జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో బాలురు, బాలికలకు ఆరో తరగతిలో ప్రవేశాల కొరకు జూన్‌లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు హాజరైన వారికి ఈ నెల 30న కౌన్సెలింగ్ నిర్వహిం చనున్నట్లు గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ భుక్యా సకనాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నల్లగొండ టూటౌన్ : జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో బాలురు, బాలికలకు ఆరో తరగతిలో ప్రవేశాల కొరకు జూన్‌లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు హాజరైన వారికి ఈ నెల 30న కౌన్సెలింగ్ నిర్వహిం చనున్నట్లు గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ భుక్యా సకనాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలురకు సూర్యాపేటలోని అగ్నిమాపక కేంద్రం దగ్గరలో గల గురుకుల పాఠశాలలో, బాలికలకు దురాజ్‌పల్లి దగ్గరలోని ఇమామ్‌పేట గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఆయా కేంద్రాలకు సకాలంలో హాజరు కావాలని కోరారు.