
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో రౌడీ మూకలు రెచ్చిపోయారు. ఆటోనగర్‌లోని రజాక్ టీ స్టాల్‌పై పెద్ద పెద్ద రాళ్లు, కర్రలతో రౌడీషీటర్, అనుచరులు దాడులకు తెగబడ్డారు. హోటల్‌లో టీ తాగుతుండగా వివాదం తలెత్తడంతో రౌడీషీటర్, పీడీ యాక్ట్ నిందితుడు జంగిల్ హిబ్బుతో పాటు అతని అనుచరులు దాడి చేశారు. ఒక్కసారిగా అయిదుగురు రౌడీలు రజాక్ హోటల్‌పై ఇనుప రాడ్లతో వీరంగం సృష్టించారు. టీ షాప్‌లో ఉన్న వారిపై రాళ్లతో దాడి చేసి, హోటల్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.
ఈ ఘటనలో రౌడీ షీటర్ జంగిల్ హిబ్బు సహా ఐదుగురి పై కేసు నమోదు చేశారు. రౌడీ మూకల వీరంగంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే విధఃగా రౌడీషీటర్ల దాడిలో గాయపడిన బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు టీ స్టాల్‌లోని వ్యక్తిని రోడ్డుపైకి లాక్కొచ్చి కిరాతకంగా దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాత కక్షల నేపథ్యంలో దాడి ఘటన జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
చదవండి: బాలిక అనుమానాస్పద మృతి.. రాత్రి సమయంలో ఎందుకు వెళ్లింది?
Comments
Please login to add a commentAdd a comment