workers dharna
-
నిజాం డెక్కన్ సుగర్స్ కార్మికుల ధర్నా
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని నిజాం డెక్కన్ సుగర్స్ లిమిటెడ్ కార్యాలయం వద్ద కంపెనీ పర్మినెంట్ కార్మికులు ధర్నా చేపట్టారు. అక్ర లేఆఫ్ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. 51 శాతం కంపెనీ షేర్ హోల్డర్‌గా ఉన్న గోకరాజు గంగరాజు కార్యాలయాన్ని విజయవాడకు మార్చడంతో 300 కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. -
కార్మికుల తోపులాట, పరిస్థితి ఉద్రిక్తం
విజయనగరం: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం డెక్కన్ ఫెర్రో అల్లాయిస్ కర్మాగారం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కర్మాగారం యాజమాన్యం ఇటీవల కొందరు ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించింది. దీంతో తొలగింపునకు గురైన వారు పనిలోకి వెళ్తున్న కొత్తవారిని బుధవారం ఉదయం అడ్డుకున్నారు. దీంతో అక్కడ రెండువర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. -
పిప్పి ల్యామినేషన్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత
కొత్తూరు: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగామ గ్రామ శివారులోని పిప్పి ల్యామినేషన్ పరిశ్రమ వద్ద మంగళవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పిప్పి ల్యామినేషన్ పరిశ్రమకు చెందిన యంత్రాలను పూణేలోని 3వ యూనిట్‌కు తరలించేందుకు ప్రయత్నించడంతో కార్మికులు అడ్డుకున్నారు. ఫలితంగా యాజమాన్యం షాద్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. షాద్‌నగర్ రూరల్ ఎస్ఐ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ గేటువద్ద గత 33 రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. నష్టాలు వస్తున్నాయన్న నెపంతో కార్మికులకు ప్రత్యామ్నాయం చూపకుండా యాజమాన్యం వారి జీవితాలతో చెలగాటమాడుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. -
పోలీస్‌స్టేషన్ ఎదుట కార్మికుల ధర్నా
అచ్యుతాపురం: ఒప్పందం ప్రకారం వేతనం ఇవ్వటం లేదంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. విశాఖ సమీపంలోని ఎస్ఈజెడ్లో ఉన్న అభిజిత్ పరిశ్రమ యాజమాన్యానికి, కార్మికులకు ఇటీవల ఒప్పందం జరిగింది. దీని ప్రకారం 15 రోజుల్లో కార్మికులకు రూ. 25 వేల చొప్పున చెల్లించాల్సి ఉంది. మధ్యవర్తిగా స్థానిక సీఐ వ్యవహరించారు. ఒప్పందం గడువు ముగియటంతో కార్మికులంతా కలసి అచ్యుతాపురం పోలీస్‌స్టేషన్ ఎదుట మంగళవారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. అయితే, స్టేషన్లో సీఐ లేకపోవటంతో వారి నిరసన కొనసాగుతోంది. -
కమిషనర్ కార్యాలయం ముట్టడి
కందుకూరు: కార్మికులను తొలగించినందుకు నిరసనగా కార్మికులు కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కందుకూరు మున్సిపాలిటి కార్యలయంలో శుక్రవారం జరిగింది. పురపాలక సంఘంలో కాంట్రాక్ట్ కార్మికులుగా పని చేస్తున్న ఐదుగురు కార్మికులను తొలగించినందుకు నిరసనగా ఈ రోజు కార్మికులు కమిషనర్ కార్యాలయన్ని ముట్టడించారు. విధుల నుంచి తొలగించిన వారిని తిరిగి తీసుకోవాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారు.