఆచూకీ తెలియలేదు. దీంతో కమలకుమారి పాప గురించి ప్రశ్నించగా నాకు తెలియదని చెప్పడంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు విచారించి పాపను విడిచిపెట్టిన ప్రాంతం వివరాలు వెల్లడించడంతో పోలీసులు వెంటనే పెదపులిపాక ప్రాంతానికి చేరుకుని పాపను రక్షించారు. పోలీసులు వెళ్లిన సమయానికి పాప ధాత్రి ఆడుకుంటూ కనిపించింది. దాదాపు రెండు గంటలపాటు ఒంటిరిగా ఉన్న చిన్నారిపై ఏదైనా జంతువుకానీ, కుక్కలు వంటికానీ దాడి చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ వెంటనే పాపను చికిత్స నిమిత్తం పాత ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. రెండు గంటల్లో చిన్నారి ఆచూకీని కనిపెట్టిన పోలీసులను కమిషనర్ అభినందించారు. -
కిడ్నాప్ కథ సుఖాంతం..
సాక్షి, విజయవాడ: సాంకేతిక పరిజ్ఞానం,పోలీసుల చాకచాక్యంతో కిడ్నాప్ కేసును 48 గంటల్లోనే ఛేదించామని డీసీపీ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశంలో వెల్లడించారు. అప్పు తీర్చలేదనే కారణంతో 8 నెలల బాలుడు అకీస్‌ని చాంద్, షహనాజ్ అపహరించారని తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన పూలుభాయ్ ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తారని.. అప్పు విషయంలో చాంద్, పూలుభాయ్‌ల మధ్య వాగ్వాదం జరిగిందన్నారు. ఈ క్రమంలో పూలుభాయ్ కుమారుడిని.. చాంద్ కిడ్నాప్ చేశాడని తెలిపారు. పోలీసులకు సమాచారం వచ్చే సమయానికి నిందితులు రైలులో పారిపోతున్నారని.. తమ బృందం వేగంగా స్పందించి ముందుగానే జైపూర్‌కు చేరుకుని, స్థానిక పోలీసుల సాయంతో నిందితులను పట్టుకున్నామన్నారు. కేసును ఛేదించిన గన్నవరం పోలీసులను డీసీపీ అభినందించారు. -
విజయవాడలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
-
కిలోల కొద్దీ వెండి, బంగారు ఆభరణాలు..!
సాక్షి, విజయవాడ : నగర పోలీస్ కమిషన్ రేట్ పరిధిలో వరస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టుబడింది. ముఠా నాయకుడు భూక్యా నాయక్‌ను, అతని గ్యాంగ్‌ను అరెస్టు చేసి పోలీసులు శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో దొంగతనాలకు పాల్పడి సవాల్ విసురుతున్న భుక్యా నాయక్ ముఠాను ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయటం ద్వారా క్రైం బ్రాంచ్ పోలీసులు పట్టుకోగలిగారని విజయవాడ సీపీ ద్వారాకా తిరుమలరావు చెప్పారు. వందల ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన భుక్యా నాయక్ ముఠా నుంచి 54లక్షలు విలు చేసే 1258 గ్రాముల బంగారు ఆభరణాలు, 17.2 కేజీల వెండి ఆభరణాలు, 9లక్షల 65వేల నగదు, ఒక ల్యాప్ ట్యాప్, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భూక్యనాయక్ తోపాటు పుల్లేటికుర్తి ఉమామహేశ్వరరావు, బాణావత్ రాజా, నల్లమోతు సురేష్, గుత్తికొండ పవన్ కూమార్ మరో మైనర్.. గ్యాంగ్‌గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని సీపీ చెప్పారు. ఈ గ్యాంగ్‌పై రాష్ట్రవ్యాప్తంగా 200 కేసులున్నాయని తెలిపారు. ముఠాలోని ఇద్దరు సభ్యులు సురేష్, పవన్ కూమార్ ఇప్పటికే జైళ్లలో ఉన్నారని వెల్లడించారు. ఇంజనీరింగ్ చదివిన ఓ వ్యక్తి కూడా ఈ గ్యాంగ్‌లో సభ్యుడిగా ఉన్నారని సీపీ పేర్కొన్నారు. భుక్యా నాయక్ ముఠా అరెస్టుతో అనేక దొంగతనాలు బయటపడ్డాయని అన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : విజయవాడలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు -
బెజవాడలో హవాలా గోల్డ్ బిజినెస్
-
విజయవాడలో కలకలం రేపిన బాక్స్ తెరిచిన పోలీసులు
-
విజయవాడలో కలకలం రేపిన ఇరీడియం బాక్స్
-
కరుడుగట్టిన సత్పాల్ ముఠా సభ్యుల అరెస్ట్
సాక్షి, విజయవాడ : కరుడుగట్టిన సత్పాల్ సింగ్ ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో హర్యానాకి చెందిన ప్రీత్‌పాల్ టాక్రాన్, రాజస్తాన్‌కి చెందిన రాజీవ్ సోనీలు ఉన్నారు. నిందితుల నుంచి మూడు కిలోల బంగారు అభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని పోలీసులు ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. అలాగే వీరి నుంచి స్వాధీనం చేసుకున్న అభరణాలను కూడా ప్రదర్శించారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ.. వీరిపై ఆంధ్రప్రదేశ్‌లో 16 కేసులు ఉన్నాయన్నారు. సీసీ కెమెరాలు లేని అపార్ట్మెంట్లను, తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వీరు చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. ముఠా ప్రధాన సూత్రధారి సత్పాల్ సింగ్‌తో పాటు మరో పది మంది సభ్యులు పరారీలో ఉన్నట్టు వెల్లడించారు.. ముఠా నాయకుడు సత్పాల్పై హత్యాయత్నాలు, దోపిడీలకు సంబంధించి 30కు పైగా కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. -
బెజవాడలో ఘర్షణలు జరగడం దురదృష్టకరం..
సాక్షి, అమరావతి : జ్యోతిరావు పూలే విగ్రహ నివాళి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు శనివారం లేఖ రాశారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విజయవాడలో ఘర్షణలు జరగడం దురదృష్టకరమని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. మూడు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదన్నారు. మహాత్మల జయంతి, వర్థంతులకు ప్రముఖులను ఆహ్వానించడం ఆనవాయితీ అని, కానీ విజయవాడలో పోలీసులు ఓవరాక్షన్ చేశారని కేవీపీ ఆరోపించారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసేందుకు కూడా అంగీకరించలేదని, అంతేకాకుండా తమను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రోటోకాల్ ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలని కేవీపీ లేఖలో కోరారు. కాగా పూలే విగ్రహానికి నివాళి వివాదంలో కాంగ్రెస్ అగ్రనేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, పల్లంరాజు సహా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనపై కేవీపీ సీఎస్‌కు లేఖ రాశారు. పోలీసులు మా హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించారని లేఖలో పేర్కొన్నారు. -
హెల్మెట్ ధరించలేదని కారు డ్రైవర్‌కు జరిమానా
విజయవాడ:నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఇ–చలానా ద్వారా జరిమానాలు చిత్రవిచిత్రంగా విధిస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రతి రోజూ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్‌లేని వారికి జరిమానాలు విధిస్తున్నారు. కొందరు వాహనాలను సీజ్ చేస్తున్నారు. గురువారం వన్ ట్రాఫిక్ పోలీసులు సెక్టార్–2లో జరిపిన తనిఖీల్లో కారు నడిపే వ్యక్తికి హెల్మెట్ లేదని ఇ–చలానాపై కేసు నమోదు చేశారు. కారు నంబర్ ఏపీ16 డీ ఎం.2229ను ఆపి కాగితాలు తనిఖీ చేశారు. అన్ని కాగితాలు సక్రమంగా ఉన్నా ఏదో విధంగా జరిమానా విధించాలని భావించిన ట్రాఫిక్ సి బ్బంది ఇ–చలానాలో కేసు బుక్ చేశారు. హె ల్మెట్ లేదని ఆ కారు నడిపిన వ్యక్తిపై కేసు న మోదు చేసి రూ.135 జరిమానా విధిస్తూ ఆన్లై న్లో చలానా పంపారు. ఇది చూసిన కారు య జమాని ఆశ్చర్యపోయారు. ఈ విషయం బయటకు రావడంతో కారు నడిపే వారు విస్మయానికి గురయ్యారు. ట్రాఫిక్ పోలీసుల నిర్వాకం ఇలా ఉందని మరికొందరు విమర్శిస్తున్నారు. -
కంచ ఐలయ్య గృహ నిర్బంధం!
-
కంచ ఐలయ్య గృహ నిర్బంధం!
హైదరాబాద్: విజయవాడ సభకు హాజరుకావొద్దంటూ ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు శుక్రవారం ఏపీ పోలీసులు నోటీసులందించి గృహ నిర్బంధం చేశారు. ఈ నెల 28న విజయవాడలో ప్రజా, కుల సంఘాలు, వామపక్షపార్టీలు నిర్వహించే సభకు ఐలయ్యను ముఖ్యఅతిథిగా ఆహ్వానించాయి. ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు.. కోమటోళ్లు’ పుస్తకం వివాదాస్పదమైన నేపథ్యంలో అదే రోజున విజయవాడలో ఆర్యవైశ్య, బ్రాహ్మణ వేదిక నాయకులు పోటీగా మరో బహిరంగసభ నిర్వహించనున్నారు. ఐలయ్య విజయవాడకు వస్తే అడ్డుకుంటామంటూ వేదిక నాయకులు హెచ్చరించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఏపీ పోలీసులు హైదరాబాద్ తార్నాకలోని ఐలయ్య ఇంటికి వచ్చారు. ‘మీరు సభకు హాజరైతే శాంతి భద్రతసమస్య తలెత్తుతుంది. అందుకే సభకు అనుమతించబోం’అంటూ ఆయనకు నోటీసులు అందించి గృహనిర్బంధం చేశారు. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు, విద్యార్థులు ఆయన ఇంటికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు దురుద్దేశంతో తమ సభను అడ్డుకునేందుకు ఆర్యవైశ్యులతో మరో సభను ఏర్పాటు చేయించారని ఆరోపించారు. విజయవాడ సభకు వెళ్లాలా..? వద్దా అనే విషయమై శనివారం ఉదయం జరిగే టీ–మాస్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
భారీగా బాహుబలి పైరసీ సీడీలు సీజ్
విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీతో దూసుకుపోతున్న బాహుబలి-2 చిత్రానికి పైరసీ బారినపడింది. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఈ చిత్రం పైరసీ సీడీలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా విజయవాడలోని బీసెంట్ రోడ్, గవర్నర్ పేటల్లోని పలు సీడీ షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా బాహుబలి-2 సినిమా ఫైరసీ సీడీలు పట్టుబడ్డాయి. టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులతో సీడీ షాపుల యజమానులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఒకవైపు దాడులు జరుగుతుండగా, మరోవైపు షాపులు మూసివేసి సీడీ షాపుల షాపుల యాజమానులు పరారయ్యారు. కాగా విశాఖపట్నంలోనూ 100 పైరసీ సీడీలను అధికారులు నిన్న సీజ్ చేశారు.