
రౌడీషిటర్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్ శివచంద్ర
బంజారాహిల్స్: రౌడీషీటర్లు స్రత్పవర్తన కలిగి ఉండాలని నేర సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ పూసపాటి శివచంద్ర సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషిటర్లకు గురువారం అడ్మిన్ ఎస్‌ఐ మహేశ్‌తో కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు. రోజువారీ పనులు ముగించుకున్న తర్వాత నేరుగా ఇంటికి చేరుకోవాలని అనవసరంగా రోడ్లపైన తిరగవద్దన్నారు.
ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదు అందితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రౌడీషిటర్ల కదలికలపై పోలీసుల నిఘా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాత్రిపూట పెట్రో, బ్లూకోట్స్ పోలీసులు రౌడీషీటర్లు నివసించే ప్రాంతాల్లో నిఘా ఉంచుతున్నామన్నారు. స్థానికులు కూడా పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment