
రౌడీషీటర్ల వివరాలు సిబ్బందికి తెలియజేస్తున్న సీఐలు
అల్లిపురం(విశాఖ దక్షిణ): ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో గల టూ టౌన్, త్రీ టౌన్, ఫోర్తుటౌన్, మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగా చేరిన 70 మంది కానిస్టేబుళ్లకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో అవగాహన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. సబ్ డివిజన్ పరిధిలో గల 78 మంది రౌడీషీటర్లను ఈ మేళాకు పిలిపించగా 44 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈస్ట్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి మాట్లాడుతూ రౌడీషీటర్ల వివరాలు, వారి అడ్రస్‌లు, వారేం చేస్తుంటారు తదితర వివరాలను సిబ్బందికి తెలియజేశారు.
వారిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి వుండాలని, వారి కదలికలపై దృష్టి సారించాలని సూచించారు. అదే విధంగా నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో గల రౌడీషీటర్ల ఫొటోలు, వివరాలు, అడ్రస్‌తు ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒక ఫోల్డర్‌లో భద్రపరచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐలు జీవీ రమణ, ఇమ్మానుయేల్ రాజు, కె.వెంకటనారాయణ, ఆయా స్టేషన్ల ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment