rowdy sheeters
-
పల్నాడులో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు: ఎస్పీ
-
పిస్తా హౌస్‌లో రౌడీ షీటర్ల వీరంగం.. కస్టమర్లపై దాడి
సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలోని ఓ హోటల్లో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. హోటల్లోకి ప్రవేశించి భోజనం చేస్తున్న వారిపై దాడికి పాల్పడ్డారు. హోటల్లో సామాగ్రి ధ్వంసం చేసి భోజనం చేస్తున్న యువకులపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీంతో భయంతో బయటకు యువకులు పరుగులు తీశారు. పార్కింగ్ వద్ద హంగామా సృష్టించిన రౌడీషీటర్లు టూ వీలర్స్‌ను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన సిబ్బంది పై దాడికి దిగారు. సీసీ టీవీ కెమెరాలో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. హోటల్లోకి మొత్తం 17 మంది గ్యాంగ్ సభ్యులు వచ్చారు. మొబైల్ ఫోన్లో వీడియోలు తీస్తూ రెచ్చిపోయారు. ఒక్కసారిగా కస్టమర్స్ భయబ్రాంతులకు గురయ్యారు. అత్తాపూర్ పోలీసులకు హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
Kanchipuram: కాంచీపురంలో ఎన్కౌంటర్.. ఇద్దరు రౌడీషీటర్లు హతం
సాక్షి, చెన్నై: తమిళనాడులోకి కాంచీపురంలో ఇద్దరు రౌడీ షీటర్లను ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, నిందితులు పోలీసులపై దాడికి యత్నించగా కారణంగానే ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు చెబుతున్నారు. వివరాల ప్రకారరం.. చెన్నైలోని కాంచీపురంలో బుధవారం తెల్లవారుజూమున ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు రౌడీలను కాంచీపురం పోలీసులు కాల్చి చంపారు. కాంచీపురం రైల్వే బ్రిడ్జి సమీపంలో పోలీసు సిబ్బందిని నరికివేయడానికి ప్రయత్నించగా.. వారు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో రఘువరన్ మరియు కరుప్పు హసన్ మరణించారు. కాగా, మరో రౌడీ షీటర్ ప్రభ హత్య కేసులో వీద్దరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. #WATCH | Tamil Nadu: Two history sheeters were killed in an encounter near Kanchipuram New railway station Kanchipuram District. Police were in search of them in connection with the murder of a history-sheeter Prabha. Yesterday, Prabha was killed in a revenge attack. Police were… pic.twitter.com/F67mr3hcTH — ANI (@ANI) December 27, 2023 అయితే, ప్రముఖ రౌడీ శరవణన్ అలియాస్ ప్రభాకరన్ (35)ను చంపిన కేసులో రఘువరన్, ఆసన్ (అలియాస్ కరుప్పు హసన్) నిందితులుగా ఉన్నారు. ఈ ఇద్దరు కాంచీపురం కొత్త రైల్వే బ్రిడ్జి సమీపంలో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం తెలిసింది. దీంతో, బుధవారం తెల్లవారుజామున వీరిద్దరిని అరెస్ట్ చేసేందుకు వెల్లతురై నేతృత్వంలోని స్పెషల్ ఫోర్స్ పోలీసులు అక్కడికి వెళ్లగా.. నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపై దాడికి పాల్పడ్డారు. తమ వద్ద ఉన్న కొడవలి కత్తితో దాడి చేయడంతో ఏఎస్ఐ రామలింగం, కానిస్టేబుల్ శశికుమార్ గాయపడ్డారు. காஞ்சிபுரத்தில் நேற்று (26.12.2023) பட்டப்பகலில் ரவுடி ஒருவர் பட்டப்பகலில் ஓட ஓட வெட்டி கொலை செய்யப்பட்ட சிசிடிவி காட்சிகள் #Kanchipuram #DinakaranNews pic.twitter.com/cBajQRTeht — Dinakaran (@DinakaranNews) December 27, 2023 అనంతరం, వీరిని లొంగిపోవాలని పోలీసులు ఎంత హెచ్చరించినా వినిపించుకోలేదు. కత్తితో దాడులు చేస్తున్న క్రమంలో తమ ఆత్మ రక్షణ కోసం పోలీసులు ఫైరింగ్ చేశారు. పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరపగా.. ఇద్దరు రౌడీలు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరి మృతదేహాలను కాంచీపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన పోలీసులు చికిత్స నిమిత్తం కాంచీపురం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రభాకరన్‌పై 30కి పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. -
రౌడీషీటర్లపై ఉక్కుపాదం
బంజారాహిల్స్: పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు వీలుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు దృష్టిసారించారు. స్వేచ్ఛాయుత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేస్తూ ప్రతిరోజూ ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. గత మూడు వారాలుగా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజక వర్గాల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, బీసీ పెట్రోలింగ్ పోలీసులు రౌడీషీటర్ల కదలికలను గమనిస్తూ వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడితే రౌడీషీట్ కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. వివిధ పారీ్టల అభ్యర్థులతో తిరిగినా, ప్రచారంలో పాల్గొన్నా పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. రౌడీషీటర్లతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. తమ పిల్లలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, రాత్రి పూట ఇంటికి వస్తున్నారో లేదో దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. దీంతో రౌడీషీటర్ల భయంతో వణికిపోతున్నారు. ఖైరతాబాద్ అసెంబ్లీ పరిధిలో... ఖైరతాబాద్ నియోజక వర్గ పరిధిలోని బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, నారాయణగూడ, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, సెక్రటేరియట్, దోమల్‌గూడ, సైఫాబాద్, ఆబిడ్స్, మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 45 మంది రౌడీషీటర్ల ఉండగా ఇప్పటికే 100 శాతం బైండోవర్లు పూర్తయ్యాయి. ఇందులో కొందరు జైలులో ఉండగా మిగతావారికి నిత్యం రాత్రివేళల్లో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహస్తున్నారు. గత ఎన్నికల సమయంలో వివిధ ఘటనలకు పాల్పడిన 182 మందికి కూడా బైండోవర్ పూర్తి చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలో.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజగుట్ట, సనత్‌నగర్, హుమాయన్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 101 మంది రౌడీషీటర్ల ఉండగా వీరందరికీ 100 శాతం బైండోవర్లు పూర్తి చేసినట్లు నియోజక వర్గ ఎన్నికల నోడల్ అధికారి, జూబ్లీహిల్స్ ఏసీపీ కట్టా హరిప్రసాద్ తెలిపారు. అలాగే గత ఎన్నికల సమయంలో వివిధ నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ మరో 300 మందిని కూడా బైండోవర్ చేసినట్లు ఆయన వెల్లడించారు. రౌడీïÙటర్లకు నిత్యం కౌన్సెలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. -
బోరబండ ఇన్స్పెక్టర్పై వేటు
హైదరాబాద్: బోరబండ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ కె.రవికుమార్‌పై వేటు పడింది. ఆయన్ను సిటీ కమిషనరేట్‌కే ఎటాచ్ చేస్తూ కొత్వాల్ సందీప్ శాండిల్య మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం తదితర కారణాల నేపథ్యంలో సీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచి్చన యువకుడి హత్య కారణంగా మరో ఇన్స్పెక్టర్పై చర్యలకు కమిషనర్ రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి బుధవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల నేపథ్యంలో ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్ తమ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల వంటి అసాంఘిక శక్తులపై కన్నేసి ఉంచాలని కొత్వాల్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రౌడీషీటర్లకు సంబంధించిన రికార్డులు కలిగి ఉండాలని, వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతో పాటు ఇన్స్పెక్టర్లే స్వయంగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. వీరిని బైండోవర్ చేయడంతో పాటు క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ ఇవ్వడం, వారి ఇళ్లను సందర్శించి కదలికలపై నిఘా ఉంచడం సైతం ఇన్స్పెక్టర్ల బాధ్యతగా సందీప్ శాండిల్య స్పష్టం చేశారు. దైనందిన విధుల నేపథ్యంలో ఈ వ్యవహారాల్లో ఎస్సై సహాయం తీసుకోవాలే తప్ప పూర్తిగా వారిపై విడిచిపెట్ట కూడదని ఆదేశాలు జారీ చేశారు. వీటి అమలును పర్యవేక్షించడానికి ఆయన మంగళవారం నుంచి ఠాణాల తనిఖీలు ప్రారంభించారు. వెస్ట్‌జోన్ పరిధిలోని పలు పోలీసుస్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోరబండ ఠాణాలో సరైన రికార్డులు లేకపోవడం, రౌడీషీటర్ల వ్యవహారం ఎస్సైలే పర్యవేక్షించడం వంటివి సందీప్ శాండిల్య దృష్టికి వచ్చాయి. దీంతో ఇన్స్పెక్టర్ రవికుమార్‌ను నిలదీసిన ఆయన రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్లారా? అంటూ ప్రశ్నించారు. తన వెంట వచ్చి కనీసం నలుగురి ఇళ్లైనా చూపాల్సిందిగా ఆదేశించారు. కొత్వాల్ వాహనం వరకు వెళ్ళిన రవికుమార్ ఆ వ్యవహారాలను ఎస్సైలు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందీప్ శాండిల్య ఆయన్ను కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ ఉత్తుర్వులు జారీ చేశారు. మరోపక్క రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని కొత్వాల్ పదేపదే స్పష్టం చేస్తున్నారు. వాళ్లు ఏం చేస్తున్నారు? ఎవరితో వైరాలు ఉన్నాయి? తదితర అంశాలపై కన్నేయాల్సిందిగా ప్రత్యేక విభాగాలకు ఆదేశించారు. అయితే ఎస్సార్‌నగర్ రౌడీషీటర్ షేక్ షరీఫ్ సోమవారం రాత్రి యువకుడు తరుణ్‌ను హత్య చేశాడు. ఇది మంగళవారం వెలుగులోకి వచ్చింది. గతంలోనూ వీరి మధ్య వైరం ఉన్నా, పలుమార్లు ఘర్షణలు జరిగినా రౌడీషీటర్ పై నిఘా ఉంచడం, చర్యలు తీసుకోవడంలో ప్రత్యేక విభాగాలు నిర్లక్ష్యం వహించాయని కొత్వాల్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన మరో ఇన్స్పెక్టర్పై వేటుకు రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు బుధవారం వెలువడే అవకాశం ఉంది. -
రౌడీషీటర్లపై కొరడా
సాక్షి ప్రతినిధి విజయవాడ: నగరంలో తరచూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న రౌడీషీటర్ల భరతం పడుతున్నారు పోలీసులు. వారిని దారిలోకి తెచ్చేందుకు తమదైన శైలిలో చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్ల ఆగడాలు పెచ్చుమీరకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని.. యాక్టివ్‌గా ఉంటూ, పోస్టింగ్‌లు పెట్టే వారిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. యువతను రెచ్చగొడుతూ తమ కార్యకలాపాలను కొనసాగించే వారిని గుర్తించి, అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రతివారం రౌడీషీటర్లకు వారి స్టేషన్ల పరిధిలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వేగంగా చార్జ్ షీట్లు.. నగరంలో 373 మంది రౌడీషీటర్లు ఉండగా, 203 మందిని క్రమం తప్పకుండా పోలీసులు సంబంధించిన స్టేషన్లకు రప్పిస్తున్నారు. 28 మంది జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 18 మంది వివిధ కేసుల్లో అరెస్టు అయ్యి రిమాండ్‌లో ఉన్నారు. రౌడీషీటర్, లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్‌లు ముద్దాయిలుగా ఉన్న కేసులకు సంబంధించి త్వరిగతిన చార్జ్ షీట్లు వేస్తున్నారు. విచారణలో ఉన్న కేసుల్లో సాక్షులందరూ కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పే విధంగా చర్యలు తీసుకొంటున్నారు. వివిధ కేసుల్లో 40 మంది రౌడీషీటర్లు, 31 మంది లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్‌గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిలో ప్రధానంగా విచారణలో ఉన్న 43 కేసులను గుర్తించి వాటిని ఎస్ఐ నుంచి ఏసీపీ అధికారి వరకు ప్రత్యేకంగా అప్పగించి, విచారణలో పురోగతి ఉండేలా సీపీ టి.కె. రాణా మానిటరింగ్ చేస్తున్నారు. వడపోత ఇలా.. ● నగరంలో ఉన్న రౌడీ షీటర్ల జాబితా ఆధారంగా వారు అంతా ఎక్కడ ఉన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరు అవుతున్నారా లేదా పరిశీలిస్తున్నారు. ● ఐదేళ్లలో వారిపై నమోదైన కేసులు, నేర ఘటనల్లో పాత్ర వివరాలను క్రోడీకరిస్తున్నారు. ప్రధానంగా భౌతిక దాడులు, అల్లర్లు, మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, గొడవలు వసూళ్ల దందాలు, వంటి కేసుల్లో నిందితులుగా ఉన్న వారి కార్యకలాపాలపై నిఘా పెట్టారు. ● టాస్క్ ఫోర్స్ పోలీసులు రోజూ ఉదయం, సాయంత్రం 10 మంది రౌడీషీటర్లను మాత్రమే పిలిచి పూర్తి వివరాలు సేకరించి, వారి కార్యకలాపాలపై ఆరా తీసి, తనదైన శైలిలో కౌన్సెలింగ్ చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే, ఈ ఏడాది రౌడీషీటర్లు భాగస్వాములుగా ఉన్న హత్య, హత్యాయత్నం కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. సోషల్ మీడియా వేదికగా... నగర బహిష్కరణకు గురై సోషల్ మీడియా వేదికగా చేసుకుని తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న 50–60 మంది ప్రవర్తనను పోలీసులు నిశింతగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వీరితో కాంటాక్ట్‌లో ఉన్న యువతకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట.. కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. వారి కదిలికపై నిఘా ఏర్పాటు చేశాం. స్టేషన్ల వారీగా పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఇటీవల కాలంలో నమోదైన వివిధ కేసులతో సంబంధం ఉన్నవారి వివరాలను సేకరించి, వారి ప్రవర్తను ఆధారంగా తాజాగా చర్యలు తీసుకొంటున్నాం. పోలీసుల కౌన్సెలింగ్ తర్వాత పద్ధతి మార్చుకోని వారిపై పీడీ యాక్టును ప్రయోగించడంతోపాటు, నగర బహిష్కరణ చేస్తున్నాం. నగర బహిష్కరణకు గురై బయటి ప్రాంతాల్లో ఉండే వారిపైనా నిఘా ఉంచాం. రౌడీషీటర్లు, లా అండ్ ఆర్డర్ సస్పెక్టర్లు ముద్దాయిగా ఉన్న కేసుల విచారణ త్వరిగతిన పూర్తయి, శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకొంటున్నాం. వీరిలో గణనీయమైన మార్పు దిశగా కృషి చేస్తున్నాం. – టి.కె. రాణా, పోలీస్ కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా -
ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు?
జగిత్యాలక్రైం: శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా, నేరాల నియంత్రణ ధ్యేయంగా జిల్లా పోలీసు శాఖ రౌడీషీటర్ల కదలికలపై నిఘా తీవ్రతరం చేసింది. కొద్దిరోజులుగా వివిధ గ్రామాలు, పట్టణాల్లో చోటుచేసుకుంటున్న హత్యలు, చోరీలు, అసాంఘిక కార్యకలాపాల నేపథ్యంలో పోలీసు శాఖ మరింత అప్రమత్తమైంది. ప్రధానంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో వరుస చోరీలు, అదేప్రాంతంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి హత్య, ఆ తర్వాత దహనం కేసులను సవాల్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు.. తొలుత రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళిక రూపొందించారు. తీరు మారడంలేదని.. ● జిల్లాలో మొత్తం 182 మంది రౌడీషీటర్లు ఉన్నారని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ● వీరిలో సత్ప్రవర్తన తీసుకొచ్చేందుకు పోలీసు శాఖ తరచూ కౌన్సెలింగ్ ఇస్తోంది. అయినా, కొందరి తీరు మారడంలేదని గుర్తించింది. ● వీరు హత్యలు, అపహరణలు, రౌడీయిజం, దౌర్జన్యాలు, కుమ్ములాటలు, గొడవలు, బెదిరింపులు, భూదందాల్లో జోక్యం చేసుకుంటున్నారని పోలీసులు భావిస్తున్నారు. ● ఇలాంటివారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసుస్టేషన్ల వారీగా నిఘా పెంచారు. ● ప్రధానంగా గ్యాంగ్స్టర్లు, హిస్టరీీషీటర్లు, వారిఅనుచరుల చిట్టాను ఎప్పటికప్పుడు తిరగేస్తున్నారు. ● చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ చట్టం ప్రయోగిస్తామని ముందుగానే హెచ్చరిస్తున్నారు. ● కొందరిని ఠాణాకు పిలిపించి తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేస్తున్నారు. ● ఆ తర్వాత రూ.లక్ష – రూ.ఐదు లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెడుతున్నారు. ● అంతేకాదు.. భవిష్యత్‌లో అరాచకాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడబోమని, సత్ప్రవర్తనతో వ్యవహరిస్తామని వారినుంచి హామీ తీసుకుంటున్నారు. ● మరోవైపు.. రౌడీషీటర్లలో ఒకరిద్దరు చోటామోటా నాయకులు కూడా ఉండటం గమనార్హం. నేరాల తీవ్రత ఆధారంగా కేసులు.. గతేడాది జిల్లా కేంద్రంలోని టీఆర్‌నగర్ ట్రిపుల్ మర్డర్ కేసులో ఐదుగురిపై పీడీయాక్ట్ నమోదు చేశారు. నేరాల తీవ్రత ఆధారంగా నేరస్తులపై రౌడీషీట్ తెరుస్తున్నారు. 20ఏళ్ల క్రితం రౌడీీషీట్ నమోదై.. ఇంకా నేరాలు కొనసాగిస్తున్న వారినుంచి.. కొత్తగా రౌడీషీషీట్ నమోదైనవారూ ఈ జాబితాలో చేరారు. నేరస్తులపై నిఘా పెంచాం జిల్లాలో రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెంచాం. పోలీస్స్టేషన్ల వారీగా నిఘా పటిష్టం చేశాం. జిల్లాలో తరచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నాం. – భాస్కర్, ఎస్పీ ఇతర జిల్లాలకు రౌడీషీటర్లు.. రౌడీషీటర్లుగా పోలీసు రికార్డుల్లో చేరిన కొందరు ఇతర జిల్లాలు, ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అక్కడ ఎవరి కంటాపడకుండా చిరువ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలాంటివారి కదలికలపైనా జిల్లా పోలీసులు నిఘా పెంచారు. తొలుత అక్కడి పోలీసులకు సమచారం అందించి రౌడీషీటర్ల కదలికలు గమనిస్తున్నారు. -
ఫంక్షన్ హాల్లో రౌడీషీటర్ల విందు భోజనం.. ఎందుకంటే?
ఖలీల్‌వాడి(నిజామాబాద్ జిల్లా): రౌడీషీటర్లు ఐక్యమత్యంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. నగరంలో గత ఆదివారం పుట్టిన రోజు వేడుకల్లో రౌడీషీటర్ ఇబ్రహీం చావూస్ (29)ను రౌడీషీటర్లు హతమార్చిన విషయం విధితమే. ఈ హత్యకు ప్రధానకారణం పీడీఎస్ బియ్యం, భూ తగాదాల్లో వచ్చిన పంపకాలతోనే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఇల్లీగల్ దందాపై పోలీసు కమిషనర్ నాగరాజు సీరియస్‌గా దృష్టి సారించారు. అంతేకాకుండా ఇబ్రహీం హత్య కేసు లో 12 మంది నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ముగ్గురు పరారీలో ఉన్నారు. పోలీసుల రియాక్షన్‌తో రౌడీషీటర్లు తమకు ఇబ్బందులు తప్పవని భావించారు. తమ దందా దెబ్బతింటుందని.. విభేదాలు తొలగించుకుని ముందుకుసాగేందుకు రెండు పార్టీలకు చెందిన నేతలను ఆశ్రయించినట్లు తెలిసింది. దీంతో రౌడీషీటర్ల మధ్య విభేదాలు రాకుండా ఉండేందుకు సదరు నేతలు రంగంలోకి దిగారు. రౌడీషీటర్ల మధ్య సఖ్యత కోసం వారితో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల క్రితం నగరంలోని ఒకటో టౌన్ పోలీస్‌స్టేష న్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో ముగ్గురు రౌడీషీటర్ల అనుచరుల సమావేశం జరిగింది. దీని వెనుక రెండు పార్టీలకు చెందిన నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశంలో భూ వివాదాలు, పీడీఎస్ బియ్యం, గంజాయివంటి వాటిలో వచ్చిన లాభాలు, మా మూళ్లను అందరూ సమానంగా పంచుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవద్దని, ఒకరు వెళ్లిన పనులకు మరోవర్గం వెళ్లకుండా ఉండాలని చెప్పుకున్నట్లు తెలిసింది. ఎక్కడ ఏ పనులు చేస్తున్నామో సమాచారం ఒకరికొకరు ఇచ్చుకొని ముందుకు వెళ్లాలని, వచ్చిన ఆదాయాన్ని ముగ్గురు సమానంగా పంచుకోవాలని ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. దీంతో వివాదాలు రాకుండా ఉంటాయని, పోలీసుల దృష్టి ఉండకుండా ఉంటుందని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్.. డైరీలో షాకింగ్ విషయాలు సమావేశంలో చర్చించిన నిర్ణయాలపై అందరూ సమ్మతించడంతో అందరూ కలిసి విందు భోజనం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. ఇబ్రహీం హత్య తర్వాత పోలీసులు ఇల్లీగల్ దందాలు, రౌడీషీటర్లపై దృష్టి సారించడంతో ఎలాంటి గొడవలు లేక పోవడంతో అక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉన్నా రు. రౌడీషీటర్ల సమావేశం అనంతరం వారి కదలిక లు మళ్లీ ప్రారంభం కావడంతో ఇబ్బందులు తప్ప డం లేవని, దీనిపై పోలీసులు దృష్టి సారించాలని నగర ప్రజలు కోరుతున్నారు. -
నగర బహిష్కరణకు గురైన షీటర్ల కొత్త పంథా
సాక్షి ప్రతినిధి విజయవాడ: తరచూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న రౌడీషీటర్ల పని పట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్ల ఆగడాలు పెచ్చుమీరకుండా పోలీస్ అధికారులు యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. ఇటీవల జరిగిన ఆకాశ్ హత్యతో పాటు నున్న, పాయకాపురంలో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగర బహిష్కరణకు గురైన రౌడీషీటర్లు కొత్త పంథాలో సోషల్ మీడియా వేదికగా చేసుకొని, యువతను రెచ్చగొడుతూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. డేటా సేకరణ.. నగరంలో ఉన్న రౌడీషీటర్లను స్టేషన్లకు పిలిచి వారి డేటా క్రోడీకరించారు. గత ఐదేళ్లుగా నేర చరిత్ర హత్యలు, లైంగిక దాడులు, దోపిడీలు, అఘాయిత్యాలు, భూకబ్జాలు, సెటిల్ మెంట్లు, ఈవ్‌టీజింగ్‌లు వంటి నేరాలకు పాల్పడిన వారి వివరాలను స్టేషన్ల వారీగా సేకరించారు. తాజాగా నగర పరిధిలో మూడు అంత కంటే ఎక్కువ కేసులతోపాటు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ యాక్టివ్‌గా ఉన్న 80 మందిపై రౌడీషీట్లు తెరిచారు. పోలీస్‌లు కౌన్సెలింగ్ చేస్తున్నప్పటికీ పద్ధతి మార్చుకోని మరో 25 మందిపై నగర బహిష్కరణ వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రౌడీషీటర్లు, ఆకతాయిలు, ఈవ్‌టీజర్లను గుర్తించి 150 మందికిపైగా ఇప్పటికే బైండోవర్ చేశారు. పక్కా నిఘా.. నగర బహిష్కరణకు గురై సోషల్ మీడియా వేదికగా చేసుకొని తమ కార్యకలాపాలను సాగిస్తున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందాలు తెలంగాణ, ఒడిశా ప్రాంతాల్లో తలదాచుకొంటున్న 25 మందికిపైగా రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో కాంటాక్ట్‌లో ఉన్న యువతను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పద్ధతి మార్చుకోవాలని సూచిస్తున్నారు. శివారుపై నజర్.. విజయవాడ శివారు ప్రాంతాలైన అజిత్‌సింగ్‌నగర్, పాయకాపురం, కృష్ణలంకలోని రాణిగారితోట, రణదీప్నగర్ కట్ట, గుణదల, మాచవరం, భవానీపురం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో గస్తీ తీవ్రతరం చేశారు. రౌడీషీటర్ల కదలికపై నిఘా పెట్టారు. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్‌లపైనా కన్నేశారు. జనసాంధ్రత కలిగిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్, కాలేజీలు తదితర ప్రాంతాల్లో మఫ్టీలో పోలీసులను ఉంచి బాడిఓన్ కెమెరాలతో రౌడీలు, ఆకతాయిలు, మందుబాబులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తిస్తున్నారు. నేరాలు చేసే అవకాశం ఉన్నవారిపై, విశ్వసనీయ సమాచారం మేరకు బైండోవర్ కేసులు పెడుతున్నారు. అలాగే గత ఐదేళ్లుగా ఎటువంటి కేసులు లేకుండా సత్ ప్రవర్తనతో మెలుగుతున్న వ్యక్తుల కోసం జాబ్ మేళాలు పెట్టి ఉపాధి కల్పిస్తున్నారు. రౌడీషీట్లు ఎత్తి వేస్తున్నారు. ఉపేక్షించేది లేదు.. కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. ఇందులో భాగంగా వారి కదిలికపై నిఘా ఏర్పాటు చేసి నిశితంగా పరిశీలిస్తున్నాం. స్టేషన్ వారీగా పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఇటీవల కాలంలో నమోదైన వివిధ కేసులతో సంబంధం ఉన్నవారి వివరాలను సేకరించి, మూడు అంతకంటే ఎక్కువ కేసులు నమోదైన వారిని గుర్తించి, వారి ప్రవర్తను ఆధారంగా తాజా రౌడీషీట్లు తెరుస్తున్నాం. కౌన్సెలింగ్ తర్వాత కూడా పద్ధతి మార్చుకోని రౌడీషీటర్లను నగర బహిష్కరణ చేస్తున్నాం. రౌడీషీటర్ల సమాచారాన్ని అప్డేట్ చేశాం. నగర బహిష్కరణకు గురై బయటి ప్రాంతాల్లో ఉండేవారిపై గట్టి నిఘా ఉంచాం. రౌడీషీటర్లలో గణనీయమైన మార్పు దిశగా కృషి చేస్తున్నాం. – టి.కె. రాణా, పోలీస్ కమిషనర్, విజయవాడ -
రెచ్చిపోయిన రౌడీమూకలు.. టీస్టాల్‌పై వీరంగం
-
రెచ్చిపోయిన రౌడీమూకలు.. కిందపడేసి కాళ్లతో తన్నుతూ.. కర్రలతో బాదుతూ
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో రౌడీ మూకలు రెచ్చిపోయారు. ఆటోనగర్‌లోని రజాక్ టీ స్టాల్‌పై పెద్ద పెద్ద రాళ్లు, కర్రలతో రౌడీషీటర్, అనుచరులు దాడులకు తెగబడ్డారు. హోటల్లో టీ తాగుతుండగా వివాదం తలెత్తడంతో రౌడీషీటర్, పీడీ యాక్ట్ నిందితుడు జంగిల్ హిబ్బుతో పాటు అతని అనుచరులు దాడి చేశారు. ఒక్కసారిగా అయిదుగురు రౌడీలు రజాక్ హోటల్‌పై ఇనుప రాడ్లతో వీరంగం సృష్టించారు. టీ షాప్‌లో ఉన్న వారిపై రాళ్లతో దాడి చేసి, హోటల్లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో రౌడీ షీటర్ జంగిల్ హిబ్బు సహా ఐదుగురి పై కేసు నమోదు చేశారు. రౌడీ మూకల వీరంగంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే విధఃగా రౌడీషీటర్ల దాడిలో గాయపడిన బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు టీ స్టాల్‌లోని వ్యక్తిని రోడ్డుపైకి లాక్కొచ్చి కిరాతకంగా దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాత కక్షల నేపథ్యంలో దాడి ఘటన జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చదవండి: బాలిక అనుమానాస్పద మృతి.. రాత్రి సమయంలో ఎందుకు వెళ్లింది? -
హైదరాబాద్‌లో పేట్రేగిపోతున్న రౌడీ మూకలు
-
పేట్రేగుతున్న బ్లేడ్ బ్యాచ్
సాక్షి, కంబాలచెరువు(రాజమహేంద్రవరం): బ్లేడ్ బ్యాచ్‌లు రెచ్చిపోతున్నాయి. అమాయకులను బెదిరించి సొమ్ములు కాజేయడం.. వాటితో జల్సాలు చేయడం.. గంజాయి, డ్రగ్స్‌కు బానిసై గొడవలకు దిగడం, దోపిడీలు, హత్యలకు పాల్పడడం వీరికి నిత్యకృత్యమైంది. జిల్లాలోని రాజమహేంద్రవరం, తుని, అమలాపురం ప్రాంతాల్లో ఈ నేర సంస్కృతి ఎక్కువైంది. రాజమహేంద్రవరంలో గత రెండేళ్లలో బ్లేడ్ బ్యాచ్ ముఠా తగాదాలు కారణంగా ఐదు హత్యలు జరిగాయంటే వీరి ఆగడాలు ఎంత మితిమీరుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. శనివారం రాజమహేంద్రవరం ఆదెమ్మదిబ్బ వాంబేకాలనీలో జరిగిన హత్యతో మరోసారి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రూపాయి బ్లేడే ఆయుధం.. నేర చరిత్ర గల యువకులు, కొత్తగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన రౌడీషీటర్లు, వీధి బాలల స్థాయి నుంచి ఎదిగే నేరగాళ్లు బ్లేడు బ్యాచ్‌లుగా తయారవుతున్నారు. వీరు మద్యానికి, గంజాయి దమ్ముకు బానిసై ఆ మత్తులో దాడులకు పాల్పడుతున్నారు. గతంలో రాత్రి సమయాల్లో రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల సమీపాల్లో మద్యం సేవిస్తూ ఒంటరిగా వెళ్లే ప్రయాణికులను బెదిరించి వారి వద్ద విలువైన వస్తువులు దోచుకునేవారు. ప్రస్తుతం ఈ సంస్కృతి విస్తరించి మురికివాడల్లోని యువకులు కూడా బ్లేడు బ్యాచ్‌లుగా మారుతున్నారు. రూపాయికి లభించే బ్లేడును ముక్కలుగా విరిచి వేళ్ల మధ్య పెట్టుకోవడం ఆ చేత్తో దాడికి దిగుతున్నారు. విలువైన వస్తువులు తస్కరించి క్షణాల్లో అక్కడి నుంచి పరారవుతున్నారు. నగరంలోని కొందరి పెద్దల అండదండలతో ఈ బ్లేడ్ బ్యాచ్ యువకులు చెలామణీ అవుతున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో.. అనుమానాస్పద రికార్డు గలవారు : 789 రౌడీ షీటర్లు : 276 దొంగలు : 21 దోపిడీలకు పాల్పడేవారు : 33 పట్టించుకోని పోలీసులు జిల్లాలో బ్లేడ్ బ్యాచ్‌లు రెచ్చిపోతున్నా.. పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ బ్యాచ్ ఆగడాలపై పోలీస్స్టేషన్లకు వెళ్లి బాధితులు ఫిర్యాదుచేస్తున్నా పెద్దగా పోలీసు అధికారులు స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. తిరిగి బాధితులదే తప్పు అన్నట్టుగా పోలీసుల ప్రవర్తన ఉంటోందని పలువురు అంటున్నారు. గతంలో ప్రతి నెలా రౌడీషీటర్లకు స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చేవారు. ఇటీవల ఆపేశారు. వీరు ఊరు వదిలి వెళ్లినా సంబంధిత పోలీస్ స్టేషన్లో చెప్పి వెళ్లాల్సి వచ్చేది. పెరుగుతున్న నేరాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు వీరిపై దృష్టి సారించి నేరాలను అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ముఠాల మధ్య ఆధిపత్య పోరే హత్యలకు కారణం ► గత మూడేళ్లలో రాజమహేంద్రవరంలో జరిగిన హత్యలు పరిశీలిస్తే.. ముఠాల మధ్య ఆధిపత్య పోరు, ఆర్థిక లావాదేవీల పంపకాల్లో తేడాల కారణంగానే చోటు చేసుకున్నాయి. ► రెండేళ్ల క్రితం ఆదెమ్మదిబ్బకు చెందిన ఉప్పు శివ, కంబాలపేటకు చెందిన సన్నీ ముఠాల మధ్య వివాదాలు కారణంగా ఉప్పు శివను సన్నీ వర్గం కిరాతకంగా చంపారు. దీంతో కక్ష పెంచుకున్న ప్రత్యర్థి వర్గం సన్నీని లాలాచెరువు చోడేశ్వరనగర్ ప్రాంతంలో పొడిచి చంపారు. ► నగరంలో బ్లేడు ముఠాలో ఓ ముఠాకు నాయకుడిగా ఉన్న కరణం వాసును అతడి ప్రత్యర్థి వర్గం మద్యం తాగించి పేపరుమిల్లు యార్డు సమీపంలో కిరాతకంగా హత్యచేశారు. ఆ సమయంలో హత్యకు ఉపయోగించిన ఆయు ధం పోలీసులను సైతం ముచ్చెమటలు పట్టించింది. ► బ్లేడుబ్యాచ్ యువకుడైన సన్నీ తమ్ముడు బన్నీపై పలు బెదిరింపు కేసులు ఉండడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు వెళ్లగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని పోలీసులను భయబ్రాంతులకు గురిచేశాడు. ఆ సమయంలో ఒళ్లు తీవ్రంగా కాలడంతో చికిత్స పొందుతూ బన్నీ మృతి చెందాడు. ► అప్సరా థియేటర్ ప్రాంతానికి చెందిన ఓ బ్లేడు బ్యాచ్ యువకుడిపై మరో వర్గం దాడి చేయడంతో అతడు చికిత్స పొందుతూ కాకినాడ జీజీహెచ్‌లో మృతి చెందాడు. ఆ మృతదేహానికి నేర చరిత్రగల యువకులందరూ ఊరేగింపు నిర్వహిస్తుండడంతో అడ్డుకున్న ఒకటో పట్టణ ఎస్సైపై బ్లేడుతో దాడిచేసిన ఘటన అప్పట్లో సంచలనమైంది. ► ఇటీవల హత్యకు గురైన రౌడీషీటర్ వై.శ్రీను వెనుక ఉండే అనేక మంది యువకులు బ్లేడులతో దాడి చేయడంలో ఆరితేరిన వారే. ► నగరంలో కాలేజీలు, కళాశాలల విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటే ఏదో ఒక వర్గం తరఫున బ్లేడ్‌బ్యాచ్ యువకులు రంగ ప్రవేశం చేసి దాడులు చేసిన ఘటనలు అనేకం. కఠిన చర్యలు చేపట్టాం ఇటీవల జరుగుతున్న బ్లేడ్ బ్యాచ్ దాడులపై కఠిన చర్యలు చేపడుతున్నాం ఇందులో ఎవరినీ ఉపేక్షించేది లేదు. ఇప్పటికే తమ వద్ద 82 మంది బ్లేడ్ బ్యాచ్ అనుమానితుల చిట్టా ఉంది. వీరందరిపై దృష్టిసారించాం. ఎప్పటికప్పుడు వీరి కదలికలను తమ సిబ్బంది కనిపెడుతున్నారు. వీరిపై కేసులు నమోదు చేస్తున్నాం. అలాగే రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇస్తాం. కరోనా కారణంగా కౌన్సెలింగ్ పక్రియ తగ్గింది. బ్లేడ్ బ్యాచ్ కదలికలపై ఎవరికైనా ఎప్పుడైనా అనుమానం వస్తే వెంటనే 100కి కాల్ చేసి తెలపండి. – లతామాధురి, అడిషనల్ ఎస్పీ, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా -
హైదరాబాద్‌లో రక్తచరిత్ర
హైదరాబాదు నగరంలో ఆదివారం వేర్వేరుచోట్ల ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. అమీర్‌పేట్‌లో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను నలుగురు వ్యక్తులు కత్తులు, తల్వార్లతో పొడిచి దారుణంగా హత్యచేయగా పహాడీషరీఫ్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అంతమొందించారు. సాక్షి, అమీర్‌పేట: అమీర్‌పేట ధరంకరం రోడ్డులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులు, తల్వార్లతో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు అపార్ట్మెంట్ సెల్లార్లో కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు..గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కేశన చంద్రశేఖరరాజు (25)కి మచిలీపట్నంకు చెందిన లక్ష్మీగౌరి (22)తో 2019 ఫిబ్రవరి 23న వివాహం జరిగింది. అయితే ఈ సంవత్సరం జూన్ 1న లక్ష్మీగౌరి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో చంద్రశేఖరరాజు జైలుకెళ్లి బెయిలుపై వచ్చాడు. రోజు బాలానగర్ ఏసీపీ కార్యాలయానికి వెళ్లి సంతకాలు చేయాల్సి ఉండటంతో అమీర్‌పేట ధరం కరం రోడ్డులోని పద్మశ్రీ అపార్ట్మెంట్లోని మేనమామ ఇంట్లో 40 రోజులుగా ఉంటున్నాడు. ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో చికెన్ తీసుకురావడం కోసం కిందకు వచ్చాడు. సెల్లార్లో అప్పటికే కాపుకాసిఉన్న నలుగురు దుండగులు కత్తులతో శరీరంపై తీవ్రంగా పొడిచారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చంద్రశేఖరరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో స్థానికులు ఎస్ఆర్నగర్ పోలీసులకు సమాచారం అందించారు. బంజారాహిల్స్ ఏసీపీ, ఇన్స్పెక్టర్ సైదులు హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు మృతుడి భార్య లక్ష్మీగౌరి సమీప బంధువులే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పహాడీషరీఫ్: పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఓ రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపిన మేరకు.. రాజేంద్రనగర్‌కు చెందిన సయ్యద్ వాహెద్« అలీ (25) చిన్నతనం నుంచే నేరబాట పట్టాడు. 2016లో ఫలక్‌నుమా ఠాణా పరిధిలో హత్య చేశాడు. ఇతనిపై ఇంకా పలు స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇతనిపై బహదూర్‌పురా పోలీసులు రౌడీషీట్ కూడా తెరిచారు. జల్పల్లి చెరువు కట్టపై ఉన్న గుట్ట రాళ్ల మధ్యలో వాహెద్ అలీ మృతదేహం పడి ఉండడాన్ని ఆదివారం సాయంత్రం గమనించిన స్థానికులు పహాడీషరీఫ్ పోలీసులకు సమాచారం అందించారు. ఎల్బీ నగర్ క్రైమ్ డీసీపీ శ్రీనివాస్, వనస్థలిపురం ఇన్చార్జి ఏసీపీ ఎం.శంకర్, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్సై కుమార స్వామిలు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి మెడ కోసి ఉండడంతో పాటు కడుపు భాగంలో కూడా కత్తిపోట్లు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్‌తో నిందితుల జాడ గుర్తించేందుకు ప్రయత్నించారు. కాగా మృతుడిని శనివారం సాయంత్రం ఆదిల్, చాంద్ అనే ఇద్దరు విందు చేసుకుందామని తీసుకొచ్చినట్లు మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా వారం క్రితమే బహదూర్‌పురా పోలీసులు షీట్‌ను రాజేంద్రనగర్‌కు బదిలీ చేశారు. పలువురితో శత్రుత్వం ఉన్న వాహెద్ అలీని శత్రువులే మట్టు బెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు సంతానం. -
రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా..
సాక్షి, విజయవాడ: రౌడీషీటర్ల కదలికలపై నగర పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కమిషనరేట్ పరిధిలో 476 మంది రౌడీషీటర్లు, 500 మంది సస్పెట్స్ షీటర్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్లలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. తుపాకులు, మారణాయుధాలతో రౌడీషీటర్ కొక్కొలగడ్డ జాన్ బాబు పట్టుబడటంతో పెనమలూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. స్టేషన్ పరిధిలో నేర ప్రవృత్తి కల్గిన 140 మందిని సమావేశపరిచి సీఐ సత్యనారాయణ హెచ్చరించారు. దందాలు, సెటిల్మెంట్లు చేస్తే పిడీ యాక్టులు పెట్టి నగర బహిష్కరణ చేస్తామన్నారు. గంజాయి అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతిఒక్కరి పై సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా ఏర్పాటు చేశామని, చిన్న తప్పు చేసినా పట్టేస్తామన్నారు. సత్ప్రవర్తనతో మెలిగితే రౌడీషీట్స్ తొలగించే అవకాశం కూడా ఉందన్నారు. ప్రజా జీవనానికి విఘాతం కల్గిస్తే జైలు జీవితం తప్పదని సీఐ సత్యనారాయణ హెచ్చరించారు. -
సాలార్జంగ్ మ్యూజియంలో రౌడీషీటర్ల మేళా
సాక్షి, హైదరాబాద్: దీర్ఘ కాలంపాటు ఎలాంటి నేరాలు చేయకుండా బుద్ధిగా మెలిగిన 31 మంది రౌడిషీటర్లపై ఉన్న రౌడీషీట్లను పోలీసులు క్లోజ్ చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. పాతబస్తీ సౌత్ జోన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ల మేళా సాలార్ జుంగ్ మ్యూజియంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ... పాతబస్తీలో సత్ప్రవ్తన కలిగి నేరాలకు దూరంగా ఉన్న 31 మంది రౌడీ షీటర్ల పేర్లను పోలీస్ రికార్డుల్లోంచి తొలగించాం. వీరంతా కొత్త జీవితాన్ని గడిపేందుకు అవకాశం కలిపించాం. గతంలో వీరంతా తప్పులు, నేరాలు చేసి జైలుకి వెళ్లిన వారు. కానీ, ఇప్పుడు బుద్ధిగా ఉంటున్నారు. వీరిపై ఉన్న రౌడీషీట్లు తొలగిపోవడంతో అందరికీ ఆదర్శంగా ఉంటూ కుటుంబంతో సంతోషంగా జీవించాలని కోరుతున్నా. సమాజంలో మంచిగా మెలగండి. బాధ్యతగా ప్రవర్తించండి. తిరిగి ఎలాంటి నేరాలకు పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన మళ్లీ జైలుకు వెళతారు’అని సీపీ పేర్కొన్నారు. -
పక్కా ప్లాన్‌తో పోలీసులపై కాల్పులు
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన రౌడీమూకల కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు చనిపోగా, అయిదుగురు పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే. మృతుల్లో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశశ్రాతో పాటు ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారు జామున 1.30 గంటలకు చోటుచేసుకుంది. ఇటీవల హత్యాయత్న కేసుకు సంబంధించి రౌడీ షీటర్ వికాస్‌దూబేపై రాహుల్ తీవారీ అనే గ్రామస్థుడు ఫిర్యాదు చేయడంతో.. అతడిని పట్టుకునేందుకు డీఎస్పీ దేవేందర్ మిశ్రా ఆధ్వర్యంలోని 16 మంది పోలీసుల బృందం గురువారం రాత్రి బిక్రూ గ్రామానికి వెళ్లారు. పోలీసులు గ్రామానికి చేరుకోగానే అక్కడ వారి కదలికలను గుర్తించిన నేరస్థులు పోలీసులు బయటకు వెళ్లకుండా రోడ్లన్నీ దిగ్భంధించారు. పోలీసులు తమ వాహనాల నుంచి కిందకు దిగగానే నేరస్థులు తమ భవనాలపై నుంచి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. (పోలీసులపై కాల్పులు.. 8 మంది మృతి) నేరస్థులు ఎత్తైన ప్రదేశం నుంచి కాల్పులు జరపడంతో డీఎస్పీ సహా ఎనిమిది పోలీసులు మరణించారు. పోలీసులపై దాడి తర్వాత దూబే మనుషులంతా అక్కడి నుంచి పారిపోయారు. ఈ కాల్పుల్లో మరో అయిదుగురు పోలీసులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు డీజీపీ హెచ్‌సీ అవస్థీ తెలిపారు. సంఘటన జరిగిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేశారు. ఆరు జిల్లాలతో కూడిన కాన్పూర్ డివిజన్లోని అన్ని సరిహద్దులను మూసివేసినట్లు డీజీపీ తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన ఎనిమిది మంది పోలీసు సిబ్బందికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాళులు అర్పించారు. ఈ సంఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.(‘మహా’ పెరుగుదల: ఒక్క రోజే 6330 కేసులు) పోలీసుల వివరాల ప్రకారం... కరుడు గట్టిన రౌడీ షీటర్ వికాస్ దూబే బిక్రూ గ్రామానికి చెందిన వ్యక్తి. అతను అదే గ్రామంలో ఓ ప్రైవేటు గ్యాంగ్ ముఠాను నడుపుతున్నట్లు తెలిసింది. ఈ గ్యాంగ్‌లో ఎక్కువగా యువతను చేర్చుతూ, వారికి కావాల్సిన ఆయుధాలను కూడా సమకూరుస్తాడు. అతడిపై హత్య, దొంగతనాలు, కిడ్నాప్లతో సహా 60 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2000 ఏడాదిలో తారాచంద్ ఇంటర్ కళాశాల ప్రిన్సిపల్ సిద్ధేశ్వర్ పాండే హత్య కేసులో దూబే పేరు కూడా ఉంది. అదే విధంగా 2001లోనూ అప్పటి మంత్రిగా పదవిలో ఉన్న బీజేపీ నేత సంతోష్ శుక్లాను శివలి పోలీస్ స్టేషన్లో హత్య చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో దూబే ప్రధాన నిందితుడు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు కూడా మరణించారు. అయితే ఈ కేసులో దూబేను సెషన్ కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. ఇక బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన వికాస్ దూబే నగర పంచాయతీ సభ్యునిగా ఎన్నికయ్యారు. -
పోలీసులపై కాల్పులు జరిపిన రౌడీలు..
-
రౌడీషీటర్ల కాల్పులు.. 8 మంది పోలీసుల మృతి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. డీఎస్పీతో పాటు 8 మంది పోలీసులను కాల్చి చంపారు. కాన్పూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఈ కిరాతక ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా ముగ్గురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారని యూపీ ప్రభుత్వం తెలిపింది. కాన్పూర్ శివారులోని చౌబెపూర్‌లోని పోలీస్ స్టేషన్ పరిధిలోని బిక్రూ గ్రామంలో రౌడీ షీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు పోలీసుల బృందం కాన్పూర్ వెళ్లింది. పోలీసులపై రౌడీషీటర్లు అనూహ్యంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఎనిమిదిమంది పోలీసులు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. అదనపు డీజీపీ(శాంతి భద్రతలు), కాన్పూర్ ఎస్పీ, ఐజీ సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల మృతి ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాల్పులు జరిపిన వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి (హోం), డీజీపీతో మాట్లాడిన ఆయన ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని కోరారు. హంతకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని కాన్పూర్ ఏడీజీ జేఎన్ సింగ్ తెలిపారు. ఇతర జిల్లాల నుంచి అదనపు సిబ్బందిని రప్పించామన్నారు. గాయపడిన నలుగురు పోలీసులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. బీజేపీకి చెందిన మంత్రి సంతోష్ శుక్లా హత్యతో సహా రౌడీషీటర్ వికాస్ దూబేపై 57 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2001లో శివలి పోలీస్ స్టేషన్లో సంతోష్ శుక్లాను హత్య చేసినట్లు దుబేపై ఆరోపణలు ఉన్నాయి. రాజ్‌నాథ్ సింగ్ కేబినెట్లో శుక్లా మంత్రిగా పనిచేశారు. -
బెజవాడ రౌడీషీటర్లకు ఫైనల్ వార్నింగ్..
సాక్షి, విజయవాడ: నేరాల అదుపుతోపాటు, శాంతి భద్రతలపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నగర సీపీ బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు నగరంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అజిత్ సింగ్ నగర్, నున్న పోలీస్‌స్టేషన్ పరిధిలో పాత నేరస్తులకు సీఐలు లక్ష్మీనారాయణ, ప్రభాకర్ లు కౌన్సిలింగ్ ఇచ్చి, వారి నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఎక్కడ నివాసం ఉంటున్నారు. ఏం పని చేసి జీవిస్తున్నారో ఆరా తీశారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 47 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. (నందిగామలో దారుణం : హత్య చేసి ఆపై..) నగరంలో ఎక్కడైనా పాత నేరస్తులు ఇబ్బంది పెడుతుంటే తమ దృష్టికి తేవాలని సీఐలు విజ్ఞప్తి చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్లు అందరితో కలసిపోయి మంచిగా జీవనం సాగించాలన్నారు. మంచిగా జీవిస్తున్న వారిని తమ దృష్టికి తీసుకువస్తే అధికారులతో చర్చించి రౌడీషీట్ ఎత్తివేసేలా కృషిచేస్తామని పోలీసులు చెప్పారు. (కలకలం రేపిన వృద్ధురాలి హత్య) -
ఇద్దరు రౌడీ షీటర్ల దారుణ హత్య
-
జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: లంగర్‌హౌస్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు రౌడీషీటర్ హర్షద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబూ, చాంద్ మహ్మద్‌ను హర్షద్ గ్యాంగ్ కత్తులతో నరికి హత్య చేసినట్లు నిర్ధారించారు. క్వాలిస్ వాహనంలో ఆరుగురు వచ్చి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. మరో ముగ్గురు పరారీలో ఉండగా, ముంబై వైపు వెళ్లినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలోనే హత్యలు జరిగినట్టు విచారణలో తేలింది. కొన్నాళ్ల నుంచి ఇబ్రహీం నుంచి తప్పించుకుని ముంబైలో తలదాచుకున్న చాంద్.. లాక్డౌన్ నేపథ్యంలో ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లుగా తెలిసింది. గచ్చిబౌలి, లంగర్‌హౌస్ తదితర ప్రాంతాల్లో ఉంటున్న చాంద్‌పై ప్రత్యర్ధులు రెక్కీ చేసి ప్లాన్ ప్రకారం దాడి చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. -
ఆధిపత్యం కోసం 13 హత్యలు
తిరువళ్లూరు: శ్రీపెరంబదూరు నుంచి తక్కోలం వైపు వెళ్తుతున్న ఇద్దరు రౌడీలను ప్రత్యర్థులు కాపు కాచి నాటు బాంబు విసిరి కత్తితో నరికి దారుణంగా హత్య చేసిన సంఘటన తిరువళ్లూరు జిల్లా పన్నూరు వద్ద శనివారం చోటు చేసుకుంది. కాంచీపురం పట్టణానికి చెందిన బాబు కుమారుడు జీవ(19), రమేష్ కుమారుడు గోపి(24). వీరిద్దరూ శ్రీపెరంబదూరు నుంచి తక్కోలం వైపు ద్విచక్ర వాహనంలో వెళ్తున్నారు. పన్నూర్ వద్ద ఉన్న స్పీడ్ బ్రేక్‌ను దాటే సమయంలో కాపు కాచిన సుమారు 10 మంది ద్విచక్ర వాహనంలో వెళ్తుతున్న ఇద్దరిపై నాటుబాంబులను విసిరారు. బాంబులు వారిపై పడడంతో జీవా, గోపి కిందపడిపోయారు. ఇద్దరినీ కత్తితో ప్రత్యర్థులు దారుణంగా నరికి హత్య చేసి పారిపోయారు. దుండగులను గ్రామస్తులు పట్టుకోవడానికి యత్నించినా వారు కత్తిని చూపించి పరారైనట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న తిరువళ్లూరు ఎస్పీ అరవిందన్, శ్రీపెరంబదూరు అసిస్టెంట్ ఎస్పీ కార్తికేయన్ తిరువళ్లూరు డీఎస్పీ గంగాధరన్ నేతృత్వంలోని పోలీసులు భారీగా మోహరించారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులను సంఘటనా స్థలానికి రప్పించి ఆధారాలను సేకరించారు. బాంబు దాడితో ఇద్దరి మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు శవ పరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. హత్యకు ఆధిపత్య పోరే కారణమా? పోలీసుల విచారణలో ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాంచీపురం జిల్లా కోలాచ్చీకి చెందిన ప్రముఖ రౌడీ శ్రీధర్. కాంచీపురం తిరువళ్లూరు తదితర జిల్లాల్లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను బెదిరించి కిడ్నాప్, రియల్‌దందా, పంచాయితీలు, గంజాయి విక్రయం లాంటివి నిర్వహించి డబ్బులు వసూలు చేసేవాడు. శ్రీధర్ వ్యవహరాలు పోలీసులకు తలనొప్పిగా మారడంతో మోస్ట్‌వాంటెండ్‌గా ప్రకటించాడు. కాంబోడియా పారిపోయిన శ్రీధర్ 2017లో సైనైడ్ తీసుకుని అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతని స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అతని డ్రైవర్ దినేష్, శ్రీధరన్ మేనల్లుడు తనికాచలం ప్రయత్నించారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి వంద మందితో గ్రూపులను ఏర్పాటు చేసుకుని దందాలు సాగించడం ప్రారంభించారు. కిడ్నాప్, రియల్‌దందా, పారిశ్రామికవేత్తలను బెదిరింపులకు గురిచేసి శ్రీధర్‌ను తలపించేలా వ్యవహరాలను నడిపించడం ప్రారంభించారు. కాంచీపురం పట్టణంలో తరచూ హత్యలు, కిడ్నాప్లతో చెలరేగడంతో వీరిని అదుపులోకి తేవడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. కాంచీపురంలో రౌడీషీటర్లుగా చెలామణి అవుతూ అల్లరి సృష్టిస్తున్న వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి వేలూరు, ఊటి తదితర ప్రాంతాల్లో గాలించినా వారు తృటిలో తప్పించుకుని కర్ణాటకు పరారయ్యారు. ఆధిపత్యం కోసం 13 హత్యలు తనికాచలం, దినేష్ రౌడీలుగా చెలామణి అయిన తరువాత ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి 2017 నుంచి ఇప్పటి వరకు అప్పుకుట్టి డాన్మణి, కరుణాకరన్, సతీష్‌కుమార్‌తో సహా రెండు వర్గాలకు చెందిన 13 మంది హత్యకు గురయ్యారు. ప్రస్తుతం జీవా, గోపి హత్యతో 15కు చేరింది. ఇదివుండగా రెండు నెలల క్రితం తనికాచలం వర్గానికి చెందిన కరుణాకరన్‌ను దినేష్ త్యాగు మరో పది మంది కలిసి హత్య చేశారు. వీరిలో త్యాగు, దినేష్ పోలీసులకు పట్టుబడి జైలులో రిమాండ్‌గా ఉంటున్నారు. తమ వర్గానికి చెందిన కరుణాకరన్‌ను దినేష్ వర్గీయులు హత్య చేయడంతో ప్రతీకారం తీర్చుకోవడానికి తనికాచలం గ్రూపునకు చెందిన చిన్న హరికృష్ణన్, షణ్ముగం, గోపి , జీవ రెండు రోజుల క్రితం కత్తులు, బాంబులో కాంచీపురంలో నానారభస సృష్టించారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు అక్కడికి చేరుకుని చిన్న, హరికృష్ణన్, షణ్ముగంను అరెస్టు చేయగా, గోపి, జీవా తప్పించుకున్నారు. దినేష్ వర్గీయులపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గోపి, జీవా నుంచి తమకు ముప్పు ఉంటుందని గ్రహించిన దినేష్ వర్గీయులు శనివారం తిరువళ్లూరు, పన్నూరు వద్ద కాపుకాచి ఇద్దర్నీ హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన ఎస్పీ అరవిందన్ హత్యల్లో పాల్గొన్న వారిని వేగంగా పట్టుకోవాలని ఆదేశించారు. మొత్తానికి తిరువళ్లూరులో శనివారం ఉదయం జరిగిన బాంబుల దాడి ఇద్దరి హత్య సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. -
రౌడీషీటర్లకు కొమ్ముకాసే ఖాకీలపై వేటు
సాక్షి, గుంటూరు : క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన కొందరు కానిస్టేబుళ్లు శాంతిభద్రతలకు విఘాతం కల్పించే రౌడీషీటర్లకు కొమ్ము కాస్తున్నారు. ఎప్పటికప్పుడు వారికి పోలీస్స్టేషన్లలోని అధికారులు తీసుకునే చర్యలు గురించి ముందస్తు సమాచారం అందజేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఈ కారణంగా సమస్యాత్మకమైన రౌడీషీటర్లు అజ్ఞాతంగా ఉంటూ హత్యలకు వ్యూహాలు రచిస్తూ, వైట్ కాలర్ నేరాలకు సైతం పాల్పడుతున్నారు. సివిల్ వివాదాల్లో తలదూర్చి బెదిరింపులకు పాల్పడుతూ దందాలు చేస్తున్నారు. ఇటీవల ఓ కీలక వ్యక్తి అందించిన సమాచారంతో అర్బన్ జిల్లా పరిధిలో నలుగురు రౌడీషీటర్లతో పాటు మరో ఆరుగురు యువకులను అరెస్టు చేయడంతో వరుసగా ఏడు హత్యలకు వ్యూహం రచించినట్లు పోలీసుల విచారణలో తేలడం గమనార్హం. రౌడీషీటర్ల హత్యల విషయం బయట పడటంతో నగరవాసులు, మిగిలిన రౌడీషీటర్లు ఉలికిపాటుకు గురయ్యారు. మరింత అప్రమత్తమైన పోలీసులు మరో ముఠాలోని రౌడీషీటర్లను అదుపులోకి తీసుకొని విచారించే పనిలో పడ్డారు. సిబ్బంది పనితీరుపై సమీక్ష సొంత ఇంటికే కన్నం వేస్తూ సమాచారాన్ని రౌడీషీటర్లకు చేరవేస్తున్న సిబ్బందిని గుర్తించే పనిలో అర్బన్, రూరల్ ఎస్పీలు నిమగ్నమయ్యారు. సమాచారాన్ని రహస్యంగా ఉంచుతూ కౌన్సెలింగ్ సమయంలో రౌడీషీటర్లు విధిగా పోలీస్ స్టేషన్లలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన కొందరు కానిస్టేబుళ్లు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని ఎస్పీలు సీరియస్‌గా పరిగణించారు. సమాచారం చేరవేస్తున్న సిబ్బంది గురించి నిఘా వర్గాల ద్వారా ఆరా తీస్తున్నారు. రౌడీషీటర్లకు సిబ్బంది సమాచారం చేరవేస్తూ వారి నుంచి వేల రూపాయలు అందుకుంటున్నట్లు తెలిసింది. నిఘా వర్గాలు కూడా ఈ విషయాల గురించి ఉన్నతాధికారులకు నివేదికలు అందచేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొందరు రౌడీషీటర్లు ఎక్కడ ఉన్నరన్న సమాచారం కూడా ప్రస్తుతం స్థానిక పోలీస్ స్టేషన్లలో ఎలాంటి సమాచారం లేకపోవడం అందుకు నిదర్శనం. అజ్ఞాతంలో ఉన్న రౌడీషీటర్ల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. వారిని అదుపులోకి తీసుకుంటునే వ్యూహ రచనలు బయట పడే అవకాశం ఉంది. రాజధాని జిల్లాలో రౌడీమూకలు పాత కక్షలు, ఆధిపత్య పోరు కోసం ఎవరికి వారు హత్యలు చేసుకునేందుకు పథకాలు వేస్తున్నట్లు తేలడంతో వారి కదలికలపై పోలీస్ యంత్రాంగం మరింతగా నిఘా పెంచింది. చర్యలకు రంగం సిద్ధం ఈ క్రమంలో విధి నిర్వహణలో విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీస్‌బాస్‌లు రంగం సిద్ధం చేస్తున్నారు. విచారణలో వాస్తవమని తేలితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. అవసరమైతే వారిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీస్ వర్గాల్లో అంతర్గంతంగా చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటేనే మరోసారి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. -
రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎయిర్‌పోర్టు పరిధిలో రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆదివారం జరిగిన కౌన్సెలింగ్‌లో సీఐ జె. మురళీ రౌడీషీటర్లకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ సత్ప్రవర్తన ఉన్నవారిని పరిశీలించి రౌడీషీట్ రికార్డుల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో రౌడీషీటర్లు వ్యవహార శైలి మార్చుకోకపోతే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. -
ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!
సాక్షి, అమరావతి బ్యూరో: రాజధానిలో కిరాయి హంతక ముఠాలు మళ్లీ విజృంభిస్తున్నాయి. చాప కింద నీరులా కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. అసాంఘిక శక్తులపై పోలీసు శాఖ నిఘా పెట్టడంలో ఉదాసీనత ప్రదర్శిస్తుండటంతో వీరి ఆగడాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌లో వ్యాపారి రాంప్రసాద్‌ను హత్యలో గుంటూరు, విజయవాడకు చెందిన రౌడీషీటర్ల హస్తం ఉండటం రాజధానిలో కలకలం రేపుతోంది. పోలీసుల వైఫల్యం.. వ్యాపారి రాంప్రసాద్ హత్య వ్యవహారంలో విజయవాడ పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రౌడీషీటర్లపై నిఘా పెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. గుంటూరు, విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో వెయ్యి మందికిపై రౌడీషీటర్లు ఉన్నారు. ఈ నగరాల్లో ఏ కేటగిరీ వారిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. వీరి కదలికలపై కమిషనర్ టాస్క్‌ఫోర్స్, సంబంధిత స్టేషన్ల అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. విజయవాడ నగరంలో.. ముఖ్యంగా విజయవాడ నగరంలో పలుకుబడి కలిగిన రౌడీషీటర్లు చాలా మంది నెలల తరబడి సంబంధిత స్టేషన్లకు రాకపోయినా పోలీసులు స్పందించడం లేదు. ‘ఏ’ కేటగిరీ రౌడీషీటర్ల విభాగంలో ఉన్న కోగంటి సత్యం ఈ ఏడాది జనవరి నుంచి పటమట స్టేషన్‌కు రాకపోయినా పట్టించుకోలేదు. నేరాభియోగాలు ఎదుర్కొంటూ రౌడీషీట్ ఉన్న వ్యక్తి చాలా కాలం నుంచి స్టేషన్‌కు ఎందుకు రావడం లేదన్న దానిపై కనీసం దృష్టి కూడా పెట్టలేదు. ఇన్నాళ్లు రాకపోతే ఏదైనా కుట్రకు పాల్పడుతున్నాడా? అన్న కోణంలో కూడా చూడలేదు. సత్యం కదలికలపై కూడా నిఘా పెట్టలేదు. ఇన్నాళ్లు రాకుండా ఉండడానికి ఏమైనా మినహాయింపు తీసుకున్నారా? అన్న విషయాన్ని పోలీసులు బయటపెట్టడం లేదు. ఈ సమయంలో ఎక్కడ ఉన్నారు? ఎవరిని కలిశారు? అన్న అంశాలపై హైదరాబాద్ పోలీసులు పరిశీలిస్తే కానీ అసలు విషయం బయటపడలేదు. శ్యామ్ సుందర్‌పైనా నిఘా లేదు.. రాంప్రసాద్‌ను తానే చంపానని హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయిన శ్యామ్, బెజవాడ వాసి. గతంలో రాజరాజేశ్వరీపేటలో కేబుల్ ఆపరేటర్‌గా పని చేశాడు. ఇతడితో కోగంటి సత్యం కృష్ణలంకలోని బందరు లాకుల ఎదుట తన కార్యాలయం ప్రాంగణంలోనే ‘కె వాటర్‘ పేరుతో నీటి ప్లాంటు పెట్టించాడు. ఆయనపై విజయవాడలోని నున్న పోలీసు స్టేషన్లో రౌడీషీట్ ఉంది. 2013లో రాంప్రసాద్ హత్యాయత్నం, కిడ్నాప్ కేసు నమోదు అయింది. ఈ కేసులో అప్పట్లో కోగంటి సత్యంతో పాటు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. రాంప్రసాద్ హత్యకు ఉపయోగించిన కత్తులను ఈ ప్లాంటులోనే తయారు చేయించాడు. గత కొన్ని నెలలుగా శ్యామ్ కూడా బయటకు రాకుండా ఉన్నాడు. రౌడీషీట్ ఉన్న వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లాడంటే ఏదో కుట్రకు ప్రణాళిక రచిస్తున్నాడేమోనన్న అనుమానం కూడా పోలీసులకు రాకపోవడం గమనార్హం. తనపై ఎలాంటి పోలీసుల నిఘా లేకపోవడంతో రాంప్రసాద్ హత్యకు ప్లాన్ చేసి అమలు చేశాడు. అందరూ విజయవాడ వాసులే.. కేసులో ఏ2గా ఉన్న టెక్కం శ్యామ్ సుందర్‌తో పాటు రాంప్రసాద్ హత్యలో పాల్గొన్న నిందితుల్లో చాలా మంది విజయవాడ వాసులే. రాంప్రసాద్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఏ3గా ఉన్న పులివర్తి బాల నాగాంజనేయ ప్రసాద్, ఏ4 మండే ప్రీతం, ఏ5 పులివర్తి రాములుది గుంటూరు జిల్లా రేపల్లె మండలం పేటేరు గ్రామం. వీరు ప్రస్తుతం ఉపాధి నిమిత్తం కృష్ణలంకలో నివాసం ఉంటున్నారు. ఏ6 తిరుపతి సురేష్ భవానీపురం నివాసి. ఇతడిపై భవానీపురం స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. ఇతడు కోగంటి అనుచరుడు. 2003లో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పట్లో వన్‌టౌన్ స్టేషన్లో షీట్ తెరిచారు. ఈ స్టేషన్ నుంచి భవానీపురం స్టేషన్‌ను విడగొట్టడంతో ఇక్కడికి బదిలీ అయింది. సురేష్‌కు అనుచరుడిగా ఏ10 పత్తిపాటి నరేష్ కొనసాగుతున్నాడు. ఏ7 చండిక ఆనంద్, ఏ8 శ్రీరామ్ రమేష్, ఏ9 షేక్ అజారుద్దీన్ అలియాస్ చోటు, ఏ11 వెంకట్ రాంరెడ్డిలు కూడా విజయవాడకు చెందిన వారిగా హైదరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. -
బుల్లెట్ దిగితే గాని మాట వినరు!
సాక్షి, బెంగళూరు : ఉద్యాననగరిలో పెట్రేగిపోతున్న నేరాలను అదుపు చేయడానికి పోలీసులు కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. గత ఆరునెలల్లో 20 మంది రౌడీషీటర్లకు పోలీసులు తుటా రుచి చూపించారు. 2018లో 30 మంది రౌడీషీటర్లపై పోలీసులు కాల్పులకు పాల్పడగా, గత ఆరునెలల్లో 20 మంది రౌడీషీటర్లపై కాల్పులు జరిపి పోలీసులు తమదైన శైలిలో హెచ్చరించారు. ప్రస్తుతం బెంగళూరు నగరాన్ని హడలెత్తిస్తున్న దారిదోపిడీలు, మోబైల్ చోరీలు, చైన్‌స్నాచింగ్ కేసులు హెచ్చుమీరుతున్నాయి. ఇటువంటి నేరాలు అరికట్టడానికి పోలీసులు పరేడ్ నిర్వహించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే కూడా వారిలో మార్పు కనిపించలేదు. గంజాయి మత్తులో దాడులకు దిగుతున్నారు. ఇటీవల నగర పోలీస్ కమిషనర్‌గా అలోక్‌కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేర కార్యకలాపాలకు పాల్పడుతున్న రౌడీషీటర్లను ఆయ విభాగాల్లోకి పిలిపించి తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. బెంగళూరు నగరాన్ని హడలెత్తిస్తున్న రౌడీషీటర్ లక్ష్మణను పట్టపగలే ప్రత్యర్థులు హత్యకు పాల్పడ్డారు. మూడు సుపారీగ్యాంగ్స్ ఏకమై పక్కాపథకంతో రౌడీషీటర్ లక్ష్మణను అంతమొందించారు. ఈ కేసుకు సంబంధించి మార్చిలో ఆకాష్ అలియాస్ మలేరియా, క్యాట్‌రాజా, హేమంత్‌కుమార్‌పై పోలీసులు కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. ఒకే కేసులో ముగ్గురు నేరగాళ్లపై కాల్పులకు దిగడం గత పదేళ్లులో ఇదే మొదటిసారి. అనంతరం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ కేసులో నిందితులపై కోకాయాక్టు అమలు చేశారు. ఇటీవల వయ్యాలికావెల్‌లో అమాయకుడైన ఎలక్ట్రీషియన్ గణేశ్‌ను 2019 జూన్ 17న హత్యకు పాల్పడిన శ్రీనివాస్‌పై పోలీసులు కాల్పులకు పాల్పడి అరెస్ట్ చేశారు. జూన్ 20న సీసీబీ పోలీసులు శివాజీనగర రౌడీషీటర్ పప్పు కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. 1980లో బెంగళూరులో ఘరానా నేరగాడిగా ఉన్న కోళిఫయాజ్ కుమారుడే పప్పు. ఇతను దోపీడీలు, దొంగతనాలు, చోరీలతో బెంగళూరు నగర పోలీసులకు పెద్ద సవాల్‌గా మారాడు. జనవరి 7న కేజీ.హళ్లి పోలీసులు తబ్రేజ్‌ఖాన్‌పై కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. ఇతని 12 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 5 న సీసీబీ పోలీసులు రౌడీషీటర్ స్లంభరత్‌పై కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. మార్చి 26న సూలదేవనహళ్లి పోలీసులు దోపిడీలకు పాల్పడుతున్న దేవరాజు, చం ద్రశేఖర్‌లపై కాల్పులుజరిపి అరెస్ట్ చేశారు. మార్చి 28 నందినీ లేఔట్ పోలీసులు రౌడీషీటర్ లగ్గెరె మునిరాజు కాల్పులు జరిపారు. మార్చి 30న కుమారస్వామి లేఔట్ పోలీసులు దుండగుడు రాజేంద్ర కాల్పులు, ఇతను ఏటీఎం సెక్యూరిటీ గార్డును హత్య కేసులో నిందితుడు. ఏప్రిల్ 28న కాటన్‌పేటే పోలీసులు దోపిడీదొంగ బడిస్సాకు చెందిన మన్సూర్‌ఖాన్‌పై కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. జూన్ 15 తూర్పు విభాగం పోలీసులు పలు దోపిడీ కేసుల్లో నిందితుడు నమ్‌రాజ్‌బసాకత్‌పై కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. జూన్ 23న బ్యాటరాయనపుర పోలీసులు దోపిడీదారుడు గోవింద్ అలియాస్ రాహుల్‌పై కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. జూన్ 24 బాణసవాడి పోలీసులు రౌడీ అశోక్‌పై కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. ఇతను నగరంలో పలు ప్రాంతాల్లో దోపిడీలు చేశాడు. -
గుడ్డు కోసం గొడవ.. వైరల్ వీడియో!
-
గుడ్డు కోసం గొడవ.. వైరల్ వీడియో!
సాక్షి, నిజమాబాద్: నగరంలో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. తమకు ఎదురుచెప్పిన ఓ యువకునిపై విచక్షణ రహితంగా సీసాలతో దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. నిజమాబాద్‌లోని ఓ సూపర్ మార్కెట్లో గుడ్డు కొనుగోలు విషయంలో సోమినేని రాజు అనే యువకునితో కొందరు రౌడీషీటర్లకు గొడవ పడ్డారు. సూపర్ మార్కెట్ వెలుపల అందరు చూస్తుండగానే రాజును సీసాలతో చితకబాదారు. ఈ దాడిలో రాజుకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాజు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజుపై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడతున్నారు. -
ఐటీ సిటీలో అర్ధరాత్రి కలకలం
మంగళవారం అర్ధరాత్రి... బెంగళూరు రాజగోపాలనగర పోలీస్ స్టేషన్ పరిధి, ముందు కారులో రౌడీలు, వెనుక జీప్‌లో పోలీసుల చేజింగ్. ఎస్ఐ గురిపెట్టి తుపాకీ పేల్చాడు, కారు టైర్ పేలిపోయి ఆగిపోయింది. రౌడీలు– పోలీసుల మధ్య బాహాబాహీ. కత్తుల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు. ఎస్ఐ మళ్లీ తుపాకీకి పనిచెప్పాడు. దుండగులకు తీవ్ర గాయాలు. సినీఫక్కీలో చేజింగ్– గోలీబార్ ఘటన అలా ముగిసింది. సాక్షి, యశవంతపుర: ఇంటి ముందు నిలిపిన వాహనాల అద్దాలను ధ్వంసం చేసిన కేసులో నిందితులపై పోలీసులు కాల్పులు జరిపి ఇద్దరిని అరెస్టు చేసిన ఘటన మహలక్ష్మి లేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పాత నేరస్తులు రఫిక్, సుధాకర్‌ను అరెస్టు చేశారు. కురబరహళ్లి, మహలక్ష్మి లేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇటీవల ఇంటీ ముందు నిలిపిన వాహనాల అద్దాలను ధ్వంసంచేసి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా ఇందులో పాత నిందితులు రఫిక్, సుధాకర్‌లు ఉన్నట్లు గుర్తించారు. దుండగుల అరెస్టుకు కార్యాచరణ నిందితులను అరెస్టు చేయాలని ఉత్తర విభాగం డీసీపీ పలువురు ఎస్ఐలతో ఒక బృందాన్ని నియమించారు. మంగళవారం అర్ధరాత్రి నిందితులు రఫిక్, సుధాకర్‌ను మారుతి జెన్ కారులో తిరుగుతుండగా అనుమానం వచ్చి ఆపారు. వారు తప్పించుకోవటానికి కారును వేగంగా నడుపుతూ దూసుకెళ్లారు. దీనితో ఎస్ఐలు లోహిత్, మహేంద్రకుమార్, నిరంజన్ కుమార్‌లు సిబ్బందితో వెంబడించారు. వారు కారును ఆపకపోవడంతో రాజగోపాలనగర పోలీసు స్టేషన్ సరిహద్దులోని కరీంసాబ్ లేఔట్ వద్ద ఎస్ఐ లోహిత్ రివాల్వర్‌తో కాల్చగా నిందితుల కారు టైర్ పేలిపోయి వాహనం అక్కడే నిలిచిపోయింది. నిందితులు కారు దిగి పారిపోతుంటే పోలీసు సిబ్బంది పట్టుకోవడానికి యత్నించారు. దీంతో దుండగులు కత్తులతో దాడి చేయగా కానిస్టేబుల్ శ్రీనివాస్, హెడ్‌కానిస్టేబుల్ హనుమంతరాజు గాయపడ్డారు. ఎస్ఐ లోహిత్ అత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరపగా నిందితుల ఇద్దరి కాళ్లకు గాయాలు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీనితో రఫిక్, సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ ఘరానా నేరగాళ్లే ఈ ఇద్దరూ జూన్ 17న రాత్రి ఇళ్ల ముందు నిలిపిన 14 వాహనాలు కారళ్లాటోల అద్దాలను ధ్వంసం చేసి మహిళలను నోటికొచ్చినట్లు తిట్టి పారిపోయారు. అదే రాత్రి రాజాజీ నగరలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని అడ్డగించి సెల్‌ఫోన్, బైక్‌ను లాక్కెళ్లిన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. గతంలో కూడా జేసీ నగరలో 17 వాహనాల అద్దాలను ధ్వంసం చేసినట్లు విచారణలో తెలింది. పాత నిందితుడు సుధాకర్ 2016లో శ్రీరామపుర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడు. అప్పటినుంచి పోలీసులకు కళ్లకప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. వీటితో పాటు మొత్తం 18 కేసులు ఇతనిపై ఉన్నాయి. కమలనగరకు చెందిన రౌడీ రఫీక్‌పై బసవేశ్వరనగర పోలీసుస్టేషన్లో మూడు హత్య కేసులు, రెండు దోపిడీ, ఒక దాడికేసు, కామాక్షిపాళ్య పోలీసుస్టేషన్లో ఒక దొపిడీ, తావరెకెరె పోలీసుస్టేషన్ పరిధిలో హత్యకేసు, తమిళనాడులో అపహరణ కేసులున్నాయి. -
రౌడీ షీటర్ల మేళా
అల్లిపురం(విశాఖ దక్షిణ): ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో గల టూ టౌన్, త్రీ టౌన్, ఫోర్తుటౌన్, మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగా చేరిన 70 మంది కానిస్టేబుళ్లకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో అవగాహన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. సబ్ డివిజన్ పరిధిలో గల 78 మంది రౌడీషీటర్లను ఈ మేళాకు పిలిపించగా 44 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈస్ట్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి మాట్లాడుతూ రౌడీషీటర్ల వివరాలు, వారి అడ్రస్‌లు, వారేం చేస్తుంటారు తదితర వివరాలను సిబ్బందికి తెలియజేశారు. వారిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి వుండాలని, వారి కదలికలపై దృష్టి సారించాలని సూచించారు. అదే విధంగా నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో గల రౌడీషీటర్ల ఫొటోలు, వివరాలు, అడ్రస్తు ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒక ఫోల్డర్లో భద్రపరచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐలు జీవీ రమణ, ఇమ్మానుయేల్ రాజు, కె.వెంకటనారాయణ, ఆయా స్టేషన్ల ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
రౌడీషీటర్ల ఫొటోలకు పూజ చేసుకోండి
విశాఖపట్నం సిటీ: ‘‘రౌడీషీటర్ల ఫొటోలు ఆన్లైన్లో అందుబాటులో లేకపోవడం ఏంటి? ఒక పని చెయ్యండి, అందరి రౌడీ షీటర్ల ఫొటోలను ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోండి..’’ పోలీసులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. సోమవారం సాయంత్రం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ సేవలు ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సెంటర్ ద్వారా అందుతున్న సేవల వివరాలను కమిషనర్ హరినారాయణన్ సీఎంకు వివరించారు. ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ, నగరంలో జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన అత్యాధునిక సీసీ కెమెరాలు, వాటి పనితీరును చెబుతున్న సమయంలో చంద్రబాబు కలగజేసుకొని.. చూడండి.. ఒక వ్యవస్థ ఏర్పాటు చేశామంటే దానివల్ల మరికొన్ని సేవలు ఎలా అందుబాటులోకి తీసుకురావాలా అని ఆలోచించండి. సీసీ కెమెరాల ద్వారా కేవలం రెడ్ సిగ్నల్ జంపింగ్, చోరీలు చేసే వారిని గుర్తించడం మాత్రమే కాదు, ఇతర సేవలు వచ్చేలా ప్లాన్ చెయ్యండి. ఉదాహరణకు రౌడీ షీటర్ల ముఖాల్ని గుర్తుపట్టేలా వ్యవస్థను ఆధునికీకరించండి. దీనికి పోలీస్ కమిషనరేట్ సాయం తీసుకొండని చెప్పారు. నగరంలో ఎంత మంది రౌడీ షీటర్లున్నారు అని జాయింట్ సీపీ నాగేంద్రకుమార్‌ను ప్రశ్నించారు. 400 మంది ఉన్నారని ఆయన చెప్పగా, వారి ఫొటోలు ఆన్లైన్లో ఉన్నాయా అని సీఎం అడిగారు. ఫొటోలు ఉన్నాయి కానీ.. ఆన్లైన్లో లేవని నాగేంద్ర చెప్పడంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఫొటోలు ఉంచుకొని ఏం చేసుకుంటారు. వారి ఫొటోల్ని తీసుకెళ్లి ఇంట్లో పూజ చేసుకోండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే వాటన్నింటినీ ఆన్లైన్లో పెట్టాలంటూ ఆదేశించారు. -
బంజారాహిల్స్ లో రౌడీషీటర్ల వీరంగం, ఒకరి మృతి
సాక్షి,హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ పెన్షన్ ఆఫీస్ సమీపంలో బుధవారం రౌడీషీటర్లు వీరంగం సృష్టించారు. అయిదుగురి వ్యక్తులపై రౌడీ షీటర్లు కత్తులతో దాడి చేశారు. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కౌన్సెలింగ్‌తో పాటు కటింగ్ !
బొమ్మనహళ్లి (కల్బుర్గి) : కల్బుర్గి జిల్లాతో పాటు తాలూకా పరిధి పీఎస్‌లలో ఉన్న రౌడీషీటర్లకు పోలీసులు పరేడ్ నిర్వహించి హెయిర్ కటింగ్ చేయించిన ఘటన ఆదివారం జరిగింది. త్వరలో జరుగనున్న టిప్పు జయంతి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా రౌడీషీటర్లను పిలిపించి కౌన్సెలింగ్‌తో పాటు అతిగా జట్టు పెంచుకున్న వారికి కటింగ్ కూడా చేయించారు. నేరప్రవృత్తికి దూరంగా ఉండాలని, ఒకేరోజు 900 మందికి కటింగ్ చేయించి హెచ్చరించినట్లు ఎస్పీ శశికుమార్ తెలిపారు. -
నేర నియంత్రణలో కొత్త పంథా
ఏలూరు అర్బన్ : నగర పోలీసులు నేరాల నిరోధం, నియంత్రణలో అప్డేట్ అవుతున్నారు. చికిత్స కన్నా నివారణ మేలు అనే నానుడిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. గతంలో నేరం జరిగిన తరువాత తీరుబడిగా విజిల్స్ ఊదుకుంటూ హడావుడి పడుతూ వచ్చే వి«ధానానికి దాదాపు తిలోదకాలు ఇచ్చేశారు. అదే క్రమంలో చేతిలో లాఠీ పట్టుకుని అల్లరిమూకలపై దాడి చేసే ప్రక్రియతో ఆశించిన ఫలితాలు రావని గ్రహించి ఫ్రెండ్లీ పోలీసింగ్ మొదలు పెట్టారు. ప్రజలను కూడా పోలీసు విధుల్లో భాగస్వాములను చేసేందుకు గతంలో పోలీసు మిత్ర పేరిట అమలు చేసిన పథకం ఫెయిల్ కావడంతో ఆ విధానానికి మరింత మెరుగులు దిద్ది విద్యార్థులు, ప్రజలను పోలీసుల విధుల్లో భాగస్వాములు చేసేందుకు కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ (సీపీవో) అనే నూతన పథకం అమలు చేస్తున్నారు. నిత్యం నగరంలో విజిబుల్ పోలీసింగ్ విజిబుల్ పోలీసింగ్ పేరిట నిత్యం నగరంలో అన్ని పోలీసు స్టేషన్ల అధికారులు సిబ్బందితో కలిసి వాహన, లాడ్జి తనిఖీలు ముమ్మరం చేశారు. రౌడీలు, విద్యార్థులు, వాహన చోదకులకు కౌన్సెలింగ్‌లు రౌడీ షీటర్లను స్టేషన్‌కు పిలిపించి వారి ప్రవర్తనపై ఆరా తీయడం కౌన్సెలింగ్ నిర్వహించడం జరిపేవారు. అయితే ప్రస్తుతం పంథా మార్చారు. పోలీసు అధికారులే నేరుగా వారి ఇళ్ళకు వెళ్లి వారి కుటుంబసభ్యుల సమక్షంలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక ర్యాగింగ్ నివారించేందుకు విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సమాజంలో కుల వివక్ష రూపుమాపేందుకు ప్రతినెలా సివిల్ రైట్స్ డే పేరిట ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రహదారి ప్రమాదాల నివారణకు స్కూలు బస్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు తరచూ కౌన్సెలింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. చట్టాల అమలుకు ప్రత్యేక కార్యాచరణ బహిరంగ ప్రదేశాలలో ధూమపానంపై నిషేధం ఉన్నా చూసీచూడనట్టు వ్యవహరించే పోలీసులు ప్రస్తుతం అందుకు భిన్నంగా చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగంగా పొగతాగుతూ పొగ మేఘాలు సృష్టించే వారిని గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. అదే విధంగా పాదచారులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ప్రమాదకరంగా వాహనాలు నడిపేవారిని గుర్తించి పెనాల్టీగా భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారు. రాంగ్ పార్కింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లెస్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిని అదుపులోకి తీసుకోవడం కొన్ని సందర్భాల్లో కేసులు పెట్టి కోర్టులో హాజరు పరచడం వంటి కార్యక్రమాలతో ప్రజల మెప్పు పొందుతున్నారు. -
పోలీసుల అదుపులో రౌడీషీటర్లు
హైదరాబాద్: నగరంలోని రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో టాస్క్ఫోర్సు పోలీసులు బుధవారం దాడులు జరిపారు. మల్లేపల్లి, గోల్కొండ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా 20 మంది రౌడీషీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే అనుమానిత వ్యక్తులను విచారిస్తున్నారు. -
రౌడీ మామూలు ఇవ్వలేదని..
-
పాతబస్తీలో కార్డన్ సెర్చ్: రౌడీషీటర్లు అరెస్ట్
హైదరాబాద్ : పాతబస్తీ, ఫలక్‌నుమా ప్రాంతాల్లో పోలీసులు గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 16 మంది రౌడీషీటర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎలాంటి ధృవపత్రాలు లేని 60 ద్విచక్రవాహనాలు, 3 కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. సౌత్‌జోన్ డీసీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 400 మంది పోలీసులు పాల్గొన్నారు. -
జులుం చేస్తే తాట తీస్తా
రౌడీషీటర్లకు ఇదే ఫైనల్ వార్నింగ్ ఎస్పీ విశాల్ గున్నీ నెల్లూరు(క్రైమ్): ‘గతంలో ఏం జరిగిందో నాకు తెలి యదు.. పద్ధతి మార్చుకోండి...ఇదే ఫైనల్ వార్నింగ్.. కాదని జులుం చేస్తే తాట తీస్తా’ అని ఎస్పీ విశాల్‌గున్నీ రౌడీషీటర్లను హెచ్చరించారు. శుక్రవారం నగరంలోని ఉమేష్‌చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో నగరంలోని రౌడీషీటర్లకు ఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ రౌడీషీటర్ల కదలికలపై పోలీసు నిఘా దగ్గరగా ఉంటుందన్నారు. ఈ విషయాన్ని గమనించి ఒళ్లు దగ్గర పెట్టకొని తమ ప్రవర్తనను మార్చుకోవాలన్నారు. దందాలు, పంచాయతీలు మానుకోవాలన్నారు. తమకు రాజకీయ నేతల అండ ఉందని తామేమి చేసినా ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగితే తగిన బుద్ధిచెబుతామన్నారు. ఇకపై ఏదైనా నేరం చేసినా, చేయించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రతి వారం విధిగా పోలీసుస్టేష న్లో హాజరువేయించుకోవడంతో పాటు అసాంఘిక శక్తులు, కార్యక్రమాలపై సమాచారం అందించాలన్నా రు. లేనిపక్షంలో ఆయా ప్రాంతాల్లో జరిగే నేరాలకు అక్కడున్న రౌడీషీటర్లే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజాజీవనానికి, శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే దండన తప్పదన్నారు. ఈ సందర్భంగా పలువురు రౌడీషీటర్లు తాము గతంలో చేసిన తప్పిదాల వల్ల రౌడీషీట్లు తెరిచారని తెలిపారు. కొన్నేళ్లుగా తాము ఏ నేరం చేయలేదనీ, విచారించి రౌడీషీట్లు తొలగించాలని అభ్యర్థించారు. ఎస్పీ స్పందిస్తూ పద్ధతి మార్చుకొని శాంతియుత వాతావరణంలో జీవిస్తున్నారని తమకు నమ్మకం కల్గితే రౌడీషీట్లు ఎత్తివేస్తామన్నా రు. రౌడీషీటర్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే తన సెల్ 9440796300, డీఎస్పీ 9440796303కు ఫోను చేస్తే తగి న చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రెడ్డి గంగాధర్, నగర, గ్రామీణ డీఎస్పీలు జి.వెంకటరాముడు, డాక్టర్ కె.తిరుమలేశ్వర్‌రెడ్డి, నగర ఇన్స్పెక్టర్లు కిశోర్‌బాబు, వి.సుధాకర్‌రెడ్డి, సీతారామయ్య, సుబ్బారావు, ఎస్ఐలు రామకృష్ణ, విజయకుమార్, రామ్మూర్తి పాల్గొన్నారు. పలువురు గైర్హాజరు కౌన్సిలింగ్‌కు పలువురు రౌడీషీటర్ల గైర్హాజరయ్యారు. వారిలో రాజకీయ పార్టీలకు చెందిన వారు ఉండటంతో పోలీసులు కౌన్సిలింగ్‌కు తీసుకురాలేదని సహచర రౌడీషీటర్లు గుసగుసలాడారు. -
'పద్ధతి మార్చుకోకుంటే తాట తీస్తాం'
నెల్లూరు : పద్ధతి మార్చుకోకుంటే తాటతీస్తామని రౌడీషీటర్లకు నెల్లూరు జిల్లా ఎస్పీ విషాల్ గున్ని హెచ్చరించారు. నగరంలోని ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో శుక్రవారం సుమారు 100 మంది రౌడీషీటర్లకు నూతన ఎస్పీ విషాల్ గున్ని కౌన్సెలింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోకుంటే తాట తీస్తామని హెచ్చరించారు. గతంలో మాదిరిగా ఉంటే కుదరదని, ప్రతి ఒక్కరి కదలికలపై సునిశిత నిఘా పెడతామన్నారు. ఎటుంటి కేసుల్లోనైనా ప్రమేయం ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇకపై మీరు హాయిగా ఉండి, ప్రజల్ని హాయిగా ఉండనివ్వాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రెడ్డి గంగాధర్, డీఎస్పీలు వెంకటరాముడు, తిరుమలేశ్వర్‌రెడ్డి, సీఐలు పాల్గొన్నారు. -
32 మంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
యాకుత్‌పురా (హైదరాబాద్) : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా భవానీనగర్ పోలీసులు మంగళవారం స్టేషన్ పరిధిలోని 32 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇన్స్పెక్టర్ బి. శ్రీనివాస్‌రావు రౌడీషీటర్లను స్టేషన్‌కు పిలిపించి ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నిబంధనలను అతిక్రమిస్తే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటికే బైండోవర్ అయిన రౌడీషీటర్ల కాలపరిమితి ఇంకా కొన్ని నెలలు మిగిలి ఉందన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఉన్నతాధికారుల ఆదేశానుశారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. కౌన్సిలింగ్ అనంతరం భవానీనగర్ పోలీసులు ముగ్గురు పేరు మోసిన రౌడీషీటర్లను మంగళవారం బైండోవర్ చేశారు. తలాబ్‌కట్ట చాచా గ్యారేజీ ప్రాంతానికి చెందిన సత్తార్ బిన్ చావూస్ ఆలియాస్ మహఫూజ్ గోరే (30), భవానీనగర్‌కు చెందిన మహ్మద్ ఫరాజ్ (21), తలాబ్‌కట్టాకు చెందిన మహ్మద్ నవాజ్ (26)లను ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకొని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచి బైండోవర్ చేశారు. -
15 మంది రౌడీషీటర్లు అరెస్ట్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జగద్గిరిగుట్టలో 15 మంది రౌడీ షీటర్లను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. రౌడీ షీటర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఫిబ్రవరి 2వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులోభాగంగా నగరంలోని పలువురు రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. -
రాజధానిలో రౌడీల దందా
బెంబేలెత్తుతున్న బిల్డర్లు, వ్యాపారులు ముఠాగా ఏర్పడిన షీటర్లు వాటాలివ్వాలని బెదిరింపులు రాజధాని ప్రాంతంలో రౌడీషీటర్ల దందా కొనసాగుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన కొందరు రౌడీషీటర్లు ముఠాగా ఏర్పడి గుంటూరు నగరాన్ని అడ్డాగా ఏర్పాటుచేసుకొని అరాచకాలకు పాల్పడుతున్నారు. వీరికి అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అండగా ఉన్నారని సమాచారం. నూతన వెంచర్లు ఏర్పాటుచేసే రియల్టర్లు, బిల్డర్లను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారని తెలిసింది. దందాలతో సంపాదించిన డబ్బుతో రౌడీషీటర్లు సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారిపోతున్నారు. ఈ వ్యవహారాల గురించి పోలీసు ఉన్నతాధికారులకు పూర్తి సమాచారం లేకపోవడంతో చర్యలు తీసుకునే విషయంలో మిన్నకుండిపోతున్నారు. గుంటూరు రూరల్ : గుంటూరు నగరంలోని కొరిటెపాడు ప్రాంతానికి చెందిన ఓ మాజీ రౌడీ షీటర్, వినుకొండకు చెందిన మరో రౌడీ షీటర్, స్థానికంగా ఉంటున్న కొందరు కలిసి కొరిటెపాడు, నగరాలు అడ్డాగా చేసుకున్నారు. ఐదుగురు రౌడీషీటర్ల ముఠా దందాలకు పాల్పడుతూ కొత్తగా వస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లను బెంబేలెత్తిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. నగర శివారుల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వెంచర్లు, నూతన అపార్ట్ మెంట్లపై కన్నెశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నూతనంగా అపార్ట్ మెంట్లు, వెంచర్లు నిర్మించే వారిని టార్గెట్ చేసుకున్నారు. తొలుత వారితో మంచి సంబంధాలు ఏర్పాటుచేసుకుంటున్నారు. తాము పెద్ద వ్యాపారులమని మార్కెట్లో నమ్మిస్తున్నారు. అపార్ట్మెంట్లు, ప్లాట్లు విక్రయించి పెడతామని చెప్పి రియల్ వ్యాపారులకు చెందిన అన్ని విషయాలు తెలుసుకుంటారు. నకిలీ పత్రాలతో మోసం... ఎవరైనా ఈ ముఠాకు భయపడకుండా ఎదురు తిరిగితే ఆ వెంచర్, అపార్ట్మెంట్ ప్రాబ్లం ఉందని, లీగల్ ఇబ్బందులు ఉన్నాయని కొనుగోలుదార్లకు చెప్పి వ్యాపారం సాగనివ్వకుండా అడ్డుపడుతుంటారు. రాయలసీమకు చెందిన కొత్తగా కొందరు రౌడీషీటర్లను పిలిపించి ఆయా కాంట్రాక్టర్లకు ఫోన్లు చేయించి బెదింరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. ఎవరైనా ప్లాట్లు కొనుగోలు చేసినట్లు తెలిస్తే వెంటనే ఆయా ప్లాట్ల పేరుతో నకిలీ సంతకాలతో పత్రాలు సృష్టిస్తారు. వెంచర్, ప్లాటు నిర్వహణదారుడు అదే ప్లాటును తమకు విక్రయించాడని చెప్పి అవతలి వారిని బెదిరింపులకు గురిచేస్తుంటారు. దీంతో కొనుగోలుదారులు వెనుకంజ వేస్తారు. ఈ విధంగా వ్యాపారాన్ని సాగనీయరు. ఈ రౌడీ ముఠాకు తలొగ్గి దిక్కుతోచని పరిస్థితుల్లో రియల్టర్లు వాటాలు ఇచ్చి వ్యాపారాలు కొనసాగిస్తున్నారని సమాచారం. ప్రాణభయం కలిగిస్తున్న వైనం తెలిసినవారికి తమవే ప్లాట్లు అని చెప్పి విక్రయిస్తారు. ప్లాట్లు విక్రయించిన వారికి వెంచర్ యజమానులు మామూలుగా అయితే కమీషన్ ఇస్తారు. కానీ వీరి రూటే సపరేటు అన్నట్లుగా రౌడీషీటర్లు వాటా ఇవ్వాలని అడుగుతారు. లేకుంటే ప్రస్తుతానికి ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉన్న మరో రౌడీషీటరు పేరు చెప్పి అన్న తాలూకా మనుషులమని బెదిరిస్తారు. వాటాలు ఇవ్వకుంటే అంతే సంగతులు అన్నట్లు ప్రాణభయాన్ని కలిగిస్తారు. చేసేదిలేక కొత్తగా వచ్చిన వ్యాపారులు వారికి వచ్చిన దాంట్లో వాటా ఇస్తూ మెల్లగా వ్యాపారం ముగియగానే మరో ప్లాట్లు వేయకుండా జారుకుంటున్నారు. -
ఎనిమిది మంది రౌడీషీటర్ల బైండోవర్
హైదరాబాద్: కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఉంటున్న ఎనిమిది మంది రౌడీషీటర్లను బుధవారం పోలీసులు బైండోవర్ చేశారు. గతంలో జరిగిన అల్లర్లు, మతకలహాలలో ఈ రౌడీషీటర్ల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్త చర్యగా బైండోవర్ చేసినట్టు ఇన్స్పెక్టర్ రామ్మోహన్రావు తెలిపారు. బైండోవర్ అయిన రౌడీషీటర్లలో మహ్మద్ యూసుఫ్, హత్వల్ ఉమేష్, ఆర్.కే. రవికిరణ్, మనోజ్, కె.ఆనంద్‌సింగ్, డి. ఉమేష్‌సింగ్, రంజిత్‌సింగ్, రాకేష్‌సింగ్ ఉన్నారు. -
నెల్లూరులో రౌడీమూకల హంగామా
-
రౌడీ గ్యాంగ్ వీరంగం..అరెస్ట్
వరంగల్ : వరంగల్ నగరంలోని కరీమాబాద్ నానమియా తోటలో రౌడీషీటర్‌తో పాటు అతడి అనుచరులు ఓ కుటుంబంపై దాడి చేసి గాయపర్చిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితులు గట్టికొప్పుల నర్సింహస్వామి, స్వప్న కథనం మేరకు వివరాలు..కరీమాబాద్‌కు చెందిన రౌడీ షీటర్ పెంచాల అశోక్‌తో పాటు అతడి అనుచరులు పేర్న అనిల్, నరేష్, మరికొందరు నానమియా తోటలో ఉండే గట్టికొప్పుల నర్సింహస్వామి ఇంటిమీదకు ఆదివారం అర్ధరాత్రి వచ్చి అకారణంగా దాడికి దిగారు. అంతేకాకుండా నర్సింహస్వామి భార్య స్వప్న, ఇంటిపక్కనే ఉన్న అబ్బు అనే యువకుడిపై కూడా దాడిచేసి గాయపర్చారు. ఈ గొడవ వల్ల బస్తీలోని ప్రజలంతా ఒక్కసారిగా నిద్రలేవడంతో పెంచాల అశోక్‌తో పాటు అతడి అనుచరులు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే బాధితులు 100 నంబర్‌కు ఫోన్ చేసి విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో మిల్స్‌కాలనీ పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాధితులు నర్సింహస్వామి, స్వప్న, అబ్బులు సోమవారం రౌడీషీటర్లపై ఫిర్యాదు చేశారు. దీంతో రౌడీషీటర్ పెంచాల అశోక్‌తో పాటు అతడి అనుచరులపై కేసు నమోదు చేశామని మిల్స్‌కాలనీ సీఐ కె.సత్యనారాయణ తెలిపారు. (కరీమాబాద్) -
పాతబస్తీలో 25 మంది రౌడీ షీటర్లు అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని పశ్చిమ మండలం పరిధిలోని పాతబస్తీలో శనివారం అర్థరాత్రి నుంచి పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా 25 మంది రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. అడిషనల్ డీసీపీ లింబారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. పట్టుబడిన రౌడీ షీటర్లలో కైజర్ ముఠా సభ్యుడు తబ్రేజ్తోపాటు పలువురు రౌడీ షీటర్లు ఉన్నారు. సోమవారం రిపబ్లిక్ డే దినోత్సవం సందర్బంగా పాతబస్తీలోని అణువణువు పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ తనిఖీలు ఆదివారం ఉదయం వరకు కొనసాగాయి. -
కాలనీవాసుల పై రౌడీ షీటర్ హల్చల్
-
ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం
జూపాడుబంగ్లా: ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపుతామని.. రౌడీషీటర్లు, ఫ్యాక్షనిస్టులు వారి కార్యకలాపాలకు స్వస్తి చెప్పకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ హెచ్చరించారు. గురువారం మండల జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల పరిశీలన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొన్ని కేసులకు సంబంధించి రికార్డులను సక్రమంగా నమోదు చేయకపోవడంతో దర్యాప్తు సక్రమంగా సాగలేదన్నారు. వీటిని పునఃదర్యాప్తు చేసేందుకు సీఐ, డీఎస్పీలను ఆదేశించామన్నారు. గ్రామాల్లో బెల్టు, నాటుసారా విక్రయాలు సాగుతున్నట్లు తన దృష్టికి వస్తే ఆయా పోలీసుస్టేషన్ల ఎస్ఐలను బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,400 మంది రౌడీషీటర్లను గుర్తించడంతో పాటు.. ఆయా స్టేషన్ల ఎస్ఐలకు వారి సమాచారం అందజేసి కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. వీరిలో మార్పు తీసుకొచ్చేందుకు వారానికో రోజు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఫ్యాక్షన్ కారణంగా కర్నూలు జిల్లా అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. ఫ్యాక్షన్ కనుమరుగైన గ్రామాలను కేటగిరీల వారీగా విభజించి అభివృద్ధిపై దృష్టి సారిస్తామన్నారు. ఐరన్‌ఓర్, ఇసుక అక్రమ తరలింపులపై మైనింగ్ అధికారులతో కలసి దాడులు చేస్తామన్నారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలతో నగరంలోని చాలా మార్పు వస్తోందన్నారు. రాత్రిళ్లు ఈ కార్యక్రమం వల్ల ప్రమాదాలను నివారించడంతో పాటు పాత నేరస్తుల కార్యకలాపాలు తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. అనంతరం పోలీసు క్వార్టర్స్‌ను పరిశీలించి స్థానికంగా నివాసం ఉండని పోలీసుల వివరాలను తెలుసుకున్నారు. నివాసం ఉంటున్న చెన్నయ్యకు అవార్డు ప్రకటించి.. స్థానికంగా ఉండని సిబ్బందిని మందలించారు. మరోసారి తనిఖీకి వచ్చేలోపు సిబ్బంది అంతా క్వార్టర్స్‌లోనే నివాసం ఉండాలని ఆదేశించారు. పోలీసు హెడ్ క్టార్టర్స్కు బదిలీ అయిన ఆత్మకూరు డీఎస్పీ నరసింహారెడ్డిని శాలువా కప్పి అభినందించారు. ఎస్పీ వెంట నందికొట్కూరు సీఐ నరసింహమూర్తి, ఎస్ఐ గోపినాథ్ ఉన్నారు. -
రౌడీలూ ఖబడ్దార్
- హద్దుమీరితే పీడీ యాక్ట్ - తాజాగా రౌడీలు ఫిర్దౌస్, లతీఫ్, తన్వీర్‌పై ప్రయోగం - చర్లపల్లి జైలుకు తరలింపు - వీరిపై 12 ఠాణాల్లో 84 కేసులు: వెలుగు చూడని వందకు పైగానే సాక్షి, సిటీబ్యూరో: సేఫ్ట్సిటీ-స్మార్ట్‌సిటీలో భాగంగా నగర పోలీసు లు మరో అడుగు ముందుకేశారు. ప్రజల రక్షణ, భద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్లు, అసాంఘికశక్తుల ఆట కట్టించేందుకు నడుం బిగించారు. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, కిడ్నాప్‌లు, బలవంతపు వసూళ్లు తదితర వరుస నేరాలకు పాల్పడుతూ ఇటు పోలీసులను, అటు ప్రజ లను భయాందోళనకు గురిచేస్తున్న కరుడుగట్టిన ముగ్గురు రౌడీషీటర్లపై నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించారు. దీంతో నెల రోజుల వ్యవధిలో ఏడుగురిపై ఈ చట్టం ప్రయోగించి జైలు కు తరలించారు. తాజాగా పీడీయాక్ట్ కింద మరో ముగ్గురిని డీసీపీ సత్య నారాయణ జైలుకు పంపారు. బంజారాహిల్స్ సయ్యద్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఫిర్దౌస్ (32), మల్లేపల్లికి చెందిన మహ్మద్ లతీఫ్ (32), ఎల్లారెడ్డిగూడ జయప్రకాష్‌నగర్‌కు చెందిన మహ్మద్ తన్వీర్ (26)లు రౌడీషీటర్లు. చిన్న చిన్న నేరాలకు పాల్పడి 12 ఏళ్ల క్రితం నేర జీవితాన్ని ప్రారంభించిన ఈ ముగ్గురు ప్రస్తుతం కరుడుగట్టిన నేరగాళ్లుగా మారారు. వీరిపై పంజగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్సార్‌నగర్, లంగర్‌హౌస్ గోల్కొండ, ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, హబీబ్‌నగర్, చిక్కడపల్లి, నాంపల్లి పోలీసు స్టేషన్ల మొ త్తం 84 కేసులున్నాయి. ఇందులో కొన్ని కేసులు సాక్షులను బేదిరించడం వల్ల వీగిపోయాయి. దీంతో వారిలో ధైర్యం రె ట్టింపై మరిన్ని నేరాలు చేయడం ప్రారంభించారు. కిరాయి హత్యలు, కిడ్నాప్‌లు, బలవంతపు వసూళ్లు, బెది రింపులు, కొట్లాటలు, హత్యాయత్నాలు తదితర నేరాలకు పాల్పడుతున్నారు. అరెస్టయిన ప్రతిసారి నెల రోజుల్లోనే జైలు నుంచి బెయిల్‌పై విడుదలై తిరిగి నేరాలు చే యడం విధిగా పె ట్టుకున్నా రు. రౌడీషీటర్లు జంగ్లీ యూ సుఫ్, చోర్ కౌసర్లతో పాటు యువతులతో వ్యభి చారం చేయిస్తున్న పల్లె సుధాకర్‌రెడ్డి, బోడ రాజులపై పోలీసులు గతంలో పీడీ యాక్ట్ ప్రయోగించిన విషయం తెలిసిందే. ఫిర్దోస్‌పై 26 కేసులు.... రౌడీషీటర్ ఫిర్దోస్‌పై హబీబ్‌నగర్, హుమాయున్‌నగర్, గోల్కొండ, చిక్కడపల్లి, నాంపల్లి, లంగర్‌హౌస్, బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లలో 26 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో హత్య, హత్యాయత్నాలు, దొంగతనాలు, దాడులు, బెదిరింపులు, ఆయుధాలు కలిగి ఉండటంలాంటి కేసులున్నాయి. లతీఫ్‌పై 46 కేసులు... అత్యధికంగా లతీఫ్‌పై హబీబ్‌నగర్, హుమాయున్‌నగర్,పంజగుట్ట, ఆసిఫ్‌నగర్, షాహినాత్‌గంజ్, నాంపల్లి, గో ల్కొండ, లంగర్‌హౌస్ బంజారాహిల్స్ ఠాణాలలో 46 క్రిమినల్ కేసులున్నాయి. వీటిలో దాడులు, బెదిరిం పులు, హత్య లు, హత్యాయత్నాలు, కిడ్నాప్ కేసులు ఉన్నాయి. తన్వీర్‌పై 14 కేసులు... తన్వీర్‌పై ఎస్సార్‌నగర్, జూబ్లీహిల్స్, పంజగుట్ట పోలీసు స్టేషన్లలో 14 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హత్యాయత్నాలు, బెదిరింపులు తదితర నేరాలున్నాయి. ప్రజల రక్షణే ధ్యేయం... ప్రజల రక్షణే మా ధ్యేయం. మాపై నుమ్మకం ఉంచి ప్రభుత్వం పోలీసుశాఖకు కోట్లాది రూపాయలు ఖర్చు చే స్తోంది. నగరాన్ని ప్రపంచంలోనే సేఫ్‌సిటీగా మార్చేం దు కు ఇప్పటికే ఎన్నో చర్యలు మొదలెట్టారు. సిబ్బంది, అధికారుల ప్రవర్తనలో కూడా మార్పులొస్తున్నాయి. ఫ్రెం డ్లీ పోలీసింగ్‌ను మరింత పెంచుతాం. దీంతో పాటు రౌడీమూకలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారి పట్ల ఉపేక్షించే ప్రసక్తేలేదు. రాజకీయ ఒత్తిళ్ల తలొగ్గం. ముఖ్యంగా రౌడీ షీటర్లు తమ పద్ధతి మార్చుకోవాలి, లేదంటే పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం. - ఎం.మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ ఫిర్యాదు చేయాలన్నా భయమే.... పై దముగ్గురు రౌడీషీటర్ల ఆగడాలపై సామాన్యులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చేవారు కాదు. ఎవరైనా వారిపై ఫిర్యాదు చేస్తే వారిని బెదిరించడం, వారి పిల్లల్ని కిడ్నాప్ చేయడం వంటివి చేసేవారు. దీంతో వారి ఆగడాలు హద్దుమీరాయి. వారిపై ఫిర్యాదు చేయనిదే పోలీసులు కేసు నమోదు చేయలేరు. అధికారికంగా వారిపై ఇప్పటి వరకు 84 కేసులు నమోదు కాగా వెలుగు చూడని కేసులు వందకుపైగానే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఒకడుగు ముందుకేసి వారిపై పీడీయాక్ట్ ప్రయోగించి చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ చట్టం కింద ఏడాది పాటు వీరు జైలులో ఉండాల్సిందే. -
మందుబాటిళ్లతో రౌడీషీటర్ గ్యాంగ్ వీరంగం
వరంగల్: వరంగల్ నగరంలో రౌడీషీటర్ ప్రమోద్ శుక్రవారం హల్చల్ సృష్టించాడు. స్థానిక శంబునిపేటలోని బార్లో ప్రమోద్ అతడి అనుచరులతో వీరంగం సృష్టించాడు. బార్లోనే ఉన్న మందుబాబులు ఇది పద్దతి కాదంటూ ప్రమోద్‌తోపాటు అతడి అనుచరులను హెచ్చరించారు. మమ్మల్నే హెచ్చరిస్తారా అంటూ వారిపై అక్కడే ఉన్న మందు సీసాలతో దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ప్రమోద్ బృందం అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటనపై బార్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బార్ వద్దకు చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ప్రమోద్‌తోపాటు అతడి బృందం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
యువకుల్లారా జాగ్రత్త!
హైదరాబాద్‌లో రౌడీషీటర్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ప్రైవేట్ సెటిల్మెంట్లు భారీ స్థాయిలో కొనసాగిస్తున్నారు. కొంతమంది రౌడీషీటర్లు జైలు నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కొందరు నేరగాళ్ళు యువకులకు డబ్బు ఎరజూపించి వారిని కూడా ఉపయోగించుకుంటున్నారు. చిన్నాచితక నేరాలపై అరెస్ట్ అయివారిని రౌడీషీటర్లు చేరదీస్తున్నారు. వారికి బెయిల్ రావడానికి ఈ గ్యాంగ్‌లు సహకరిస్తున్నాయి. దాంతో వారు నేరగాళ్లుగా మారిపోతున్నారు. రియల్ ఎస్టేట్ దందాలు, ప్రైవేట్ సెటిల్మెంట్లలో రౌడీషీటర్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ప్రైవేట్ ప్లేసుల్లో దాడులకు కూడా పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. గ్యాంగ్‌లు రౌడీషీటర్లను అణచివేయడానికి పోలీసులు కూడా అదే స్థాయిలో తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. అయినా ఫలితం కనిపించడంలేదు. రౌడీషీటర్ల ప్రైవేట్ దందాలకు పాల్పడుతూ తమలోతాము పరస్పర దాడులు చేసుకుంటూ బీభత్సం సృష్టిస్తున్నారు. నేరసామ్రాజ్యాన్ని విస్తరించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వీళ్ళ ఆగడాలు ఆగడం లేదు. ఇప్పటికే నగరంలో పేరు మోసిన ఇద్దరు రౌడీషీటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో కైసర్ గ్యాంగ్ ప్రైవేట్ సెటిల్మెంట్లు చేస్తున్నాయి. కౌసర్‌ను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ జైలు నుండి వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొత్త గ్యాంగ్‌ను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడని సమాచారం. రియల్ ఎస్టేట్‌కు సంబందించిన తగాదాలు, మనీ సెటిల్మెంట్లు వీళ్ళ కనుసన్నల్లో జరిగిపోతున్నాయి. గతంలో నాంపల్లిలో రౌడీ మూకలు వేటాడి, వెంటాడి దారుణంగా హత్య చేశాయి. చిన్నాచితక నేరాల్లో అరెస్ట్ అయిన యువకులను ఈ గ్యాంగ్‌లు వల వేసి పట్టుకుంటున్నాయి. వారిని జైల్లోనే ఈ రౌడీషీటర్లు చేరదీస్తున్నారు. నేరప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నారు. అంతే కాకుండా వారికి బెయిల్ రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్లు బయటకు వెళ్ళిన తర్వాత చేయాల్సిన యాక్షన్ ప్లాన్‌ను వీళ్ళ ద్వారా రౌడీ షీటర్లు అమలు చేస్తున్నారు. జైలు నుండి విడులయ్యే యువకులకు సుఫారీలిచ్చి నేర ప్రపంచాన్ని విస్తరించుకుంటున్నారు. ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపడానికి నగర సిటి కమీషనర్ ఇప్పటికే సీరియస్‌గా ప్లాన్ చేస్తున్నారు. కరుడుకట్టిన రౌడీ షీటర్ కైసర్, మరో రౌడీషీటర్‌పై పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. చిన్న నేరాలు చేసిన యువకులు వీరివైపు మళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. యువత నేర ప్రపంచంలోకి అడుగుపెట్టకుండా చిన్నచిన్న నేరాలు చేసేవారికి కౌన్సిలింగ్ నిర్వహించాలి. వారు బెయిలు పొందే విషయంలో రౌడీషీటర్లు కాకుండా స్వచ్చంద సంస్థలు సహాయపడేవిధంగా చర్యలు తీసుకోవలసి అవసరం ఉంది. పొరపాటున తెలిసోతెలియకో మొదటిసారి తప్పులు చేసిన యువకులు ఈ రౌడీషీటర్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. - శిసూర్య -
మున్సిపల్ ఎన్నికలకు 3 వేల మంది సిబ్బంది
రేపల్లెరూరల్, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా మూడు వేల మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ తెలిపారు. రేపల్లె సర్కిల్ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1000 మంది సివిల్, 1000 మంది స్పెషల్పోలీస్లతో పాటు 1000 మంది హోంగార్డులతో భద్రత కల్పిస్తామని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 35 చెక్‌పోస్టుల్లో కోటి 45 లక్షల రూపాయలు, 31 కిలోల వెండి సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 1,023 మంది రౌడీషీటర్లలో ఇప్పటివరకు 803 మంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి బైండవర్ చేశామన్నారు. ఎన్నికల్లో అల్లర్లు చేసే అవకాశం ఉన్నవారిని 15 వేల మంది (ట్రబుల్ మంగర్స్)ని గుర్తించి 11 వేల మందిని మండల మెజిస్ట్రేట్ సమక్షంలో బైండవర్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి అతిక్రమించిన 39 మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. 11 వాహనాలను ఎన్నికల నియమావళి అతిక్రమించినందున సీజ్ చేశామన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 3,485 లిక్కర్ బాటిల్స్‌ను, 180 లీటర్ల సారా సీజ్ చేసి 59 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల బందోబస్తుపై సీఐలు, ఎస్ఐలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు. సమావేశంలో బాపట్ల, గుంటూరు డీఎస్పీలు జోసఫ్ రాజ్‌కుమార్, సత్యనారాయణ, రేపల్లె టౌన్, రూరల్ సీఐలు యు.నాగరాజు, పెంచల రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. -
రౌఢీలు!
2014... నగరంలో అప్పుడే రాజకీయం మొదలైంది. కాదు.. రాజకీయ నేతలే ‘ఇల్లు’ చక్కదిద్దుకునే పని మొదలుపెట్టారు. ఎన్నికలు సమీపించడంతో తమ బలాన్ని... బలగాలను పెంచుకునేందుకు రౌడీమూకలను పోషించే పనిలో నిమగ్నమయ్యారు. ఫలితంగా కొంత కాలంపాటు నిశ్శబ్దంగా ఉన్న వరంగల్ నగరం మళ్లీ గరం గరంగా మారింది. రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండడంతో తాజా, మాజీ రౌడీషీటర్లు పంజా విసురుతున్నారు. ప్రధానంగా వరంగల్ ‘తూర్పు’లో వారి హవానే నడుస్తోంది. పోలీసులకు సమాంతరంగా రాజ్యం నడుపుతూ... భూకబ్జాలు, బెదిరింపులు, సెటిల్మెంట్లతో సామాన్యులను దోచుకుంటున్నారు. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలు రంగంపేటలో ఓ రౌడీషీటర్ తన ఇంటి పక్క ఇళ్లను తనకే అమ్మాలని గలాటా చేస్తున్నాడు. తక్కువ ధరకు అమ్మకుంటే అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. చేసేది రౌడీరుుజం అయినప్పటికీ.... తెల్లవారితే ఆ కాలనీలో నాయకులకు అతడు కట్టిన ఫ్లెక్లీలే దర్శనమిస్తుండడంతో స్థానికులు కిమ్మనకుండా ఉంటున్నారు. కాశిబుగ్గలోని ఓ రౌడీషీటర్, ఎల్బీనగర్లోని మరో పేరుమోసిన రౌడీషీటర్ స్థానికంగా భూ తగాదాల్లో తలదూర్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. గిర్మాజిపేటలో ఇటీవల జరిగిన కత్తిపోటు సంఘటనలో రౌడీషీటర్‌పై కేసు లేకుండా ముఖ్య నేత బంధువు ఒకరు తన అధికార బలంతో ఆ కేసును తిరగరాసినట్లు సమాచారం. గతంలో హన్మకొండలో పనిచేసిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తను సర్వీసులో ఉండగా వ డ్డేపల్లి ప్రాంతంలో 1978లో 280 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. అప్పుడు దాని ధర రూ.9 వేలు. రిటైర్మెంట్ అయిన తర్వాత సదరు ఉపాధ్యాయుడు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని అతడి కొడుకుల వద్ద ఉంటున్నాడు. తన స్థలం చూసుకోవడానికి కొద్దిరోజుల క్రితం వడ్డేపల్లికి రాగా... అది కబ్జాకు గురైనట్లు గుర్తించాడు. షాక్‌కు గురైన సదరు పెద్దాయన పోలీసులను ఆశ్రరుుంచాడు. సివిల్ మ్యాటర్ కావడంతో పోలీసులు అంతగా శ్రద్ధ చూపలేదు. ఇంతలో కబ్జారాయుళ్లు సదరు రిటైర్డ్ ఉపాధ్యాయుడితో బేరసారాలకు దిగారు. అన్న వద్దకు వస్తే సెటిల్ చేసుకుందామన్నారు. దీంతో ఇరువర్గాలు అన్న వద్దకు వెళ్లగా... ప్రస్తుతం రూ. 80 లక్షలు ఖరీదు చేసే స్థలాన్ని చెరి సమానంగా తీసుకోండని తీర్పు చెప్పాడు. చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితిలో ఆ ఉపాధ్యాయుడు రూ. 40 లక్షలు తీసుకుని వెళ్లిపోయాడు. ఎటువంటి హక్కు లేకున్నా... స్థలాన్ని కబ్జా చేసిన రౌడీలకు రూ.40 లక్షలు వచ్చాయన్న మాట. వరంగల్ క్రైం, న్యూస్‌లైన్ నగరంలో రౌడీమూకల ఆగడాలు మళ్లీ మితిమీరుతున్నారుు. అర్బన్ ఎస్పీగా వెంకటేశ్వర్రావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రైసిటీస్‌గా పేరుగాంచిన వరంగల్, హన్మకొండ, కాజీపేటలో తాజా, మాజీ రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపారు. కౌన్సెలింగ్‌లు... నగర బహిష్కరణ హెచ్చరికలతో వారి ఆగడాలకు కొంత మేర కళ్లెం వేయగలిగారు. అరుుతే ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశముండడంతో రాజకీ య పక్షాలు ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టారుు. ఇందులో భాగంగా పోలీసుల హెచ్చరికలతో తోకముడిచి న రౌడీ నాయకులను తెరపైకి తెచ్చి బలాన్ని ప్రదర్శిస్తున్నారు. వారిని వెంటేసుకుని తిరుగుతూ తమ ఆధిపత్యా న్ని చాటుకుంటున్నారు. రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండడంతో సదరు రౌడీ మూకలు మరింతగా రెచ్చిపోరుు భూకబ్జాలకు పాల్పడుతున్నారు. దోచుకున్న లక్షలాది రూపాయల్లో తమ గాడ్ ఫాదర్లకు ఎలక్షన్ ఫండ్‌గా ప్రధాన భాగం సమర్పించుకుంటున్నారు. ఒక్క భూ దందాయే కాకుండా... పంచారుుతీలు... సెటిల్మెంట్లతో సాధారణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి దోచుకుంటున్నారు. హన్మకొండలోని పెద్దమ్మగడ్డ, ములుగురోడ్డు,యూనివర్సిటీ, బాలసముద్రంలోని శ్రీనివాసనగర్, దర్గా కాజీపేటలో ఎక్కువగా భూ దందాలు మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా సాగుతున్నారుు. రెవెన్యూ పరమైన లోపాలతో పోలీసులు కూడా ఏమి చేయలేని పరిస్థితి నెలకొనడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. ‘తూర్పు’లో రౌడీషీటర్లదే హవా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రౌడీషీటర్ల హవా కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో రౌడీలను బడా రాజకీయ నేతలు దగ్గరకు తీస్తుండడం... వారిని ఏకంగా పార్టీల్లో చేర్చుకుంటుండడం ఈ నియోజకవర్గంలో కామన్‌గా మారింది. రాజకీయంగా అండదండలు అందిస్తుండడంతో రౌడీషీటర్లు భూ కబ్జాలు, తగాదాల్లో తలదూరుస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అంతేకాదు... తమ చేతిలో పరిష్కారం కాని సెటిల్మెంట్లను తమ బాస్‌లకు అప్పజెబుతూ వారి సహకారంతో చక్కబెడుతూ తలా కొంత సొమ్ము చేసుకుంటున్నారు. పోలీస్ అధికారులపై ఒత్తిళ్లు రౌడీమూకల ఆగడాలు మితిమీరడంతో.. కౌన్సిలింగ్ ఇచ్చేందుకు మిల్స్‌కాలనీ పోలీసులు ఇటీవల వారిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. వారికి కౌన్సిలింగ్ మొదలుపెట్టారో.. లేదో... రాజకీయ నాయకుల నుంచి ఫోన్లు వరదలా వచ్చాయి. ‘ఎన్నికల సంవత్సరం... చూసిచూడనట్లుగా ఉండాలి... లేకుంటే ఏంచేయాలో మాకు తెలుసు...’ అం టూ వార్నింగ్‌లు వచ్చినట్లు సమాచారం. అధికార పార్టీ ముఖ్య నేత తమ్ముడు ఫోన్లో పోలీస్ అధికారులపై తీవ్రస్థాయిలోఒత్తిడి తీసుకురావడంతో రౌడీలకు కౌన్సిలింగ్ నుంచి విముక్తి కలిగింది. దీన్ని బట్టి పోలీస్ అధికారులపై ఏమేర ఒత్తిళ్లు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, పోలీస్ యంత్రాంగం పెట్రేగిపోతున్న రౌడీ మూకలపై దృష్టి సారించకుంటే... తీవ్ర అనర్థాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. బార్ ఎదుట రౌడీషీటర్ల ఘర్షణ వరంగల్ చౌరస్తాలో తాజాగా ఆదివారం ఉదయం నలుగురు రౌడీషీటర్లు వీరంగం సృష్టించారు. వారి వెంట మరో 15 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. నడిరోడ్డుపై ఘర్షణకు దిగిన వారిని అదుపులోకి తీసుకున్న ఇంతేజార్గంజ్ పోలీసులు వారిపై రాజకీయ ఒత్తిళ్లతో ఎలాంటి చర్య తీసుకోకుండానే వదిలేశారు. వరంగల్‌లో రౌడీలకు రాజకీయ నాయకుల ఆశీస్సులు ఏ స్థారుులో ఉన్నాయో ఈ ఘటనే అద్దం పడుతోంది. -
భయం నీడన జనం
జిల్లా ప్రజల్లో 2013 భయాన్ని నింపింది. భవిష్యత్తును బంగారు మయం చేసుకోవాలని పైసాపైసా పోగు చేసిన అనేక మంది మధ్య తరగతి కుటుంబీకులు నిలువునా మోసపోయారు. ఆర్థిక నేరాలు, చోరీలు పెరిగిపోయాయి. హత్యలు, ప్రతీకార దాడులు పోలీసులకు సవాళ్లు విసిరాయి. అభద్రత నడుమ మహిళలు జీవించాల్సి వచ్చింది. - న్యూస్‌లైన్, అనంతపురం క్రైం అనంతపురంలో రౌడీషీటర్లు, కిరాయి హంతక ముఠా సభ్యులు పెట్రేగిపోయారు. కమ్యూనిస్టు నేత హత్యతో ప్రారంభమైన ఏడాది... ప్రతి నెలా ఒకటి, రెండు హత్యలతో కొనసాగింది. జనవరి 1న అనంతపురంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున కమ్యూనిస్టు నేత, మాజీ కార్పొరేటర్ రామకృష్ణారెడ్డిని ప్రత్యర్థులు హతమార్చారు. మార్చి 4న ఇందిరానగర్‌లోని రైలు పట్టాలపై పెయింటర్ ప్రసాద్‌ను స్నేహితులే దారుణంగా హతమార్చారు. ఏప్రిల్ 2న సాక్షి ఉద్యోగి నరసింహులును పథకం ప్రకారం కిరాయి హంతక ముఠా నరికి చంపింది. ఏప్రిల్ 7న ఎమ్మార్పీస్ నేత సిద్ధును బంధువులే హతమార్చారు. అక్టోబర్ 23న కేబుల్ ఆపరేటర్ అయూబ్‌ను ప్రత్యర్థులు హత్యచేశారు. అభద్రత నడుమ అనంత మహిళా లోకం.. నిర్భయ చట్టాన్ని ప్రవేశపెట్టిన ఏడాదిలోపే జిల్లాలో పది కేసులు నమోదయ్యాయి. తల్లిదండ్రులకు కాఫీ తెచ్చేందుకు హోటల్‌కు వెళ్లి న తొమ్మిదేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు, ఓ యువకుడు సామూహిక అత్యాచారానికి తెగబడిన ఘటన ‘అనంత’ మహిళా లోకాన్ని ఆందోళనకు గురి చేస్తే... మైనర్ బాలికను తల్లిని చేసి అసహజమైన పద్ధతిలో పిండాన్ని తొలగించి పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు పెంచి తప్పించుకోవాలని చూసిన ఓ మానవ మృగాన్ని మహిళా సంఘాల ఒత్తిడితో ఉన్నతాధికారులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. పెచ్చరిల్లిన ఆర్థిక నేరాలు నవంబరు 19న ‘ది అనంతపురం టౌన్ కోఆపరేటివ్ బ్యాంకు’లో క్యాషియర్‌గా పనిచేసే రమేశ్‌రెడ్డి రాబరీకి తెగబడ్డాడు. రూ.13 లక్షల నగదును అపహరించి పట్టుబడ్డాడు. నవంబరు 30న మణప్పుఱం గోల్డ్‌లోన్ బ్యాంకులో అసిస్టెంట్ క్యాషియర్‌గా పనిచేసే విక్రమ్‌రావు తాకట్టు నగలను అపహరించినట్లు వెలుగు చూసింది. పోలీసుల దర్యాప్తులో రూ. 1.50 కోట్ల విలువైన బంగారు నగలు మాయమైనట్లు స్పష్టమైంది. జిల్లాలో నకిలీ నోట్లు చలామణి కూడా విచ్చలవిడిగా కొనసాగింది. నేరాల చిట్టా ఇదిగో... జిల్లా వ్యాప్తంగా చోరీల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని స్నాచింగ్ ముఠాలు హల్చల్ చేశాయి. ఏడాది మొత్తం (డిసెంబర్ 27 వరకు) 6555 కేసులు నమోదు కాగా వీటిలో కిరాయి హత్యలు తొమ్మిది, దోపిడీలు 5, రాబరీలు 23, పగటి దొంగతనాలు 47, రాత్రి చోరీలు 210, సాధారణ, పశువుల దొంగతనాలు 572 జరిగాయి. ఈ ఏడాది రూ.5,40,25,222 విలువజేసే బంగారం, నగదును చోరులు తస్కరించారు. ఇందులో పోలీసులు రూ.3,31,06,830 విలువజేసే సొత్తును రికవరీ చేశారు. కాగా, 140 దాడులు, 53 కిడ్నాపులు, 105 లైంగికదాడులు, 25 తీవ్ర ఘాతుకాలు, 45 సాధారణ ఘాతుకాలు, 1321 మోసాలు, 147 నమ్మించి ద్రోహం చేసిన ఘటనలు, 6 నకిలీ కరెన్సీ కేసులు, 4 హత్యాయత్నాలు పోలీసు రికార్డుల్లో నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగులపై నిఘా సారించలేకపోయారు. అవినీతి చేపలకు వల విసిరిన ఏసీబీ.. ఈ ఏడాదిలో రెండు సార్లు పెనుకొండ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నవంబరు 5న నంబులపూలకుంట మండల కేంద్రానికి చెందిన పంచాయతీరాజ్ శాఖ జూనియర్ ఇంజినీర్ తులసీప్రసాద్, అక్టోబరు 26న హిందూపురం సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయంలో ప్రిన్సిపాల్ అరుణకుమారి ఏసీబీ అధికారుల ఉచ్చులో చిక్కుకున్నారు. మార్చి 2న వరంగల్జిల్లా హన్మకొండ నుంచి కర్ణాటకలోని కోలార్‌కు ఏపీ36టీఏ 3362 వాహనంలో జిలెటిన్‌స్టిక్స్ తీసుకెళ్తుండగా ఆ వాహనం మిడుతూరు వద్ద ఆపిన డీసీటీఓ రమేశ్‌కుమార్‌రెడ్డి రూ.1.50 లక్షలు లంచం డిమాండ్ చేసి పట్టుబడ్డాడు.