అచ్యుతాపురం: ఒప్పందం ప్రకారం వేతనం ఇవ్వటం లేదంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. విశాఖ సమీపంలోని ఎస్‌ఈజెడ్‌లో ఉన్న అభిజిత్ పరిశ్రమ యాజమాన్యానికి, కార్మికులకు ఇటీవల ఒప్పందం జరిగింది. దీని ప్రకారం 15 రోజుల్లో కార్మికులకు రూ. 25 వేల చొప్పున చెల్లించాల్సి ఉంది.
మధ్యవర్తిగా స్థానిక సీఐ వ్యవహరించారు. ఒప్పందం గడువు ముగియటంతో కార్మికులంతా కలసి అచ్యుతాపురం పోలీస్‌స్టేషన్ ఎదుట మంగళవారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. అయితే, స్టేషన్‌లో సీఐ లేకపోవటంతో వారి నిరసన కొనసాగుతోంది.