
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎయిర్‌పోర్టు పరిధిలో రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆదివారం జరిగిన కౌన్సెలింగ్‌లో సీఐ జె. మురళీ రౌడీషీటర్లకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ సత్ప్రవర్తన ఉన్నవారిని పరిశీలించి రౌడీషీట్ రికార్డుల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో రౌడీషీటర్లు వ్యవహార శైలి మార్చుకోకపోతే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.