counciling
-
రౌడీషిటర్లకు కౌన్సెలింగ్
బంజారాహిల్స్: రౌడీషీటర్లు స్రత్పవర్తన కలిగి ఉండాలని నేర సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్ర సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషిటర్లకు గురువారం అడ్మిన్ ఎస్ఐ మహేశ్‌తో కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు. రోజువారీ పనులు ముగించుకున్న తర్వాత నేరుగా ఇంటికి చేరుకోవాలని అనవసరంగా రోడ్లపైన తిరగవద్దన్నారు. ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదు అందితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రౌడీషిటర్ల కదలికలపై పోలీసుల నిఘా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాత్రిపూట పెట్రో, బ్లూకోట్స్ పోలీసులు రౌడీషీటర్లు నివసించే ప్రాంతాల్లో నిఘా ఉంచుతున్నామన్నారు. స్థానికులు కూడా పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారని ఆయన స్పష్టం చేశారు. -
ఎంబీఏ చేయాలనుంది. ఏం చేయాలి?
నేను ప్రస్తుతం ఐటీలో జాబ్ చేస్తున్నాను. నాకు ఎంబీఏ చేయాలనుంది. ఏం చేయాలో చెప్పండి? –నగేశ్ చాలామంది టెక్నికల్ కోర్సుల విద్యార్థులు తమకు ఉన్నత చదువులు చదవాలని ఉన్నా.. క్యాంపస్ ఎంపికల్లో ఆఫర్ రావడంతో అందులో చేరిపోతున్నారు. మంచి వేతనంతో పాటు సౌకర్యాలు అందిస్తుండటంతో అదే జాబ్‌లో కొనసాగుతుంటారు. కానీ కొంతకాలానికి ఉన్నత విద్య కోర్సు చదువుదాం అనే ఆలోచన మొదలవుతుంది. ఇప్పుడు చేస్తున్న జాబ్‌ను వదిలి మళ్లీ కోర్సులో చేరాలంటే.. కుటుంబం నుంచి మద్దతు లభించదు. చేతిలో ఉన్న ఉద్యోగం వదిలేయడం సరైన నిర్ణయం కాదని సన్నిహితులు సూచిస్తుంటారు. ఇవన్నీ సర్వ సాధారణమే! మీరు ఐటీ ప్రొఫెషన్లో ఉన్నారు. ఇంజనీరింగ్ నేపథ్యంతో సాఫ్ట్వేర్ జాబ్‌లో చేరి ఉంటే.. ఐదారేళ్ల అనుభవం తర్వాత మరింత ఉన్నత స్థాయికి వెళ్లేందుకు ఎంబీఏ ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు ఐటీ జాబ్‌లో ఐదేళ్లు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే.. ఎంబీఏ చేయాలన్న మీ ఆలోచన సరైనదే. దీనిద్వారా మీరు కెరీర్లో మేనేజ్మెంట్ విభాగంలోకి ప్రవేశించవచ్చు. ప్రస్తుతం కొనసాగుతున్న కెరీర్లో మరింత ఉన్నతంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. వాస్తవానికి చాలామంది ఇంజనీరింగ్ పూర్తికాగానే ఎంబీఏలో చేరిపోతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం–బీటెక్ పూర్తికాగానే ఎంబీఏలో చేరడం వల్ల తమకు ఏ స్పెషలైజేషన్ నచ్చుతుందో సరిగా అంచనా వేయలేరు. దానివల్ల ఎంబీఏ చేసిన రెండేళ్ల కాలం నష్టపోతున్నారు. మరోవైపు ఎంతో విలువైన ఉద్యోగ అనుభవం అవకాశం కూడా కోల్పోతున్నారు. మేనేజ్మెంట్ కోర్సుల్లో రెగ్యులర్ ఎంబీఏ, పీజీడీపీఎం, పీజీడీఎం వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇవి ఫుల్‌టైమ్ టైమ్ కోర్సులు. వీటిని తప్పనిసరిగా విద్యా సంస్థకు వెళ్లి చదవాల్సిందే. అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వారికి అనువుగా ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ అందుబాటులో ఉంది. ఇప్పటివరకు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా అనుభవం పొందిన వారు ఎంబీఏతో మేనేజ్మెంట్ విభాగంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఐటీ ప్రొఫెషన్స్‌లో ఉన్నవారికి అనువైన ఎంబీఏ స్పెషలైజేషన్స్.. ఎంబీఏ–ఐటీ లేదా టెక్నాలజీ మేనేజ్మెంట్ » ఎంబీఏ–ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ » ఎంబీఏ–బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ » ఎంబీఏ–ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్మెంట్, ఎంబీఏ–స్ట్రాటజీ మేనేజ్మెంట్ » ఎంబీఏ–కన్సల్టింగ్ మేనేజ్మెంట్,–ఎంబీఏ–ఫైనాన్స్ లీడర్షిప్ » ఎంబీఏ–ఆపరేషన్స్ మేనేజ్మెంట్ » ఎంబీఏ–ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్. ఇలాంటి స్పెషలైజేషన్స్‌ను ఎంచుకోవచ్చు. -
97.58 శాతం మందికి అర్హత
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ పూర్తి చేసి ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరం ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే టీఎస్ ఈసెట్–20 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జేఎన్టీయూహెచ్ ఆడిటోరియంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. సెట్‌కు హాజరైనవారిలో ఏకంగా 97.58 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసెట్ పరీక్ష కోసం 28,041 మంది దరఖాస్తు చేసుకోగా, ఇందులో 25,448 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 24,832 మంది అర్హత సాధించారు. ఇక అర్హత పొందిన వారు ఎంపిక చేసుకున్న కోర్సుల్లో నేరుగా సెకండియర్‌లో చేరాల్సి ఉంటుంది. ఈసెట్ ద్వారా 11 కోర్సుల్లో అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఇందులో ఇంజనీరింగ్‌లో 9 కోర్సులు, ఫార్మసీ, డిగ్రీ (మ్యాథమెటిక్స్) కోర్సులున్నాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో బీఎస్సీ (మ్యాథమెటిక్స్)కు సంబంధించి 100 శాతం అర్హత సాధించగా, ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో మైనింగ్ ఇంజనీరింగ్‌లో 99.87%, సీఎస్ఈ–98.67%, ఈసీఈ–98.62%, ఈఐఈ– 98.58%, సివిల్–97.25%, ట్రిపుల్ఈ–97.14%, మెకానికల్–96.91%, మెటలార్జికల్–96.84%, కెమికల్–96.40%, ఫార్మసీ–96.21% మంది విద్యార్థులు అర్హత సాధించారు. 16 నుంచి టీఎస్ ఈసెట్ కౌన్సెలింగ్.. ఇక టీఎస్ ఈసెట్–20 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 16న తొలి దశ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. రెండు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించి అక్టోబర్ 12వ తేదీతో అడ్మిషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ మేరకు శుక్రవారం సెట్ కన్వీనర్ నవీన్‌మిట్టల్ తేదీలు ప్రకటించారు. ఈసెట్ అభ్యర్థులకు ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలు అక్టోబర్ 10వ తేదీన స్పాట్ బుకింగ్ నిర్వహించుకోవచ్చని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెబ్సైట్లో అందుబాటులో పెట్టినట్లు వెల్లడించారు. ఈసెట్ ద్వారా అడ్మిషన్లు పొందిన అభ్యర్థులకు అక్టోబర్ 12వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రాథమికంగా నిర్ణయించినట్లు షెడ్యూల్లో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఈసెట్–20 వెబ్‌సైట్‌ను చూడవచ్చని సూచించారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా.. తొలిదశ..: ► ఆన్లైన్ ఫైలింగ్, పేమెంట్, స్లాట్ బుకింగ్, హెల్ప్‌లైన్ సెంటర్ ఎంపిక, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు తేదీ, సమయం ఖరారుకు గడువు: 16–09–2020 నుంచి 23–09–2020 వరకు ► స్లాట్ బుక్ చేసుకున్న వారి ధ్రువపత్రాల పరిశీలన: 19–09–2020 నుంచి 23–09–2020 వరకు ► సర్టిఫికెట్ల పరిశీలన చేసుకున్న విద్యార్థుల ఆప్షన్ల ఎంపిక: 19–09–2020 నుంచి 25–09–2020 వరకు ► ఆప్షన్ల ఫ్రీజింగ్ తేదీ: 25–09–2020 ► ప్రొవిజినల్ సీట్ అలాట్మెంట్: 28–09–2020 ► ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీ: 28–09–2020 నుంచి 03–10–2020 వరకు తుదిదశ: ► ఆప్షన్ల ఎంపిక: 06–10–2020 నుంచి 07–10–2020 వరకు ► ఆప్షన్ల ఫ్రీజింగ్ తేదీ: 07–10–2020 ► ప్రొవిజినల్ సీట్ అలాట్మెంట్: 09–10–2020 ► ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీ: 09–10–2020 నుంచి 12–10–2020 వరకు ► కాలేజీలో రిపోర్ట్ చేయాల్సిన తేదీ: 09–10–2020 నుంచి 12–10–2020 వరకు.. -
బరువు అదుపు చేయాలంటే...
నా వయసు 48. మెనోపాజ్ దశలో బరువు పెరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సమయంలో డైటింగ్ చేయడం మంచిదేనా? ఎలాంటి ఆహారం తీసుకుంటే బరువును అదుపులో పెట్టుకోవచ్చు అనేది వివరంగా తెలియజేయగలరు. – కె.స్వాతి, నిర్మల్ మెనోపాజ్ దశలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల 5 శాతం వరకు పొట్ట దగ్గర.. పిరుదులు దగ్గర కొవ్వు చేరే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల శరీరం మెటబాలిజం తగ్గి కొవ్వు పెరుగుతుంది. అలాగే ఈ వయసులో పని చెయ్యటం తగ్గుతుంది. దాని వల్ల కూడా కొద్దిగా బరువు పెరుగుతారు. ఈ మార్పులు అందరిలో జరగాలని ఏం లేదు. అవి ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, వారు చేసే పనులను బట్టి ఆహారపు అలవాట్లను బట్టి ఉంటుంది. ఈ వయసులో ఉండే కొన్ని బాధ్యతలు, పిల్లలు దూరంగా వెళ్లడం, బందువుల మరణాలు, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి వాటి వల్ల శరీరంలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఈ హార్మోన్ ప్రభావం వల్ల కూడా కొందరు బరువు పెరుగుతారు. డైటింగ్ అంటే తిండి బాగా తగ్గించడం కాదు. మితంగా తీసుకోవడం, ఈ సమయంలో బరువు పెరగకుండా ఉండటానికి, బరువు తగ్గడానికి, ఆహారంలో అన్నం తక్కువ తీసుకోవడం, నీళ్లు బాగా తాగడం, తృణధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, కొద్దిగా పండ్లు, పాలు వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. మాంసాహారులు అయితే గుడ్లు, చికెన్, మటన్, చేపలు వారానికి రెండు మూడు సార్లు తీసుకోవచ్చు. అలాగే వాకింగ్, ధ్యానం, యోగా, చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అలాగే ఎముకలు దృఢపడతాయి. ఆహారంలో స్వీట్లు, బేకరీ ఐటమ్స్, జంక్‌ఫుడ్, నూనె వస్తువులు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. రోజూ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఈ వయసులో కొందరిలో బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి, పైన చెప్పిన ఆహార నియమాలు, వ్యాయామాలు, నీటిని కూడా అదుపులో ఉంచుతాయి. ఆహారం కొద్దిగా కొద్దిగా విభజించుకుని 5–6 సార్లుగా తీసుకోవడం మంచిది. కాఫీ, టీలు కూల్ డ్రింకులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మా చెల్లెలికి పిల్లలు లేరు. తన వయసు 36. వైద్యులను సంప్రదిస్తే ‘ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్’ అని చెప్పారు. ఇది ఎందుకు వస్తుంది? భవిష్యత్‌లో పిల్లలు కనే అవకాశం ఉండదా? పూర్తి వివరాలను తెలియజేయగలరు. – బి.స్వర్ణలత, హిందూపురం సాధారణంగా ఆడవారు 45 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపల పీరియడ్స్ ఆగిపోయి, మెనోపాజ్ దశకు చేరుకుంటారు. కొందరిలో అనేక కారణాల వల్ల ఒవరీస్ (అండాశాయాల) పనితీరు ఆగిపోయి) 40 సంవత్సరాల కంటే ముందే పీరియడ్స్ ఆగిపోతాయి. దీనినే ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ లేదా ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. సాధారణంగా అండాశయాల నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల అవుతుంది. అలానే అండాలు విడుదల అవుతూ ఉంటాయి. జన్యుపరమైన కారణాల వల్ల స్మోకింగ్, హార్మోన్స్‌లో లోపాలు ఆటోఇమ్యూన్ సమస్యలు, చిన్నతనంలో వైరల్ ఇన్ఫెక్షన్స్, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇంకా ఎన్నో తెలియని కారణాలు వల్ల అండాశయంలోని అండాలు త్వరగా నశించిపోతాయి. అలానే అండాశయాల పనితీరు తగ్గిపోయి, ఈస్టోజన్ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోవటం వల్ల, పీరియడ్స్ కొందరిలో 40 సంవత్సరాల కంటే ముందే ఆగిపోతాయి. మీ చెల్లెలికి ఈ సమస్య వల్ల అండాశయాల నుంచి అండాలు విడుదల అవట్లేదు. కాబట్టి సాధారణంగా పిల్లలు పుట్టే అవకాశం చాలా వరకు లేదు. కాకపోతే, వీరికి హార్మోన్ల పరీక్షలు చేసి వాటి విలువలను బట్టి, ఈవీఎఫ్ చికిత్స ద్వారా అనేకరకాల, ఎక్కువ డోస్ కలిగిన హార్మోన్స్, ఇంజెక్షన్లు, మందుల ద్వారా ప్రయత్నిస్తే.. 5–10 శాతం గర్భం నిలిచే అవకాశాలుంటాయి. అలా ప్రయత్నించినా గర్భం రాకపోతే, దాత నుంచి (డోనర్) తీసిన అండాలను ఉపయోగించి, గర్భం రావడానికి ప్రయత్నించవచ్చు. నా వయసు 29. పెళ్లి అయ్యి ఐదేళ్లు దాటుతోంది. ఇప్పటికింకా పిల్లలు లేరు. సంతానలేమి సమస్యను నివారించడానికి ఫోలిక్ యాసిడ్ లాంటి సప్లిమెంట్లు తీసుకోవడం మంచిదేనా? ఒకవేళ తీసుకుంటే సైడ్ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అనే విషయాలను దయచేసి పూర్తిగా వివరించండి. – ఆర్.నీలిమ, రాజమండ్రి కేవలం ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల సంతానలేమి సమస్య తీరదు. ఫోలిక్‌యాసిడ్ అనేది విటమిన్ బి9. ఇది జన్యువులోని డీఎన్ఏ తయారీకి తోడ్పడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల, అండం నాణ్యతకు, శుక్రకణాల నాణ్యతకు, కదలికలకు దోహదపడుతుంది. తద్వారా పిండం ఆరోగ్యకరంగా తయారుకావడానికి ఉపయోగపడుతుంది. పిండంలో కొన్ని అవయవలోపాలు, వెన్నుపూస, మెదడు లోపాలను చాలా వరకు రాకుండా అడ్డుపడి శిశువు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి గర్భం కోసం ప్రయత్నించే మూడునెలల ముందు నుంచి, దంపతులు ఇద్దరూ ఫోలిక్ యాసిడ్ మాత్ర రోజుకొకటి చొప్పున తీసుకోవడం మంచిది. ఇది నీటిలో కరిగిపోయే విటమిన్. దీనివల్ల ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్‌లు లేవు. -
డిగ్రీ ప్రవేశాల్లో గందరగోళం!
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ విద్యార్థికి హైదరాబాద్‌లో చదువుకోవాలని కోరిక. రాజధానిలోని ఓ కాలేజీకి మొదటి ప్రాధాన్యత ఆప్షన్ ఇవ్వడంతో ఆ కాలేజీలో సీటు వచ్చింది. ఆ కాలేజీ బాగా లేదని, మరో కాలేజీకి వెళ్లేందుకు రెండో దశలో ఆప్షన్ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. ‘‘మీకు మొదటి ప్రాధాన్యతలో సీటు లభించింది కాబట్టి రెండో దశలో ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశాన్ని తొలగించాం..’’అని దోస్త్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవ్వడంతో ఆ విద్యార్థి ఆందోళనలో పడ్డారు. పెద్దపల్లి జిల్లాలోని ఓ గ్రామంలో వరంగల్‌కు చెందిన ఓ కాలేజీ యాజమాన్యం తమ లెక్చరర్లతో ఇంటర్ పూర్తయిన విద్యార్థుల ఇంటింటికీ వెళ్లి.. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులతోనే తమ కాలేజీలో చదువుకోవచ్చని నమ్మబలికింది. ఐదారుసార్లు ఓ లెక్చరర్ వెళ్లడంతో తల్లిదండ్రులు ఆ విద్యార్థి యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేశారు. అంతే తమ కాలేజీలో సీటు వచ్చేలా ఆ లెక్చరర్ ఆప్షన్ ఇవ్వడంతో అందులో సీటు వచ్చింది. విద్యార్థికి కాలేజీ నచ్చలేదు. పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అదనంగా ఫీజు చెల్లించాలని, లేకపోతే మీకు బయట కూడా సీటు రాదని యాజమాన్యం పేర్కొంటోంది. దీంతో విద్యార్థి గందరగోళంలో పడ్డారు. రెండో దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం లేకుండా పోయింది. ..వీరిద్దరే కాదు.. వేలాది మంది విద్యార్థులదీ ఇదే దుస్థితి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల అవగాహనాలోపం, కొన్ని డిగ్రీ కాలేజీ యాజమాన్యాల ప్రచారం, మోసం కారణంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండో దశ కౌన్సెలింగ్‌లో అవకాశం లేకపోవడంతో గత్యంతరం లేక మొదటి దశలో సీటు వచ్చిన కాలేజీల్లోనే చేరాల్సిన అగత్యం దాపురించింది. మొదటి దశ కౌన్సెలింగ్‌లో 1.21 లక్షల మంది విద్యార్థులకు సీట్లు లభించగా, మొదటి ఆప్షన్ మేరకు సీటు లభించిన 85 వేల మంది ఉన్నారు. వీరిలో చాలా మందిది ఇదే పరిస్థితి కావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం మొదటి దశలో, మొదటి ఆప్షన్ మేరకు సీట్లు వచ్చిన వారంతా ఆయా కాలేజీల్లో చేరాల్సిందే. లేదంటే ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ సీటును వదిలేసుకోవాల్సిన పరిస్థితిని అధికారులు కల్పించడం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎంసెట్‌లోనే లేని విధానం ఇక్కడెందుకు? ఇంజనీరింగ్ వంటి చదువులకు వెళ్లలేని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు, పెద్దగా అవగాహన లేని విద్యార్థులే డిగ్రీలో చేరేందుకు ముందుకు వస్తున్న తరుణంలో ఇలాంటి నిబంధన సరికాదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అవగాహన లేక ముందుగా ఆప్షన్ ఇచ్చినా, యాజమాన్యాల మోసం కారణంగా నష్టపోతే దానిని సరిదిద్దుకునే అవకాశం ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ఇలాంటి నిబంధన లేదని, ఏ దశలో సీటు వచ్చినా విద్యార్థులు చివరి దశ వరకు కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని, డిగ్రీలోనూ అలాంటి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. అయితే రెండో దశ కౌన్సెలింగ్‌లో అవకాశం ఇస్తే కొన్ని యాజమాన్యాలు తమ కాలేజీల్లో సీట్లు వచ్చేలా విద్యార్థులు అప్షన్లు ఇచ్చుకునేలా ప్రలోభ పెట్టి మోసం చేస్తాయని అధికారులు చెబుతున్నారు. కానీ మొదటి దశలోనే అలాంటి మోసాలు జరిగాయని, వాటిని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. -
అదంటే చాలా భయం
‘టోకోఫోబియా’ గురించి వివరంగా తెలియజేయగలరు. ఈ ఫోబియా వల్ల ప్రమాదం ఉందా? దీని నుంచి ఎలా బయటపడాలి? అనేది వివరించగలరు. – టీఎల్, ఏలూరు గర్భం దాల్చడం అంటే భయం, అలాగే కాన్పు గురించిన భయం, కాన్పు సమయాల్లో జరిగే మార్పులు, నొప్పుల గురించి విపరీతమైన భయాన్నే టోకోఫోబియా అంటారు. ఇందులో ప్రైమరీ టోకోఫోబియా, సెకండరీ టోకోఫోబియా ఉంటాయి. ఒక్కసారి కూడా గర్భం దాల్చక ముందే .. కాన్పు గురించి విపరీతమైన భయాన్ని ప్రైమరీ టోకోఫోబియా అంటారు. ఇక కాన్పులో వచ్చే నొప్పులు, సమస్యలతో కూడిన చెడు అనుభవం వల్ల మరలా గర్భం దాల్చడానికి కలిగే భయాన్ని సెకండరీ టోకోఫోబియా అంటారు. చిన్నతనంలో లైంగిక వేధింపులు, స్నేహితులు కాన్పు గురించిన విషయాలను చెప్పేది విని, కాన్పు వీడియోలు చూడటం లాంటివి జరిగినప్పుడు వారిలో భయాలు, అపోహలు పెరుగుతాయి. దాంతో గర్భం దాల్చడానికి భయపడి, గర్భం కోసం ప్రయత్నాలు కూడా చేయరు. కొంతమంది భర్తలను దూరం పెడతారు. కొంతమంది గర్భం దాల్చినా సిజేరియన్ చేయమంటారు. దీనికి ప్రధానంగా కౌన్సెలింగ్ చేయడం ఒక్కటే మార్గం. వీరికి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. డాక్టర్‌తో మెల్లమెల్లగా ఎక్కువ సెషన్స్‌లో కౌన్సెలింగ్ చేయించుకోవడం ద్వారా వారికి కాన్పు మీద ఉన్న భయం దూరమవుతుంది. అలాగే ధ్యానం, యోగా కూడా ఉపయోగపడతాయి. యాంటీబయోటిక్స్ తీసుకునే గర్భిణులకు ‘బేబీస్ ఇన్ఫెక్షన్ రిస్క్’ ఎక్కువగా ఉంటుందని ఈమధ్య ఎక్కడో చదివాను. దీని గురించి కాస్త వివరంగా తెలియజేయగలరు. – స్వాతి, నకిరెకల్ గర్భిణీలు యాంటీబయోటిక్స్ ఎలా అంటే అలా వాడకూడదు. ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయితేనే వాడాలి. అలాగే యాంటీబయోటిక్స్ వాడకపోతే వచ్చే రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు వాడవలసి ఉంటుంది. గర్భిణీలు వాటిని తరచూ వాడటం వల్ల కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా నశించిపోతుంది. మంచి బ్యాక్టీరియా అనేది తల్లి నుంచి బిడ్డకు కూడా చేరి వారిలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి. రోగకారక క్రిములకు వ్యతిరేకంగా పోరాడే తెల్లకణాలను వృద్ధి చేస్తాయి. తల్లి యాంటీబయోటిక్స్‌ను ఎక్కువగా వాడితే బిడ్డలో కొన్నిసార్లు రోగనిరోధకశక్తి తగ్గి, పుట్టిన తర్వాత తరచూ ఇన్ఫెక్షన్ల బారినపడే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి గర్బిణీలు అవసరాన్నిబట్టే యాంటీబయోటిక్స్‌ను డాక్టర్ సలహామేరకు వాడాలి. అలాగని వదిలేస్తే తల్లిలో ఇన్ఫెక్షన్ ఇంకా పెరిగి, అది బిడ్డకు కూడా సోకి ఇద్దరికీ ప్రమాదంగా మారే అవకాశాలు ఉంటాయి. నా వయసు 25. నాకు పీరియడ్స్ ఇరెగ్యులర్‌గా వస్తున్నాయి. థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను. మూడు నెలలు మందులు వాడితే తగ్గిపోతుందన్నారు. మందులు వాడిన మూడు నెలల తరువాత టెస్ట్‌లు చేయించుకుంటే కొన్ని పాయింట్స్ తగ్గాయి. నాకు ఇంకా పెళ్లి కాలేదు. థైరాయిడ్ వస్తే లైఫ్‌లాంగ్ మెడిసిన్ వాడాలి, పిల్లలు కూడా పుట్టరని తెలిసిన వారు అంటున్నారు. నాకు భయంగా ఉంది. – ఏఎన్, గుంటూరు థైరాయిడ్ గ్రంథి మెదడు ముందు భాగంలో ఉంటుంది. దీని నుంచి విడుదలయ్యే థైరాక్సిన్ హార్మోన్ (టీ3, టీ4) ప్రతి ఒక్కరిలోని అనేక జీవప్రక్రియలకు ఎంతో అవసరం. మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే టీఎస్‌హెచ్ హార్మోన్ థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి టీ3, టీ4 హార్మోన్లను విడుదల అయ్యేటట్లు చేస్తుంది. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు టీఎస్‌హెచ్, టీ3, టీ4 హార్మోన్లు సక్రమంగా విడుదల కావు. అలాంటప్పుడు పీరియడ్స్ సరిగా రాకపోవడం, బ్లీడింగ్ ఎక్కువ, తక్కువ కావడం వంటి ఇబ్బందులు ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి ఏర్పడతాయి. అలాంటప్పుడు థైరాయిడ్ సమస్యకు డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ సక్రమంగా మందులు వాడాలి. థైరాయిడ్ హార్మోన్ అదుపులో ఉంటే ఇంకా ఇతర హార్మోన్లు, అండాశయాలు, గర్భాశయంలో సమస్యలు ఏమీ లేకపోతే, గర్భం రావటానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. థైరాయిడ్ మాత్రలు ఎప్పటికీ వాడాలా వద్దా అనేది, ఒక్కొక్కరి థైరాయిడ్ హార్మోన్ లోపం యొక్క తీవ్రతను బట్టి బరువు వంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. బరువు మరీ ఎక్కువగా ఉన్నవారు... బరువు బాగా తగ్గితే, కొందరిలో హార్మోన్ లెవల్నిబట్టి హార్మోన్ మోతాదును మెల్లగా తగ్గిస్తూ రావచ్చు. థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు కొందరిలో పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అండం సరిగా విడుదల కాకపోవడం వంటి సమస్యల వల్ల పిల్లలు పుట్టడానికి ఇబ్బంది కావచ్చు. కాకపోతే డాక్టర్ దగ్గర సక్రమంగా చెకప్‌లు చేయించుకుంటూ థైరాయిడ్ మందులు సరిగా వాడుతుంటే... థైరాయిడ్ హార్మోన్ అదుపులో ఉండి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది ఏమీ ఉండదు. కాబట్టి మీరు అనవసరంగా భయపడకుండా మందులు సక్రమంగా వేసుకుంటూ, పీరియడ్స్ ఇరెగ్యులర్‌గా రావడానికి గర్భాశయంలో కానీ అండాశయంలో కానీ వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి గైనకాలజిస్ట్‌ని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవడం మంచిది. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
'కొత్త' కాపురం
మూడు ముళ్ల బంధానికి మున్నెన్నడూ లేని కష్టమొచ్చింది. జీవితకాలం కొనసాగాల్సిన వైవాహిక బంధం బలహీనమైపోతోంది. ఏ గొడవొచ్చినా పరిష్కరించే కుటుంబ పెద్దలు కరువయ్యారు. ఒకప్పటిలాగా గుట్టుగా సాగాల్సిన సంసారం మూణ్ణాళ్లకే వీధిన పడుతోంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి దాంపత్య జీవితం దారి తప్పుతోంది. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని జీవిత కాలం కలిసిమెలసి ఉండాల్సిన దంపతులు విడిపోతున్నారు. అనుమానం, అవగాహనా లేమి, ఒకరిపై మరొకరికి ప్రేమ లేకపోవడం, వివాహేతర సంబంధాలకు తోడు.. సెల్ఫోన్లు, ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్సాప్ చాటింగ్‌లు సైతం కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. ఏ కారణం వల్ల జంటలు విడిపోయినా అది తప్పని వైవాహిక జీవితపు గొప్పదనాన్ని చాటిచెప్పుతూ.. భార్యాభర్తలు పరస్పర అవగాహన, ప్రేమ కలిగి ఉండాలని.. అనుమానాలను దూరం పెట్టాలని, సర్దుకొని పోతేనే సంసారం సాగుతుందని తెలియజెప్పి వారి బంధం బలంగా ఉండేందుకు కృషి చేస్తోంది ‘కుటుంబ సలహా కేంద్రం’.. మీ బంధం బలహీనమైతే దానికి బలమైన పునాదులు వేసేందుకు రెడీగా ‘కుటుంబ సలహా కేంద్రం’ ఉందన్న విషయాన్ని మరవొద్దని చెబుతోంది. గజ్వేల్‌రూరల్: డిగ్రీ చదువుకున్న సిద్దిపేటకు చెందిన అమ్మాయికి.. ఇంటర్ చదువుకున్న దుబ్బాక మండలానికి చెందిన అబ్బాయితో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత అమ్మాయిని బీఎడ్టోపాటు పీజీ కూడా చదివించాడు. మూడేళ్ల వరకు ఆ దంపతులిద్దరూ బాగానే ఉన్నారు. ఈ సమయంలోనే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. భర్త తనను పట్టించుకోవడం లేదని.. అలనా పాలనా చూడడం లేదని ఆమె పేర్కొంటుండగా... భార్యపై అనుమానంతో వారిద్దరూ దూరమయ్యారు. వారికి ఏడాదిన్నర పాప ఉంది. విడిపోయిన భార్యాభర్తలు కోర్టులో కేసులు పెట్టుకోవడం, కోర్టు, లాయర్లు, మధ్యవర్తుల వద్ద పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబ సలహా కేంద్రం కౌన్సిలర్లు దూరమైన ఆ జంటకు, వారి కుటుంబసభ్యులకు మూడు నెలల క్రితం వివాహబంధంపై కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఈ జంట వేరు కాపురం పెట్టి ప్రస్తుతం సిద్దిపేటలో నివాసముంటోంది. ఇలాంటివే మరెన్నో చిన్న చిన్న కారణాలు.. స్పర్థలు.. మాట పట్టింపులతో దూరమవుతున్న జంటలను కలుపుతోంది గజ్వేల్‌లోని కుటుంబ సలహా కేంద్రం. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇక్కడికి వస్తున్న అనేక జంటలకు ఈ కేంద్రంలో కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాలను నిలబెడుతున్నారు. మన జీవితంలో టీవీలు, సెల్‌ఫోన్, ఇంటర్నెట్ల వినియోగం ఓ భాగమైపోయింది. వీటి వినియోగం వల్ల మేలు జరుగుతున్నప్పటికీ అనర్థాలు సైతం అదే స్థాయిలో ఉంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. వీటి వ్యామోహంలో చదువుకున్న యువత, గ్రామీణ ప్రాంత ప్రజలు ఆర్థికంగా ఎదగాలనే ఆకాంక్షతోపాటు జల్సాలకు అలవాటు పడి కుటుంబ సభ్యుల్లో ప్రేమానురాగాలు తగ్గి క్షణికావేశంలో... విచక్షణ కోల్పోయి చేసే పనుల వల్ల ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటాయి. మూడు ముళ్లు.. ఏడడుగులు.. భాజా బజంత్రీలు, వేద మంత్రాల సాక్షిగా ఏకమై అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా నిలవాల్సిన భార్యాభర్తలు చిన్నపాటి మనస్పర్థలు, అపర్థాలు, అపోహలతో వారి దాంపత్య జీవితం ముణ్నాళ్ల ముచ్చటగా మార్చుకుంటున్నారు. దీనికి ముఖ్య కారణం భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కరువై సఖ్యత లేకపోవడమే. దాంపత్య జీవితానికి బీటలు గ్రామాల్లో, పట్టణాల్లో గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి... అన్నాదమ్ములు, భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్య తలెత్తినా ఇంటి పెద్ద పరిష్కరించేవారు. కానీ ఇప్పుడు పెళ్లయిన కొన్నాళ్లకే ఉమ్మడి కుటుంబంలో ఇమడలేక భార్యాభర్తలు వేరుపడి వైయక్తిక కుటుంబంగా మారుతున్నారు. అలా వేరుగా వచ్చిన భార్యాభర్తల్లో మనస్పర్థలు, అవగాహన లోపంతో చిన్నపాటి సమస్యలకు కూడా పెద్దగా ఫీలవుతూ సతమతమవుతున్నారు. దీంతో విడిపోవడం దాకా నిర్ణయం తీసేసుకుంటూ జీవితాలను దారి మళ్లించుకుంటున్నారు. పెరిగిపోతున్న ‘ఇగో’యిజం చదువుకున్న యువతలో అహం పెరిగిపోయి జల్సాలకు అలవాటు పడడం.. చదువు, సంపాదనలో తానేం తక్కువా అన్నట్లు వ్యవహరించడం... సెల్‌ఫోన్, ఇంటర్నెట్, ఇల్లీగల్ కాంటాక్టŠస్(వివాహేతర లైంగిక సంబంధాలు), మద్యపానం వంటివాటి మత్తులో ఎంతో మం ది తమ జీవి తాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, క్షణికావేశం వల్ల తలెత్తే అనర్థాలు ఎం తో దూరం తీసుకెళ్తున్నాయి. దీంతో వా రి పిల్లలు అనాథలు గా మారి తల్లిదండ్రుల ప్రేమకు దూరమవుతున్నారు.ఇలాంటి వారిని కౌ న్సెలింగ్ ద్వారా ఏకం చేసేందుకు కృషి చేస్తోంది ‘కుటుంబ సలహా కేంద్రం’... చిన్న సమస్యలతో భార్యాభర్తల మధ్య విద్వేషాలు పెరిగి దాంపత్య జీవితానికి దూరమవుతున్న వారికి కుటుంబ సలహా కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చి వారిని ఏకం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహిళా శిశు సంక్షేమశాఖ, సాంఘీక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల ఆధారంగా కుటుంబ సలహా కేంద్రాలు కొనసాగుతున్నాయి. దీని ఆధ్వర్యంలో ఉమెన్, మేల్ కౌన్సిలర్లు మనస్పర్థలతో విడిపోయిన జంటలను ఏకం చేసేందుకు కౌన్సెలింగ్ ఇస్తుంటారు. గజ్వేల్‌లోని కుటుంబ సలహా కేంద్రం పరిష్కరించిన కేసులు మహిళా శిశు సంక్షేమశాఖ, సాంఘీక సంక్షేమ మండలి సహకారం తో గజ్వేల్ పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు సమీపంలో ‘విజన్ ఎన్జీఓ స్వచ్ఛంద సంస్థ’ ఆధ్వర్యంలో 2012లో కుటుంబ సలహా కేంద్రం ఏర్పాటైంది. రాష్ట్ర వ్యాప్తంగా 40 కుటుంబ సలహా కేంద్రాలు ఉండగా.... గజ్వేల్‌లో ఉన్న ఈ కేంద్రం ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో 516 కేసులను పరిష్కరించారు. అయితే ప్రస్తుత ç2017లో ఇప్పటి వరకు 68 కేసులు పరిష్కరించినట్లు నిర్వాహకుడు కైలాష్ పేర్కొన్నారు. గ్రామైక్య సంఘాలు, పోలీసుల సహకారంతో.. గ్రామైక్య సంఘాలు, పోలీసుల ద్వారా ఈ సెంటర్లలో ఎంఎస్‌డబ్ల్యూ చేసిన కౌన్సిలర్లతో దూరమవుతున్న జంటలకు కౌన్సెలింగ్ ఇప్పిస్తారు. ఇటీవలి కాలంలో మనస్పర్థలు, అపనమ్మకాలు, సెల్‌ఫోన్, ఇల్లీగల్ కాంటాక్ట్స్, వరకట్నం వేధింపుల వంటి సమస్యలతో దూరమవుతున్న జంటలు ఎక్కువగా ఉంటున్నాయని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఏకం చేస్తున్నామని చెబుతున్నారు. క్షణికావేశంలో మాటామాట పెరిగి తీసుకున్న నిర్ణయాలతో భార్యాభర్తల మధ్య అగాధం ఏర్పడం వల్ల వారి పిల్లలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదముందని చెబుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నా, ఎవరో ఒకరు (వివాహేతర సంబంధం)ఇతరులతో వెళ్లిపోవడం వల్ల పిల్లలు వారి ప్రేమను కోల్పోవడంతో పాటు అనాథలుగా మారుతున్నారు. దూరమవుతున్న జంటలకు పెద్దల సమక్షంలో పంచాయితీలు, పోలీసు కేసుల వరకు వెళ్లినటువంటి వారికి ఈ కేంద్రాలలో కేసులు, కోర్టుల చుట్టూ తిరగడం వల్ల అయ్యే ఖర్చు, కోల్పోతున్న జీవితం, భార్యాభర్తల బంధం, విడిపోవడానికి గల కారణాలను తెలియజేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ కేంద్రాలకు వచ్చే కేసులలో ఎక్కువ ఒకటీ రెండుసార్ల కౌన్సెలింగ్‌తోనే పరిష్కారం అవుతున్నట్లు గజ్వేల్ కుటుంబ సలహా కేంద్రం, విజన్ సంస్థ నిర్వాహకుడు కైలాష్ తెలిపారు. అంతేగాకుండా గ్రామీణ ప్రజలకు, మహిళా సంఘాలలో సమావేశాలు నిర్వహిస్తూ కుటుంబ సలహా కేంద్రం ఉన్నట్లు తెలపడంతోపాటు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. విభేదాలకు కారణాలు.. దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య సమన్వయం లేకపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, అనుమానాలకు తావివ్వడం, ఇతరుల మాటలు నమ్మి మోసపోవడం, కట్న కానుకల విషయంలో తగాదాలు, ఆధిక్యత కోసం పోటీ పడటం, నిరక్షరాస్యత, అవగాహన లోపం, మూఢనమ్మకాలు, అపోహలు, ఆచార వ్యవహా రాలు, వివాహేతర సంబంధాలతో తలె త్తే వివాదాల కారణంగా జం టలు దూరమవుతున్నా యి. అలా కా కుండా భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు, అనుమానాలకు తావులేనప్పుడే దాంపత్య బం ధం నూరేళ్లు కొనసాగుతుంది. చిచ్చు పెట్టిన సెల్‌ఫోన్.. అమ్మాయిది వర్గల్ మండలంలోని ఓ గ్రామం. ఆమె 10వ తరగతి వరకు చదువుకుంది. గజ్వేల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న అబ్బాయితో పెళ్లైంది. వీరు రెండేళ్లు బాగానే ఉన్నారు. భర్త స్నేహితుడొకరు ఆమెతో తరచూ ఫోన్లో మాట్లాడేవాడు. దీంతో భర్తకు అనుమానం కలిగింది. భార్య కాల్ లిస్ట్ చెక్ చేసి ఆమె తన స్నేహితుడితో మాట్లాడుతున్నట్లు గుర్తించాడు. అనుమానానికి మరింత బలం చేకూరి గొడవలు తలెత్తాయి. దీంతో అమ్మాయిపై చేయి చేసుకున్నాడు. ఆమె చనిపోతానని బెదిరిస్తూ ఇంట్లో నుంచి చుట్టాల ఇంటికి వెళ్లిపోయింది. దీంతో అతడు అత్తామామలకు సమాచారం అందించాడు. వారు అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్లారు. భార్యను తీసుకువెళ్లడానికి భర్త రాగా పెద్ద మనుషుల మధ్య మాట్లాడిన తర్వాతే పంపిస్తామని అత్తింటివారు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఓ సారి అతడిని బావమరుదులు కొట్టడంతో విభేదాలు తలెత్తాయి. గ్రామ మహిళా సంఘాల ద్వారా సమాచారం అందుకున్న గజ్వేల్‌లోని కుటుంబ సలహా కేంద్రం ప్రతినిధులు 15 రోజుల వ్యవధిలో రెండు కుటుంబాలవారిని వేర్వేరుగా పిలిపించారు. పెళ్లి.. జీవితం అంటే ఏమిటి.. భార్యాభర్తల మధ్య వచ్చిన తగాదాలకు కారణాలను తెలియజేశారు. నీ స్నేహితుడే దీనికి కారణం.. నిన్నే మోసం చేయాలని చూశాడని, తప్పు నీవైపునే ఉంది కాబట్టి.. పీడకలలా మరచిపోవాలని సూచనలివ్వడంతోపాటు కౌన్సెలింగ్ నిర్వహించి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. 6 నెలలుగా వీరు పటాన్‌చెరులోని ఓ ప్రాంతంలో వేరు కాపురం పెట్టి బాగానే ఉంటున్నారు. మానసిక వేధింపులతో... తొగుట మండలానికి చెందిన అబ్బాయికి గజ్వేల్ మండలానికి చెందిన అమ్మాయితో రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి పిల్లలు లేరు. అబ్బాయి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత అమ్మాయిని మానసికంగా వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అమ్మాయి పుట్టింటికి వెళ్లిపోయింది. అబ్బాయి తల్లిదండ్రులు వెళ్లినా అమ్మాయిని పంపించలేదు. ఈ విషయం కుటుంబ సలహా కేంద్రానికి అందడంతో రెండు కుటుంబాల సభ్యులను పిలిపించారు. ఈ సందర్భంలో అబ్బాయి మానసిక ప్రవర్తన బాగా లేదని, అమ్మాయికి అతడి నుంచి ప్రాణహాని ఉందనే అనుమానం ఆందోళన కలిగిస్తోందని ఆమె తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రెండు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో అబ్బాయి డిప్రెషన్‌కు గురయ్యాడని, ఆసుపత్రిలో చికిత్స చేయించాలని సూచించారు. అతడికి చికిత్స పూర్తయిన తర్వాత అమ్మాయిని పంపించేలా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు. రెండు నెలల ట్రీట్మెంట్ తర్వాత అబ్బాయిలో కొంత మార్పు వచ్చింది. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో ఈ జంటను కలిపారు. ఈ జంట మూడు నెలలుగా వేరుగా ఉంటోంది. భార్యాభర్తలిద్దరూ సమానమే బండికి రెండు చక్రాలు ఎలానో... భార్యాభర్తలనేది కూడా అలానే కలిసుండాలి. మా వద్దకు వచ్చే జంటలకు విడిపోవడం వల్ల కలిగే నష్టాలు, కలిసుండడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరిస్తున్నాం. భార్యాభర్తల బంధంపై కౌన్సెలింగ్ ఇస్తున్నాం. జల్సాలకు అలవాటు పడి, వివాహేతర సంబంధాలతో ఎక్కువగా దూరమవుతున్నారు. వారిలో మార్పును తీసుకువస్తూ ఒక్కటయ్యే విధంగా కుటుంబ సలహా కేంద్రం ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. – కైలాష్, కుటుంబ సలహా కేంద్రం నిర్వాహకుడు, క్షణికావేశంతో దూరమవుతున్నారు భార్యాభర్తలు చిన్న సమస్యకు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో అనర్థాలు జరుగుతాయి. అలా కాకుండా ఒకరిపై మరొకరికి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. జీవితం ఎంతో విలువైనది. అపోహలు, విభేదాలకు తావులేకుండా భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అదే విధంగా గృహ హింస, వరకట్న నిరోధక చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం. – రాధ, కౌన్సిలర్ -
మున్సిపల్ టీచర్లకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాలి
► నిరవధిక నిరాహార దీక్షల ప్రారంభంలో నాయకుల డిమాండ్ నగరంపాలెం : రాష్ట్రంలోని మున్సిపల్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు జిల్లా, అంతర్జిల్లా బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ జిల్లా, అంతర్జిల్లా బదిలీలు కోరే ఉపాధ్యాయ కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గోరంట్లలోని పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయ (డీఎంఏ) ప్రాంగణం ఎదుట నిర్వహిస్తున్న నిరవధిక నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ప్రభుత్వం, జెడ్పీ, ఉపాధ్యాయులకు విధిగా బదిలీలు జరుపుతూ మున్సిపల్ ఉపాధ్యాయులకు 17 ఏళ్లుగా ఒక్కసారిగా కూడా బదిలీలు జరపకపోవటం శోచనీయమన్నారు. ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి రామచంద్ర మాట్లాడుతూ రాజీలేని పోరాటాలతో ప్రభుత్వాన్ని ఒప్పించైనా ఈ వేసవిలో బదిలీలు చేయించే ప్రయత్నం చేస్తామన్నారు. కార్యాచరణ కమిటీ సభ్యులు పి. సనాఉల్లా మాట్లాడుతూ ప్రభుత్వం వి«ధిగా అందరితోపాటు మున్సిపల్ టీచర్ల బదిలీలు జరుపుతూ ఉండాలన్నారు. దీనిపై ఎమ్మెల్సీ, ఫ్యాప్టో, జాక్టోలు సరైన శ్రద్ధ చూపలేదన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎస్వీ రత్నం, సి. నారాయణ, ఎంఏ సత్తార్, 13 జిల్లాలకు చెందిన మున్సిపల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
30 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
జేఎన్టీయూ: ఏపీ పాలిసెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 30 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఆష్రప్ ఆలీ తెలిపారు. జూన్ 6 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు ఒరిజినల్స్‌తో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలని సూచించారు. తీసుకరావాల్సిన సర్టిఫికెట్లు : ఏపీ పాలిసెట్ –2017 ర్యాంకు కార్డు , హాల్‌టికెట్ –పదవ తరగతి మార్క్స్ మెమో –4 నుంచి 10 వరకు స్టడీ సర్టిఫికెట్లు –రెసిడెన్స్ సర్టిఫికెట్ –విద్యార్థి ఆధార్ కార్డు, –కుల ధ్రువీకరణ పత్రం, –కౌన్సెలింగ్ ఫీజు రూ. 250 ఎస్సీ, ఎస్టీ కేటగిరి విద్యార్థులు, రూ.500 ఓసీ, బీసీ విద్యార్థులు . వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సిన తేదీలు: జూన్2 ,3 తేదీల్లో 1–30 వేల ర్యాంకుల వరకు, 4,5 తేదీల్లో 30001–60 వేల వరకు , 6,7 తేదీల్లో 60,001–చివరి ర్యాంకు వరకు =జూన్ 10న సీటు అలాట్మెంట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. =ఎన్సీసీ, సీఏపీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఫిజికల్లీ ఛాలెంజెడ్ పర్సన్స్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, విజయవాడ హెల్ప్‌లైన్ సెంటర్లో హాజరుకావాలి. హాజరుకావాల్సిన ర్యాంకర్ల వివరాలు కౌన్సెలింగ్ తేదీ ప్రభుత్వపాలిటెక్నిక్ కళాశాల, అనంతపురం. (ర్యాంకు సంఖ్య) మే 30 1–10 వేల ర్యాంకు వరకు మే 31 10,001 –20 వేల వరకు జూన్ 1 20,001–32 వేల వరకు 2 32,001–45 వేల వరకు 3 45,001–60 వేల వరకు 4 60001–75 వేల వరకు 5 75,001– 87 వేల వరకు 6 87,001– చివరి ర్యాంకు వరకు -
రేపటి నుంచి ‘గురుకుల’ ప్రవేశాలకు కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఆదివారం నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల సొసైటీ కార్యదర్శి శేషుకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న ఎంపీసీ విద్యార్థులకు, 23న బైపీసీ, ఎంఈసీ, సీఈసీ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. నాలుగు గురుకుల జూనియర్ కాలేజీల్లో 510 సీట్ల భర్తీకి 1:5 చొప్పున ఇంటర్వూ్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఇంటర్వూ్యకు ఎంపికైన వారి వివరాలను తమ వెబ్సైట్లో (tsrjdc.cgg.gov.in) విద్యార్థులు తమ హాల్‌టికెట్ సహాయంతో పొందవచ్చని సూచించారు. బాలురకు సర్వేల్లోని గురుకుల జూనియర్ కాలేజీ, బాలికలకు హసన్‌పర్తిలోని గురుకుల జూనియర్ కాలేజీలో కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించారు. -
పొగరాయుళ్లకు జరిమానా
కోవెలకుంట్ల: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్లో శనివారం పొగతాగుతున్న ఐదుగురికి రూ. 500 జరిమానా విధించి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. అలాగే స్థానిక జమ్మలమగుడు చౌరస్తాలో వాహనాల తనిఖీ నిర్వహించి ఆర్సీ, లైసెన్స్, హెల్మెట్‌లేని 22 మంది వాహన చోదకులకు రూ. 2400 జరిమానా వేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
గురుకులాల్లో ప్రవేశాలకు 30న కౌన్సెలింగ్
నల్లగొండ టూటౌన్ : జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో బాలురు, బాలికలకు ఆరో తరగతిలో ప్రవేశాల కొరకు జూన్‌లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు హాజరైన వారికి ఈ నెల 30న కౌన్సెలింగ్ నిర్వహిం చనున్నట్లు గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ భుక్యా సకనాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలురకు సూర్యాపేటలోని అగ్నిమాపక కేంద్రం దగ్గరలో గల గురుకుల పాఠశాలలో, బాలికలకు దురాజ్‌పల్లి దగ్గరలోని ఇమామ్‌పేట గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఆయా కేంద్రాలకు సకాలంలో హాజరు కావాలని కోరారు. -
46 మంది వైద్యులకు పోస్టింగులు
ఏలూరు (మెట్రో): జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల పోస్టులకు బుధవారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. కలెక్టరేట్లో జరిగిన కౌన్సిలింగ్లో 46 మంది వైద్యులకు కలెక్టర్ కె.భాస్కర్ వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. జిల్లాలో 59 వైద్యుల ఖాళీలకు 166 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 56 మంది కౌన్సెలింగ్‌కు హాజరుకాగా 46 మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. వీరిలో 11 మంది ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేయనున్నారు. 13 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్లైన్ విధానంలో నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియలో ఐటీడీఏ పీవో షాన్మోహన్, డీఎంహెచ్‌వో కె.కోటేశ్వరి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
డైట్లో ఎల్పీ సెట్ కౌన్సెలింగ్
కార్వేటినగరం : ఎల్పీ సెట్ తెలుగు, హిందీ పండిట్లకు మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో ఇన్చార్జి ప్రిన్సిపల్ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో తెలుగు పండిట్ కోర్సులకు కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీలో 50 సీట్లు ఉన్నాయన్నారు. హిందీ పండిట్ కోర్సులకు జిల్లాలో 250 సీట్లు ఉన్నాయని చెప్పారు. ఇందులో భాగంగా మంగళవారం తెలుగుకు 23 మంది, హిందీకి 11 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారని తెలిపారు. సర్టిఫికెట్లు, అలాట్మెంట్ కాపీలను పరిశీలించి, మీసేవా కేంద్రంలో రుసుం చెల్లించిన అభ్యర్థులకు సీట్ల కేటాయింపు కాపీని అందించినట్లు చెప్పారు. కౌన్సెలింగ్‌లో అధ్యాపకులు డాక్టర్ గంగిరెడ్డి, ఉమాశంకర్, సుధీర్, అయ్యప్ప, సూపరింటెండెంట్ ఆండాలు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఎడ్‌సెట్ తుది దశ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎడ్‌సెట్ సెట్ -2015 తుది దశ కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. మొదటి దశ కౌన్సెలింగ్‌లో భర్తీ అయిన సీట్లు పోను రాష్ట్రవ్యాప్తంగా అన్ని వ ర్సిటీల పరిధిలోని కళాశాలల్లో దాదాపు 9 వేల సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి 13 నుంచి 16 వరకు ఎడ్‌సెట్ ర్యాంకర్ల ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. ఇందుకు హైదరాబాద్ గగన్ మహల్‌లోని ఏవీ కాలేజీ, నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ, వరంగల్‌లోని కాకతీయ వర్సిటీ క్యాంపస్‌లో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 13న సోషల్ సైన్స్, 14న జీవశాస్త్రం, ఇంగ్లిష్, 15న గణితం, భౌతిక శాస్త్రం మెథడాలజీకి సంబంధించి తుది ర్యాంకు వరకు అభ్యర్థులు హెల్ప్‌లైన్ సెంటర్లలో హాజరుకావాలని సోమవారం ఎడ్‌సెట్ కన్వీనర్ పి. ప్రసాద్ సూచించారు. -
పోలీసుల అదుపులో 106మంది యువకులు
హైదరాబాద్: అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్లపై సంచరిస్తున్న జులాయిల పనిపట్టేందుకు పోలీసులు మరోసారి పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. 110 మందిని అదుపులోకి తీసుకుని వారిని ఫలక్‌నుమాలోని బషేరా ఫంక్షన్ హాల్‌కు తరలించారు. చాంద్రాయణగుట్ట, ఛత్రినాక, ఫలక్‌నుమా, కాంచన్‌బాగ్, మెయిన్‌బజార్ తదితర ప్రాంతాల్లో మొత్తం 17 పోలీస్ స్టేషన్ల పరిధిల్లో శనివారం అర్ధరాత్రి సౌత్‌జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. పట్టుబడిన వారికి వారి తల్లిదండ్రులను పిలిపించి అడిషినల్ డీసీపీ బాబూరావు ఆదివారం ఉదయం బషేరా ఫంక్షన్ హాల్లో కౌన్సెలింగ్ ఇచ్చారు. శుక్రవారం అర్ధరాత్రి కూడా 300 మందిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
ఆందోళనలో డెంటల్ పీజీ స్టూడెంట్స్