సాక్షి, విజయవాడ: నేరాల అదుపుతోపాటు, శాంతి భద్రతలపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నగర సీపీ బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు నగరంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అజిత్ సింగ్ నగర్, నున్న పోలీస్‌స్టేషన్ పరిధిలో పాత నేరస్తులకు సీఐలు లక్ష్మీనారాయణ, ప్రభాకర్ లు కౌన్సిలింగ్ ఇచ్చి, వారి నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఎక్కడ నివాసం ఉంటున్నారు. ఏం పని చేసి జీవిస్తున్నారో ఆరా తీశారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 47 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. (నందిగామలో దారుణం : హత్య చేసి ఆపై..)
నగరంలో ఎక్కడైనా పాత నేరస్తులు ఇబ్బంది పెడుతుంటే తమ దృష్టికి తేవాలని సీఐలు విజ్ఞప్తి చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్లు అందరితో కలసిపోయి మంచిగా జీవనం సాగించాలన్నారు. మంచిగా జీవిస్తున్న వారిని తమ దృష్టికి తీసుకువస్తే అధికారులతో చర్చించి రౌడీషీట్ ఎత్తివేసేలా కృషిచేస్తామని పోలీసులు చెప్పారు. (కలకలం రేపిన వృద్ధురాలి హత్య)
Comments
Please login to add a commentAdd a comment