RowdySheeter
-
రౌడీషీటర్ హత్య కేసులో నిందితుల రిమాండ్
హైదరాబాద్: రౌడీషీటర్ హత్య కేసులో ఆరుగురు నిందితులను కంచన్‌బాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడు కత్తులు, మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మంగళవారం కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్, ఈస్ట్ జోన్ డీసీపీ సిహెచ్.రూపేశ్ చాంద్రాయణగుట్ట డీసీపీ మనోజ్ కుమార్, ఇన్స్పెక్టర్ జి.శేఖర్ రెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ చిట్టీ బుర్రలతో కలిసి వివరాలను వెల్లడించారు. కంచన్‌బాగ్ పీఎస్ పరిధిలోని హఫీజ్‌బాబానగర్ సి–బ్లాక్ ప్రాంతానికి చెందిన సయ్యద్ నసీర్ (22) ఏసీ మెకానిక్‌గా పని చేసేవాడు. అతను 2020 సెప్టెంబర్‌లో ఇలియాస్, ఆరాఫత్‌తో కలిసి చాంద్రాయణగుట్ట పూల్‌బాగ్ ప్రాంతానికి చెందిన బాబా షిండే కుమారుడు విశాల్ షిండేను హత్య చేశాడు. ఛత్రినాక పోలీసులు అప్పట్లో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి బయటికి వచ్చిన అనంతరం సయ్యద్ నసీర్తో పాటు అతని స్నేహితులు బాబా షిండే మరో కుమారుడు ఆకాశ్ షిండేను చంపుతామని గత రెండు నెలలుగా బెదిరిస్తున్నారు. దీంతో సయ్యద్ నసీర్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్న బాబాషిండే ఈ నెల 13న తెల్లవారుజామున తన కుమారుడు ఆకాశ్ షిండే, హషామాబాద్ ప్రాంతానికి చెందిన సయ్యద్ షా అబ్దుల్ జబ్బార్ ఆలియాస్ సులేమాన్, హఫీజ్ బాబానగర్‌కు చెందిన ప్రేమ్ మానే, కై ఫ్ మోహీనుద్దీన్, అత్తార్, షేక్ హషమ్ అలీతో కలిసి హఫీజ్‌బాబానగర్‌కు వెళ్లాడు. ఇంటి ముందు ఆటోలో కూర్చున్న సయ్యద్ నసీర్‌పై బాబా షిండే, ఆకాశ్ షిండే, సయ్యద్ షా అబ్దుల్ జబ్బార్ కత్తులతో దాడి చేస్తుండగా మిగతా వారు ఎవరూ రాకుండా కాపలా కాశారు. సయ్యద్ నసీర్ కేకలు విని ఇంట్లో నుంచి బయటికి వచ్చిన అతడి తల్లి సయీదా బేగం చిన్న కుమారుడితో కలిసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో వారిని కూడా చంపుతామని బెదిరించి అక్కడినుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన నసీర్‌ను చికిత్స నిమిత్తం ఓవైసీ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తల్లి సయీదా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కంచన్‌బాగ్ పోలీసులు సౌత్, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి మూడు కత్తులు, మూడు బైక్‌లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు అత్తర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
రౌడీషీటర్ హత్య కేసు.. హోమోసెక్స్ అలవాటును ఆయుధంగా మార్చి..
హైదరాబాద్: పాతబస్తీ బండ్లగూడలో కలకలం సృష్టించిన రౌడీషీటర్ హత్య కేసును సౌత్ఈస్ట్ జోన్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. రాజకీయంగా తమను అప్రతిష్ట పాల్జేస్తున్న రౌడీషీటర్‌ను హత్య చేయాలని కుట్ర పన్నిన జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్.. హతుడికి స్నేహితుడైన మరో రౌడీషీటర్ హోమోసెక్స్ అలవాటను ఆయుధంగా ప్రయోగించి హత్య చేశాడు. దీన్ని హోమోసెక్స్ వివాదంగా మార్చాలనే యత్నం చేశాడు. అయితే వారి కుట్రను పోలీసులు బట్టబయలు చేశారు. బుధవారం సైదాబాద్‌లోని తన కార్యాలయంలో డీసీపీ రూపేష్ వివరాలు వెల్లడించారు. జైలులో ఏర్పడిన పరిచయంతో.. ► బార్కాస్‌కు చెందిన షేక్ సయీద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బవజీర్ (27) చాంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలో రౌడీషీటర్. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 3 పోక్సో కేసులు సహా మొత్తం 9 కేసుల్లో నిందితుడు. బండ్లగూడలో ఆఫీస్ ఏర్పాటు చేసుకొని యూ ట్యూబర్‌గా పని చేస్తున్నాడు. బవజీర్కు 2021లో జైలులో ఉన్న సమయంలో భవానీనగర్ పీఎస్ పరిధి రౌడీషీటర్ అయిన వాషింగ్ మెషిన్ మెకానిక్ అహ్మద్ బిన్ హజీబ్తో పరిచయమైంది. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా వారు స్నేహం కొనసాగిస్తున్నారు. వీరిద్దరికీ హోమోసెక్స్వల్ అలవాటు ఉంది. అందుకు తన స్నేహితులను తీసుకురమ్మని హజీబ్‌ను బవజీర్ వేధించేవాడు. దీంతో అతను తన స్నేహితులను తెచ్చేవాడు. రూ.13 లక్షలకు ఒప్పందం.. ఈ నేపథ్యంలో బవజీర్.. జల్పల్లి మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ తరచూ తన యూట్యూబ్‌లో ప్రచారం చేసేవాడు. అతని వీడియోలతో ప్రతిష్ట దెబ్బ తింటోందని, రాజకీయంగా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని జల్పల్లి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాదీ, అహ్మద్ సాదీ, సాలేహ్ సాదీ, ఒమర్ సాదీ భావించారు. హజీబ్కు బంధువైన ఒమర్ సాదీ అతడిని బార్కాస్‌కు తీసుకువెళ్లి మిగిలిన వారిని పరిచయం చేశాడు. బవజీర్‌ను తమపై అనుమానం రాకుండా హతమారిస్తే రూ. 13 లక్షలు ఇచ్చేలా వారి మధ్య ఒప్పందం కుదిరింది. బాలుడిని తీసుకొచ్చి.. ► బవజీర్ హోమోసెక్స్ అలవాటును ఆసరాగా చేసుకొని హత్య చేయాలని హజీబ్ ప్లాన్ వేశాడు. ఈ నెల 9న గతంలో హోమోసెక్స్‌కు పాల్పడిన బాలుడిని తీసుకు వస్తున్నట్లు బవజీర్కు ఫోన్లో చెప్పాడు. హజీబ్ తన స్నేహితుడు మహ్మద్ అయూబ్‌ఖాన్‌ను, బాలుడిని తీసుకొని బవజీర్ ఆఫీస్‌కు వెళ్లాడు. బవజీర్ బాలుడితో కలిసి ఉన్న హజీబ్ లోనికి వెళ్లి తనతో తెచ్చుకున్న కారం పొడిని బవజీర్ కళ్లలో చల్లి అతడిని కత్తితో పొడిచి హతమార్చి అక్కడి నుంచి వాహనాలపై పారిపోయారు. ► కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు హజీబ్, జల్పల్లి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాదీ, అహ్మద్ సాదీ, అయూబ్‌ఖాన్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సాలేహ్ సాదీ, ఒమర్ సాదీలు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. బవజీర్ తనకు ప్రాణహాని ఉందని బతికి ఉన్న సమయంలోనే పోలీసులకు, హోంమంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయమై డీసీపీ మాట్లాడుతూ.. అతని ఫిర్యాదులను కోర్టు అనుమతుల కోసం పంపామని, ఎలాంటి ఫిర్యాదులపై అయినా తాము వెంటనే స్పందిస్తామని ఆయన తెలిపారు. -
రౌడీషిటర్లకు కౌన్సెలింగ్
బంజారాహిల్స్: రౌడీషీటర్లు స్రత్పవర్తన కలిగి ఉండాలని నేర సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్ర సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషిటర్లకు గురువారం అడ్మిన్ ఎస్ఐ మహేశ్‌తో కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు. రోజువారీ పనులు ముగించుకున్న తర్వాత నేరుగా ఇంటికి చేరుకోవాలని అనవసరంగా రోడ్లపైన తిరగవద్దన్నారు. ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదు అందితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రౌడీషిటర్ల కదలికలపై పోలీసుల నిఘా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాత్రిపూట పెట్రో, బ్లూకోట్స్ పోలీసులు రౌడీషీటర్లు నివసించే ప్రాంతాల్లో నిఘా ఉంచుతున్నామన్నారు. స్థానికులు కూడా పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారని ఆయన స్పష్టం చేశారు. -
రెచ్చిపోయిన రౌడీమూకలు.. టీస్టాల్‌పై వీరంగం
-
రెచ్చిపోయిన రౌడీమూకలు.. కిందపడేసి కాళ్లతో తన్నుతూ.. కర్రలతో బాదుతూ
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో రౌడీ మూకలు రెచ్చిపోయారు. ఆటోనగర్‌లోని రజాక్ టీ స్టాల్‌పై పెద్ద పెద్ద రాళ్లు, కర్రలతో రౌడీషీటర్, అనుచరులు దాడులకు తెగబడ్డారు. హోటల్లో టీ తాగుతుండగా వివాదం తలెత్తడంతో రౌడీషీటర్, పీడీ యాక్ట్ నిందితుడు జంగిల్ హిబ్బుతో పాటు అతని అనుచరులు దాడి చేశారు. ఒక్కసారిగా అయిదుగురు రౌడీలు రజాక్ హోటల్‌పై ఇనుప రాడ్లతో వీరంగం సృష్టించారు. టీ షాప్‌లో ఉన్న వారిపై రాళ్లతో దాడి చేసి, హోటల్లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో రౌడీ షీటర్ జంగిల్ హిబ్బు సహా ఐదుగురి పై కేసు నమోదు చేశారు. రౌడీ మూకల వీరంగంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే విధఃగా రౌడీషీటర్ల దాడిలో గాయపడిన బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు టీ స్టాల్‌లోని వ్యక్తిని రోడ్డుపైకి లాక్కొచ్చి కిరాతకంగా దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాత కక్షల నేపథ్యంలో దాడి ఘటన జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చదవండి: బాలిక అనుమానాస్పద మృతి.. రాత్రి సమయంలో ఎందుకు వెళ్లింది? -
కామాంధుడి పైశాచికం.. చితక్కొట్టిన మహిళలు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో ఓ రౌడీ షీటర్‌కు మహిళలు దేహశుద్ధి చేశారు. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి పుస్తకాలు, పెన్నలు ఎరచూపి బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన రౌడీషీటర్ చిన్నారావుకు పిల్లల తల్లిదండ్రులు బడితెపూజ చేశారు. చదువుకునేందుకు సామాగ్రి ఇస్తానంటూ బాలికలను ఇంటికి తీసుకెళ్లిన చిన్నారావు.. వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థినీలు.. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఆ వ్యక్తికి బుద్ధి చెప్పారు. చిన్నారావును కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఒళ్లు గగుర్పొడిచే భయానక దృశ్యం.. కాళ్లు, చేతులు, తల మాయం -
జయరాం కేసు: రౌడీషీటర్ల అరెస్ట్‌కు రంగం సిద్ధం
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకేసుతో సంబంధం ఉన్న నగేష్, విశాల్ అనే ఇద్దరు రౌడీ షీటర్ల అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. జయరాం హత్యకేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితులకు ఆరో రోజు కస్టడీ విచారణ ముగిసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో పాటు ఆయనతో సంబంధాలున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులను పోలీసులు సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. జయరాం హత్యకు ముందు 48 గంటలు, తర్వాత 48 గంటలు రాకేష్ రెడ్డితో టచ్‌లో ఉన్నవారిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో మరో నిందితురాలు శ్రిఖా చౌదరీ స్టేట్మెంట్ను పోలీసులు మరోసారి రికార్డు చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో సుమారు 60 మందిని పోలీసులు విచారించారు. శనివారం అనుమానం ఉన్న మరి కొద్ది మందిని కూడా విచారిస్తామని పోలీసులు వెల్లడించారు. జయరాంను చంపిందెవరో తెలిసిపోయింది..! నగేశ్ సాయంతో రాకేష్ రెడ్డి భారీ స్కెచ్ -
రౌడీషీట్ ఓపెన్ పేరుతో బెదిరింపు
కణేకల్లు: యర్రగుంటలో రెండు నెలల క్రితం పబ్లిక్ కొళాయి విషయంలో జరిగిన గొడవలకు సంబంధించి బాధితులైన తమపైనే రౌడీషీట్ తెరుస్తామంటూ కణేకల్లు ఎస్ఐ యువరాజు తమను బెదిరిస్తున్నారని సర్పంచ్ పాటిల్ చెన్నకేశవరెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పాటిల్ నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు చంద్రమౌళిరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసులు, రామిరెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. రౌడీషీట్ ఓపెన్ చేయకుండా ఉండాలంటే ఒక్కొక్కరు రూ.6లక్షలు ఇవ్వాలని, అది కూడా తమకేమీ కాదని పై అధికారుల కోసమని డిమాండ్ చేశారన్నారు. ఇప్పటికే అక్రమ కేసులతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, అంత డబ్బు ఇచ్చుకోవడం తమవల్ల కాదని చెప్పడంతో ఎస్ఐ కక్ష పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార తెలుగుదేశం పార్టీ నేతల మెప్పు కోసం తమపై రౌడీషీట్ ఓపెన్ చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఎస్ఐ చర్యల వల్ల తమ కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని వాపోయారు. ఎస్ఐ ఆగడాలు, తమపై బనాయించి అక్రమకేసుల గురించి మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళుతున్నట్లు వారు తెలిపారు. -
ప్రత్యర్థుల అంతానికి పథకం
- ఘరానా రౌడీషీటర్ అరెస్టు - రెండు తపంచాల స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో: తన ప్రత్యర్థులను అంతం చేసేందుకు పేరు మోసిన ఓ రౌడీషీటర్ రెండు తపంచాలను సిద్ధం చేసుకున్నాడు. వెస్ట్‌జోన్ ఎస్ఓటీ పోలీసులు సదరు రౌడీషీటర్‌ను అరెస్టు చేసి తపంచాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫతేనగర్‌కు చెందిన తడకల లక్ష్మణ్‌గౌడ్ బోయిన్‌పల్లిలో అర్వింద్ అనే వ్యక్తి వద్ద కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. ఆ సమయంలో మద్యానికి బానిసైన లక్ష్మణ్‌కు నేరగాళ్లతో సంబంధాలు ఏర్పడ్డాయి. డ్రైవర్ వృత్తి ద్వారా వచ్చే జీతం డబ్బు వ్యసనాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు సుపారీ తీసుకొని తన సహచరులతో కలిసి నేరాలు చేయడం మొదలెట్టాడు. దీంతో 1996లో సనత్‌నగర్ పోలీసులు లక్ష్మణ్గౌడ్పై రౌడీషీట్ తెరిచారు. ఇదీ నేరచరిత్ర... నార్సింగి నివాసి కృష్ణను హత్య చేసేందుకు అదే ప్రాంతానికి చెందిన కమ్మరి కృష్ణ.. లక్ష్మణ్‌కు రూ. 20 వేల సుపారీ ఇచ్చాడు. ఆ తర్వాత బోయిన్‌పల్లికి చెందిన కన్నారావుతో ఒప్పందం చేసుకొని మెదక్ జిల్లా కుకూనూర్పల్లి ఠాణా పరిధిలో రమేశ్ అనే వ్యక్తిని లక్ష్మణ్ సు పారీ హత్య చేసి... వేలల్లో డబ్బు తీసుకున్నాడు. కర్నూల్ పట్టణంలో మూర్తిని హత్య చేసేందుకు ప్రయత్నించినా అది సఫలం కాలేదు. ఆ తర్వాత తన యజమాని అర్వింద్‌ను మోసం చేసి రూ.5 లక్షలను సొంతానికి వాడుకున్నాడు. సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండే రౌడీషీటర్లు రవీంద్రచారి, ప్రశాంత్‌లతో ఆర్థిక వివాదాలు రావడంతో వారిని హత్య చేయాలని లక్ష్మణ్ నిర్ణయించుకున్నాడు. ఇందులో భా గంగా ఐదు నెలల క్రితం యూపీలోని పాట్నా వెళ్లి రెండు దేశవాళీ తుపాకులు కొనుగోలు చేశాడు. కాగా, రౌడీషీటర్లు రవీంద్రచారి, ప్రశాంత్‌ల హత్యకు లక్ష్మణ్ పథకం పన్నాడని వెస్ట్‌జోన్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో అతడి కదలికలపై నిఘా పెట్టారు. బుధ వారం ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ రామచంద్రారెడ్డి నేతృ త్వంలో ఇన్స్పెక్టర్లు గురురాఘవేంద్ర, వెంకట్‌రెడ్డిల బృందం లక్ష్మణ్‌ను పట్టుకుంది. అతడి నుంచి రెండు తపంచాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు.